*హైద్రాబాద్:*
*జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు, నగదు రహిత వైద్యం అందించడమే తన ప్రాధాన్యత అని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ నూతన చైర్మెన్ కే.శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.*
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా అకాడమీ చైర్మెన్ గా నియమించినందుకు *
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి* కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని,జర్నలిజంపై ఉత్సాహంతో ముందుకు వచ్చిన తరానికి దాని ఉద్దేశాలు ఏంటో చెప్పాలన్న లక్ష్యంతో అకాడమీ ఏర్పడిందని,మీడియా అకాడమీ లక్ష్యాలకు భిన్నంగా బాధ్యతలు అప్పగించారని,సమాచార శాఖ నిర్వర్తించాల్సిన అంశాలను కూడా దీనికి ఇచ్చారని,అవా ర్డులు, అక్రెడిటేషన్లు ఇవ్వడం వాస్తవంగా దీని బాధ్యత కాదని,సంక్షేమ కార్యక్రమాలు కూడా దీని పనికాదని
,అనేక కారణాలతో వాటన్నింటినీ మీడియా అకాడమీకి అప్పగించారని,జర్నలిజంపై ప్రజల్లో సానుకూలత పెద్దగా లేదని,సోషల్ మీడియాలో ఉచ్చరించలేని భాష వాడుతున్నారని,జర్నలిజంలో ప్రజాప్రయోజనం కీలకమని,కానీ ఇప్పుడు పూర్తిస్థాయిలో అలా లేకుండా పోయిందని,మీడియాకు పాలసీలు ఉంటాయని,
ఎడిటోరియల్ పాలసీ ఉండాలి కూడా అయితే ప్రజల్లో జర్నలిజంపై భిన్నమైన అభిప్రాయం నెలకొని ఉందని,గతంలో చైర్మన్ గా ఉన్నప్పుడు రెవెన్యూ డివిజన్ వరకు వెళ్లి జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చామని,వాటిని పునరుద్ధరించడమే ఇప్పుడు కర్తవ్యంగా భావిస్తున్నానని,బడ్జెట్, సైన్స్, లీగల్- క్రైమ్ తదితర అంశాలపై మండల స్థాయి వరకు జర్నలిస్టులకు శిక్షణ ఇస్తామని,జర్నలిజంలో ప్రమాణాలు కాపాడాల్సిన అవసరముందని తెలిపారు.
No comments:
Post a Comment