Monday, 26 August 2024

ఆందోళన వద్దు - పాత్రీకేయుల ఇండ్ల స్థలాల బాధ్యత మాదే : మంత్రి పొంగులేటి


*పాల్వంచ :* జర్నలిస్టులు నిజాలను వెలికి తీయడంలో కీలకపాత్ర పోషిస్తారని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జెన్ కో కేటాయించిన స్థలంలో శ్యామల గోపాలన్ ఫౌండేషన్ చైర్మన్ సురేష్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా నిర్మించిన ప్రెస్ క్లబ్ ను మంత్రి పొంగులేటి స్థానిక  ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభు త్వానికి వ్యతిరేకంగా వార్తల రాసిన జర్నలిస్టులపై కేసులు పెట్టిన చరిత్ర ఉందని, తమ ప్రభుత్వంలో విలేకరులు స్వేచ్ఛగా వార్తలు రాసుకునే వీలుందన్నారు. ఆ ట్యూబులు ఈ ట్యూబులు పేరిట తమ ప్రభుత్వంపై బురద చల్లేవారు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. తప్పులు ప్రభుత్వం చేసిన ప్రతిపక్షం చేసిన విలేకరులు ధైర్యంగా వార్తలు రాసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వైయస్ హయాంలో హైదరాబాదులో 72 ఎకరాల భూమిలో 1050 మంది విలేకరులకు ఇంటి పట్టాలు ఇచ్చిన గత ప్రభుత్వంలో కోర్టులో విలేకరులకు స్థలాలు ఇచ్చే విధంగా తీర్పు వచ్చినా ప్రభుత్వం ఆ పని చేయలేదన్నారు. తమ ప్రభుత్వంలో త్వరలోనే జవహర్ సొసైటీకి ఈ స్థలాలను భారీ బహిరంగ సభ నిర్వహించి వారి సమక్షంలో అందజేస్తామన్నారు. కొన్ని పింక్ పేపర్లు తమపై వ్యతిరేకంగా వార్తలు రాసిన పట్టించుకోమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా  జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మాటలు చెప్పిందని తమ ప్రభుత్వం చేతల ద్వారా చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.  పాల్వంచ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల కొండలరావు అధ్యక్షతన జరిగిన ఈ  సభలో కే టి పి ఎస్  ట్రైనింగ్ సెంటర్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస బాబు, మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరా వు, ఏపీఆర్ఓ అస్గర్ హుస్సేన్  ,సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్  పాషా, ప్రెస్ క్లబ్ నిర్మాణదాత నల్ల సురేష్ రెడ్డి, ప్రెస్ క్లబ్ కార్యదర్శి షేక్ సుభాని, గౌరవాధ్యక్షులు సంజీవ్ కుమార్, సలహాదారులు చండ్ర నరసింహారావు, కోశాధికారి రజాక్, ఉపాధ్యక్షులు వెంకటనారాయణ, ఏ. అబ్బురామ్, ఆర్ కృష్ణమూర్తి, జైనుల్లాబద్దీన్, జగదీష్, వాజిద్, వై. శ్రీనివాసరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీయూడబ్ల్యూజే యూనియన్ అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్, ఉదయ్ కుమార్,  బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర కామేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని, దేవి ప్రసన్న, నాగా సీతారాములు, సిపిఎం, సిపిఐ పట్టణ మండల కార్యదర్శులు దొడ్డా రవికుమార్, సాయిబాబు, వీసంశెట్టి పూర్ణ, మాస్ లైన్ నాయకులు నిమ్మల రాంబాబు, ఐ ఎన్ టీ యు సి రాష్ట్ర కార్యదర్శి ఎస్ ఏ జలీల్, 15 35 జాతీయ అధ్యక్షులు ఎంఏ వజీర్, టిఆర్వికేఎస్ రాష్ట్ర కార్యదర్శి చారుగుండ్ల రమేష్, 327 రాష్ట్ర కార్యదర్శి ఎంఏ మజీద్, 1104 రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రాజేందర్, కోటే శ్వరరావు, సిఐటియు రాష్ట్ర నా యకులు అంకిరెడ్డి నరసిం హారావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలతో సత్కరించి,  మెమొంటోలను అందజేశారు.

Thursday, 22 August 2024

దేశంలో సజ్జనార్లే ఉండాలి... కోల్కత్తా ఘటనపై మహిళల ఆవేశం....

ప్రస్తుతం ఎక్కడ చూసినా కోల్ కతా డాక్టర్ రేప్ కేసు గురించి చర్చ జరుగుతుంది. ఈ ఘటన జరిగాక కూడా నర్సుపై అత్యాచారం, చిన్నారులపై లైంగిక వేదింపులు..
ఇలా దేశవ్యాప్తంగా జరుగుతున్న చాలా ఇన్సిడెంట్స్ ఆడపిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో 2019లో జరిగిన వెటర్నరీ డాక్టర్ హత్యాచారం కేసుపై డిస్కషన్ జరుగుతుంది. ఈ కేసు విషయంలో వీసీ సజ్జనార్ ఇన్ స్టాంట్ జస్టిస్ ఇచ్చారని.. ఆయన లెజెండ్ అని పొగిడేస్తున్నారు. నేను ఇలాంటి లెజెండ్స్ మన సమాజానికి చాలా అవసరమని అంటున్నారు.కాగా 2019 నవంబర్ లో శంషాబాద్ లో 26 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఒకరోజు తర్వాత ఆమె బాడీ షాద్ నగర్ లో లభ్యమైంది. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారించారు. డిసెంబర్ 6న కేసు రిక్రియేషన్ గురించి నిందితులను తీసుకెళ్లిన పోలీసులు.. హైదరాబాద్ - బెంగళూరు నేషనల్ హైవే సమీపంలో ఎన్ కౌంటర్ చేశారు. పోలీసులపైకి గన్స్ తో ఎటాక్ చేసే క్రమంలో ప్రాణ రక్షణ కొరకు ఇలా చేసినట్లు తెలిపారు. దీంతో దేశ వ్యాప్తంగా సజ్జనార్ పై ప్రశంసల వర్షం కురిసింది. ఈ విధంగా న్యాయం చేసిందందుకు చాలా మంది అమ్మాయిలు 100కు డయల్ చేసి థాంక్స్ చెప్పారు.ఈ విషయంలో నాతో ఓ మహిళ అక్కడ సజ్జినారు లాంటి ఆఫీసర్ లేరా అని అడిగినప్పుడు అందరూ లెజెండ్లు కాలేరు కదా అన్నాను నేను..

Wednesday, 21 August 2024

సేవా పత్రాలను అందజేసిన జిల్లా కలెక్టర్


ఖమ్మం, ఆగస్టు 21: స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించికొని విశిష్ట సేవలు అందించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రశంసాపత్రాలు అందజేసి, అభినందించారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించి, బదిలీపై పొరుగు జిల్లాకు వెళుతున్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి విజయనిర్మల, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస రావులను కలెక్టర్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, ఇంచార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డిఆర్డీవో సన్యాసయ్య, డిఆర్వో ఎం. రాజేశ్వరి,  వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

భక్త రామదాసు ధ్యాన మందిరంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి పొంగులేటి...

జిల్లాలోని నేలకొండపల్లి మండల కేంద్రంలోని భక్త రామదాస ధ్యాన మందిర ఆడిటోరియాన్ని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఉదయం ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. భక్తరామదాసు ఇక్కడే జన్మించారని.. ఆయన జన్మస్థలాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేయాలని అన్నారు.
ఆడిటోరియం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మూడు కోట్ల రూపాయలతో ఆడిటోరియం నిర్మాణం చేసినట్లు చెప్పారు. ఇక్కడ ప్రశాంతత కనిపిస్తుందని.. బౌద్ద స్థూపాన్ని పరిశీలించామన్నారు. ప్రపంచంలో మూడో అత్యంత పెద్ద బౌద్ద స్తూపం నేలకొండపల్లిలో ఉందని తెలిపారు. నేలకొండపల్లిని టూరిజం ప్లేస్‌గా అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలకు భక్తరామదాసు గురించి తెలియజేలన్నదే ఇక్కడి వారి లక్ష్యమన్నారు. ధ్యాన మందిరం ఎలా అభివృద్ధి చేయాలో నిపుణులతో చర్చిస్తామన్నారు. భక్తరామదాసు ప్రజల శ్రేయస్సు కోసం పని చేశారన్నారు. మార్పు రావాలని తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామన్నారు. శ్రీరామచంద్రునికి ఆలయం కట్టేందుకు భక్తరామదాసు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలుసన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ల రాజ్యమని అన్నారు. భక్తరామదాసు ఈ ప్రభుత్వానికి ఆదర్శమని చెప్పుకొచ్చారు. ప్రజలకు చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తామని... అభివృద్ధి సంక్షేమం రెండూ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Monday, 19 August 2024

తిరుమలలో వైభవంగా శ్రావణ పౌర్ణమి గరుడసేవ.. GARUDA SEVA HELD AT TIRUMALA


 తిరుమలలో సోమవారం రాత్రి శ్రావణ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. గ‌రుడ వాహ‌నం - స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
TIRUMALA, The monthly Pournami Garuda Seva on the auspicious day in Sravana month was observed in Tirumala on Monday evening.The processional deity of Sri Malayappa atop might Garuda paraded swiftly along the four mada streets of Tirumala blessing devotees.The event took place between 7pm and 9pm under the sheath of full moon rays in the pleasant evening

దుర్గమ్మ సన్నిధిలో ఇంద్రకీలాద్రి పున్నమి "గిరి" ప్రదక్షిణ..

భక్తజనం నడుమ ఆలయ ధర్మ ప్రచార రథం తో  ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ పౌర్ణమి సందర్భంగా 
ప్రతి పౌర్ణమి నాడు ఉదయం 6:00 గం.లకు ఇంద్రకీలాద్రి ఎంట్రన్స్ నుంచి మొదలైంది ..ఆలయ అర్చకులు.. సిబ్బంది.భక్తులు కొండ చుట్టూ 7km  కొనసాగుతూ ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం కాళ్ళు చేతులు కడుగుకొని అమ్మవారి దర్శనానికి వెళ్లేదరు. స్వామి అమ్మవార్ల రథం లేకుండా నే గిరి ప్రదక్షిణ జరుగు... ఆలయ ధర్మ ప్రచార రథం లో స్వామి అమ్మవారు ఉంటారు అక్కడ నుంచి పూజలు నిర్వహించి తదనంతరం గిరి ప్రదక్షిణ మొదలవుతుంది.భక్తులు ప్రచార రథంతో మాత్రమే కాకుండా కొందరు ముందుగానే గిరి ప్రదక్షిణలు చేస్తూ మరికొందరు వెనక వస్తూ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణలు చేశారు.

Saturday, 17 August 2024

పరిహారం తిరస్కరించిన హతురాలి తండ్రి.. కోల్కత్తా ఘటనపై వెల్లువేత్తిన భారతావని..


కోల్‌కతాలోని మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన ఘటనపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. పార్టీలకు అతీతంగా ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తూ..బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కూడా 24 గంటల బంద్ ప్రకటించింది. ఈ తరుణంలో బాధితురాలి తండ్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని తిరస్కరించారు. తన కుమార్తె మరణానికి పరిహారంగా వచ్చిన డబ్బులు తీసుకుంటే అది తనను బాధిస్తుంది. అందుకే వద్దని స్పష్టంగా చెప్పారు. ఈరోజు దేశం మొత్తం నా కూతురికి న్యాయం జరుగాలని కోరుకుంటోంది. రోడ్లమీదరకు వచ్చిన అందరూ నా కూతుళ్లు, కొడుకులే. ఈ కేసు విచారణలో ఉన్నందున సీబీఐకి ఇచ్చిన వివరాలను బయట చెప్పలేను. నిందితులను త్వరలోనే గుర్తించి కఠినంగా శిక్షిస్తామని అధికారులు హామీ ఇచ్చారు అని తెలిపారు.
ఖమ్మంలో...
ఖమ్మం ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు కోల్కత్తా జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్యను ఖండిస్తూ ఖమ్మం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ప్లే కార్డులు ధరించి నిందితులను తక్షణమే శిక్షించాలని  నిన్నదించారు.
ఉదయం 10:30 కి స్థానిక పెవలేం గ్రౌండ్ దగ్గర ప్రారంభమైన నిరసన ర్యాలీ ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్ వైరా రోడ్డు నుండి సర్దార్ పటేల్ స్టేడియంకి చేరుకుంది. ఈ సందర్భంగా
 ఐఎంఏ బాధ్యులు ఘటనను నిరసిస్తూ తక్షణమే మృతురాలి కుటుంబానికి న్యాయం జరగాలని నినదించారు..*కలకత్తాలో వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యుల నిరసన*

ఖమ్మం : కలకత్తాలో ఓ వైద్య విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి , ఆపై దారుణ హత్యకు నిరసనగా పెవిలియన్ గ్రౌండ్ నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు మెడికల్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబులెన్స్ సహా భారీ ర్యాలీ నిర్వహించారు . ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ పి సేవలు నిలిపివేసి నిరసన చేపట్టారు . ఆసుపత్రిలోనే మహిళలకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ రక్షణ ఉంటుందని అన్నారు . వెంటనే దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కంభంపటి నారాయణ రావు , జనరల్ సెక్రటరీ డాక్టర్ కాసుకుర్తి జగదీశ్ బాబు , ట్రెజరర్ డాక్టర్ గుబ్బల స్వప్న మరియు ఐఎంఏ మెంబర్స్ , జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్యులు , వైద్య సిబ్బంది పాల్గొన్నారు .
కార్యక్రమంలో Chemists,para medical సిబ్బంది, మమతా మెడికల్ కాలేజీ పీజీ లు,govt hospital సిబ్బంది అంబులెన్స్ లు వాళ్ళు డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు

Friday, 16 August 2024

శ్రీశైల భ్రమరాంబమల్లిఖార్జనుల సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు...

శ్రీశైల మహా క్షేత్రంలో ధర్మప్రచారంలో భాగంగా నేడు శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఆలయ ఉత్తర ద్వారం ఎదురుగా ఉన్న చంద్రావతి కళ్యాణ మండపంలో 1500 పైగా భక్తులకు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతం దేవస్థానం జరిపించడం జరిగింది.అనంతరం భక్తులకు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం మరియు అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు.వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న అందరికీ మొట్టమొదటిసారిగా చీర,రవికవస్త్రం,తులసి మొక్క అందజేశారు

ఆదివారంలోగా నిందితులను ఉరి తీయండి : మమతా బెనర్జీ

డాక్టర్‌ అత్యాచారం-హత్యపై సీబీఐని కోరిన మమతా బెనర్జీ అన్నారు శుక్రవారం జరిగిన భారీ నిరసన ర్యాలీని మమతా స్వయంగా ముందు వరుసలో ఉండి నడిపించారు.   31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై బెంగాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.
ఈ కేసులో నిందితులను ఆదివారంలోగా ఉరి తీయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీబీఐని కోరారు. "మా కోల్‌కతా పోలీసులు దాదాపు 90 శాతం వరకు దర్యాప్తును పూర్తి చేసారు" అని ఆమె తెలిపారు. ఈ నేరానికి వ్యతిరేకంగా శుక్రవారం టిఎంసి చీఫ్ గా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ర్యాలీకి నాయకత్వం వహించారు.

Wednesday, 14 August 2024

ఇండియా దూసుకుపోతోంది..ద్రౌపతి ముర్ము..

భారతదేశ 78వ స్వాతంత్య దినోత్సవ వేడుకల (Independence Day) సందర్భంగా దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) శుభాకాంక్షలు తెలిపారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 140 కోట్ల ప్రజానీకం ఎంతో సంబరంగా జరుపుకొనేందుకు సిద్ధమవుతోందని అన్నారు. దేశ గౌరవం, ఐక్యతను చాటే ఈ వేడుక మనకందరికీ గర్వకారణమని అన్నారు. ఆగస్టు 15వ తేదీన 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి 7 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఆర్థిక, క్రీడా, మౌలిక వసతుల కల్పన తదితర రంగాల్లో దేశం సాధించిన విజయాలను తన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంసించారు. ప్రపంచంలోనే ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడం గర్వకారణమని చెప్పారు.

ఎందరెందరో సమరయోధుల పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్ర్య సిద్ధించిందని, భగత్ సింగ్, చంద్రశేఖర్, ఆజాద్, సుఖదేవ్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు నిరుపమానమని రాష్ట్రపతి ఈ సందర్భంగా కొనియాడారు. ఆగస్టు 14వ తేదీన దేశ విభజన నాటి పీడకలను స్మరించుకునే రోజు ఇదని, విభజన సమయంలో వేలాది మంది బలవంతంగా దేశం విడిచివెళ్లారని, అనేక మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాటి ట్రాజెడీని స్ఫురణకు తెచ్చుకుని, సమష్టిగా బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని అన్నారు.దేశ స్వాతంత్ర్య కోసం గిరిజనలు చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ, తిల్కా మాంజి, బిర్సా ముండా, లక్ష్మణ్ నాయక్, ఫులో-ఝానో తదితరులు చేసిన అసమాన త్యాగాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. భగవాన్ బిర్సా ముండా జయంతిని జన్‌జాతీయ గౌరవ్ దివస్‌గా జరుపుకొంటున్నామని, వచ్చే ఏడాది ఆయన 150వ జయంత్యుత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకోనున్నామని చెప్పారు.

