Thursday, 29 February 2024

జర్నలిస్టుల సమస్యలపై ​మార్చి 5న సీఎం రేవంత్ మీటింగ్ ..

*జర్నలిస్టుల సమస్యలపై ​మార్చి 5న సీఎం రేవంత్ మీటింగ్ నిర్వహించనున్నారని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.*

పదవీ బాధ్యత స్వీకరించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 'హైదరాబాద్ కు 4 వైపులా జర్నలిస్టులకు ఇండ్ల జాగాలు ఇచ్చేలా కృషి చేస్తానని అన్నారు. జవహర్ లాల్ సొసైటీ కేస్ క్లియర్ అయిన గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ విషయం అల్లం నారాయణ కూడా ఒప్పుకున్నారని తేల్చి చెప్పారు.హెల్త్ కార్డ్ లు పని చేసేలా సీఎంతో మాట్లాడుతాన్నారు. -అవాస్తవాలు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. సోషల్ మీడియా పెద్ద ప్రమాదకరంగా మారింది. *జర్నలిస్టుల ప్రమాణాలు పెంచుతా'* అని శ్రీనివాస్​రెడ్డి తెలిపారు.

*తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో డ్రోన్ తో ప్రత్యేక నిఘా...*. *మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోని ఫెర్రి పాయింట్స్*


 హైదరాబాద్ ,: రామగుండం పోలీస్ కమీషనరెట్ మంచిర్యాల జోన్ నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంచపల్లి ఫెర్రీ పాయింట్, నీల్వాయి పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాసులు ఐపీఎస్ (ఐజి ) గారు, మంచిర్యాల డిసిపి సుదీర్ కేకెన్ ఐపీఎస్.,  ఇతర పోలీసు అధికారులతో కలిసి సందర్శించి, పడవలు నడిపెవారితొ, చేపలు పట్టే వారితో మాట్లాడి అక్కడి  వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతం గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయా, మావోయిస్టులకు సంభందించి మరియు వారి కదలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయా అని అడగడం జరిగింది. పోలీస్లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, యువత మంచిగా చదువుకొని ప్రభుత్వం ఉద్యోగం, ఇతర ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయిలో ఉండాలని, సంఘవిద్రోహక శక్తులకు సహకరించవద్దని యువత తమ భవిష్యత్తు  నాశనం చేసుకోవద్దన్నారు.
మీ భద్రత మా బాద్యత అని వారికీ చెప్పడం జరిగింది.
అనంతరం నీల్వాయి నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం పనులను పరిశీలించి, నిర్మాణం పనులు ఎప్పటికి పూర్తి కావడం జరుగుతుంది. త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని సూచించారు. నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాల వివరాలు, ఇక్కడి అటవీ ప్రాంతం పరిస్థితి, ప్రస్తుత పరిస్థితుల గురించి, పడవలు నడిపెవారి  సమాచారం వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ ప్రాంత లోని సానుభూతి పరులు, మిలిటెంట్స్, మావోయిస్టులకు సంభందించి మరియు వారి కదలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయా అని అడగడం జరిగింది. ఎల్లపుడు అప్రమత్తం గా ఉండాలని మారుమూల ప్రాంతాల్లో సందర్శించి ప్రజల అవసరాలు, సమస్యలు తెలుసుకోవాలని చట్టపరిధిలో పరిష్కరించాలని,పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు.
ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ..యాంటీ ఎక్సమిస్ట్స్ ఆపరేషన్ లో భాగంగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ప్రాణహిత పరివాహక ప్రాంతంలో ప్రత్యేక నిఘా లో భాగంగా మావోయిస్టుల కదలికలు, వారు ఏదైనా సంఘటనలకు పాల్పడే సమాచారం ముందస్తుగా తెలుసుకోవడం కోసం సాంకేతిక పరిజ్ఞానం ను  ఉపయోగించి డ్రోన్ పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది అని ఈ ప్రాంతం లో ఎలాంటి అవాంఛనియా సంఘటనలు జరగకుండా సరిహద్దు ప్రాంత ప్రజలకు ఒక సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం లో ప్రజలు తమ  అమూల్యమైన ఓటు ను స్వేచ్ఛ వాతావరణం లో వినియోగించు కోనేలా చూడవలసిన బాధ్యత పోలీస్ శాఖ పై ఉందన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో  ఎన్నికలు ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో *ఇన్సిడెంట్ ఫ్రీ* ఎన్నికలు జరిగే విధంగా పోలీస్ అధికారులు సిబ్బంది పనిచేయడం జరుగుతుంది అని తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు హోం గార్డ్ స్థాయి అధికారి నుండి సీపీ స్థాయి అధికారుల ద్వారా జన జీవన స్రవంతి లో కలిసి కుటుంబ సభ్యులతో ఆనందం గా ఉండవచ్చు అని లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున వచ్చే అన్ని లాభాలు అందేలాగా పోలీస్ శాఖ తరుపున అండగా ఉంటామన్నారు.
 ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు , చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, చెన్నూర్ ఇన్స్పెక్టర్ రవీందర్, నీల్వాయి ఎస్ఐ సుబ్బారావు, కోటపల్లి ఎస్ఐ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 27 February 2024

*6 ఏళ్లు నిండితేనే ఒకటో తరగతిలో అడ్మిషన్*


*న్యూ ఢిల్లీ:*
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాఠశాల విద్యాశాఖ లేఖ..

2024 - 25 విద్యా సంవత్సరం నుండి గ్రేడ్ 1/ఒకటో తరగతి లో అడ్మిషన్స్ 6 సంవత్సరాలు నిండిన వారికే ఇవ్వాలని లేఖలో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం..

నూతన విద్యావిధానం,విద్యా హక్కు చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం ఈ నిర్ణయం అని తెలిపిన విద్యాశాఖ.

*జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు,నగదు రహిత వైద్యం అందించడమే నా ప్రాధాన్యత..**-కె.శ్రీనివాస్ రెడ్డి* *తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మెన్*


*హైద్రాబాద్:*
*జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు, నగదు రహిత వైద్యం అందించడమే తన ప్రాధాన్యత అని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ నూతన చైర్మెన్ కే.శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.*

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా అకాడమీ చైర్మెన్ గా నియమించినందుకు *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి* కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని,జర్నలిజంపై ఉత్సాహంతో ముందుకు వచ్చిన తరానికి దాని ఉద్దేశాలు ఏంటో చెప్పాలన్న లక్ష్యంతో అకాడమీ ఏర్పడిందని,మీడియా అకాడమీ లక్ష్యాలకు భిన్నంగా బాధ్యతలు అప్పగించారని,సమాచార శాఖ నిర్వర్తించాల్సిన అంశాలను కూడా దీనికి ఇచ్చారని,అవా ర్డులు, అక్రెడిటేషన్లు ఇవ్వడం వాస్తవంగా దీని బాధ్యత కాదని,సంక్షేమ కార్యక్రమాలు కూడా దీని పనికాదని,అనేక కారణాలతో వాటన్నింటినీ మీడియా అకాడమీకి అప్పగించారని,జర్నలిజంపై ప్రజల్లో సానుకూలత పెద్దగా లేదని,సోషల్ మీడియాలో ఉచ్చరించలేని భాష వాడుతున్నారని,జర్నలిజంలో ప్రజాప్రయోజనం కీలకమని,కానీ ఇప్పుడు పూర్తిస్థాయిలో అలా లేకుండా పోయిందని,మీడియాకు పాలసీలు ఉంటాయని,ఎడిటోరియల్ పాలసీ ఉండాలి కూడా అయితే ప్రజల్లో జర్నలిజంపై భిన్నమైన అభిప్రాయం నెలకొని ఉందని,గతంలో  చైర్మన్ గా ఉన్నప్పుడు రెవెన్యూ డివిజన్ వరకు వెళ్లి జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చామని,వాటిని పునరుద్ధరించడమే ఇప్పుడు కర్తవ్యంగా భావిస్తున్నానని,బడ్జెట్, సైన్స్, లీగల్- క్రైమ్ తదితర అంశాలపై మండల స్థాయి వరకు జర్నలిస్టులకు శిక్షణ ఇస్తామని,జర్నలిజంలో ప్రమాణాలు కాపాడాల్సిన అవసరముందని తెలిపారు.

Monday, 26 February 2024

ఆమేకు 70వసంతాలు... అయినా చెదరని మనో నిబ్బరం.. ఆమె జీవన పోరాటం కావాలి మనకు స్పూర్తి

ఈరోజు నా కళ్ళు ఒక అద్భుతాన్ని చూశాయి..
నాలుక ఒక అమోఘమైన రుచిని ఆస్వాదించాయి..
మనసు ఒక జీవితానికి కావాల్సిన ధైర్యాన్ని నింపుకుంది..
కారణం ఒక బామ్మ...
ఐరన్ యార్డ్ లో ఒక క్లయింట్ను కలిసి స్వాతి రోడ్ లోని వైఎస్సార్ బొమ్మ పక్క సందులో నుండీ వెళ్తున్నా.. అప్పటికే చాలా ఆకలి.. వాటర్ కానీ సింగిల్ టీ కూడా ఆఫర్ చెయ్యకుండా కోట్ల వ్యాపారం డీల్ చేయించుకుందాము అనే లోకం బాగా అనుభవమే.. అలాంటి వాళ్ళని పచ్చి మంచి నీళ్ళు కూడా అడగను.. ఆఫ్కొర్స్.. నేను ఏమీ ఆశించను.. జస్ట్ మనుషుల గురించి చెప్తున్నాను అంతే...
అదే ఆకలితో ఆ రోడ్ లో వెళుతూ ఉంటే చిన్న వెలుగులో ఒక టిఫిన్ బండి.. ఎందుకో అప్రయత్నంగా నా బండి ఆగింది..
కారణం ఆ బండి దగ్గర ఉన్న బామ్మ.. చూడగానే అర్థం అవుతుంది ఆమె చాలా పెద్ద వయసు అని... బండి పక్కన పార్క్ చేసి ఏమున్నాయి బామ్మ అని అడిగాను.. బదులుగా బామ్మ " నువ్వు ఏమి తింటావో చెప్పు ?? వేడి వేడి ఇడ్లీ ఉన్నాయి, బొబ్బట్లు,హల్వా పూరి, పునుగులు, వేడి వేడి బజ్జీ ఉన్నాయి.." అని అంటూనే సరే ఒక పని చెయ్యి ఒక్కోటి పెడతాను తినగలిగినన్ని తిను అని నా సమాధానం కోసం ఎదురు చూడకుండా అన్నీ ఒక కాగితంలో పెడుతూ అద్భుతమైన చట్నీ, అమోఘమైన అల్లం చట్నీతో (ఈ మధ్య ఎక్కడా ఇంత చక్కని అల్లం చట్నీ తినలేదు) కొసరి కొసరి వడ్డిస్తూ.. ఈ వయసులో తినకపోతే ఎలా డైటింగ్ గీటింగ్ వేస్ట్ అంటూ ప్రేమగా మాట్లాడుతుంటే..
అప్రయత్నంగా మీ వయసు ఎంత బామ్మా అని అడిగాను.. ఒక సెకండ్ పాస్ ఇచ్చి ఎంత ఉంటుంది అని ఎదురు ప్రశ్న వేసింది.. చూస్తానికి ఒకప్పుడు బాగా బ్రతికి చితికిన జీవితం అని ఆమె రాయల్టీ చూస్తే అర్ధం అవుతునే ఉన్నది.. ఎస్టిమేట్ చెయ్యలేక పోయే సరికి ఆమే చెప్పింది డెబ్బయ్ కి ఒక సంవత్సరం తక్కువ అని.. కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి.. ఈలోపు ఆమెకి సరుకు సప్లై చేసే మనిషి వచ్చాడు... మా డిస్కషన్ విని ఒకటే చెప్పాడు.. ఏమండీ నేను ఎన్నో సంవత్సరాల నుండీ ఆమెను చూస్తున్నాను.. ఒకరికి పెట్టడమే కానీ తీసుకోవడం తెలీదు.. రేపటికి రూపాయి అప్పు పెట్టదు.. ఒకరి డబ్బు ఆశించదు.. పైగా పెట్టే గుణం.. అనగానే.. బామ్మ మాట అందుకుంది.. " ఈవయసులో అణ పైసా రుణం నాకు ఉండకూడదు.. ఋణ గ్రస్తురాలిగా చనిపోకూడదు.. ఈ ప్రాణం ఉన్నన్ని నాళ్లు కష్టపడి సంపాదించాలి.. కష్టపడి బ్రతకాలి.." కళ్ళు ఆశ్చర్యంతో కూడి చెమర్చాయి.. ఆ సంకల్పానికి, నమ్మకానికి, వ్యక్తిత్వానికి..
మరి ఒక్క దానివే ఇన్ని పదార్థాలు ఎలా చేయగలుగుతున్నారు అని అడిగితే సమాధానం " నేనూ నా కూతురు ఉంటాము అయ్యా.. తను ఇప్పుడే ఇంటికి వెళ్ళింది.. ఆమె పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి బందర్ లో సెటిల్ అయ్యారు.. జగన్ అన్న కి ఇల్లు అర్జీ పెట్టుకున్నాము.. వస్తుంది ఏమో అని ఒక ఆశ.. 

ఇంక మీకు ఎవరూ లేరా బామ్మా అని అడిగితే " ఎందుకు లేరయ్యా!! నా భర్త కి ఏడుగురు అన్నా తమ్ములు నలుగురు అక్కా చెల్లెళ్ళు.. పెద్ద బలగం.. ఒకప్పుడు వస్త్రలత లో నాలుగు ఐదు షాపులు ఉండేవి... లాటరీ తికెట్లకి అలవాటు పడి.. జీవితంలో తొందరగా కోట్లు సంపాదించాలి అన్న ఆశతో ఆస్థి అంతా పోగొట్టారు నా భర్త.. నా చేతిలో శక్తి విద్య ఉంది.. కష్టపడుతున్నాము.. ఎవరైనా ఆర్ధర్స్ ఉంటే పాతిక ముప్పై మందికి వండి పంపగలము అని చెప్తూ రోజుకి శక్తి కొలది ఒక వంద రూపాయిలు తగ్గకుండా బేంక్ లో దాచుకో అయ్యా ఆఖరికి అవ్వే నీకు పనికి వస్తాయి అని జీవిత కష్ట సారాంశాన్ని చెప్పింది బామ్మ..
చేతిలో ఒక వంద పెడితే వద్దు అంటూ తిన్న దానికి మాత్రమే డబ్బులు తీసుకుంది... 

ఎన్ని మేనేజ్మెంట్ డిగ్రీలు పీహెచ్డీలు ఉంటే ఇంత గొప్ప వ్యక్తిగతం, కష్టం, క్వాలిటీ మేనేజ్ మెంట్, దార్సినికత అబ్బుతాయి ?? 
జీవితంలో ఏమీ సాధించని వాళ్ళని, పిల్ల కాలువలో కూడా ఈదని వాళ్ళని, ఎటువంటి ఆటు పోట్ల అనుభవం లేని వాళ్ళని ఏసీ హాల్స్ లో, ఇంపాక్ట్ క్లాసెస్ లో, ఎంబీఏ కాలేజీల్లో, టెడ్ టాక్స్ లో ఊర సొల్లు చిలక పలుకులు చెప్పిస్తారు లక్షలు కోట్లు ఇచ్చి... ఇటువంటి నిజమైన వ్యక్తిత్వం, నిజమైన ఆటుపోట్లు, సక్సెస్ అన్నీ చూసిన వారితో చెప్పించరు.. అఫ్కోర్స్ మనకి అంత టైం లేదు.. అన్నీ ఫెబ్రికేట్డ్ జీవితాలు... ఫెబ్రికేటెడ్ సక్సెస్ లు..

వీలైతే ఆ అద్భుతాన్ని వెళ్ళి పలకరించండి, వెళ్ళి ఆ రుచులను ఆస్వాదించండి... నలుగురితో ఈ విషయాన్ని పంచండి.. కుదిరితే ఎప్పుడైనా వెజిటేరియన్ ఫుడ్ ఒక పాతిక ముప్పై మందికి ఆర్డర్ ఇవ్వండి..

ఫుడ్ వ్లాగర్స్ ఫ్రీ తిండి కోసం, నాలుగు డబ్బుల కోసం, ఆల్రెడీ లక్షలు, కోట్లు సంపాదిస్తున్న వాళ్ళని ఎటువంటి క్వాలిటీ లేకపోయినా అద్భుతం అమోఘం అంటూ గాలికి ఎత్తేసి మనల్ని పిచ్చి తిండికి పురమాయిస్తున్నారు.. రోడ్లు బ్లాక్ చేయించి మరీ ఇంకా కోటీశ్వరులను చేస్తున్నారు.. ఇలాంటి బక్క జీవితాలు, నిజమైన అద్భుతాలను ఎవరూ పట్టించుకోరు.. కనీసం మనమైనా సపోర్ట్ చేద్దాం..
ఇంతకీ బామ్మ పేరు ఏమిటీ అని అడగగా " తిరువీధుల కుసుమ కుమారి అని చెప్పారు.. ఎంతో గర్వంగా హుందాగా రాయల్ గా.. హాట్స్ ఆఫ్ బామ్మ.. ఒక జీవితానికి సరిపడా మనోధైర్యాన్ని ఇచ్చావు... ఆమె నాకు ఇచ్చిన రెండో సలహా.." ఏమైనా ధైర్యాన్ని కోల్పోవద్దు అని.."

ఎక్కడో దూరంలో ఉన్న గుడి నుండీ"తిరువీధుల వెలసీ ఈ దేవ దేవుడు.. " అన్న పాట వినపడుతుంటే జేబుల్లో చేతులు పెట్టుకోకుండా బండి ఉన్నది అన్న స్పృహ కూడా మర్చిపోయి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను...

బామ్మ ఫోన్ నంబర్ : 7075803856
అడ్రస్ : వైఎస్సార్ విగ్రహం ప్రక్క సందు నుండీ ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ కు వెళ్ళే దారిలో ,
భవానీ పురం,
విజయవాడ.

- మీ మోహన్ వంశీ ధర్ బచ్చు.
విజయవాడ.

నిర్దేశిత వార్షిక ల‌క్ష్యాం సాదించాలి : సి.ఎం.రేవంత్..

హైదరాబాద్ :ప‌న్ను వ‌సూళ్ల‌లో నిర్దేశించిన వార్షిక ల‌క్ష్యాన్ని  అన్ని శాఖలు సాధించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 2023-24 సంవ‌త్స‌రానికి సంబంధించి వాణిజ్య ప‌న్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేష‌న్లు, ర‌వాణా, గ‌నులు, భూగ‌ర్భ వ‌నరుల శాఖ ప‌న్ను వ‌సూళ్ల‌పై డాక్ట‌ర్ బి.ఆర్‌.అంబేడ్క‌ర్ స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. వాణిజ్య ప‌న్నుల శాఖ‌లో ప‌న్ను ల‌క్ష్యానికి, రాబ‌డికి మ‌ధ్య వ్య‌త్యాసం ఎక్కువ‌గా ఎందుకు ఉంద‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. కేంద్ర ప్ర‌భుత్వం గ‌తేడాది వ‌ర‌కు జీఎస్టీ ప‌రిహారం కింద రూ.4 వేల కోట్ల‌కుపైగా చెల్లించేద‌ని, దాని గ‌డువు ముగియ‌డంతో ఆ నిధులు రాక‌పోవ‌డంతో రాబ‌డిలో వ్య‌త్యాసం క‌నిపిస్తోంద‌ని అధికారులు తెలిపారు.  పొరుగు రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్క‌ర్ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. మ‌ద్యం స‌ర‌ఫ‌రా, విక్ర‌యాల‌కు సంబంధించిన లెక్క‌లు తేడాలు ఉంటున్నాయ‌ని, ఈ విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌తి డిస్ట‌ల‌రీ వ‌ద్ద సీసీ కెమెరాలు  ఏర్పాటు చేయాల‌న్నారు. మ‌ద్యం స‌ర‌ఫ‌రా వాహ‌నాల‌కు జీపీఎస్ అమ‌ర్చి వాటిని ట్రాకింగ్ చేయాల‌ని, బాటిల్ ట్రాకింగ్ సిస్టం ఉండాల‌ని, మ‌ద్యం స‌ర‌ఫ‌రా వాహ‌నాలు వే బిల్లులు క‌చ్చితంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్క‌ర్‌తో పాటు గ‌తంలో న‌మోదు చేసిన ప‌లు కేసుల పురోగ‌తిపై నివేదిక స‌మ‌ర్పించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.  రిజిస్ట్రేష‌న్ల శాఖ‌పై స‌మీక్ష సంద‌ర్భంలో స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాలు, జిల్లా రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాలు అద్దె భ‌వ‌నాల్లో కొన‌సాగుతున్నాయని అధికారులు తెలిపారు. అదే స‌మ‌యంలో త‌మ‌ శాఖలోనూ అదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని వాణిజ్య ప‌న్నుల శాఖ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ టి.కె.శ్రీ‌దేవి ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ముఖ్య‌మంత్రి  ఆదాయాన్ని తెచ్చే శాఖల‌కు సొంత భ‌వ‌నాలు లేక‌పోవ‌డం స‌రికాద‌ని, ప్రస్తుత అవ‌స‌రాల‌కు అనుగుణంగా నూత‌న భ‌వ‌నాలు నిర్మించేందుకు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.  అవ‌స‌రాల‌కు అనుగుణంగా హైద‌రాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను వినియోగించుకోవాల‌ని సూచించారు. హైద‌రాబాద్‌తో పాటు న‌గ‌రంలో ప‌లు ప్రాంతాల్లో ర‌హ‌దారుల‌పై కంక‌ర కుప్పలుగా పోసి విక్ర‌యిస్తున్నార‌ని, అలా కాకుండా న‌గ‌రంలో వివిధ ప్ర‌దేశాల్లో ప్ర‌భుత్వ స్థ‌లాలను అందుకు వినియోగించాల‌ని పేర్కొన్నారు.  ఇసుక విక్ర‌యాల‌పై స‌మ‌గ్ర విధానం రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.  వే బిల్లుల‌తో పాటు ఇసుక స‌ర‌ఫ‌రా వాహ‌నాల‌కు ట్రాకింగ్ ఉండాల‌ని, అక్రమ ర‌వాణాకు అవ‌కాశం ఇవ్వ‌వ‌ద్ద‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకుగానూ ప‌లు గ‌నుల‌పై గ‌తంలో జ‌రిమానాలు విధించార‌ని, కేసులు న‌మోదు చేశార‌ని ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు. విధించిన జ‌రిమానాల‌ను వెంట‌నే వ‌సూలు చేయాల‌ని ఆదేశించారు.  గ‌తంలో జ‌రిమానాలు విధించి త‌ర్వాత వాటిని త‌గ్గించార‌ని, అందుకు కార‌ణాలు ఏమిటో తెలియ‌జేయాల‌ని, దానిపై నివేదిక స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌కు ముఖ్య‌మంత్రి సూచించారు. టీఎస్ ఎండీసీతో పాటు గ‌నుల శాఖ‌లో ప‌లువురు అధికారులు ఒకే పోస్టులో ఏళ్ల త‌ర‌బ‌డి తిష్ట వేశార‌ని, కొంద‌రిపై ఆరోప‌ణ‌లున్నాయ‌ని, వారిని వెంట‌నే బ‌దిలీ చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. 
స‌మీక్ష‌లో ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Thursday, 15 February 2024

75గడపల్లో 51పైగా సివిల్స్ విజేతలు... మేధోపట్టి ... మేధావుల ఫ్యాక్టరీ....

ఊరు పేరు మధోపట్టి కానీ ఇక్కడ ఉన్న వారంతా మేధావులే.. ఆ విషయం ఈ ఊరిలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ల సంఖ్య చూస్తే తేలిపోతుంది అసలు మాధో అనేది మేధస్సు కావచ్చు  అదే ఊరి పేరైందనిపించకమానదు. కాబట్టే ఇక్కడ ఉన్న వారంతా మేధావులుగా ఉన్నారా అనిపిస్తుంది.ఇది ఊరు కాదు..! ఐఏఎస్‌ ఫ్యాక్టరీ..!! 75 ఇళ్లున్న ఈ గ్రామంలో 51 మందికి పైగా IAS, IPS అధికారులే..ఈ ఊరి నీటిలో, గాలిలో ఏదైనా మాయాజాలం ఉండి ఉండాలి.. లేకపోతే కేవలం 75 ఇళ్లున్న ఈ గ్రామంలో 51 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలా ఉంటారు..?! 
అవును, ఈ ఊరు ఒక గ్రామం కాదు.. ప్రతి ఇంట్లో ఒక IAS, IPS ఉంటారు.. కాబట్టి దీనిని IAS ఫ్యాక్టరీ అని పిలుస్తారు. అందుకే ఈ చిన్న గ్రామం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఉత్తర ప్రదేశ్‌ లోని జౌన్‌పూర్ జిల్లా లోని మాధోపట్టి అనే గ్రామం ఇప్పటివరకు దాదాపు 51 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తయారు చేసింది. యూపీ రాజధాని లక్నో నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నఈ మాధోపట్టి గ్రామం దేశానికి అత్యధిక ఐఏఎస్, ఐపీఎస్ లను అందించింది. 
దీంతో, భారత దేశంలో సివిల్ సర్వీసెస్‌లో అత్యధిక అభ్యర్థులు ఉన్న గ్రామంగా మాధోపట్టి నిలిచింది.
ఈ గ్రామం ‘IAS ఫ్యాక్టరీ’ గా పేరు పొందింది. ప్రతి యేటా ఉన్నత అధికారులను ఉత్పత్తి చేస్తూనే ఉంది. జౌన్‌పూర్ జిల్లా లోని ఈ గ్రామానికి కోచింగ్ సెంటర్‌లు లేవు. కాబట్టి, ఈ ఘనత మరింత మెచ్చుకోదగినది..! 
ఇక, స్థానిక పండుగల సమయంలో ఈ ఊరికి వచ్చే రోడ్లన్నీ ఎరుపు,నీలం లైట్లు వచ్చే కార్లతో

Wednesday, 14 February 2024

భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన టీటీడీ సీవీఎస్వో న‌ర‌సింహ కిషోర్‌, తిరుప‌తి ఎస్పీ మ‌లికా గార్గ్‌

భ‌ద్ర‌తా ఏర్పాట్ల ప‌రిశీల‌న 
ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినానికి విశేషంగా విచ్చేసే భ‌క్తుల కోసం చేప‌డుతున్న భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను సీవీఎస్వో  న‌ర‌సింహ కిషోర్‌, తిరుప‌తి జిల్లా ఎస్పీ మ‌లికా గార్గ్ క‌లిసి ప‌రిశీలించారు. భ‌క్తులు గ్యాల‌రీల్లోకి వెళ్లేందుకు, తిరిగి వెలుప‌లికి వ‌చ్చేందుకు ఏర్పాటు చేసిన మార్గాల‌ను త‌నిఖీ చేశారు. మాడ వీధుల‌తోపాటు భ‌క్తుల ర‌ద్దీ ఉన్న ప్రాంతాల్లో చేప‌ట్టాల్సిన భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌పై విజిలెన్స్‌, పోలీసు అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. తిరుమ‌ల‌లో ట్రాఫిక్ ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, పార్కింగ్ ప్ర‌దేశాల‌కు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల‌ని తెలియ‌జేశారు. వీరి వెంట టీటీడీ నిఘా, భ‌ద్ర‌తా అధికారులు, తిరుమ‌ల పోలీసు అధికారులు ఉన్నారు.
TTDs CVSO and SP conducted an inspection of the mada streets in Tirumala in preparation for the upcoming Radhasapthami festival."

Sunday, 11 February 2024

టీటీడీ కళాశాలల విద్యార్థులు ఎంతో అదృష్టవంతులు : ఈవో ధర్మారెడ్డి.


తిరుపతి : శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో టీటీడీ నిర్వహిస్తున్న కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులందరూ ఎంతో అదృష్టవంతులని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి ఇతర కళాశాలల విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం స్టూడెంట్స్ సక్సెస్ మీట్ - అఛీవర్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. అకడమిక్స్, ఎన్.సి.సి, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కల్చరల్, కో కరికులర్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్, ప్లేస్మెంట్స్ తదితర అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 215 మంది విద్యార్థిని విద్యార్థులకు ఈ సందర్భంగా 5 గ్రాముల వెండి డాలర్, ప్రశంసాపత్రం అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈవో శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలోని 27 విద్యాసంస్థల విద్యార్థులందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి  అవార్డులు అందించడం ఎంతో సంతోషకరమన్నారు. అధ్యాపకులు విద్యార్థుల క్రమశిక్షణ విషయంలో రాజీ పడకుండా చక్కగా చూసుకోవాలని,  అవసరమైన పక్షంలో వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ కూడా ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు కూడా అధ్యాపకుల పట్ల గౌరవభావంతో మెలిగి బాగా చదువుకోవాలని కోరారు. కళాశాలల్లో అధ్యాపకుల కొరతను తీర్చేందుకు త్వరలో 120 మంది జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల నియామకానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. టీటీడీ విద్యార్థులు అంకితభావం, ఏకాగ్రతతో బాగా చదువుకుని వారు కోరుకున్న ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఈవో ఆకాంక్షించారు.టీటీడీ జెఈఓ శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ విద్య కొనబడకూడదు, అమ్మబడకూడదు అనే మహోన్నత లక్ష్యంతో టీటీడీ విద్యాసంస్థలను నిర్వహిస్తోందని, ఇక్కడి సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని చక్కగా విద్యనభ్యసించాలని కోరారు. అదేవిధంగా విద్యార్థులకు ఔట్ డోర్ టూర్ ఏర్పాటుచేసి పలు వైజ్ఞానిక విషయాలు తెలుసుకొనే అవకాశం కల్పించాలన్నారు. స్వామివారి అనుగ్రహంతో విద్యాసంస్థలను భవిష్యత్తులోనూ టీటీడీనే నిర్వహించాలని ఈ సందర్భంగా ఈవోను జెఈవో కోరారు.ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ ఈ ప్రపంచంలో విజయం మాత్రమే ఉందని, పరాజయం లేదని, అపజయంలో కూడా కొత్త విషయాలను నేర్చుకుని విజయంగా మార్చుకోవాలని సూచించారు. విద్యార్థులు ఇతరులను పోటీగా భావించరాదని, మీతో మీరే పోటీపడి అనుకున్న స్థాయికి చేరుకోవాలని సూచించారు. శారీరక వికాసం కోసం క్రీడలు, యోగ సాధన చేయాలని, మానసిక వికాసం కోసం పుస్తక పఠనం అలవరుచుకోవాలని కోరారు. టీటీడీ ముఖ్య గణాంకాధికారి శ్రీ శేషశైలేంద్ర మాట్లాడుతూ టీటీడీ విద్యార్థులకు విద్యతో పాటు ఆర్ష విజ్ఞానాన్ని బోధించాలని, తద్వారా వారిని ఆధ్యాత్మికంగా జ్ఞానవంతులను చేయాలని కోరారు. సనాతన ధర్మంలోని పలు వైజ్ఞానిక విషయాలను విద్యార్థులకు బోధించాలన్నారు. జీవితంలో కష్టపడి మనం అనుకున్న స్థాయికి చేరుకోవడం అఛీవ్ మెంట్ అని, ఆ తర్వాత సమాజానికి ఉపయోగపడేలా మంచి పనులు చేయడం సక్సెస్ అని తెలిపారు.టీటీడీ విద్యాశాఖాధికారి డా. ఎం.భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఒకే మేనేజ్మెంట్ ఆధ్వర్యంలోని మూడు  కళాశాలలకు న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ తో పాటు అటానమస్ హోదా రావడం చారిత్రకమైన విషయం అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో 27 విద్యాసంస్థలు, ఆరు వేద పాఠశాలలు ఉన్నాయని, మొత్తం దాదాపు 20వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలియజేశారు. విద్యార్థుల కోసం టీటీడీ అనేక సౌకర్యాలు కల్పిస్తోందని, అన్ ఎయిడెడ్ పాఠశాలలకు టీటీడీ విద్యా కానుక కిట్లను అందజేసిందని, ఎన్.సి.సి విద్యార్థులు క్యాంపులు నిర్వహించేందుకు ఆర్థిక సాయం అందజేస్తోందని, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని తెలియజేశారు. విద్యార్థులు భక్తిభావనతో చక్కగా చదువుకుని, టీటీడీకి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
Tirupati, TTD EO  Dharma Reddy said students of TTD educational institutions are blessed by Sri Venkateshwara Swamy and should set benchmark for discipline and merit. 
Addressing students success meet at Mahati Auditorium on Friday evening the EO presented achiever awards to 215 students on  criteria of academics, NCC, NSD Sports, cultural activities performance.
Besides a citation, 5 gms silver dollar was given to all students by him. 
Speaking  on the ocassion he said awards were given to students of 27 TTD educational institutions. Without compromise TTD is striving to improve standards by appointing 120 junior and degree lecturers for students benefit. 

Saturday, 10 February 2024

బడ్జెట్ లెక్కలు వచ్చేశాయి...2,75,891కోట్లు* *ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు*

*2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891కోట్లు*
*ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా*
*పరిశ్రమల శాఖ 2543 కోట్లు*
*ఐటి శాఖకు 774కోట్లు.*
*పంచాయతీ రాజ్ 40,080 కోట్లు*
*పురపాలక శాఖకు 11692 కోట్లు*
*మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు*
*వ్యవసాయ శాఖ 19746 కోట్లు*
*ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250కోట్లు*


*ఎస్సి సంక్షేమం 21874 కోట్లు*
*ఎస్టీ సంక్షేమం 13013 కోట్లు*
*మైనార్టీ సంక్షేమం 2262 కోట్లు*
*బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు.*
*బీసీ సంక్షేమం 8 వేల కోట్లు*
*విద్యా రంగానికి 21389కోట్లు.*
*తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు.*
*యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు*
*వైద్య రంగానికి 11500 కోట్లు*
*విద్యుత్ - గృహ జ్యోతికి 2418కోట్లు.*
*విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.*
*గృహ నిర్మాణానికి 7740 కోట్లు.*
*నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు*

Saturday, 3 February 2024

పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ : మంత్రి సీతక్క ...


ఖమ్మం : రాష్ట్రంలోని గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపొందించి ప్రత్యేక అధికారుల పాలన ద్వారా అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శనివారం ములుగు జిల్లా కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హైదరాబాద్‌ నుండి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా తో కలిసి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులతో గ్రామపంచాయతీల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఇందులో భాగంగా ప్రత్యేక అధికారుల పాలన ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రానున్న వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా పూర్తి స్థాయిలో త్రాగునీరు అందించడంతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పారిశుధ్య కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా మాట్లాడుతూ గ్రామ పంచాయితీలలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైన నేపథ్యంలో నూతన పంచాయితీరాజ్‌ చట్టం, గ్రామ పంచాయి విధి నిర్వహణ విధానాలు వంటి అంశాలపై ప్రత్యేక అధికారులకు అవగాహన కల్పిస్తూ ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్లకు సూచించారు.  రాబోయే వేసవి కాలంలో త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా ముందస్తు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.  గ్రామంలో త్రాగునీటి కనెక్షన్లపై సర్వేనిర్వహించి, ఇంకా నల్లా కనెక్షన్‌ లేని ఇండ్లు గుర్తించాలన్నారు.  త్రాగునీటి సరఫరాకు సంబంధించి ఆర్ధిక సంఘం నిధులను వినియోగంచుకునే అవకాశం ఉందని, అవసరమైన చోట నీటి లీకేజీ మర్మత్తు పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.  గ్రామంలో అంతర్గత నీటి సరఫరా, నూతన నల్ల కనెక్షన్‌ పనుల ప్రాతిపాదనలు రూపొందించి జల్‌ జీవన్‌ మిషిన్‌ ద్వారా నిధులు పొందాలని తెలిపారు.  
నూతన కలెక్టరేట్‌ స్పూర్తి వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌   మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీన సర్పంచ్‌ల పదవీకాలం ముగిసినందున జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఈ నెల 2వ తేదీ నుండి ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని, గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులను సిబ్బందితో సమన్వయం చేసుకొని పనిచేసే విధంగా ప్రత్యేక అధికారులకు బాధ్యతలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వేసవిలో త్రాగునీటికి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కార్యాచరణ రూపొందించి ప్రణాళికాబద్ధంగా అమలు చేసే విధంగా గ్రామీణ మంచినీటి సరఫరా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రతి కుటుంబానికి మిషన్‌ భగీరథ ద్వారా త్రాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు.  గ్రామపంచాయతీలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఉపాధి హామీ కూలీల శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, నర్సరీల నిర్వహణ, మొక్కల సంరక్షణ, డంపింగ్‌ యార్డుల నిర్వహణ, వైకుంఠధామాల అభివృద్ధిపై సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.  జిల్లాలో ఈనెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు గ్రామపంచాయతీలలో పారిశుధ్యం పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.వి.అప్పారావు, జిల్లా పంచాయితీ అధికారి హరికిషన్‌, ఎస్‌ఈ పి.ఆర్‌ చంధ్రమౌళిశ్వరరావు, ఏ.పి.డి శిరీష, మిషన్‌ భగీరథ ఇ.ఇ పుష్పలత, వివిధ శాఖల అధికారులు  తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------
------------------------------------------------------------------------
యువత అవకాశాలు ఎక్కడ ఉంటే, అక్కడకి వెళ్ళాలి : కలెక్టర్ వి.పి.గౌతమ్
ఖమ్మం :  స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో తెలంగాణ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  వేలాదిమంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలు మెగా జాబ్ మేళాను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, మెగా జాబ్ మేళాకు వచ్చినవారు ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.  హైదరాబాద్, వరంగల్ తో పాటు  వివిధ ప్రాంతాలకు చెందిన 65 పైగా కంపెనీలు, 5000 పైగా ఉద్యోగావకాశాలను కల్పించేందుకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 45 వేల నుండి 50 వేల వేతనం గల ఉద్యోగాలు 500 ఉండగా, 25 వేల నుండి 45 వేల మధ్యలో 3 వేలకు పైగా ఉద్యోగాలున్నట్లు ఆయన అన్నారు. ఒక ఫ్రెషర్ కి ఆఫ్ క్యాంపస్ ద్వారా ఇది మంచి అవకాశమని అన్నారు. ఎక్కడ అవకాశాలు ఉంటే, అక్కడకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని, వచ్చిన ఏ చిన్న అవకాశమైనా విడిచి పెట్టక, ఒక్కో మెట్టు ఎదుగుతూ, లక్ష్యం చేరాలన్నారు. ప్రతి ఉద్యోగం ఒక పాఠం వంటిదని, ప్రతి ఉద్యోగం లో ఎంతో నేర్చుకోవచని, నైపుణ్యం, అనుభవం పొంది కెరీర్ పరంగా ఎడగాలన్నారు. ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగకల్పన చేయనుందని, ఇప్పుడు పొందే ఉద్యోగాలతో ఉపాధి పొందుతూ, మన కాళ్ళ మీద మనం నిలబడి, ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కావాలన్నారు. యువత, విద్యార్థులు అర్హతలను బట్టి ఉద్యోగావకాశాలను పొందాలన్నారు. ఉద్యోగావకాశం ఎక్కడ వచ్చిన చేయడానికి సిద్ధం కావాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా అభ్యర్థుల ఇంటర్వ్యూలు సాఫీగా సాగేవిధంగా నిర్వహిచాలని జాబ్ మేళా చేపట్టిన కంపెనీ ప్రతినిధులకు సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా మెగా జాబ్ మేళా లో ఆర్డర్ పొందిన ఇద్దరికి ఆఫర్ లేటర్లను అందజేశారు. ఇట్టి జాబ్ మేళా కు జిల్లాలో 11530 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, వివిధ కంపెనీలకు 1122 మంది యువత ఎంపిక కాగా, 2698 మంది యువత షార్ట్ లిస్టెడ్ అయినట్లు కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులకు వివిధ కంపెనీల ప్రతినిధులు  ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసిన వారికి ఆఫర్ లెటర్స్ అందజేస్తారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉద్యోగార్థులకు శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి, జిల్లా ఉపాధికల్పన అధికారి కె. శ్రీరామ్, జగన్నాధం, వివిధ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగార్థులు పాల్గొన్నారు.

Friday, 2 February 2024

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు.... Govindarajaswamy temple Adhyayanotsavams concludes....


తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 10న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు ఆలయం నుంచి శ్రీ గోవిందరాజ స్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారు, శ్రీ విష్వ‌క్సేనుల‌వారు, శ్రీరామానుజాచార్యులు, శ్రీ న‌మ్మాళ్వార్‌, శ్రీ కూర‌త్తాళ్వార్‌, శ్రీ తిరుమంగైయాళ్వార్ ఉత్సవమూర్తుల ఊరేగింపు ప్రారంభ‌మైంది. తిరుప‌తి వీధుల గుండా కపిలతీర్థానికి చేరుకున్న అనంతరం అక్కడ తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు. అక్కడినుంచి బయల్దేరి పిఆర్‌ గార్డెన్‌ మీదుగా మధ్యాహ్నం తిరిగి ఆలయానికి చేరుకుంది.
Tirupati, The Adhyayanotsavams which began on January 10 at Sri Govindaraja Swamy temple in Tirupati concluded on a grand note on Friday. 
Special programs were organized in the temple on this occasion.
The procession of utsava murthies of Sri Govindaraja Swamy, Sri Andal Ammavaru, Sri Vishwaksena, Sri Ramanujacharya, Sri Nammalwar, Sri Kurtalwar, Sri Thirumangaiyalwar started from the temple at 6 am.  After reaching Kapilatirtham through the streets of Tirupati, Thirumanjanam and Asthanam were performed there.  And later the deities returned to the temple.

ఫిబ్ర‌వ‌రి 15, 16, 17వ తేదీల్లో ఎస్ఎస్‌డి టోకెన్లు ర‌ద్దు ఈవో ధ‌ర్మారెడ్డి...



సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీ రథసప్తమి పర్వదినానికి విచ్చేసే వేలది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని ఈవో ధ‌ర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులు, పోలీస్ అధికారుల‌తో శుక్ర‌వారం ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, రథసప్తమికి సంబంధించిన ఏర్పాట్లపై అన్నప్రసాదం, ఆరోగ్యశాఖ, ఇంజనీరింగ్‌ విభాగం, ఆలయం, ఉద్యానవనశాఖ, శ్రీవారి సేవ, భద్రతా విభాగం, ఎస్వీబీసి, ధర్మప్రచారపరిషత్‌ తదితర విభాగాధిపతులకు పలు సూచనలు చేశారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు తిరుమలలో ఏడు వాహనాలపై స్వామివారి ఉరేగింపును తిలకించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వివిధ విభాగాధిపతులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.రథసప్తమి సందర్భంగా తిరుమలకు విచ్చేసే  భ‌క్తులు చ‌లికి, ఎండ‌కు ఇబ్బంది ప‌డ‌కుండా మాడ వీధుల్లో తాత్కాలిక‌ షెడ్లు ఏర్పాటు చేయ‌ల‌న్నారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం 3.5 ల‌క్ష‌ల ల‌డ్డూలు బ‌ఫ‌ర్ స్టాక్ ఉంచుకోవాల‌ని పోటు అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భ‌క్తులు తిల‌కించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహ‌న‌సేవ‌ల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామ‌ని తెలిపారు. వాహ‌న‌సేవ‌ల ఎదుట ఆక‌ట్టుకునేలా సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయాల‌న్నారు. టీటీడీ నిఘా, భ‌ద్ర‌తా విభాగం అధికారులు పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని మెరుగైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. అన్నప్రసాదం అధికారులు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలలో వాహనాలను తిలకించడానికి వేచి ఉండే భక్తులకు తాగునీరు, మజ్జిగ, సాంబారు అన్నం, పెరుగు అన్నం, పులిహోర, పొంగలి వంటి అన్న ప్రసాదాలను నిరంతరాయంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. భక్తుల దాహార్తిని తీర్చడానికి శ్రీవారి సేవకుల సహకారంతో ఎప్పటికప్పుడు తాగునీరు అందించాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. మెరుగైన పారిశుద్ధ్య చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. అత్యవసర సేవలందించడానికి వీలుగా వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్సు వాహనాలను కూడా  సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన వైద్యాధికారులకు సూచించారు. మాడవీధులలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను సీనియర్‌ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. రథసప్తమి సందర్భంగా వివిధ రకాల ఫలపుష్పాలతో, పచ్చని తోరణాలతో, అందమైన అరటి చెట్లతో పందిళ్ళను ఏర్పాటు చేసి తిరుమాడ వీధులను అందంగా అలంకరించాలని ఉద్యానవన విభాగం అధికారులను ఈవో ఆదేశించారు.
రథసప్తమిని పురస్కరించుకొని ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు తెలిపారు. ఆ రోజున ఎటువంటి ప్రత్యేక దర్శనాలు (విఐపి బ్రేక్‌, వయోవృద్ధులు, వికలాంగులు మరియు చంటిపిల్లల తల్లిదండ్రులకు) ఉండవని చెప్పారు. అదే విధంగా ఫిబ్ర‌వ‌రి 14వ తేదీ తెల్ల‌వారు జామున 12 గంట‌ల నుండి 16వ తేదీ అర్థ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు టిబి, ఎంబిసి - 34 కౌంట‌ర్ల‌ను మూసివేసి, సిఆర్‌వో, శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నాల‌ స‌మూదాయంలో మాత్ర‌మే గ‌దులు కేటాయించాల‌న్నారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని టీటీడీ భద్రతా విభాగం మరియు పోలీసు అధికారులు స‌మ‌న్వ‌యంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు.

వాహనసేవల వివరాలు :
తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.40 గంట‌ల‌కు) - సూర్యప్రభ వాహనం      
ఉదయం 9 నుంచి 10 గంటల వరకు - చిన్నశేష వాహనం          
ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు - గరుడ వాహనం              
మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు - హనుమంత వాహనం    
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు - చక్రస్నానం
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు -  కల్పవృక్ష వాహనం        
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు - సర్వభూపాల వాహనం    
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు - చంద్రప్రభ వాహనం

Tirumala, TTD EO  Dharma Reddy directed officials of all departments to coordinate efforts and organise all round arrangements for the convenience of devotees coming for Surya Jayanti also known as Ratha Sapthami at Tirumala  on February 16.
Addressing a review meeting of officials and district police at Annamaiah Bhavan on Friday evening, the EO reviewed in detail on Anna Prasadam, Health, Engineering, Srivari temple, Garden, Srivari Seva, security, SVBC and HDPP. 
He said there would be procession of seven vahanams along Mada streets  from dawn to dusk and asked officials to ensure against any inconvenience to devotees in galleries.
Among others he directed officials to install temporary sheds along Mada streets for the sake of devotees and instructed to keep a buffer stock of four lakh laddus. 
He directed Anna Prasadam officials to supply  buttermilk, sambar rice, curd rice Pulihora, Pongal etc from all through the processions at regular intervals and health department to supply water along the Mada streets utilizing the services of Srivari Sevaks.
He urged senior officials to supervise arrangements of supply of medicines by medical staff , stationing of ambulances,frequent cleaning by sanitation staff etc.
He also said in view of the festival, TTD has cancelled all Arjita sevas, VIP Break, Senior citizen, physically Handicapped, parents with infants darshans for the day.
TTD has also stalled issuance of SSD tokens in Tirupati from February 15-17.  MBC-34 and TB counters will remain closed from the midnight of February 13 till midnight of February 16 and only CRO and Sri Padmavati Rest Houses allotments operate.