హైదరాబాద్ ,: రామగుండం పోలీస్ కమీషనరెట్ మంచిర్యాల జోన్ నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంచపల్లి ఫెర్రీ పాయింట్, నీల్వాయి పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాసులు ఐపీఎస్ (ఐజి ) గారు, మంచిర్యాల డిసిపి సుదీర్ కేకెన్ ఐపీఎస్., ఇతర పోలీసు అధికారులతో కలిసి సందర్శించి, పడవలు నడిపెవారితొ, చేపలు పట్టే వారితో మాట్లాడి అక్కడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతం గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయా, మావోయిస్టులకు సంభందించి మరియు వారి కదలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయా అని అడగడం జరిగింది. పోలీస్లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, యువత మంచిగా చదువుకొని ప్రభుత్వం ఉద్యోగం, ఇతర ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయిలో ఉండాలని, సంఘవిద్రోహక శక్తులకు సహకరించవద్దని యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు.
మీ భద్రత మా బాద్యత అని వారికీ చెప్పడం జరిగింది.
అనంతరం నీల్వాయి నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం పనులను పరిశీలించి, నిర్మాణం పనులు ఎప్పటికి పూర్తి కావడం జరుగుతుంది. త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని సూచించారు. నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాల వివరాలు, ఇక్కడి అటవీ ప్రాంతం పరిస్థితి, ప్రస్తుత పరిస్థితుల గురించి, పడవలు నడిపెవారి సమాచారం వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ ప్రాంత లోని సానుభూతి పరులు, మిలిటెంట్స్, మావోయిస్టులకు సంభందించి మరియు వారి కదలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయా అని అడగడం జరిగింది. ఎల్లపుడు అప్రమత్తం గా ఉండాలని మారుమూల ప్రాంతాల్లో సందర్శించి ప్రజల అవసరాలు, సమస్యలు తెలుసుకోవాలని చట్టపరిధిలో పరిష్కరించాలని,పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు.
ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ..యాంటీ ఎక్సమిస్ట్స్ ఆపరేషన్ లో భాగంగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ప్రాణహిత పరివాహక ప్రాంతంలో ప్రత్యేక నిఘా లో భాగంగా మావోయిస్టుల కదలికలు, వారు ఏదైనా సంఘటనలకు పాల్పడే సమాచారం ముందస్తుగా తెలుసుకోవడం కోసం సాంకేతిక పరిజ్ఞానం ను ఉపయోగించి డ్రోన్ పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది అని ఈ ప్రాంతం లో ఎలాంటి అవాంఛనియా సంఘటనలు జరగకుండా సరిహద్దు ప్రాంత ప్రజలకు ఒక సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం లో ప్రజలు తమ అమూల్యమైన ఓటు ను స్వేచ్ఛ వాతావరణం లో వినియోగించు కోనేలా చూడవలసిన బాధ్యత పోలీస్ శాఖ పై ఉందన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలు ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో *ఇన్సిడెంట్ ఫ్రీ* ఎన్నికలు జరిగే విధంగా పోలీస్ అధికారులు సిబ్బంది పనిచేయడం జరుగుతుంది అని తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు హోం గార్డ్ స్థాయి అధికారి నుండి సీపీ స్థాయి అధికారుల ద్వారా జన జీవన స్రవంతి లో కలిసి కుటుంబ సభ్యులతో ఆనందం గా ఉండవచ్చు అని లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున వచ్చే అన్ని లాభాలు అందేలాగా పోలీస్ శాఖ తరుపున అండగా ఉంటామన్నారు.
ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు , చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, చెన్నూర్ ఇన్స్పెక్టర్ రవీందర్, నీల్వాయి ఎస్ఐ సుబ్బారావు, కోటపల్లి ఎస్ఐ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment