Wednesday, 21 August 2024

భక్త రామదాసు ధ్యాన మందిరంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి పొంగులేటి...

జిల్లాలోని నేలకొండపల్లి మండల కేంద్రంలోని భక్త రామదాస ధ్యాన మందిర ఆడిటోరియాన్ని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఉదయం ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. భక్తరామదాసు ఇక్కడే జన్మించారని.. ఆయన జన్మస్థలాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేయాలని అన్నారు.
ఆడిటోరియం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మూడు కోట్ల రూపాయలతో ఆడిటోరియం నిర్మాణం చేసినట్లు చెప్పారు. ఇక్కడ ప్రశాంతత కనిపిస్తుందని.. బౌద్ద స్థూపాన్ని పరిశీలించామన్నారు. ప్రపంచంలో మూడో అత్యంత పెద్ద బౌద్ద స్తూపం నేలకొండపల్లిలో ఉందని తెలిపారు. నేలకొండపల్లిని టూరిజం ప్లేస్‌గా అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలకు భక్తరామదాసు గురించి తెలియజేలన్నదే ఇక్కడి వారి లక్ష్యమన్నారు. ధ్యాన మందిరం ఎలా అభివృద్ధి చేయాలో నిపుణులతో చర్చిస్తామన్నారు. భక్తరామదాసు ప్రజల శ్రేయస్సు కోసం పని చేశారన్నారు. మార్పు రావాలని తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామన్నారు. శ్రీరామచంద్రునికి ఆలయం కట్టేందుకు భక్తరామదాసు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలుసన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ల రాజ్యమని అన్నారు. భక్తరామదాసు ఈ ప్రభుత్వానికి ఆదర్శమని చెప్పుకొచ్చారు. ప్రజలకు చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తామని... అభివృద్ధి సంక్షేమం రెండూ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

No comments:

Post a Comment