"శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య తిరు కల్యాణమహోత్సవములు"
స్వస్తిశ్రీ శార్వరి నామ సంవత్సర మాఘశుద్ధ సప్తమి శుక్రవారం నుండి మాఘబహుళ పాద్యమి ఆదివారం వరకు అనగా
ది.19.02.2021 నుండి ది.28.02.2021వరకు జరుగును.
© కార్యక్రమల వివరాలు ©
✓ 19.02.2021 శుక్రవారం రథసప్తమి :-
• సా౹౹ గం౹౹ 4.30 లకు "సూర్య వాహనము పై గ్రామోత్సవము.
• సా౹౹ గం౹౹ 6.30 ని౹౹లకు ధూపసేవ అనంతరం "ముద్రికాలంకరణ"(శ్రీ స్వామివారిని పెండ్లికుమారుని,అమ్మవారిని పెండ్లి కుమార్తెను చేయుట )అనంతరం "చంద్రప్రభ వాహనము" పై గ్రామోత్సవము.
✓ 20.02.2021 శనివారం అష్టమి :-
• సా౹౹ గం౹౹ 4.00 లకు "గరుడ పుష్పక వాహనము" పై గ్రామోత్సవము.
• రాత్రి 7 గం|| ని "పుష్పక వాహనము పై గ్రామోత్సవము.
✓ 21.02.2021 ఆదివారం నవమి :-
• సా౹౹ గం౹౹ 4.00 లకు "హంస వాహనము" పై గ్రామోత్సవము.
• రా౹౹ గం౹౹ 6:30 లకు థూపసేవ అనంతరం ధ్వజారోహణం అనంతరం "శేష వాహనము" పై గ్రామోత్సవము.
✓ 22.02.2021 సోమవారం దశమి :-
• సా౹౹ గం౹౹ 4.00 లకు "పంచముఖ ఆంజనేయస్వామి వాహనము" పై గ్రామోత్సవము.
• రాత్రి౹౹ గం౹౹ 8.00 లకు "కంచు గరుడ వాహనము" పై గ్రామోత్సవము అనంతరం
✓✓ రాత్రి౹౹ గం౹౹ 11:19 ని౹౹లకు ఆరుద్ర నక్షత్రయుక్త తులా లగ్న పుష్కరాంశమందు "శ్రీస్వామివారి తిరు కల్యాణ మహోత్సవము.✓✓
✓ 23.02.2021 మంగళ వారం ఏకాదశి ( భీష్మ ఏకాదశి ) :-
• మధ్యాహ్నం గం౹౹ 2.30 ని౹౹లకు "శ్రీస్వామివారి రధోత్సవము"
✓ 24.02.2021 బుధవారం ద్వాదశి :-
• సా౹౹ గం౹౹ 4.00 లకు "గజ వాహనము" పై శ్రీవారి గ్రామోత్సవము.
• సా౹౹ గం౹౹ 5.30 ని౹౹ల నుండి గం౹౹ 7.00 వరకు శ్రీస్వామివారి సన్నిధి శుద్ధి చేయుటకు గాను దర్శనములు నిలిపివేయబడును.
• రాత్రి 7.00 గం౹౹లకు "అన్నపర్వత మహానివేదన" అనంతరం దర్శనములు,"పొన్నవాహనము" పై గ్రామోత్సవము.
✓ 25.02.2021 గురువారం త్రయోదశి :-
• మ౹౹ గం౹౹ 4.00 లకు "హనుమద్వాహనము" పై శ్రీవారి గ్రామోత్సవము.
• సా౹౹ గం౹౹ 5.00 లకు "సదస్యం"
•సా౹౹ గం౹౹ 6.30 ని౹౹లకు ధూపసేవ అనంతరం, రాత్రి 7.00 గం౹౹లకు "సింహవాహనము" పై గ్రామోత్సవము.
✓ 26.02.2021 శుక్రవారం, చతుర్దశి:-
• సాయంత్రం 4 గంటలకు రాజాధిరాజ వాహనంపై గ్రామోత్సవం.
• రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై గ్రామోత్సవం. 16 స్థంభములు మండపం వద్ద "చోరసంవాదం"
✓27-02-2021 శనివారం, మాఘ పౌర్ణమి :- చక్రవారి,( సముద్ర స్నానం )
• ఉదయం గం౹౹ 8.30 లకు " పుష్పక వాహనము" పై శ్రీ స్వామివారి గ్రామోత్సవము"చక్రవారి" " అవభృధోత్సవము" సముద్ర స్నానం.
• రాత్రి "ధ్వజ అవరోహణ"
✓ 28.02.2021 ఆదివారం మాఘ బహుళ పాఢ్యమి :-
• సా౹౹ 4.00 గం౹౹లకు "పుష్పక వాహనము" పై గ్రామోత్సవము.
• సా౹౹ 6.00 గం౹౹లకు అంతర్వేది గ్రామ చెరువులో మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణతో చేసిన "హంస వాహనము" పై బ్రహ్మండమైన బాణసంచా కాల్పులతో శ్రీ స్వామివారి మరియు శ్రీ అమ్మవార్ల " తెప్పోత్సవము"
•రాత్రి 8.00 గం౹౹లకు ఉత్సవరులకు తిరుమంజనములు,దర్పణసేవ,ధూపసేవ,ద్వాదశతిరువారాధన,విష్వక్సేనఆరాధన, పుణ్యాహవచనం,"శ్రీ పుష్పోత్సవము"చేగోలం విన్నపము,తీర్ధగోష్ఠి,శ్రీ స్వామివారి పవళింపు సేవ.
No comments:
Post a Comment