విజయనగరం:
ఆమేలో మనవత్వం పరిమళించింది..అన్ని వర్గాల అభినంధనలు అందుకుంటోంది
ఓ అనాథ శవాన్ని తరలించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తన భుజాలపై రెండు కిలోమీటర్లు మేర మోసుకుంటూ శిరీష వెళ్లారు. విషయం తెలుసుకున్న ఎస్సై శిరీషను డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. త్వరలో శిరీషకు ప్రశంసా పత్రాన్ని డీజీపీ అందజేయనున్నారు. కాశీబుగ్గ ఎస్సై శిరీష.. ఓ అనాథ శవాన్ని తన భుజాలపై మోసుకుంటూ నడిచారు. అంతేకాదు, ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించారు. ఆమె మానవత్వాన్ని ప్రశంసిస్తూ పలువురు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. శిరీషను తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు. ఆమె సేవలను కొనియాడుతూ సెల్యూట్ మేడమ్ అంటూ ట్వీట్ చేశారు. ఆడవాళ్ళు ఇంటికే పరిమితమని, ఇలాంటి పనులే చేయాలనే సమాజంలో... ఆమె ఎంచుకున్న వృత్తికి, వేసుకున్న యూనిఫారానికి, చేస్తున్న సేవకి సగర్వంగా సెల్యూట్ చేస్తున్నామని పేర్కొన్నారు.
కాశీబుగ్గ మున్సిపాలిటీ లోని 2 వ వార్డులో గల అడవికోత్తూరు పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని ఆనాధ మృతదేహన్ని ఎస్ఐ శిరీష కాశిబుగ్గ లలిత చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయంతో తన భుజాలపై పొలం గట్ల నుండి మోసుకొని రహదారి ప్రదేశానికి తీసుకు వచ్చారు.అనంతరం లలిత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దహన సంస్కారాలు నిర్వహించారు.
Inspiring 🙏👏
No comments:
Post a Comment