Saturday, 29 November 2025

డెంటల్ డాక్టర్ పై సైబర్ వాళ్ళ 14 కోట్లు హాంఫట్


హైదరాబాద్‌: హబ్సిగూడలో డెంటల్‌ డాక్టర్‌  సైబర్ మోసగాళ్ల చేతుల్లో రూ.14 కోట్లు  రూపాయలు కోల్పోయారు.. ఫేస్‌బుక్‌లో మౌనిక పేరుతో మెసేంజర్‌కి రియాక్ట్‌ అయిన డాక్టర్.. తాను కష్టాల్లో ఉన్నానని ఆదుకోవాలని రిక్వెస్ట్ పెట్టిన మౌనిక..మాయమాటలతో డాక్టర్‌ నుంచి రూ.14 కోట్లు కొట్టేసిన మౌనిక.. క్రిప్టో కరెన్సీ పేరుతో ట్రేడింగ్‌ అకౌంట్‌ ఓపన్‌ చేయించి.. 
లావాదేవీలు నిర్వహించి లాభాలు చూపెట్టిన మౌనిక.. 
డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్‌ చెల్లించాలని నమ్మించి మోసం చేసినట్లు డాక్టర్ ఆవేదన.
***********************************************
*ఇంటర్ స్టేట్ ట్రేడింగ్ ఫ్రాడ్ సిండికేట్ బస్ట్మ్యూల్ అకౌంట్ & సిమ్ సప్లై రాకెట్‌లో గుట్టురట్టు....* *ఆరుగురు నిందితుల అరెస్ట్...*
మెట్రో న్యూస్ క్రైమ్ ప్రతినిధి, సైబరాబాద్:
సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు, బహిరంగంగా ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌లకు సహకరిస్తున్న, బ్యాంక్ అకౌంట్లు, చెక్ బుక్స్ మరియు సిమ్ కార్డులు సరఫరా చేసే ఒక వ్యవస్థీకృత సైబర్ మోసగాళ్ల నెట్‌వర్క్‌లో భాగమైన ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ నెట్‌వర్క్ పలు రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహించారు.
ఈ కేసు భారతీయ న్యాయ సంహిత (BNS) Sections 318(4), 319(2), 336(3), 338, 340(2) r/w Section 3(5) అలాగే ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 66-D కింద రిజిస్టర్ చేయబడింది.మోడస్ ఆపరెండీ (నేర పద్ధతి)అప్పగించబడిన బ్యాంక్ అకౌంట్లు, సిమ్ కార్డులను నేరస్థులు ఫేక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లను నడపడానికి ఉపయోగించారు. బాధితులకు నకిలీ లాభాల స్క్రీన్‌షాట్లు, డ్యాష్‌బోర్డ్‌లు చూపించి, భారీ మొత్తాలు మ్యూల్ అకౌంట్లలో జమ చేయించారు. ఈ అకౌంట్ల ద్వారా భారీ మొత్తాల మనీ ట్రాఫికింగ్ జరిపి, కమీషన్ ద్వారా లాభాలు పొందారు.
అరెస్ట్ అయిన వ్యక్తులు..వెనిగల్ల శ్రీనివాసరావు, 52 ఏళ్లు, NTR జిల్లా, చిట్ట గణేష్, 45 ఏళ్లు, పశ్చిమ గోదావరి జిల్లా, గండ్లూరు నవీన్ కుమార్ రెడ్డి, 33 ఏళ్లు, అనంతపురం జిల్లా, సత్తూరి రాజేష్, 41 ఏళ్లు, మెడ్చల్ జిల్లా మడ్డిరల్ల సుధీర్, 50 ఏళ్లు, కృష్ణా జిల్లా
మొహమ్మద్ అష్రఫ్, 39 ఏళ్లు, హైదరాబాద్ 
 వివరాలు
వెనిగల్ల శ్రీనివాసరావు, చిట్ట గణేష్ – బ్యాంక్ అకౌంట్లు మరియు సిమ్ కార్డులు సేకరించేవారు.
గండ్లూరు నవీన్ కుమార్ రెడ్డి – అకౌంట్ హోల్డర్లను గుర్తించి, డాక్యుమెంటేషన్ నిర్వహించేవారు.
సీజ్ చేసిన మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ విశ్లేషణలో 60 చెక్ లీఫ్ ఇమేజ్‌లు, దేశవ్యాప్తంగా 400 సైబర్ ఫ్రాడ్ కేసులకు సంబంధించిన వివరాలు బయటపడ్డాయి.
బాధితుల ఆర్థిక నష్టం: ₹1,09,50,000/-
సీజ్ చేసిన వస్తువులు..
7 మొబైల్ ఫోన్లు
3 చెక్ బుక్స్
11 సిమ్ కార్డులు
దర్యాప్తు స్థితి..
అరెస్ట్ చేసిన ఆరుగురిని పోలీస్ కస్టడీకి తీసుకుని, కేసు తదుపరి దర్యాప్తు సాగుతోంది. ఇంకా పరారీలో ఉన్న నిందితులను పట్టుకునే పనులు కొనసాగుతున్నాయి.
కేసును ఇన్‌స్పెక్టర్ జి. విజయ్ కుమార్,ఇన్‌స్పెక్టర్లు దుర్గ, డి. పళవెల్లి, సందీప్,సీసీపీ ఎస్ సిబ్బంది..
ఏసీపీ (సైబర్ క్రైమ్స్) ఎ. రవీంద్ర రెడ్డి డి.ఎస్.పి పర్యవేక్షణలో,
 డి.సి.పి (సైబర్ క్రైమ్స్) వై.వి.ఎస్. సుదీందర్  పర్యవేక్షణలో చేస్తున్నారు..
********************************************** *ట్రాఫిక్ చలానాలపై హైకోర్టు సీరియస్.. ఆ హక్కు మీకు లేదంటూ..*
**********************************************
తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఈ-చలాన్లు విధించే విధానంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చలాన్ల అమలులో పారదర్శకత లేదంటూ వి.రాఘవేంద్ర చారి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఈ అంశంపై పూర్తి వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.పిటిషనర్ రాఘవేంద్ర చారి, ట్రాఫిక్ పోలీసుల అమలు పద్ధతుల చట్టబద్ధతను ప్రశ్నించారు. ఈ పిటిషన్‌లో ఆయన ప్రధానంగా లేవనెత్తిన అంశాలు ఇలా ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు తమకు కేటాయించిన అధికారిక పరికరాలకు బదులుగా.. సొంత మొబైల్ ఫోన్లతో వాహనాల ఫోటోలు తీసి చలాన్లు జారీ చేస్తున్నారు. తనపై కూడా ఇలాగే మూడు చలాన్లు విధించారని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. వ్యక్తిగత మొబైల్ ఫోన్లు లేదా ధృవీకరించబడని పరికరాల ద్వారా తీసిన ఫోటోలు చట్టపరమైన సాక్ష్యంగా చెల్లవని, ప్రభుత్వం ఆమోదించిన నిఘా కెమెరాల ద్వారా మాత్రమే ట్రాఫిక్ ఉల్లంఘనలను రికార్డు చేయాలని పిటిషనర్ వాదించారు.చట్టబద్ధత లేని పద్ధతిలో చలాన్లు వేయడం వల్ల వాహనదారుల హక్కులు దెబ్బతింటాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ట్రాఫిక్ పోలీసు సిబ్బంది చట్టవిరుద్ధంగా జరిమానా మొత్తాలను నిర్ణయించడం.. న్యాయ పర్యవేక్షణ లేకుండా డబ్బు వసూలు చేయడంపై కూడా పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. శిక్షను నిర్ణయించే అధికారం కేవలం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు మాత్రమే ఉంటుందని.. క్షేత్రస్థాయిలోని కానిస్టేబుళ్లు లేదా ఇన్‌స్పెక్టర్లకు ఆ హక్కు ఉండదని పిటిషనర్ స్పష్టం చేశారు. ఈ రిట్ పిటిషన్ 2011 నాటి ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) నెం. 108ని కూడా సవాలు చేసింది. ఈ జీవో పోలీసులకు వాహనాలను ఆపి, కాంపౌండ్ జరిమానాలు అక్కడికక్కడే వసూలు చేయడానికి అధికారం ఇస్తుంది.
అయితే ఈ జీవో 108 చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం , ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేది అని పిటిషనర్ ఆరోపించారు. ఇది న్యాయవ్యవస్థకు ఉన్న అధికారాలను పోలీసులు వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తుందని ఆయన ఆరోపించారు. పిటిషనర్ తరపు న్యాయవాది విజయ్ గోపాల్, పోలీసులు దశాబ్దాలుగా చట్టాలను ఉల్లంఘిస్తూ డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హోం శాఖ తరపున ఏజీపీ లక్ష్మీకాంత్ హాజరుకాగా.. జస్టిస్ మాధవి దేవి ప్రాథమిక వాదనలు విన్న తర్వాత.. చలాన్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానంపై పూర్తి నివేదిక దాఖలు చేయడానికి రాష్ట్ర హోం శాఖకు నాలుగు వారాల సమయం ఇచ్చారు.ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం జరిగిన విచారణలోనూ హైకోర్టు ట్రాఫిక్ అమలు తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలాన్లు విధించిన తర్వాత.. వాటిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాయితీలు ప్రకటించడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయితీలు ఇవ్వడం వలన చట్టపరమైన పరిణామాలపై ప్రజల్లోని భయం బలహీనపడి, మరింత ట్రాఫిక్ క్రమశిక్షణ రాహిత్యాన్ని పెంచుతుందని హైకోర్టు పేర్కొంది.
***********************************************
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ చైతన్య స్కూల్ నిజాంపేట్ రోడ్డు బ్రాంచ్ వారు నిర్వహించిన "ఫిట్ ఇండియా మూవ్మెంట్" 2K రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, స్కూల్ ఆవరణలో జ్యోతి ప్రజ్వలన చేసి,  కిందికుంట పార్క్ వరకు జరిగిన 2K రన్ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ, స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించే 2K రన్ శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించే మంచి కార్యక్రమం. ఈ కార్యక్ర లో లోమం ద్వారా విద్యార్థులు వ్యాయామానికి అలవాటు పడతారు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడానికి ప్రేరణ పొందుతారు. అలాగే, క్రమం, క్రమశిక్షణ, జట్టుగా పనిచేయడం వంటి విలువలు నేర్చుకుంటారు. పాఠశాలలు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పిల్లల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించి, శారీరక–మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అలానే ఇలాంటి మంచి కార్యక్రమం పాఠశాలల్లో పిల్లల్లు తల్లిదండ్రుల సమక్షంలో చేసిన శ్రీ చైతన్య స్కూల్ సిబ్బంది వారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైతన్య స్కూల్ AGM శివరామకృష్ణ, RI పద్మజా, RI శ్రీనివాస రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ మురళి కృష్ణ, ప్రిన్సిపల్ సిందూష, డీన్ సునీల్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------
 *తిరుమలలో రికార్డు స్థాయిలో నమోదు*
------------------------------------------------------------------
వైకుంఠ ద్వార దర్శనం – eDIP
eDIP వ్యవస్థలో ఇప్పటివరకు 6 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. మొత్తం 15.50 లక్షల సభ్యులు (1+3) చేరుకున్నారు.
TTD ఈ ఐదు రోజుల వ్యవధిలో 60–70 లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
1.76 లక్షల స్లోటెడ్ టోకెన్లు మూడు రోజుల పాటు ఎంపికైన భక్తులకు జారీ చేయబడతాయి.
ప్లాట్‌ఫారమ్‌ వారీగా రిజిస్ట్రేషన్లు 📱💻
👉 మొబైల్ యాప్: 3.40 లక్షల రిజిస్ట్రేషన్లు (8.51 లక్షల సభ్యులు)
👉 వెబ్‌సైట్: 2.21 లక్షల రిజిస్ట్రేషన్లు (5.75 లక్షల సభ్యులు)
👉 వాట్సాప్: 39 వేల రిజిస్ట్రేషన్లు (98 వేల సభ్యులు)
e-DIP రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

------------------------------------------------------------------
*24 గంటల పాటు త్రాగునీటి సరఫరాకు చర్యలు.... రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు* 
**220 కోట్లతో త్రాగునీటి పనులు*
**నగరాన్ని ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి*
**ఖమ్మం నగరం 35వ డివిజన్ లో పర్యటించి 50.25 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల*
------------------------------------------------------------------
ఖమ్మం :ఖమ్మం నగరంలో 24 గంటల పాటు త్రాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.మంత్రివర్యులు, శనివారం ఖమ్మం నగరం 35వ డివిజన్ లో పర్యటించి 50.25 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా *మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ* నగరంలో చేపట్టే అభివృద్ధి పనులు నాలుగు కాలాల పాటు స్థిరంగా ఉండే విధంగా పూర్తి చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు.కార్పొరేటర్లు, ప్రజలు మున్సిపల్ కమీషనర్ కు సహకరిస్తూ పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా ఉండేలా చూడాలని అన్నారు.   అమృత్ పథకం క్రింద ఖమ్మం మున్సిపాలిటీకి 220 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, అధికారులు, ప్రజా ప్రతినిధులు కూర్చొని చేపట్టాల్సిన పనుల యొక్క డిపిఆర్ తయారు చేయాలని అన్నారు. డిసెంబర్ నెలలో అమృత్ పనులకు టెండర్ పిలిచి రాబోయే వేసవి కాలం నాటికి పనులు పూర్తి చేయాలని, నగర వ్యాప్తంగా 24 గంటల పాటు త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో డ్రైయిన్ నిర్మాణం కోసం మరో 200 కోట్ల పనులు జరుగుతున్నాయని అన్నారు. ఖమ్మం ఖిల్లాకు రోప్ వే సౌకర్యం కల్పించి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని, లకారం ప్రక్కన శిల్పారామం నిర్మిస్తున్నామని, వెలుగు మట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి చర్యలు చేపట్టామని అన్నారు. 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------------------------------------------------------
*భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి ... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*
*భక్త రామదాసు కళా క్షేత్రాన్ని సందర్శించి, చేపట్టవలసిన ఆధునీకరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్*
ఖమ్మం‌ : ఖమ్మం నగరంలో సాంస్కృతిక ప్రదర్శనలకు వేదికగా ఉన్న భక్త రామదాసు కళాక్షేత్రం ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. 
శనివారం భక్త రామదాసు కళాక్షేత్రాన్ని మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించారు. కళాక్షేత్రం మొత్తం కలియతిరుగుతూ చేయవలసిన పనులను పరిశీలించారు. కళా క్షేత్రంలో చేపట్టవలసిన ఆధునీకరణ పనులపై టాప్ ప్రూఫ్ లీకేజీ, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్, పార్కింగ్, కలర్ వాష్, పరిసరాలలో పచ్చదనం కోసం మొక్కల పెంపు, నిర్వాహణ, మరమ్మత్తు పనులపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* కళలకు, కళాకారులకు పుట్టినిల్లయిన ఖమ్మం జిల్లాలో ఉన్న భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆధునీకరించి, మౌళిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. భక్తరామదాసు కళాక్షేత్రం ఆకర్షణీయంగా తయారు చేయడం, సౌండ్, ఆడియో వ్యవస్థను మెరుగు పర్చడం, పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాటుకు చర్యలు, గోడలకు సంప్రదాయక వాల్ పెయిటింగ్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, టాప్ ప్రూఫ్ వాటర్ లీకేజీ, కళాక్షేత్రం బయట పరిసరాల్లో గ్రీనరికి చర్యలు, పూర్తి స్థాయి మరమ్మత్తు పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఇంటీరియర్ మరింత ఆకర్షణీయంగా తయారు చేయడం, కళాక్షేత్రంలో ఏసి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, వెనుక ఉన్న ప్రేక్షకులకు డయాస్ స్పష్టంగా కనిపించేలా రూపొందిచాలని అన్నారు. కళాక్షేత్రం సౌండ్ ప్రూఫ్, లోపల ఆడియో మైక్ వ్యవస్థ పక్కాగా ఉండేలా చూడాలని తెలిపారు. ముందు సీట్లలో కూర్చునే ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా స్టేజీ ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ అన్నారు.ఇంజనీరింగ్ అధికారులు తయారుచేసిన మోడల్ డిజైన్ మ్యాప్ లు, ఆర్కిటెక్చర్ రూపొందించి నమూనా వీడియోను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంట జెడ్పి సీఈఓ దీక్షా రైనా, పంచాయతీరాజ్ ఇఇ మహేష్ బాబు, మున్సిపల్ డిప్యూటీ కమీషనర్ శ్రీనివాస్, అసిస్టెంట్ కమీషనర్ అనిల్, ఖమ్మం అర్బన్ తహసీల్దారు సైదులు,  మునిసిపల్ డిఇ ధరణి కుమార్, ట్లౌన్ ఫ్లానింగ్ అధికారి సంతోష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------
*కటుదిట్టమైన ఏర్పాట్లతో గ్రామ పంచాయతీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ... సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు*
ఎన్నికల విధులు కట్టుదిట్టంగా నిర్వహించండి : 
ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ
ఖమ్మం : ఎన్నికల నిబంధనల ప్రకారం అప్రమత్తంగా ఉంటూ విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు అన్నారు.
శుక్రవారం రఘునాథపాలెం మండలంలో మొదటి విడత గ్రామ పంచాయతి ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి ఎన్నికల సాధారణ పరిశీలకులు పరిశీలించారు. చిమ్మపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోటపాడు, చిమ్మపూడి, కోయచెలక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రేగులచెలక, కోయచెలక, శివాయిగూడెం  గ్రామాల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. అభ్యర్ధులు దాఖలు చేసిన నామినేషన్ ప్రతాలను పరిశీలించారు. ఎన్నికల విధులు, బాధ్యతల పట్ల సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా *సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు మాట్లాడుతూ* ఎన్నికల నిర్వహణలో నామినేషన్లు చాలా ముఖ్యమైన ఘట్టమని, నామినేషన్ పత్రాలలో ప్రతి అంశం సరిగా ఉన్నాయో, లేవో జాగ్రత్తగా నిబంధనల ప్రకారం చూడాలని తెలిపారు. *జిల్లా కలెక్టర్  అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ కు విధిగా కొత్త బ్యాంక్ ఖాతా తీసుకునే విధంగా వారికి తెలియజేయాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ఒరిజినల్ పత్రాలను సంబంధిత గ్రామ పంచాయతీలలోని ఆర్వో ల వద్ద పొందవచ్చని తెలిపారు. వార్డు సభ్యుడు పోటీ కోసం అదే వార్డు సభ్యుడు ప్రపోజర్ గా ఉండాలని అన్నారు. సర్పంచ్ గా పోటీచేసే అభ్యర్థి డిపాజిట్ క్రింద  కేటగిరి వారిగా  చెల్లించాలని, ఏమైనా అప్పీల్ ఉంటే ఆర్డీవోను సంప్రదించాలని సూచించారు.నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులకు సంబంధించిన కర పత్రాలు, గోడపత్రాలు, ప్రచార వాహనాల అనుమతులను తీసుకోవాలంటే సంబంధిత మండల అధికారులను సంప్రదించాలని తెలిపారు. గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యుల నామినేషన్ దాఖలును రోజు వారిగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. అభ్యర్థుల యొక్క అన్ని వివరాలు నామినేషన్ పత్రాలలో పూర్తిగా నమోదు చేసేందుకు అవగాహకు హెల్ప్ డెన్స్ లో నివృత్తి చేసుకోవచ్చని,  ప్రతి చిన్న అంశాన్ని, అనుమానాలకు తావులేకుండా పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించుటకు అధికారులు సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.సాధారణ ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్ వెంట రఘునాథపాలెం మండల తహసీల్దారు శ్వేత, లింగనాయక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------
Another Indian Air Force IL-76 aircraft lands in Colombo with:
➡️9 Tons Relief Material 
➡️2 Urban Search & Rescue Teams comprising 80 National Disaster Response Force Personnel
A total of around 27 tons of relief material delivered by air and sea. More is on the way!

Wednesday, 26 November 2025

పది రూపాయల బిక్ష... 10 లక్షలు దానం చేసిన రజినీకాంత్...

సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఒక భిక్షగాడిగా భావించి ఆయనకు పది రూపాయలు భిక్ష వేసిన ఒక మహిళకు సంబంధించిన ఆసక్తికర సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.   ప్రముఖ వైద్యురాలు గాయత్రీ శ్రీకాంత్ గారు రజనీ కాంత్ పై రాసిన పుస్తకంలో  ఈ విషయం వెలుగు చూసింది.  రజనీ కాంత్ హీరోగా గొప్ప పేరు తెచ్చుకున్న తర్వాత బెంగుళూరులోని ఒక ప్రసిద్ధ ఆలయాన్ని దర్శించడానికి వెళ్లారట , దర్శనం తర్వాత ఆయన ఆ గుడిలోని ఒక స్థంబం వద్ద కూర్చున్నారట.   రజనీ తన సాధారణ గెటప్ లో పంచె , చెరిగిన జుట్టు , మాసిన గెడ్డంతో అక్కడ కూర్చున్నారు.
అక్కడ రజనీని చూసిన ఒక గుజరాతీ మహిళ , ఆయనను భిక్షగాడు అనుకొని రజనీ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు దానం చేసింది.   ఈ సంఘటనకు రజనీ ఏమీ మాట్లాడకుండా ఆమెను చూసి చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయారట. అది చూసిన కొంతమంది పరిగెత్తుకొని వచ్చి,   “ ఆయనను ఎవరనుకుంటాన్నావ్........? అంటూ ఆ గుజరాతీ మహిళను తిట్టడం మొదలుపెట్టారట. దానితో బెదిరిపోయిన ఆ గుజరాతీ మహిళ , రజనీని పట్టుకొని క్షమించమని ఏడ్చిందట.  దానికి రజనీ ఆమెను ఓదారుస్తూ,  ఇది దేవుడు తనకు ప్రసాదించిన అసలు రూపమని చెబుతూ ,  తాను సూపర్ స్టార్ ను కాను ,కేవలం సామాన్యుడినే అని  ఆ దేవుడు ఆమె చేత చెప్పించాడని ఆమెను ఓదార్చి ,  ఆమె ఇచ్చిన 10 రూపాయలకు తోడుగా మరో 10 లక్షల రూపాయలను కలిపి  ఒక అనాథ శరణాలయానికి ఇచ్చాడట మన సూపర్ స్టార్.  హ్యాట్సాఫ్ టు రజనీ కాంత్.
సేకరణ: సోషల్ మీడియా.

Thursday, 20 November 2025

దర్యాప్తులో సిపిఎం జోక్యం ఉండబోదు. పద్మ కుమార్ అరెస్టుపై కేరళ సిపిఎం స్పందన..

శబరిమలైలో  బంగారం ఛోరిలో దర్యాప్తులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది శబరిమలై అయ్యప్ప ఆలయం.. ట్రావన్కూర్ దేవస్థానం బోర్డు  మాజీ అధ్యక్షుడు ఎ. పద్మకుమార్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అరెస్టు చేయడంతో శబరిమల బంగారు దొంగతనం కేసు కీలక మలుపు తిరిగింది.- ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు ఎ. పద్మకుమార్ అరెస్టుతో శబరిమల బంగారు దొంగతనం కేసు మలుపు తిరిగింది.- శబరిమల ఆలయం నుండి బంగారం  మాయం అయినా కేసులో దర్యాప్తు బృందం (SIT)  దర్యాప్తులో భాగంగా  ఈ అరెస్టు జరిగింది.
- దొంగతనం దరిమిలా ఉన్న సంఘటనలను బెరిజు వేసుకున్న సీటు SIT పద్మకుమార్‌ను ప్రశ్నించిన తర్వాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు.ఆలయ భద్రత విశ్వాసంపై దాని ప్రభావం కారణంగా 
ఈ కేసు గణనీయమైన ప్రజా దృష్టిని ఆకర్షించింది.
 #శబరిమల #గోల్డ్‌థెఫ్ట్ కేసు దర్యాప్తులో పార్టీ జోక్యం చేసుకోదని #CPM రాష్ట్ర కార్యదర్శి M.V గోవిందన్ అన్నారు.దర్యాప్తు బృందానికి ఎవరినైనా ప్రశ్నించడానికి లేదా అరెస్టు చేయడానికి పూర్తి అధికారం ఉందని ఆయన పేర్కొన్నారు. అరెస్టు అంటే నేరం అని అర్థం కాదని, దీనిని కోర్టు మాత్రమే నిర్ణయించగలదని నొక్కి చెప్పారు.సీపీఎం పతనంతిట్ట జిల్లా కార్యదర్శి రాజు అబ్రహం కూడా ఇదే విషయం వెల్లడించారు.సీపీఎం సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పద్మకుమార్ జిల్లా కమిటీ సభ్యుడు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆయన అరెస్టు పార్టీలో ఆందోళనను సృష్టించింది.
మణికుమార్ కొమ్మమూరు, మోబైల్: 9032075966.

Monday, 17 November 2025

మక్కా యాత్రికుల బస్సుకు ప్రమాదం.. హైదరాబాద్ వాసులు మృతి...

మక్కా యత్రకు వెళ్లిన హైదరాబాద్ యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదానికి గురైందని తెలుస్తోంది. దాదాపు 42 మంది ప్రయాణికులు మృతి చెందినట్లుగా పేర్కొంటున్నారు.. ముఖ్యంగా అందులో 11 మంది మహిళలు 10 మంది చిన్నారులు ఉన్నట్టు సమాచారం.
                                     --------
సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, అందులో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని వస్తున్న ప్రాథమిక సమాచారంపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి  పూర్తి వివరాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించారు. ఈ దుర్ఘటనపై విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని, తక్షణం అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి  ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు వెంటనే ఢిల్లీలో ఉన్న కో-ఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్తో  మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు, సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ కుటుంబీకులు, బంధువులకు సమాచారం కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు:
+91 79979 59754
+91 99129 19545

Saudi Arabia Bus Accident
Control Room Numbers:
📞 +91 79979 59754
📞 +91 99129 19545
-------------
Chief Minister A. Revanth Reddy has expressed deep shock over the tragic bus accident in Saudi Arabia involving Indian pilgrims. Initial reports indicate that the accident occurred while the passengers, including residents of Hyderabad, were travelling from Mecca to Medina.The Chief Minister immediately directed the Chief Secretary and the DGP to obtain full details of the incident. He also instructed officials to coordinate with the Ministry of External Affairs and the Saudi Embassy to ensure prompt relief measures for the affected.Chief Secretary K. Ramakrishna Rao contacted Coordination Secretary Gaurav Uppal in Delhi and provided necessary guidance to facilitate immediate assistance. A control room has been established at the Telangana Secretariat to keep the families and relatives informed and to monitor ongoing relief efforts.
A spiritual journey turned into a nightmare early Monday when a bus carrying Indian Umrah pilgrims from Mecca to Madinah collided with a diesel tanker. The crash, followed by a massive fire, has left at least 42 people feared dead. Initial reports indicate that many passengers on the bus were women and children from Hyderabad. Unofficial information suggests 11 women and 10 children may be among the dead, though officials are still verifying exact numbers.

Sunday, 16 November 2025

మీడియాకు స్వచ్ఛంద ప్రెస్ కౌన్సిల్ వుండాలి : సీనియర్ ఎడిటర్ దేవులపల్లి అమర్

మీడియా స్వేచ్ఛ తోపాటు మీడియాను అదుపు చేయడానికి ప్రభుత్వ ఆజమాయిషీ లేని ప్రెస్ కౌన్సిల్ లాంటి వ్యవస్థలు అత్యంతఆవశ్యకమని సీనియర్ సంపాదకులు దేవులపల్లి అమర్ అన్నారు. నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి ఆడిటోరియంలో సమాచార పౌర సంబంధాల శాఖ, తెలంగాణ మీడియా అకాడమి  సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం (నేషనల్ ప్రెస్ డే) కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవులపల్లి అమర్ మాట్లాడుతూ, సమాజంలో మీడియా పేరుతో జరుగుతున్న దుష్టప్రయోగాలను ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసారు. వర్కింగ్ జర్నలిస్టులు, 
వార్తా పత్రికలు, చట్టాలు ఏలా రూపొందించాలో ఆనాటి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ సూచనల మేరకు దేశంలో మొదటి ప్రెస్ కమీషన్ తోపాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను 1966 నవంబర్ 16న ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రెస్ కౌన్సి ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన రోజునే జాతీయ పత్రికా దినోత్సవం (నేషనల్ ప్రెస్ డే) నిర్వహించుకోవడం ఆనావాయితిగా వస్తుందన్నారు. అందులో భాగంగా నేడు మనం ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకుని ఆందరం ఒకే వేదికపె కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అదే విధంగా అందరికి నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.కొన్ని పత్రికలు, ఛానాల్స్ యాజమాన్యాలు మీడియా చట్టాలు, నైతిక నియామావళిని పాటించకపోవడం వలన, తప్పుడు వార్తలు ప్రచురించడం, ప్రసారం చేయడం వల్ల మీడియా మొత్తాన్ని దూషిస్తున్నారు. దీనిని అరికట్టాలంటే మీడియా సంస్థలు, సంఘాలు అన్ని ఒక తాటిపై వచ్చి మనపై ఉన్న అభద్రతాభావాన్ని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.అదే విధంగా సోషల్ మీడియా నియంత్రణకు చట్ట పరంగా సరియైన మార్గదర్శకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాలని ఆయన కోరారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు ప్రభుత్వం తరుపున తగిన చర్యలు తీసుకోవాలన్నారు. భారత ప్రభుత్వం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను మీడియా కౌన్సిల్ ఇండియా మార్చే విధంగా అన్ని మీడియా సంస్థలు, జర్నలిస్టుల సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం, మీడియా అకాడమి కృషి చేయాలన్నారు. గత రెండేళ్లుగా భారత ప్రెస్ కౌన్సిల్ కు పాలక వర్గాన్ని నియమించలేదని,  ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పాలక వర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దీని ద్వారా పత్రికా స్వెచ్ఛ, నైతికత, జవాబుదారితనం, బాధ్యతలు మొదలగునవి పర్యవేక్షిస్తూ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తప్పు చేస్తే మీడియాపై చర్యలు తీసుకునే అధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు మారుతి సాగర్, మాజీద్, బసవ పున్నయ్య, రమణారావు, రంగసాయి, యూసుఫ్ బాబు, రమణ కుమార్,  సువర్ణ, తదితరులు నేషనల్ ప్రెస్ డే సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమానికి తమ సూచనలు, సలహాలు అందజేశారు.ఈ కార్యక్రమానికి సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ డి.ఎస్. జగన్ అధ్యక్షత వహించగా, జాయింట్ డైరెక్టర్ కే. వెంకట రమణ, మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, అధికారులు, జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు. 

Saturday, 15 November 2025

వ్యాపారి - రాజు కథ.... లక్ష్యం నిర్దేశించుకుంటేనే సోమరితనం పోతుంది..

ఒకప్పుడు ఒక రాజుకి  ఒక గుర్రపు వ్యాపారితో  స్నేహం ఏర్పడింది. 
ఆ వ్యాపారి రాజు కోసం ఉత్తమమైన గుర్రాలను తీసుకువచ్చేవాడు, అతను తెచ్చిన గుర్రాలు చాలా ఆరోగ్యంగా, చురుకైనవిగా ఉండటం వల్ల, రాజు హృదయం ఆనందంతో నిండిపోయేది. 
వాటన్నింటినీ ఎంత ధర వెచ్చించయినా కొనేవాడు. చాలా సార్లు, వ్యాపారి రాజుకు చాలా ఖరీదైన గుర్రాన్ని బహుమతిగా ఇచ్చేవాడు. రాజు కూడా దానిని నిరభ్యంతరంగా స్వీకరించేవాడు.
వారిరువురి మధ్య చాలా మధురమైన, సన్నిహితమైన స్నేహం ఉండేది, రాజు తన స్నేహితుడితో ఎన్నడూ తాను ఒక దేశానికి రాజన్న హోదాలో ప్రవర్తించేవాడు కాదు. వ్యాపారి కూడా రాజును తనకంటే ఉన్నతమైన వాడని భావించి అతనితో మాట్లాడేవాడు కాదు. ఇద్దరికీ ఒకరికొకరంటే చాలా గౌరవం, ప్రేమ ఉండేది.

కాలక్రమంలో, వ్యాపారి డబ్బును కోల్పోవడం ప్రారంభించాడు. అతను తన గుర్రాలకు, పెట్టిన ఖర్చు కంటే తక్కువ డబ్బు రావడం మొదలయింది. అలాగే, అతని ఖరీదైన, ఉన్నత జాతి గుర్రాలు గుర్తుతెలియని వ్యాధులతో చనిపోవడం ప్రారంభించాయి. తన జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ కష్టాల నుంచి గట్టెక్కేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ, కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. నెమ్మదిగా, అతని ఆదాయం తగ్గిపోయి, దాచుకున్న డబ్బు వ్యయం అయిపోయి, క్రమంగా బీదవాడైపోయాడు.

మొదట, అతను తన కష్టాలను రాజు నుండి దాచాడు. అయితే ఉండేందుకు ఇల్లు, పిల్లలకు రెండు పూటలా భోజనానికి కూడా కష్టమైపోవడంతో భార్య కోరిక మేరకు రాజాస్థానానికి వెళ్లాడు.

తన కష్టాలను రాజుకు తెలియజేసి, కొంత డబ్బు సహాయం చేయమని అడిగాడు కానీ, రాజును సహాయం అడగవలసివస్తున్నందుకు వ్యాపారి సిగ్గుతో తలదించుకున్నాడు.

వ్యాపారి చెప్పేది ఓపికగా, శ్రద్ధగా విన్న రాజు, "మిత్రమా, నీవు ఏ పని చేయగలవు?" అని వ్యాపారిని అడిగాడు.

వ్యాపారి కాసేపు ఆలోచించి, "నేను నా జీవితమంతా గుర్రపు పని మాత్రమే చేసాను, కానీ చాలా కాలం క్రితం కొరడాల తయారీలో శిక్షణ తీసుకున్నాను. బహుశా, అది చేయగలగుతానేమో", అన్నాడు.

రాజు కొంచెం ఆలోచించి, కోశాధికారితో, "నా స్నేహితుడికి 500 నాణేలు ఇవ్వండి. అతను ఎప్పుడు వచ్చినా కారణం అడగకుండా 500 నాణేలు ఇవ్వాలి", అని ఆజ్ఞాపించాడు. రాజు మాటలు విన్న వ్యాపారి 500 నాణేలు సరిపోవని, ఇబ్బందిగా అనిపించినా చిరునవ్వుతో రాజు సహాయాన్ని స్వీకరించాడు.

కాలం గడుస్తూ ఉంది. వ్యాపారి వచ్చినప్పుడల్లా, కోశాధికారి ఎటువంటి ప్రశ్నలు అడగకుండా అతనికి 500 నాణేలు ఇచ్చేవాడు. వ్యాపారి కూడా తన వంతు ప్రయత్నంగా, పూర్తి అంకితభావంతో కొరడాలను తయారుచేసేవాడు. కానీ ఏదో ఒక లోపం, లేదా ఏదో ఒక కారణంగా తరచుగా అతను పెట్టిన ఖర్చు కంటే తక్కువ పొందేవాడు. అదృష్టవశాత్తూ, రాజు చేస్తున్న సహాయంతో, ఇప్పుడు అతను తన కుటుంబానికి ఆహారం సమకూర్చడంలో ఎటువంటి ఇబ్బంది పడట్లేదు. కొన్ని నెలలు గడిచినా వ్యాపారి పట్టువదల్లేదు. అతను కొరడాలను తయారు చేయడంలో మరింత కష్టపడుతూ, విక్రయించడంలో మరింత శ్రద్ధపెడుతూ పనిచేశాడు. ఎల్లప్పుడూ ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాడు.

క్రమంగా, వ్యాపారి నిష్ణాతుడయ్యాడు, నైపుణ్యత సాధించాడు. అతని కొరడాలు మునుపటి కంటే చాలా చక్కగా తయారవుతున్నాయి. ఇప్పుడు కొంత లాభం రావడం కూడా మొదలయింది. మళ్లీ తన ఇల్లు అమర్చుకునే ఏర్పాట్లు మొదలుపెట్టాడు.

కాలక్రమేణా కావల్సినంత డబ్బు కూడబెట్టిన తర్వాత, ఒక స్నేహితుడిగా రాజు తనకు డబ్బు ఇచ్చినప్పటికీ, ఇప్పుడు తన పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉండడం వలన, రాజుకు ఆ డబ్బు కొద్ది, కొద్దిగా తిరిగి చెల్లించేయాలని అనుకున్నాడు.

అతను 500 నాణేలు తీసుకుని కోశాధికారి వద్దకు వెళ్లి, "దయచేసి ఈ నాణేలను మీ కోశాధికారంలో జమ చేయండి" అని అభ్యర్థించాడు. కోశాధికారి చేతులు జోడించి నిరాకరించాడు. " మీకు 500 నాణేలు ఇవ్వమని మాత్రమే నాకు ఆజ్ఞ ఉంది; మీ నుండి డబ్బు తీసుకునే హక్కు నాకు లేదు ఎందుకంటే అలాంటి ఆజ్ఞ నాకు ఇవ్వలేదు. మీకు కావాలంటే ఇక్కడ నుండి ఇంకొంత డబ్బు తీసుకోండి, కానీ మీరు ఇచ్చిన ఈ మొత్తాన్ని తీసుకుని జమ చేసుకోలేను"అన్నాడు.

ఇది విన్న వ్యాపారి చాలా ఆశ్చర్యపోయాడు. అతను ఆ నాణేలతో రాజాస్థానం చేరుకుని వాటిని రాజుకు ఇచ్చి, "మహారాజా, మీ దయతో ఇప్పుడు నా వ్యాపారం బాగా జరుగుతోంది! ఇప్పుడు నేను మీ నుండి అప్పుగా తీసుకున్న డబ్బును కొద్ది కొద్దిగా తిరిగి చెల్లించాలనుకుంటున్నాను, కానీ కోశాధికారి దానిని అంగీకరించడం లేదు", అన్నాడు.

అది విన్న రాజు చిరునవ్వు నవ్వి కోశాధికారితో ఇలా అన్నాడు: "ఇప్పుడు నా ఈ స్నేహితుడు నీ దగ్గరకు వచ్చి ఎంత డబ్బు అడిగినా, ఎలాంటి లెక్కా వేయకుండా, ఎలాంటి ఖాతా పెట్టకుండా తక్షణమే అతనికి ఇవ్వు." అని మళ్ళీ అన్నాడు.

రాజు అన్న ఈ మాటలు విని వ్యాపారి చాలా చాలా ఆశ్చర్యపోయాడు. అతను ముకుళిత హస్తాలతో ఇలా అడిగాడు, "మహాప్రభూ, నా ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నప్పుడు, నేను మీ సహాయం కోసం వచ్చాను, మీరు నాకు చాలా తక్కువైనా, నిర్ణీత మొత్తం ఇవ్వాలని ఆదేశించారు. అప్పుడు నిజంగానే వింతగా అనిపించింది. కానీ ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను, నా రుణాన్ని తిరిగి చెల్లించాలనుకుంటున్నాను, ఇప్పుడేమో అడిగినంత ధనాన్ని ఇవ్వమని మీరు ఆదేశిస్తున్నారు. నాకు ఎక్కువ  డబ్బు అవసరమైనప్పుడు, మీరు కేవలం చిన్న మొత్తాన్ని స్థిరంగా అందించారు. ఎందుకు అలా?"

రాజు చిరునవ్వు నవ్వి, "మిత్రమా, ఆ సమయంలో నేను నీకు చాలా డబ్బు ఇచ్చి ఉంటే, నీవు సోమరివైపోయి, పని చేయనవసరం లేదనుకుని, నీ భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేసిఉండేవాడివి. పని చేయని కారణంగా మరింత అధ్వాన్నమైన పరిస్థితికి దిగజారిపోయుండేవాడివి. కానీ నీకు పరిమితమైన మొత్తంలో డబ్బు ఇవ్వబడినప్పుడు, నీ పరిస్థితిని, మీ కుటుంబ పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి దాన్ని సరిగ్గా ఉపయోగించడం గురించి నీవు ఆలోచించావు. నీ అంతర్గత ప్రతిభను గుర్తించి, అంకితభావం, చిత్తశుద్ధితో పని చేయడం ప్రారంభించావు. నీ కుటుంబానికి అన్ని సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో ఉండడం వలన, నీ నైపుణ్యాలకు పదునుపెట్టుకుంటూ, అభివృద్ధి చెందడానికి ప్రయత్నించావు."

“మన జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతూ, ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మనలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నప్పుడు, మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం.
 
ఇప్పుడు నువ్వు కొరడాలను తయారు చేయడంలో చాలా నైపుణ్యాన్ని సాధించావు, ఇప్పుడు నీ వ్యాపారం బాగా సాగుతోంది...ఈ సమయంలో నీ వ్యాపారంలో ఎక్కువ డబ్బు పెట్టుబడి పెడితే, నీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి నీకు సరైన అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా నీ కష్టానికి సంబంధించిన పూర్తి ప్రయోజనాలను కూడా పొందుతావు", అన్నాడు, 
రాజు తన బాధలలో, కష్టాల్లో తనకు సహాయం చేయడమే కాకుండా... వాటిని అధిగమించడానికి అతనికి పుష్కలమైన అవకాశాలను ఇచ్చి, వాస్తవానికి ఒక నిజమైన స్నేహితుడి పాత్రను పోషించాడని, వ్యాపారి అర్థం చేసుకున్నాడు.
సంపూర్ణ విజయానికి బలమైన సంకల్పంతో పాటు సరైన మార్గాలు, సరైన మార్గదర్శకత్వం ఎంతో అవసరం. 🌼

బాబూజీ
హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన కేంద్రం

Sunday, 9 November 2025

ఉపరాష్ట్రపతి తొలి పర్యటన కర్ణాటకలో...

పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉపరాష్ట్రపతి  సి.పి. రాధాకృష్ణన్తన తొలి పర్యటనలో  కర్ణాటక వచ్చారు. 
కర్ణాటక గవర్నర్  ధావర్ చంద్ గెహ్లాట్, కేంద్ర మంత్రి  హెచ్.డి. కుమారస్వామి ఇతర ప్రముఖులు ఆయనకు బెంగళూరులో ఘన స్వాగతం పలికారు.ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా ఆయనకు గౌరవ వందనం కూడా సమర్పించారు.

Sunday, 2 November 2025

పారేసిన కాగితం నుంచి నోట్ బుక్ .. ఈ తాతకు పిల్లలే ఫ్యాన్స్

బెంగళూరు బ్యాంక్ కాలనిలో దినపత్రిక ఏజెంట్లు తమ పత్రికల బండల్లను విడదీస్తారు.. ఈ విధంగా విడదీసే టప్పుడు కట్ట మీద పలుచటి తెల్లని రంగు పేపర్లను తీసి పక్కన పడేసి పత్రికలను అమర్చుతారు.
అక్కడకు వయోవృద్ధుడైన ఒక వ్యక్తి వచ్చి క్రింద పడేసిన అన్ని తెల్లని రంగుల పేపర్లనూ సేకరించి తీసుకువెళతారు. 
 ప్రతిరోజూ ఈ విధంగా వేస్ట్ అని పడేసిన ఈ పేపర్లను తీసుకు వెళ్లి వాటిని నోటు పుస్తకాల కొలతలకు సరిపోయేలాగ కత్తిరించి వాటి నుండి వ్రాసే నోట్ బుక్ లను తయారు చేస్తారు, అనేక నోట్ బుక్ లను తయారు చేసి వీరు మైసూరు రోడ్డులో ఉన్న ప్రభుత్వపాఠశాలలలో పిల్లలకు ఉచితంగా పంచుతుంటారు. ఈయన కనపడితే చాలు పిల్లలు పరుగులు తీసుకుంటూ వచ్చి,, నోట్ బుక్ తాత అంటూ ముద్దాడతారు. ఈ పెద్దాయన  పేరు మోహన్. ఐ.టి.ఐ కంపెనీ ఉద్యోగి . పాఠశాల పిల్లలకు విశిష్టమైన మంచిపని చేస్తున్న ఇతడు నిజంగానే అందరికి ఆదర్శం.