కోల్‌కతాలోని మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన ఘటనపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. పార్టీలకు అతీతంగా ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తూ..బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కూడా 24 గంటల బంద్ ప్రకటించింది. ఈ తరుణంలో బాధితురాలి తండ్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని తిరస్కరించారు. తన కుమార్తె మరణానికి పరిహారంగా వచ్చిన డబ్బులు తీసుకుంటే అది తనను బాధిస్తుంది. అందుకే వద్దని స్పష్టంగా చెప్పారు. ఈరోజు దేశం మొత్తం నా కూతురికి న్యాయం జరుగాలని కోరుకుంటోంది. రోడ్లమీదరకు వచ్చిన అందరూ నా కూతుళ్లు, కొడుకులే. ఈ కేసు విచారణలో ఉన్నందున సీబీఐకి ఇచ్చిన వివరాలను బయట చెప్పలేను. నిందితులను త్వరలోనే గుర్తించి కఠినంగా శిక్షిస్తామని అధికారులు హామీ ఇచ్చారు అని తెలిపారు.
ఖమ్మంలో...
ఖమ్మం ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు కోల్కత్తా జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్యను ఖండిస్తూ ఖమ్మం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ప్లే కార్డులు ధరించి నిందితులను తక్షణమే శిక్షించాలని నిన్నదించారు.
ఉదయం 10:30 కి స్థానిక పెవలేం గ్రౌండ్ దగ్గర ప్రారంభమైన నిరసన ర్యాలీ ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్ వైరా రోడ్డు నుండి సర్దార్ పటేల్ స్టేడియంకి చేరుకుంది. ఈ సందర్భంగా
ఐఎంఏ బాధ్యులు ఘటనను నిరసిస్తూ తక్షణమే మృతురాలి కుటుంబానికి న్యాయం జరగాలని నినదించారు..*కలకత్తాలో వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యుల నిరసన*
ఖమ్మం : కలకత్తాలో ఓ వైద్య విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి , ఆపై దారుణ హత్యకు నిరసనగా పెవిలియన్ గ్రౌండ్ నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు మెడికల్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబులెన్స్ సహా భారీ ర్యాలీ నిర్వహించారు . ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ పి సేవలు నిలిపివేసి నిరసన చేపట్టారు . ఆసుపత్రిలోనే మహిళలకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ రక్షణ ఉంటుందని అన్నారు . వెంటనే దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కంభంపటి నారాయణ రావు , జనరల్ సెక్రటరీ డాక్టర్ కాసుకుర్తి జగదీశ్ బాబు , ట్రెజరర్ డాక్టర్ గుబ్బల స్వప్న మరియు ఐఎంఏ మెంబర్స్ , జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్యులు , వైద్య సిబ్బంది పాల్గొన్నారు .
కార్యక్రమంలో Chemists,para medical సిబ్బంది, మమతా మెడికల్ కాలేజీ పీజీ లు,govt hospital సిబ్బంది అంబులెన్స్ లు వాళ్ళు డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment