Monday, 22 April 2024

కలెక్టర్ ను కలిసిన సివిల్ సర్వీసెస్ ర్యాంకర్ అలేఖ్య


ఖమ్మం, ఏప్రిల్ 22: అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 లో 938 వ ర్యాంక్ సాధించిన జిల్లాకు చెందిన సాయి అలేఖ్య సోమవారం నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సాయి అలేఖ్య ను అభినందించి సత్కరించారు. సాయి అలేఖ్య బోనకల్ మండలం, గోవిందాపురం (ఎల్) గ్రామ వాస్తవ్యులు కాగా, ఆమె తండ్రి పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేయుచున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, సాయి అలేఖ్య తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు.

Wednesday, 17 April 2024

భద్రాద్రి రామునికి పట్టు వస్త్రాలు సమర్పించిన పొంగులేటి దంపతులు...


*భద్రాచలం :* *అందరి బంధువు... ఆదుకునే ప్రభువు... భద్రాచల రామయ్య కల్యాణ మహోత్సవాన్ని అభిజిత్ లగ్నంలో కనుల పండువగా నిర్వహించారు. నేత్రపర్వంగా సాగిన ఈ తంతులో తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాధురి దంపతులు హాజరై నీలమేఘశ్యాముని కల్యాణోత్సవానికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మంగళ వాయిద్యాలు... వేదవండితుల మంత్రోచ్ఛరణల నడుమ జరిగిన సీతారాముల కల్యాణ వేడుకను లక్షలాది మంది భక్తులు తిలకించి పులకించారు. ఈ కల్యాణ క్రతువును మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, శ్రీలక్ష్మి దంపతులు కూడా హాజరై వీక్షించారు.*

*అంగ రంగ వైభవంగా భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవం*


భద్రాచలం జిల్లా:ఏప్రిల్ 17 : శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారా ముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా మైదానంలో ఈ వేడుక నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల నడుమ అభిజిత్‌ లగ్నంలో కల్యాణ క్రతువును వేదపం డితులు పూర్తిచేశారు.భద్రాచలం పుర వీధులన్నీ శ్రీరామ నామస్మరణతో మార్మోగాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎస్‌ శాంతికుమారి పట్టువస్త్రా లు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.కాగా, తిరుకల్యాణ బ్రహ్మో త్సవాల సందర్భంగా బుధ వారం తెల్లవారు జామునే ఆలయ ద్వారాలను తెరిచి అర్చకులు.. రామయ్యకు సుప్రభాత సేవ జరిపారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళ శాసనం, అభిషేకం ఆ తర్వాత ధ్రువమూర్తులకు కల్యాణం నిర్వహించారు.తర్వాత కల్యాణ మూర్తు లను పల్లకీలో ఉంచి మంగళవాయిద్యాల మధ్య మిథిలా మైదానంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేశారు.రజత సింహాసనంపై సీతారామ చంద్ర స్వాములను ఆసీను లను చేశారు.తిరువారాధన, విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం నిర్వహించి మండప శుద్ధి చేశారు. ‘యుంజానహః ప్రథమం’ అనే మంత్రాని పఠిస్తూ వేద పండితులు ప్రజా సంపతర్థ్యం ‘శ్రీయం ఉద్వాః హిష్షే’ అన్న సంక ల్పంతో స్వామి వారికి ఎదురుగా సీతమ్మను కూర్చోబెట్టి కన్యావరణలు జరిపారు.మోక్షబంధం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీత ధారణ గావించారు. వధూవరుల వంశ గోత్రాలకు సంబంధించి ప్రవరలు వినిపించారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళన, పుష్పాదక స్నానం జరిపి వరపూజ కార్యక్రం జరిపారు.కల్యాణం సందర్భంగా సంప్రదాయబద్ధంగా భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం, కలికితురాయి, రామమాడ తదితర ఆభరణాలను రామయ్యకు, సీతమ్మకు, లక్ష్మణ స్వామికి ధరింపజేశారు...

తుమ్మలపల్లి లో ఘనంగా నవమి వేడుక..

సూర్యాపేట జిల్లా మోతే మండలం లో తుమ్మల పల్లి లో నూతనము గా నిర్మాణం చేసిన శ్రీ రామాలయం లో నేడు శ్రీ సీతా రామ కళ్యాణం ఘనంగా జరిగిందిగ్రామ పెద్దలు, ప్రజలు, పిల్లలు వృద్ధులు 43డిగ్రీ ల ఎండను లెక్క చేయకుండా శ్రీ రామ నవమి వేడుకల్లో సంతోషం గా పాల్గొన్నారు.హైదరాబాద్ లో నివాసం ఉంటూ ప్రతి శ్రీరామ నవమికి తప్పకుండా వెళ్లి గోటి తో వలచిన కొన్ని తలంబ్రా లను దేవాలయం లో ని అక్షింతల్లో కాల్పి రాములో రికి శ్రీమతి సంధ్యా రాణి, శ్రీ చకి కిలం రమేష్ రావు ఆలయం లో కి మేళా తాళాల తో దేవాలయం లో సమర్పించారు 
ఆ తరువాత అన్న ప్రసాదం అందరి అందించారు 
సాయంత్రం భజన బృందం తో ఎద్దుల బండి మీద శ్రీ రాములవారిని సీతమ్మ వారిని గ్రామ లోని ప్రతి ఇంటికి ఉరే గింపు గా వెళ్లి అందరికి ప్రసాదం ఇచ్చారు 
ఊరు ఊరంతా కూడ తమ ఇంట్లో పెంళ్లి లా తుమ్మల పల్లి గ్రామ ప్రజలు ఘనంగా రాములోరి కళ్యాణం నిర్వహించడం జరిగింది 
Dr పిచ్చి రెడ్డి, గ్రామ సర్పంచ్ వార్డు మెంబెర్స్, ప్రజలు వేడుకను ముందు ఉండి నిర్వహించారు

Sunday, 14 April 2024

అక్కడ పోలీసు డ్యూటీ సాంప్రదాయ వస్త్రాల్లో...

వారణాసి: ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం.. కాశి విశ్వనాధ ఆలయంలో బెనారస్ పోలీసులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి విధుల్లో ఉంటారని వారణాసి కమిషనర్ మోహిత్ అగర్వాల్ పేర్కొన్నారు. 15 రోజులు పాటు సాంప్రదాయ వస్త్రాల్లో వారు బాధ్యతలు విశ్వనాధ్ ఆలయంలో నిర్వహిస్తారని అనంతరం దీనిని సమీక్షించి పూర్తిగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఈ డ్రెస్ కోడ్ ద్వారా పోలీసులు భక్తులతో సహృద్భావంతో వ్యవహరిస్తారని ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు అగర్వాల్ పేర్కొన్నారు. సాంప్రదాయ వస్త్రాల్లో ఆలయ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల్ని చూసిన భక్తుల సైతం వారితో కలివిడిగా ఉంటూ ఇది మంచి పరిణామం అని చెబుతున్నారు. త్వరలో మరిన్ని ఆలయాల్లో ఇటువంటి మార్పు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు
ఇక  కాశి విశ్వనాధ్ ఆలయం పరిసరాల్లో డ్యూటీ చేసే అందరి పోలీస్ లు ఖాకి డ్రెస్ కాకుండా ఇలా పూర్తి హిందూ సంప్రదాయం ప్రకారం దోతి, కుర్తా, కండువా, బొట్టు, రుద్రాక్ష మాల ధరించి డ్యూటీ చేస్తారు.
కాగా ప్రతిపక్షాలు మాత్రం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆలయంలో పోలీసుల డ్రెస్ కోడ్ పై స్పందిస్తూ పూజారులు ధరించే ఇలాంటి డ్రెస్సులు పోలీసులు వేసుకోవాలని ఆదేశాలు ఇచ్చిన కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.


Wednesday, 10 April 2024

ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష... వేగం పెంచాలని సూచన.... మే 3నుండి హోం ఓటింగ్ షూరు......


