*మహిళలు వ్యాపార రంగంలో రాణించి మహిళా శక్తి బ్రాండ్ గా నిలవాలి... జిల్లా కలెక్టర్*
*అతివలకు ఇందిర మహిళా శక్తి పథకం అండగా నిలుస్తుంది.. జిల్లా కలెక్టర్*
ఖమ్మం : మహిళలు ఆసక్తి ఉన్న రంగంలో అర్ధికంగా రాణించాలని, ఇందిరా మహిళా శక్తి పథకం అండగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న ఇందిర మహిళా శక్తి స్త్రీ టీ సెంటర్ ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు. స్త్రీ టీ నిర్వాహకురాలను చెల్లెమ్మ చాయ్ సెంటర్ మంచిగా నడుస్తుందా, వ్యాపారం అనుకూలంగా ఉందా అని అప్యాయంగా అడిగారు. కలెక్టరేట్ బస్ స్టాప్ లోనే టీ స్టాల్ ఉందిగదా గిరాకి వస్తుందా అని ఆరాతీసారు. చెల్లెమ్మ టీ పెట్టమ్మ అంటూ కలెక్టర్ చాయ్ ని సేవించారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, వ్యాపార అభివృద్దికి సౌకర్యాలు కల్పించే అవసరం ఉందా అని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ* ఇందిర మహిళా శక్తి పథకం కుటుంబానికి ఆర్ధిక ప్రగతినిస్తుందని, మహిళలు స్వయం శక్తితో ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. చేయూత ఇచ్చే భాద్యత మాది.. మీ తలరాతలు మార్చుకునే శక్తి మీదని కలెక్టర్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం సమృద్ధికి దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు. మహిళలకు లబ్ది చేకూరాలనేది ప్రభుత్వం లక్ష్యమని, ఇందుకోసం స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం సహా వివిధ మార్గాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నమని తెలిపారు. ఇందిర మహిళా శక్తి పథకం ద్వారా అతివలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి, నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు బ్రాండింగ్, మార్కెటింగ్‌లలో మెలకువలు నేర్పించేందుకు సౌకర్యాలను కల్పిస్తున్నామని,
గ్రామీణ సంఘాలకు ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్టి చేకూరే విధంగా కార్యాచరణను వివరించారు. సుదీర్ఘకాలంగా మహిళాభ్యున్నతికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి నిలదొక్కుకునే విధంగా చేయాలనేదే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి అధికారులు తోడ్పాటు అందిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని స్వయం సహాయక గ్రూపుల సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించడం ద్వారా ఇంట్లో ఉండి ఏదైనా వ్యాపారం చేసుకోసి స్వయం ఉపాధిని పొందవచ్చు అన్నారు. ఒంటరిగా వ్యాపారాలు చేయలేని మహిళలు గ్రూపులుగా కూడా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు అన్నారు.మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని వారికి చిన్నగా చేయూత ఇస్తే, ఇక వారు వెనక్కి తిరిగి చూసుకోకుండా అనుకున్నది సాధిస్తారని చెప్పారు.మహిళాలు ఆర్థికంగా ఎదిగి, మిగతా వారికి ఆదర్శంగా నిలువాలని కలెక్టర్ ఆకాక్షించారు.
#################################
---------------------------------------------------------------------
*పక్కా ప్రణాళికతో ఇంటింటి సర్వే... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*
---------------------------------------------------------------------
*ఇంటింటి సర్వేలో ఏ దశలోనూ పొరపాట్లకు తావివ్వవద్దు.. జిల్లా కలెక్టర్*
------------------------------------------------------------------------
*ఇంటింటి సర్వే నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్*
------------------------------------------------------------------------
ఖమ్మం, నవంబర్- 4 : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణకై ప్రభుత్వం ఈ నెల 6 వ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లాలో పక్కాప్రణాళికతో, ఏ దశలోనూ పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 633304 కుటుంబాలున్నట్లు అంచనా ఉందన్నారు. ప్రతి ఇంటి సర్వేకు పటిష్ట ప్రణాళిక చేశామన్నారు. 3654 ఇబి లుగా చేపట్టి, 3719 ఎన్యుమరేటర్లను, 314 మంది సూపర్వైజర్ల, 5 గురు నియోజకవర్గ అధికారులను నియమించినట్లు ఆయన తెలిపారు. వివిధ శాఖల నుండి గెజిటెడ్ అధికారులను సూపర్వైజర్లుగా, వివిధ శాఖల సిబ్బందిని ఎన్యుమరేటర్లలుగా నియమించామన్నారు. ఖమ్మం కు డిప్యూటీ సిఇఓ నాగలక్ష్మి, పాలేరుకు అదనపు డిఆర్డీవో నూరోద్దీన్, వైరా కు డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, సత్తుపల్లి కి కల్లూరు ఆర్డీవో రాజేందర్, మధిర నియోజకవర్గ బాధ్యులుగా ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు లను నియయించినట్లు ఆయన అన్నారు.ఒక ఎన్యుమరేషన్ బ్లాక్ కి ఒక సర్వేయర్ ఉండాలన్నారు. సర్వేలో 75 పప్రశ్నలు ఉన్నట్లు, ఒక ఇంటి సర్వేకు 30 నిమిషాల సమయం, రోజుకు ఒక సర్వేయర్ 10 ఇండ్ల సర్వే చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. ఈ నెల 6,7,8 తేదీల్లో ఇండ్ల లిస్టింగ్ పూర్తి చేయాలని ఆయన తెలిపారు. ఒక్కో సర్వేయర్ కు 150 ఇండ్లు కేటాయించామన్నారు. రోజువారి లక్ష్యం పెట్టుకొని, 15 రోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లను సిద్ధంగా ఉంచాలని, వీరిని మండల స్టాటిస్టిక్ అధికారులు పర్యవేక్షణ చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఏ దశలో పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు ఎప్పటికప్పుడు సూపర్ చెక్ చేపడుతూ, పర్యవేక్షణ చేస్తూ, వారికి కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ అన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి రాజేశ్వరి, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment