చంద్రబాబును రాష్ట్ర ప్రజలే కాకుండా చిట్టచివరకు కుప్పం ప్రజలు కూడా ఛీ కొట్టిన బుద్ధి లేకుండా చంద్రబాబు తో పాటు తన పుత్రుడు లోకేష్ మరియు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ లు బుద్ధిలేని స్టేట్మెంట్స్ ఇస్తున్నారని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు శైలజా చరణ్ రెడ్డి మండిపడ్డారు
ఆడలేక మద్దెల దరువు అన్నట్టు వైఎస్ఆర్సిపి కి వస్తున్న ప్రజా బలాన్ని తట్టుకోలేక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన మరియు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని, ముందు తప్పులను సరి చేసుకొని క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు
అర్హతలేని వారిని ప్రజలు అందలం ఎక్కిస్తే అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకున్న దొంగలు సైతం పదవీ కాలం ముగిసిన కూడా ఈరోజు అహంకార పూరితమైన మాటలు మాట్లాడుతున్నారని ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా ఆమె హెచ్చరించారు.
చంద్రబాబు కుప్పం టూర్ ఫెయిల్యూర్ అయిందని చంద్రబాబు ఏ మారుమూల నియోజకవర్గం అయినా వెతుక్కోవాల్సిన దిగా శైలజ చరణ్ రెడ్డి సూచించారు
No comments:
Post a Comment