ఖమ్మం, ఏప్రిల్ 10: ఎన్నికల నోడల్ అధికారులు, తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా చేపట్టాలని, రాబోయే ఎన్నికలు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఎన్నికల నోడల్ అధికారులతో, ఎన్నికల సన్నద్ధతపై జిల్లా ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నామినేషన్ సహాయక కేంద్రాల ఏర్పాటు, పోస్టల్ బ్యాలెట్, ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్,  పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన పై సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు సబంధించి ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని ముందస్తు చర్యల్లో వేగం పెంచాలని అన్నారు.  ఈ నెల 18 నుండి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, నామినేషన్ లకు సంబంధించి సామాగ్రి, ఎలక్షన్ కమిషన్ నుండి నామినేషన్ ప్రింటెడ్ పత్రాలు, ఇట్టి బ్లాంక్ నామినేషన్ పత్రాలు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. సహాయక కేంద్రాన్ని ఏర్పాటుచేసి, పోటీచేసే అభ్యర్థి, ప్రపోజర్ల ఓటుహక్కు ఉన్నది లేనిది చూడడం,  పోస్టల్ బ్యాలెట్లు, ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్, ఆబ్సెంటీ ఓటర్లు, 85 సంవత్సరాల వయస్సు దాటిన సీనియర్ సిటీజేన్లు, దివ్యాoగులు, ఎస్సెన్షియల్ సర్వేసెస్ లో పనిచేసే వారికి ఫారం 12, 12ఏ లు తీసుకోవాలన్నారు. ఎన్ఐసి పోర్టల్ నుండి ఎవరు, ఎక్కడ పనుచేయుచున్నది నివేదిక తీసుకొని, దాని ప్రకారం చర్యలు చేపట్టారు.గత ఎన్నికలో హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించిన వారికి తిరిగి కల్పించాలన్నారు. మే 3 నుండి హోం ఓటింగ్ చేపట్టనున్నట్లు, దీనికి అన్ని చర్యలు చేపట్టాలన్నారు. సెగ్మెంట్లలో ఇవిఎంల భద్రపర్చుటకు స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేయాలని, పోస్టల్ బ్యాలెట్లు భద్రపర్చడానికి మండల స్థాయిలో భద్రతతో కూడిన స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుచేయాలన్నారు. సువిధ అనుమతులు నిర్ణీత కాలవ్యవధిలోగా జారీచేయాలన్నారు. ఈ సమీక్ష లో అదనపు కలెక్టర్స్ సత్యప్రసాద్, మధుసూదన్ నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్ యువరాజ్, డిఎఫ్ఓ సిధార్థ విక్రమ్ సింగ్, అదనపు డిసిపి ప్రసాదరావు  అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పేదలకు మెరుగైన వైద్యం అందించండి : కలెక్టర్ వి పి గౌతం
ఖమ్మం, ఏప్రిల్ 10: పల్లె దవాఖానలో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్, రఘునాథపాలెం మండలం వి. వెంకటయపాలెం గ్రామంలోని పల్లె దవాఖాన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. షుగర్, బి పి. వ్యాధిగ్రస్థులకు ప్రతి నెలా మందులు ఇవ్వాలన్నారు. వ్యాధినిరోధక టీకాలు ఎంతమంది పిల్లలకు ఇచ్చినది, ఇంకా ఎంత మందికి ఇవ్వాల్సింది అడిగి తెలుసుకున్నారు. వ్యాధినిరోధక టీకాలు ఇవ్వాల్సిన ప్రతి ఒక్క పిల్లవాడికి అందించాలన్నారు.  పాము, కుక్క కాట్లకు మందులు అందుబాటులోఉంచాలన్నారు. ఇడిడి చార్ట్ ప్రదర్శించాల న్నారు. గర్భిణులకు అవసరమైన పరీక్షలు సమయానుసారం చేయించాలని ఆయన తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అన్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎండ వేడి నుంచి  కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పట్టణాలు, గ్రామాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థానిక ప్రజలను వేసవి జాగ్రత్తలపై అవగాహన పరచాలని అధికారులను సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలతీ, డాక్టర్ బాలకృష్ణ మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Tuesday, 9 April 2024

శ్రీవారి ఉగాది వసంత వైభవం... ఆకట్టుకున్న అయోధ్య రాముని నమూనా... కోనేటి రాయని లోగిలిలో ఫల - పుష్పాలంకార శోభ

కోనేటి రాయిని లోగిలిలో పల పుష్పాలు మురిసాయి..
అయోధ్య రాముడు ఏడుకొండల పై కొలువుతీరినట్లు భక్తులు సంబరపడ్డారు.. తిరుమల శ్రీవారి ఆలయంలో వసంత ఉగాది వైభవం అత్యంత శోభాయమానంగా నిలిచింది.తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫల పుష్ప అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందుకోసం 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 60 వేల కట్ ఫ్లవర్స్ ఉపయోగించారు. శ్రీవారి ఆలయం లోపల ఆపిల్‌, ద్రాక్ష, బత్తాయి,  నారింజ, కర్బూజ, మామిడి, చెరకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో భూలోక వైకుంఠంగా శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్థంభం చెంత పుచ్చకాయలతో చెక్కిన దశావతారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా అయోధ్య రామాలయం, బాల రాముడి సెట్టింగ్, నవధాన్యాలతో రూపొందించిన మత్స అవతారము భక్తులను మైమరిపించింది.ఆలయం వెలుపల గొల్ల మండపం పక్కన త్రేతా, ద్వాపర, కలియుగాలకు సంబంధించిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వేదనారాయణ స్వామి, శ్రీమహావిష్ణువు దశావతారాలు,  ఉద్యానవనంలో ఆడుకుంటున్న  రామలక్ష్మణుల సమేత హనుమంతుల వారు, బాల కృష్ణుడు వంటి పౌరాణిక ఘట్టాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఆలయం బ‌య‌ట‌ భక్తులు తమ చరవాణుల్లో ఫలపుష్ప ఆకృతులతో ఫొటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు.టీటీడీ గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ‌నివాసులు ఆధ్వ‌ర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వ‌చ్చిన 150 మంది పుష్పాలంక‌ర‌ణ క‌ళాకారులు, టీటీడీ గార్డెన్ సిబ్బంది 100 మంది రెండు రోజుల పాటు శ్ర‌మించి ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫల - పుష్ప ఆకృతులను రూపొందించారు.
*Krodhinama Ugadi observed*
#Ayodhya Bala Rama stands special attraction#
#Dasavatara Diorama attracts devotees#
Tirumala, Sri Krodhinama Telugu Ugadi festival was observed with utmost religious pomp and gaiety by TTD on Tuesday in Tirumala temple.Ugadi Asthanam was observed on the auspicious occadion where the Pundits rendered Panchanga Shravanam in front of Utsava Murthies in Garuda Mandapam of Sanctum Sanctorum.Both the presiding deity as well the processional deities were adorned with new robes on the occasion. After Asthanam devotees were allowed for darshan.Speaking to media TTD EO AV Dharma Reddy extended Sri Krodhinama Ugadi wishes to all Telugu devotees spread across the globe wishing them happy, peaceful and prosperous life.Ayodhya Rama and Dasavatara steals the show. As a special attraction matching Ugadi festival, the TTD Gardrn department has come out with colourful floral themes that included Sri Bala Rama of Ayodhya Temple and Dasavatara concepts.Devotees clicked photos infront of Dasavatara which was displayed in front of temple that stood as a special attraction.

Friday, 5 April 2024

తాగునీటి సమస్య ఎక్కడున్నా అధికారులు సత్వరమే స్పందించండి : ప్రభుత్వ కార్యదర్శి సురేంద్ర మోహన్


ఖమ్మం, ఏప్రిల్ 5: త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఉభయ ఖమ్మం జిల్లాల త్రాగునీటి సరఫరా పర్యవేక్షణ ప్రత్యేక అధికారి, ప్రభుత్వ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ అన్నారు. శుక్రవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి, మిషన్ భగీరథ, మునిసిపల్, ఇర్రిగేషన్, రెవిన్యూ, పంచాయతీ అధికారులతో జిల్లాలో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక అధికారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం త్రాగునీటి సరఫరా పర్యవేక్షణకై కార్యదర్శి స్థాయి అధికారిని జిల్లాలకు పంపిందని, దీన్ని బట్టి త్రాగునీటికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత నిస్తుందో తెలుస్తుందని అన్నారు. జిల్లా యంత్రాంగం పకడ్బందీ కార్యాచరణతో త్రాగునీటి సరఫరాపై ముందుకు వెళుతున్నదని, ఎక్కడెక్కడ సమస్యలు ఉంటే, వెంటనే పరిష్కార చర్యలు చేపడుతుందని అన్నారు. త్రాగునీటి సరఫరాపై వస్తున్న వ్యతిరేక వార్తలపై వెంటనే స్పందించి, పరిష్కార చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. ఈ నెల 10న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో త్రాగునీటి సరఫరాపై సమావేశం ఉన్నట్లు, అట్టి సమావేశంలో జిల్లాకు కావాల్సిన నీటి విడుదలపై చర్యలు తీసుకోనున్నట్లు ఆయన అన్నారు. నీటి సరఫరా పైప్ లైన్ తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలను తన దృష్టికి తేవాలని ఆయన తెలిపారు. జిల్లా స్థాయి అధికారి నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ప్రతివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి త్రాగునీటి సరఫరాపై సమీక్షలు చేస్తున్నారని, అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, జిల్లాలో త్రాగునీటి సరఫరా వివరాలను వెల్లడించారు. జిల్లాలో 957 గ్రామీణ అవాసాల్లో 93 త్రాగునీటికై కట్టడాలు, 2250.35 కి.మీ. మేర పైప్ లైన్ ఏర్పాటు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 6 ఇంటెక్ వెల్స్, 8 డబ్ల్యుటిపి లు, 54 ఓహెచ్బీఆర్ లు, 6 జిఎల్బిఆర్ లు, 19 సంప్ లు ఉన్నాయన్నారు. జిల్లాలో 1972 బోర్ వెల్స్ ఉండగా, 1627 పనిచేస్తున్నట్లు, 331 మరమ్మత్తులు చేయించినట్లు,14 పాడయినట్లు ఆయన అన్నారు. అదేవిధంగా 10005 హ్యాండ్ పంప్ లు ఉండగా, 7199 పనిచేస్తున్నట్లు, 1887 మరమ్మతులు చేయించినట్లు, 919 పూర్తిగా పాడయినట్లు ఆయన తెలిపారు. ఎస్డీఎఫ్ క్రింద రూ. 502.95 లక్షలతో 209 పనులు, డిఎంఎఫ్టి క్రింద రూ. 610.90 లక్షలతో 249 పనులు త్రాగునీటి సరఫరాకు సంబంధించి చేపట్టినట్లు ఆయన అన్నారు. ఇందులో 35 పనులు పూర్తి కాగా, 111 బోర్ పనులు, 109 పంప్ సెట్ పనులు పురోగతి లో ఉన్నాయన్నారు. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా లేనిచోట స్థానికంగా వ్యవసాయ బావులు తదితర నీటి వనరులు అద్దెకు తీసుకుంటున్నట్లు ఆయన అన్నారు. హ్యాండ్ పంప్ విడి భాగాలు గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు, అన్ని గ్రామ పంచాయతీల్లో నీటి పరీక్షలకు క్లోరోస్కోప్ లు అందించినట్లు తెలిపారు. ప్రతి మండలంలో మండల ప్రత్యేక అధికారి, ఎంపిడివో, ఎంపిఓ, ఏఇఇ లు రోజువారి త్రాగునీటి సరఫరా పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో 100704 గృహాలకు 69 ఎంఎల్డి  ప్రస్తుతం డిమాండ్ వున్నట్లు ఆయన తెలిపారు. మధిర మునిసిపాలిటీలో 6203 ఇంటి కనెక్షన్లకు 5.46 ఎంఎల్డి, సత్తుపల్లి మునిసిపాలిటీలో 6235 ఇంటి కనెక్షన్లకు 5.75 ఎంఎల్డి, వైరా మునిసిపాలిటీలో 9054 ఇంటి కనెక్షన్లకు 5.32 ఎంఎల్డి త్రాగునీటి సరఫరా డిమాండ్ ఉన్నట్లు ఆయన అన్నారు. ట్యాoకర్ల ద్వారా నీటి సరఫరా ఆవశ్యకత వస్తే, జిల్లాలో గ్రామపంచాయతీ లు, మునిసిపాలిటీల్లో 600 కు పైగా ట్యాoకర్లు ఉన్నట్లు, వీటిని వినియోగానికి తేనున్నట్లు ఆయన అన్నారు. పాలేరు రిజర్వాయర్ ద్వారా జూన్ వరకు త్రాగునీటి సరఫరాకై 1.74 టీఎంసీ ల నీరు అవసరం ఉంటుందని, ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుండి వదులుతున్న నీటికి అదనంగా మే మాసంలో మరో టీఎంసీ నీరు అందిస్తే త్రాగునీటి సమస్యలు ఉండవని అన్నారు. వైరా రిజర్వాయర్ నకు  జూన్ వరకు త్రాగునీటి అవసరాలకు 0.87 టీఎంసీ నీటి అవసరం ఉందని, నాగార్జున సాగర్ నుండి మే చివరి వారంలో 0.31 టీఎంసీ నీటి సరఫరా చేస్తే సమస్యలు ఉండవని అన్నారు. నీటి వనరులు లేనిచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుంటూ, త్రాగునీటి సరఫరా సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, మిషన్ భగీరథ సిఇ కె. శ్రీనివాస్, ఇర్రిగేషన్ సిఇ విద్యాసాగర్, మిషన్ భగీరథ ఎస్ఇ సదాశివకుమార్, ట్రాన్స్కో ఎస్ఇ సురేందర్, జెడ్పి సిఇఓ వినోద్, జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, ఇర్రిగేషన్, మిషన్ భగీరథ ఇంజనీర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Thursday, 4 April 2024