స్వాతంత్ర్య సమరయోధులకు నివాళిగా కొత్త క్రిమినల్ చట్టాలను ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని రాష్ట్రపతి అన్నారు. ప్రభుత్వ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, గత కొన్నేళ్లుగా మౌలిక సదుపాయాల రంగంలో ఎంతో పురోగతి సాధించామని, రోడ్లు, హైవేలు, రైల్వేలు, నౌకాశ్రయాలతో సహా వివిధ రంగాల్లో మౌలిక వసతుల కల్పన కొత్తపుంతలు తొక్కిందని అన్నారు. 2020లో ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం ఫలితాలను ఇవ్వడం మొదలుపెట్టిందన్నారు.

*5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా...*

భారతదేశం ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడం దేశానికి గర్వకారణమని ద్రౌపది ముర్ము అన్నారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారతదేశం దూసుకువెళ్తోందన్నారు. రైతులు, కార్మికులు, దూరదృష్టి కలిగిన పాలసీ మేకర్లు, పారిశ్రామిక వేత్తలు, విజనరీ నాయకత్వ కఠోర శ్రమవల్లే ఇది సాకారమవుతోందని ప్రశంసించారు. పారిస్ ఒలింపిక్స్‌లో విజయాలు సాధించిన భారతీయ అథ్లెట్లు, టీ-20 వరల్డ్ కంప్ సాధించిన టీమ్ ఇండియాకు రాష్ట్రపతి తన ప్రసంగంలో అభినందనలు తెలిపారు.

ప్రధానమంత్రి ఇన్‌టర్న్‌షిప్ స్కీమ్‌‌ను రాష్ట్రపతి ప్రశంసించారు. దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా యువతకు వర్క్ ఎక్స్‌పీరియన్స్, స్కిల్ డవలప్‌మెంట్‌కు ఈ స్కీమ్ ఉద్దేశించిందని చెప్పారు. మహిళలు సాధికారత కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, నారీశక్తిని విస్తరించేందుకు నిర్విరామ కృషి చేస్తోందని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్, అధికారులు, భద్రతా సిబ్బందిని కూడా రాష్ట్రపతి తన ప్రసంగంలో అభినందించారు.

Monday, 5 August 2024

కబ్జాదారులపై కొరడా :మంత్రి శ్రీనివాస రెడ్డి *సీపీ సునీల్ దత్ కు ఆదేశాలు*

*

- *రైతుల భూములను ఆక్రమించుకునే వారిని వదలొద్దు*
- *ఎంతటివారైనా చట్టరీత్యా చర్యలు తీసుకొండి*
- *గంజాయి విక్రయాలపైనా ఉక్కు పాదం మోపండి*
- *సీపీ సునీల్ దత్ కు మంత్రి శ్రీనివాస రెడ్డి ఆదేశాలు*
*కూసుమంచి :*  రైతుల భూములు ఆక్రమించుకుంటూ వారి ఆత్మహత్యలకు కారణమవుతున్న కబ్జాదారులను బొక్కలో వేయాలని... వారు ఎంతటి వారైనా చట్టరీత్యా చర్యలకు పూనుకోవాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశాలు జారీచేశారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో ఖమ్మం సీపీ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు సంబంధించిన పలు అంశాలపై వారిరువురు చర్చించారు. తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టిస్తూ ఆక్రమణలకు పాల్పడుతున్నా వారిపై దృష్టి సారించాలని సీపీకి సూచించారు. కొంతమంది ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించారని వారిని కూడా గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో గంజాయి విక్రయాలు.. వాడకంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. వారిపై ఉక్కుపాదం మోపాలని పేర్కొన్నారు. గంజాయి మూలంగా యువత పెడదోవ పడతున్నారని దీన్ని అంతమొందించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ ఠాణాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఖచ్చితంగా అమలవ్వాలని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు