పచ్చని భూములను కొల్లగొట్టొద్దు.
- భగ్గుమన్న భారతీయ జనతా పార్టీ.
- ఖమ్మంలో బీజేవైఎం నిరసన సెగ.
- ప్రకృతి సంరక్షణ కోసం పోరాటం ఉధృతం.
- భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు.
ఖమ్మం , ఏప్రిల్ 03, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపై ఆందోళన మిన్నంటుతోంది. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు, పర్యావరణవేత్తలు, ప్రజాసంఘాలు నిరసన రథాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. విద్యార్థుల నిరసనలపై పోలీసుల నిర్బంధ చర్యలతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులపై లాఠీచార్జ్, అరెస్టులపై ఆగ్రహంతో, ప్రజల గొంతుకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ), బీజేవైఎం సమరశంఖం పూరించింది. ఖమ్మం జిల్లాలో బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. నల్లబ్యాడ్జీలతో వీధుల్లోకి దిగి ప్రభుత్వ మొండివైఖరిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వానికి హెచ్చరికగా బీజేపీ నిరసనలను మరింత తీవ్రతరం చేయనున్నట్లు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ప్రకటించారు. భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగపడే భూమిని కాపాడుకొవాల్సిన బాధ్యత అందరి మద. ఉందని ఆయన పేర్కొన్నారు.. యూనివర్సిటీ భూములు ఇతరుల పరం చేయడం సరికాదని అన్నారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెడతామని ప్రకటించడంతో తీవ్ర కలకలం రేగింది. విద్యార్థులు, అధ్యాపకులు, పర్యావరణవేత్తలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పచ్చని చెట్లు నరుకుతుంటే, ప్రకృతి నాశనమైపోతుంటే, ప్రభుత్వం లాభాల కోసం భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించడాన్ని సమర్థించలేమని ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు స్పష్టం చేశారు.
- భాజపా నిరసన
ఈ వ్యవహారంపై విద్యార్థుల నిరసనలను అణచివేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో, ఈ విషయాన్ని తప్పుబడుతూ బీజేపీ నిరసన బాట పట్టింది. ఖమ్మం నగరంతో పాటు పలు మండలాల్లో భారీ స్థాయిలో నిరసనలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు నల్లబ్యాడ్జీలతో రోడ్డెక్కి, ప్రభుత్వం తక్షణమే ఈ వేలాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జడ్పీ సెంటర్ వద్ద బీజేపీ కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు.
- "వేలం నడవదు!" - భాజపా హెచ్చరిక.
భాజపా జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ, "సెంట్రల్ యూనివర్సిటీ భూమిని రియల్ ఎస్టేట్ మాఫియాకు అప్పగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఇది చెల్లదని, భూములను పరిరక్షించేందుకు తాము పోరాటం కొనసాగిస్తామని" హెచ్చరించారు. భూములను కాపాడాలని 22,000 మందికి పైగా ప్రజలు సంతకాలు చేసి పిటిషన్ సమర్పించారని, ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారంపై సమీక్ష జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
- పోరాటం ఆగదు" - భాజపా స్పష్టం.
భూముల రక్షణ కోసం భాజపా నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేయనున్నట్లు ప్రకటించింది. "ఈ భూములను వేలం వేయాలని చూస్తే, భాజపా దీన్ని నిలువరించకుండా ఉండదు. ప్రభుత్వానికి మా పోరాట శక్తిని చూపించాల్సిన సమయం ఆసన్నమైంది" అని నేతలు స్పష్టం చేశారు. విద్యార్థులు, పర్యావరణవేత్తలు, రాజకీయ నేతలు భూమిని కాపాడాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. భవిష్యత్తులో ఈ నిరసన తారాస్థాయికి చేరుకునే అవకాశముంది.
- ప్రకృతి రక్షణకు ప్రజల సంఘీభావం.
సెంట్రల్ యూనివర్సిటీ పరిసర ప్రాంతం నెమళ్ళు, జింకలు, అరుదైన తాబేళ్ల వంటి వన్యప్రాణులకు ఆశ్రయం ఇస్తోంది. ఈ భూమిని అభివృద్ధి చేయాలంటే, అటవీ సంరక్షణ చట్టం-1980 ప్రకారం కేంద్ర అనుమతి అవసరం. కానీ ప్రభుత్వం ఎలాంటి అనుమతి లేకుండానే ఈ ప్రదేశాన్ని వేలం వేయాలని చూస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చెట్లను నరికి, భూమిని మునుపటి రూపాన్ని కోల్పోయేలా చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్నాయి.ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనంత ఉపేందర్ గౌడ్ , జిల్లా ఉపాధ్యక్షుడు దుద్దుకూరు కార్తీక్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు ఈదుల భద్రం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోంగూర వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు శీలం పాపారావు, సీనియర్ నాయకులు మందడపు సుబ్బారావు, దొడ్డ అరుణ, మంద సరస్వతి,జిల్లా నాయకులు సుదర్శన్ మిశ్రా,నల్లగట్ల ప్రవీణ్ కుమార్,రేఖ వెంకట సత్యనారాయణ, నల్లగట్టు ఉపేందర్ ఏలూరి నాగేశ్వరరావు, తొడుపునూరి రవీందర్, భూక్య నాయక్, కుమిలి శ్రీనివాస్, జ్యోతుల యుగంధర్, నెల్లూరి బెనర్జీ, ఆచంటి కోటేశ్వరరావు, గడీల నరేష్ పిల్లలమర్రి వెంకట్, డికొండ శ్యామ్, రీగన్ ప్రతాప్, వలల రమేష్ , కందుల కృష్ణ , రుద్ర ప్రదీప్ రాహుల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment