Saturday, 6 February 2021

👉మిత్రుని కష్ణం విని చలించిన ఎంఎల్.సి.రాజేశ్వరరెడ్డి... 👉సాయం అందజేత..నేనున్నా అంటూ బరోసా.....

ఖమ్మం...
స్నేహం అంటే భుజం మీద చేయివేసి నడవడమే కాదు..  నీకెన్ని కష్టాలు వచ్ఛినా నీ వెనుక  నేనున్నా అని తట్టి చెప్పడం.. ఈ మాటలనే ఆచరణలో చూపారు.. 
#పల్లా రాజేశ్వరరెడ్డి#

వివరాలోకి వెళితే..
 అనారోగ్యంతో బాధపడుతున్న చిన్ననాటి మిత్రుడు రంగా నారాయణ   పరిస్థితి తోటి మిత్రుల ద్వారా తెలుసుకున్న తెరాస ఎం.ఎల్.సి..పల్లా రాజేశ్వరరెడ్డి.. మిత్రుల ద్వారా..ఆర్థిక సాయం.అందజేసి స్నేహం విలువలను మరోమారు చాటారు..
రంగా నారాయణ...ఉన్నత కుటుంబంలో పుట్టి బాగా బతికిన నేపథ్యంలో.. సుమారు  8 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ రూపంలో వచ్ఛిన ఆపద  కేవలం మంచానికి పరిమితం చేసింది.
దీంతో ఆ కుటుంబం జీవనానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి..
తల్లి చెల్లెలు మాత్రమే వున్న నారాయణ ప్రమాదంతో శరీరకంగా..మనసికంగా..ఆర్థికంగా..కృంగిపోయాడు..ఇటీవలే తల్లి మరణించగా... ప్రస్తుతం.. తనకు..చెల్లెలికి వచ్ఛే ప్రభుత్వ పింఛన్ లతో అత్యంత ఇబ్బంది కరంగా ఖమ్మం నగరంలోని.. పిల్లిచిన్నక్రిష్ణ వీధిలో.. వాసవిగార్డన్ ఏరియాలో.. అద్దే గదిలో వుంటూ జీవనం గడుపుతున్నాడు..
రంగా నారాయణ విధ్యార్థి దశలో..పల్లా రాజేశ్వరరెడ్డితో  మౌంట్ ఫోర్డ్ స్కూలులో కలసి చదివారు ..గతంలో నారాయణ ఇబ్బందులు తెలుసుకున్న  పల్లా రాజేశ్వరరెడ్డి.. మిత్రుల.. ద్వారా కొంత మొత్తాన్ని  రెండు దఫాలుగా అందజేశారు.. కాగా.. శుక్రవారం మరోసారి మిత్రుల ద్వారా ఆర్థిక సాయం అందజేసి ధైర్యంగా వుండాలంటూ సందేశం పంపారు...గతంలో కూడా పలువురికి రాజేశ్వరరెడ్డి గారు ఇదే విధంగా తన అపన్నహస్తం అందించారని సన్నిహితులు పేర్కొన్నారు.

No comments:

Post a Comment