Wednesday, 21 August 2024

సేవా పత్రాలను అందజేసిన జిల్లా కలెక్టర్


ఖమ్మం, ఆగస్టు 21: స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించికొని విశిష్ట సేవలు అందించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రశంసాపత్రాలు అందజేసి, అభినందించారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించి, బదిలీపై పొరుగు జిల్లాకు వెళుతున్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి విజయనిర్మల, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస రావులను కలెక్టర్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, ఇంచార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డిఆర్డీవో సన్యాసయ్య, డిఆర్వో ఎం. రాజేశ్వరి,  వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment