Wednesday, 10 April 2024

ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష... వేగం పెంచాలని సూచన.... మే 3నుండి హోం ఓటింగ్ షూరు......


ఖమ్మం, ఏప్రిల్ 10: ఎన్నికల నోడల్ అధికారులు, తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా చేపట్టాలని, రాబోయే ఎన్నికలు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఎన్నికల నోడల్ అధికారులతో, ఎన్నికల సన్నద్ధతపై జిల్లా ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నామినేషన్ సహాయక కేంద్రాల ఏర్పాటు, పోస్టల్ బ్యాలెట్, ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్,  పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన పై సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు సబంధించి ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని ముందస్తు చర్యల్లో వేగం పెంచాలని అన్నారు.  ఈ నెల 18 నుండి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, నామినేషన్ లకు సంబంధించి సామాగ్రి, ఎలక్షన్ కమిషన్ నుండి నామినేషన్ ప్రింటెడ్ పత్రాలు, ఇట్టి బ్లాంక్ నామినేషన్ పత్రాలు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. సహాయక కేంద్రాన్ని ఏర్పాటుచేసి, పోటీచేసే అభ్యర్థి, ప్రపోజర్ల ఓటుహక్కు ఉన్నది లేనిది చూడడం,  పోస్టల్ బ్యాలెట్లు, ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్, ఆబ్సెంటీ ఓటర్లు, 85 సంవత్సరాల వయస్సు దాటిన సీనియర్ సిటీజేన్లు, దివ్యాoగులు, ఎస్సెన్షియల్ సర్వేసెస్ లో పనిచేసే వారికి ఫారం 12, 12ఏ లు తీసుకోవాలన్నారు. ఎన్ఐసి పోర్టల్ నుండి ఎవరు, ఎక్కడ పనుచేయుచున్నది నివేదిక తీసుకొని, దాని ప్రకారం చర్యలు చేపట్టారు.గత ఎన్నికలో హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించిన వారికి తిరిగి కల్పించాలన్నారు. మే 3 నుండి హోం ఓటింగ్ చేపట్టనున్నట్లు, దీనికి అన్ని చర్యలు చేపట్టాలన్నారు. సెగ్మెంట్లలో ఇవిఎంల భద్రపర్చుటకు స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేయాలని, పోస్టల్ బ్యాలెట్లు భద్రపర్చడానికి మండల స్థాయిలో భద్రతతో కూడిన స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుచేయాలన్నారు. సువిధ అనుమతులు నిర్ణీత కాలవ్యవధిలోగా జారీచేయాలన్నారు. ఈ సమీక్ష లో అదనపు కలెక్టర్స్ సత్యప్రసాద్, మధుసూదన్ నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్ యువరాజ్, డిఎఫ్ఓ సిధార్థ విక్రమ్ సింగ్, అదనపు డిసిపి ప్రసాదరావు  అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పేదలకు మెరుగైన వైద్యం అందించండి : కలెక్టర్ వి పి గౌతం
ఖమ్మం, ఏప్రిల్ 10: పల్లె దవాఖానలో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్, రఘునాథపాలెం మండలం వి. వెంకటయపాలెం గ్రామంలోని పల్లె దవాఖాన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. షుగర్, బి పి. వ్యాధిగ్రస్థులకు ప్రతి నెలా మందులు ఇవ్వాలన్నారు. వ్యాధినిరోధక టీకాలు ఎంతమంది పిల్లలకు ఇచ్చినది, ఇంకా ఎంత మందికి ఇవ్వాల్సింది అడిగి తెలుసుకున్నారు. వ్యాధినిరోధక టీకాలు ఇవ్వాల్సిన ప్రతి ఒక్క పిల్లవాడికి అందించాలన్నారు.  పాము, కుక్క కాట్లకు మందులు అందుబాటులోఉంచాలన్నారు. ఇడిడి చార్ట్ ప్రదర్శించాల న్నారు. గర్భిణులకు అవసరమైన పరీక్షలు సమయానుసారం చేయించాలని ఆయన తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అన్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎండ వేడి నుంచి  కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పట్టణాలు, గ్రామాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థానిక ప్రజలను వేసవి జాగ్రత్తలపై అవగాహన పరచాలని అధికారులను సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలతీ, డాక్టర్ బాలకృష్ణ మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment