వారణాసి: ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం.. కాశి విశ్వనాధ ఆలయంలో బెనారస్ పోలీసులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి విధుల్లో ఉంటారని వారణాసి కమిషనర్ మోహిత్ అగర్వాల్ పేర్కొన్నారు. 15 రోజులు పాటు సాంప్రదాయ వస్త్రాల్లో వారు బాధ్యతలు విశ్వనాధ్ ఆలయంలో నిర్వహిస్తారని అనంతరం దీనిని సమీక్షించి పూర్తిగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఈ డ్రెస్ కోడ్ ద్వారా పోలీసులు భక్తులతో సహృద్భావంతో వ్యవహరిస్తారని ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు అగర్వాల్ పేర్కొన్నారు. సాంప్రదాయ వస్త్రాల్లో ఆలయ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల్ని చూసిన భక్తుల సైతం వారితో కలివిడిగా ఉంటూ ఇది మంచి పరిణామం అని చెబుతున్నారు. త్వరలో మరిన్ని ఆలయాల్లో ఇటువంటి మార్పు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు
ఇక కాశి విశ్వనాధ్ ఆలయం పరిసరాల్లో డ్యూటీ చేసే అందరి పోలీస్ లు ఖాకి డ్రెస్ కాకుండా ఇలా పూర్తి హిందూ సంప్రదాయం ప్రకారం దోతి, కుర్తా, కండువా, బొట్టు, రుద్రాక్ష మాల ధరించి డ్యూటీ చేస్తారు.
కాగా ప్రతిపక్షాలు మాత్రం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆలయంలో పోలీసుల డ్రెస్ కోడ్ పై స్పందిస్తూ పూజారులు ధరించే ఇలాంటి డ్రెస్సులు పోలీసులు వేసుకోవాలని ఆదేశాలు ఇచ్చిన కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment