ఖమ్మం, అక్టోబర్ 17: నూతన కలెక్టరేట్ లో నిర్వహించబడుచున్న ఎన్నికల కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్ కి వచ్చే ఫిర్యాదులు, చేపడుతున్న చర్యలను పరిశీలించారు. కంట్రోల్ రూమ్ లో ప్రదర్శించిన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎంసిసి, ఎఫ్ఎస్టి, ఫ్లయింగ్ స్క్వాడ్ టీముల వివరాలు, సంప్రదించాల్సిన నెంబర్లతో సహా ఉన్న ఫ్లెక్సీలను పరిశీలించారు. సి విజిల్ యాప్, 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, పరిష్కార వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఇప్పటి వరకు సి విజిల్ యాప్ ద్వారా 72 ఫిర్యాదులు రాగా, పరిష్కరించినట్లు, 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా 343 కాల్స్ వచ్చినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారి ద్వారా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, సిసి కెమెరాలు అమర్చినట్లు, అట్టి సిసి కెమెరాలను కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా పెట్టాలన్నారు. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ *1950, 9063211298* లకు కాల్ చేసి ఫిర్యాదులు, సందేహాలు పరిష్కరించుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, సిపిఓ ఏ. శ్రీనివాస్, కలెక్టరేట్ పర్యవేక్షకులు మదన్ గోపాల్, రంజిత్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
సాధారణ ఎన్నికలలో ప్రతి అభ్యర్థి ఎన్నికల వివరాలను భారత ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల ప్రకారం కట్టుదిట్టంగా నమోదు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో, శాసనసభ సాధారణ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుల నమోదు పై అకౌంటింగ్ బృందాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న శాసనసభ సాధారణ ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల వివరాలను నిబంధనల ప్రకారం కట్టుదిట్టంగా నమోదు చేయాలని, పారదర్శకంగా ప్రతి అభ్యర్థికి సమాన హక్కులు కల్పిస్తూ ఎన్నికలను నిర్వహించాలని అన్నారు. భారత ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గానికి అభ్యర్థి ఎన్నికల ఖర్చును గరిష్ట పరిమితి రూ. 40 లక్షలుగా నిర్ధారించిందని కలెక్టర్ తెలిపారు. రాబోయే రోజులలో జిల్లాలో జరిగే రాజకీయ పార్టీల సమావేశాలు సభలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాలు పంపిణీ, ప్రచార ప్రకటనలు, వీఐపీలు పాల్గొనే బహిరంగ సభలు వాటికి అయ్యే వివరాలను నిషితంగా పరిశీలించి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు అభ్యర్థి ఖాతాలో నమోదు చేయాలని అన్నారు. ప్రతి ఖర్చుకు ఆధారాలు నిర్వహించాలన్నారు. నామినేషన్ వేసినప్పటి నుంచి అభ్యర్థి ఎన్నికల కోసం చేసే ఖర్చులకు ప్రత్యేకమైన బ్యాంకు ఖాతా ప్రారంభించాల్సి ఉంటుందని, అందులో నుంచి మాత్రమే ఎన్నికల ఖర్చులు చేయాలని, వీటిని పరిశీలించేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, ఎన్నికల వ్యయ పరిశీలకులు, వీడియో సర్వేలెన్సు బృందాలు వీడియో వీవింగ్ బృందాలు, అకౌంటింగ్ బృందాలు, మానిటరింగ్ సెల్ కాల్ సెంటర్, స్టాటిటిక్ సర్వేలైన్స్ బృందాలు, వ్యయ మానిటరింగ్ సెల్ మొదలకు బృందాలు వారికి కేటాయించిన విధులను పకడ్బందీగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని కాల్ సూచించారు. జిల్లాలో ఇక పై ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ఎన్నికల కరపత్రాలు ఫ్లెక్సీలు బ్యానర్లు ముద్రించే సమయంలో తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఎన్నికల ఫ్లెక్సీల పై ఎవరు ముద్రిస్తున్నారో వారి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ప్రింట్ చేయాలని అన్నారు. ఎన్నికల సమయంలో డబ్బు మద్యం ప్రభావం ఉండకుండా నిరంతరం నిఘా ఉండాలని, అభ్యర్థులు ఎన్నికల ఖర్చుపై అధికారులు డేగ కన్నుతో పరిశీలించాలని అన్నారు. ప్రజా ప్రాతినిధ్య 1951 ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.కార్యక్రమంలో వ్యయ పరిశీలన, స్వీప్ నోడల్ అధికారులు బృందాలకు తమ విధులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారురు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, శిక్షణా సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా సహకార అధికారిణి విజయకుమారి, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, ఏఇఓ లు, ఆడిట్ అధికారులు, అకౌంట్, విఎస్టి, వివిటి బృంద సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment