Saturday, 10 July 2021

పూరిలో జగన్నాధుని రధయాత్ర....


ఆషాఢ మాసంలో ఒరిస్సాలోని పూరీ జగన్నాధుని రధాయత్ర చాల విశేషమైంది.జగత్తుకే నాధుడైన ఆ జగన్నాధుడు తానే కదలి వచ్చే ఈ అద్భుత యాత్ర -9రోజులు గుండీచ మందిరంలో జనుల పూజలందుకుని తిరుగు ప్రయాణమయే ఉత్సవం శోభాయమానంగా జరుగుతుంది -ఈ యాత్రని బహుదా యాత్ర అంటారు. విదేశీయులు ఎవరికీ  గుడి ప్రవేశ అర్హత లేదీ ఆలయంలో.ఇందిరాగాంధీ  పార్శీని పెళ్లి చేసుకున్నందుకు ఆమెనీ గుడిలోకి అనుమతించలేదని అంటారు. తన దగ్గరకు రాలేని భక్తులకి దర్శనమివ్వటానికి భగవంతుడే స్వయంగా బయటకు వస్తాడు. కులమత భేదాలు లేకుండా అందరూ ఇందులో పాల్గొనడం విశేషం - ఈ 9 రోజులలో బయటి కొచ్చిన దేముణ్ణి చూడడానికి దేశ,విదేశీభక్తులు  వేలాదిగా,లక్షలాదిగా వస్తారు.
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుధ్ధ విదియనాడు ప్రారంభమయ్యే ఈ యాత్ర జగన్నాధుని ఆలయానికి 3 కి.మీ. ల దూరంలో వున్న గుండిచా మందిరందాకా సాగుతుంది. భారీ రధాలలో బలరాముడు, సుభద్ర, జగన్నాధుని విగ్రహాలను ఊరేగిస్తూ తీసుకు వెళ్తారు. భక్తులు ఈ రధం తాళ్ళని లాగటానికి పోటీ పడతారు. ఆ సమయంలో పూరీ వీధులలో ఇసక వేస్తే రాలనంత జనం వుంటారు. ఈ రధ యాత్ర కోసమే ఆలయం ముందు వీధి అతి విశాలంగా వుంచారు. - 
ఈ రధాలలో ముందుగా బలభద్రుని రధం, తర్వాత సుభద్రది, చివరికి జగన్నాధుని రధాలు సాగుతాయి. ఈ రధాలు వరుసగా 45 అడుగులు, 44 అడుగులు, 43 అడుగులు ఎత్తు వుంటాయి. అలాగే రధాలకు 16, 14, 12 చక్రాలుంటాయి. రధయాత్రసాగే ముందు రాజు బంగారు చీపురుతో రధాలను శుభ్రం చేసి, ఆ దేవతలని యాత్రకి బయలుదేరమని ప్రార్ధించటం ఆనవాయితీ. భగవంతుని ముందు రాజు, పేద తేడాలేదని నిరూపిస్తుంది ఈ ఆచారం. మహారాజు రధయాత్రకు ముందు బంగారు చీపురుతో తుడిచాక రధాయత్ర ప్రారంభం అవుతుంది,పూరీ రధయాత్ర విశేషాలు చాలా ఉన్నాయి.
ఒరిస్సా రాజ వంశీకులు ఈ సేవను అత్యంత గౌరవప్రదమైనదిగా భావిస్తారు.రధాలు ఈ మూడు కిలోమీటర్ల దూరం దాటి గొండిచా ఆలయం చేరేసరికి సాయంకాలం అవుతుంది. లక్షలాది మంది భక్తులు  లాగుతుంటే, మధ్య మధ్యలో రధ చక్రాలు కదలనని మొరాయిస్తాయి. అపుడు వేలకొద్ది కొబ్బరి కాయలు కొడతారు. భక్తులంతా ఏక కంఠంతో చేసే భగవన్నామంతో భూమి దద్దరిల్లి పోతుందేమో అని అనిపిస్తుంది విగ్రహాలని ఏడు రోజులు గొండిచా ఆలయంలో వుంచి పూజలు, ఉత్సవాలు చేశాక ఏడవ రోజు తిరిగి జగన్నాధ ఆలయం చేరుకుంటారు. - 
ఏ అలయంలోనూ లేని విధంగా -అన్న,చెల్లెళ్ళ ప్రత్యెకత.జగన్నాధుడు,బలభద్రుడు,సుభద్రల  ఆలయం ఇది.అధిక ఆషాఢమాసం వచ్
వేప చెట్టుని వెదికి,వాటిని చెక్కించి పెట్టడం చాలా పెద్ద ప్రహసనం.ఆ చెట్లు ఎక్కడ దొరుకుతాయో -- -.ఆ వెళ్ళే బృందం నియమ నిష్టలతో ఎడ్ల బండి పై వెళ్ళాలి,మంగళాదేవి గుడిలో నిద్రించి నప్పుడు కలలో కనబడి మంగళాదేవి అనే దేవత చెబుతుంది అట,వీరికి తెల్లని పాము తోవ చూపుతుందిట.
ప్రతీ విగ్రహానికి ఒక్కో రకం పోలికలు ఉండాలి.వేప చెట్టు కాండం నల్ల రంగులో ఉండేది జగన్నాధునికి -దీనిపై శంఖు,చక్రాలు,నామం ఉండాలి.దగ్గరలో పాము పుట్ట ఉండాలి.చెరువుగానీ,సముద్రంగానీ ఉండాలి.గుడి ఉండాలి.)
బలభద్రుని విగ్రహానికి తెల్లని కఱ్ఱ కావాలి. దానిపై శంఖ చిహ్నం కనిపిస్తుంది. ఆ చెట్టుకు ఐదు శాఖలుంటాయి. జగన్నాధుని విగ్రహం తయారు చేసే కఱ్ఱమీద చక్రం చిహ్నం వుంటుంది. ఆ చెట్టుకు 7 శాఖలుంటాయి.పాము పుట్ట,గుడి,నీరు దగ్గరలో ఉండాలి.
ఇలా 4 రకాల చెట్లను వెదుకుతారు,జగన్నాధుడు,బలభద్రుడు,సుభద్ర ,సుదర్శనం ఇలా 4 విగ్రహాలు ..ఆయా చిహ్నాలు ఉండేవి చూసి పూజాదికాలు నిర్వహిస్తారు.
ప్రసాదాలు:జగన్నాదుడికి 54 రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. ప్రసాదంగా అన్నాదులను కుండలో మాత్రమే వండు.

No comments:

Post a Comment