*ఏనుగు దాడిలో రైతు మృతి: ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి కొండ సురేఖ*




ఆదిలాబాద్ జిల్లాలో చింత లమానేపల్లి మండలంలోని బూరెపల్లిలో బుధవారం సాయంత్రం ఏనుగు అల జడి సృష్టించిన ఒక రైతు మృతి చెందాడు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతు న్నారు.
మహారాష్ట్ర  అటవీ ప్రాంతం నుంచి కొమురంభీం జిల్లా లోకి ఏనుగు ప్రవేశించింది. రైతును హతమార్చిన తర్వాత లంబాడీ హెటీ, గంగాపూర్ వైపు ఏనుగు వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
తిరిగి మహారాష్ట్ర అడవు ల్లోకి పంపేందుకు ప్రయత్నా లు చేస్తున్నారు.సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సూచించారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చింతలమానేపల్లి అటవీ ప్రాంతం నుంచి బూరెపల్లి గ్రామ శివారులోకి వచ్చిన ఏనుగు అక్కడే ఉన్న మిర్చి తోటలోకి ప్రవేశించింది.ఆ సమయంలో అల్లూరి శంకర్‌(56) అనే రైతు, అతడి భార్య అక్కడ పనుల్లో ఉన్నారు. ఏనుగును గమనించిన శంకర్‌ దాన్ని తరిమేందుకు ప్రయత్నించ గా అతడిపై అది దాడి చేసింది. కాళ్లతో తొక్కగా తీవ్రగాయాలైన శంకర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భయంతో పరుగులు తీసిన భార్య గ్రామస్థులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు, అటవీశాఖ అధికారులు చేరుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.జిల్లాలో ఇటువంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ఈ ఘటనపై అటవీ శాఖ అధి కారి ఒకరు మాట్లాడుతూ… తెలంగాణలో ఏనుగుల సంచారం లేదన్నారు.ప్రాణహిత నదికి అవత లవైపు మహారాష్ట్రలోని గడ్చరోలి జిల్లాలో 70 నుంచి 75 ఏనుగుల మంద సంచ రిస్తోందని తెలిపారు. వీటిలో ఒక మగ ఏనుగు దారి తప్పి నది దాటి ఇవతలికి వచ్చిందని వెల్లడించారు.అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ శంకర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతి తెలిపారు. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు...

Tuesday, 2 April 2024

*పోలింగ్ 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహించాలి* : కలెక్టర్ వి పి గౌతమ్


ఖమ్మం, ఏప్రిల్ 2: పోలింగ్ రోజున చేయవలసిన విధులు, బాధ్యతలపై ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు పూర్తి అవగాహన కలగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ కళాశాలల్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ విధులు, బాధ్యతలపై ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి తనిఖీ చేశారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పాలేరు, మధిర, సత్తుపల్లి సెగ్మెంట్ ల, ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ కళాశాలలో ఖమ్మం, వైరా నియోజకవర్గ పీవో, ఏపీవో లకు శిక్షణా కార్యక్రమ ఏర్పాట్లు చేశారు.
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలింగ్ రోజున నిర్వహించే విధుల పట్ల, ఇవిఎం యంత్రాల పట్ల పూర్తి అవగాహన పొందాలని తెలిపారు. పోలింగ్ ఏజెంట్లకు సీక్రెసి ఓటింగ్, పోలింగ్ నియమాలపై వివరించాలని, పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహించే విధానంపై వారికి వివరించాలని, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్  పోలింగ్ జరపాలని, మాక్ పోలింగులో 50 కి తక్కువ కాకుండా ఓట్లు వేయాలని,  రిజల్ట్ చూసిన తర్వాత ఈవీఎం యంత్రాన్ని క్లియర్ చేయాలని, అనంతరం అసలైన పోలింగుకు సన్నద్ధం కావాలని సూచించారు. బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వి.వి.ప్యాట్లను పోలింగ్ కేంద్రాలలో అమర్చడంపై అవగాహన ఉండాలన్నారు.  హ్యాండ్ బుక్ లోని ప్రతి అంశాన్ని తెలుసుకొని ఉండాలని, హ్యాండ్ బుక్ లో సూచించిన విధంగా మొత్తం పోలింగ్ సామాగ్రిని సేకరించుకోవాలని, ఫారములు, స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ కవర్స్, మెటీరియల్స్, మాక్ పోల్ సర్టిఫికెట్ ఇచ్చే విధానంపై, ఇవిఎం యంత్రాలలో క్లోజ్, రిజల్టు, క్లియర్ వ్యవస్థలపై, వీవీప్యాట్ లో 7 సెకన్లలో వచ్చే స్లిప్స్ పై,  పోల్ జరిగే సందర్భంలో కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్, బ్యాలెట్ యూనిట్లలో ట్రబుల్ షూట్స్ పై అవగాహన పొందాలని, ఓటింగు గోప్యత నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని,  బ్యాలెట్ గోప్యతను కాపాడే విధంగా ఓటింగ్ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పోలింగ్ స్టేషన్ ప్రాంతం, ఓటర్ల వివరాలు తెలిపే నోటీసు బోర్డులు, ఫారం -7 లో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాని పోలింగ్ స్టేషన్ బయట ప్రదర్శించాలని, ఓటర్లకు అవసరమైన సహాయం అందించడానికి బూత్ లెవల్  ఆఫీసర్ల ద్వారా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ లోని  సూచనల ప్రకారం అన్ని పత్రాలను సీల్ చేయాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు ఫారం-12ఏ, ఫారం-12 ద్వారా ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్, పోస్టల్ బ్యాలెట్ లు పొంది, ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటర్ హెల్ప్ లైన్, సి-విజిల్ యాప్ లను డౌన్లోడ్ చేసుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఏవేని పొరపాట్లు ఉంటే సరిదిద్దుకొని, ఎన్నికల నిర్వహణ వంద శాతం విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. శిక్షణా కేంద్రాల వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక వైద్య శిబిరాలను జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు.ఈ కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించి, ఇవిఎం యంత్రాలతో హాండ్స్ ఆన్ శిక్షణ ఇచ్చారు.ఈ సందర్భంగా ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, డిఎఫ్ఓ
 సిద్ధార్థ విక్రం సింగ్, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, జిల్లా స్థాయి మాస్టర్ శిక్షకులు, జిల్లా ఉపాధికల్పన అధికారి కె. శ్రీరామ్, మదన్ గోపాల్ తహశీల్దార్లు, అధికారులు తదితరులు ఉన్నారు.