Saturday, 29 January 2022
జాతరపై తెలంగాణ మంత్రుల క్లారిటీ.... ఏర్పాట్లపై సమీక్ష.. ఏరియల్ సర్వే... పాల్గొన్న సీతక్క...
Thursday, 27 January 2022
కధ బాగుంది కాని కలేక్టర్ కాదంటున్నారు... డౌటైతే కేరళోని మల్లపురం కలక్టరేట్ నెంబర్ ఇచ్ఛేశాం...
_*కలెక్టర్ మేడమ్ మీరు మేకప్ ఎందుకు వేసుకోరు ...?*_అంటు వివిధ బాషల్లో ప్రచారంలో వున్న కేరళలోని మల్లాపురం జిల్లా కలేక్టర్ కధ నిజం కాదని తెలుస్తోంది.. కాని ఆ కధ వాస్తావానికి దగ్గరగా వుండటంతో నెటిజన్లను ఆకట్టుకుంది.. దీంతో భారిగా షేరింగ్ అవుతోంది ఏది ఏమైనా ఇలాంటి కధలో నాయిక ఓ మంచి అధికారిగా వాస్తవంలో వుండే అవకాశం కొట్టిపారేయలేము...
మలప్పురం జిల్లా కలెక్టర్ మిస్ రాణి సోయామోయి కళాశాల విద్యార్థులతో సంభాషిస్తున్నారు.
ఆమె చేతి గడియారం తప్ప మరే ఇతర నగలు ధరించలేదు.
చాలా మంది విద్యార్థులను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, ఆమె ఫేస్ పౌడర్ కూడా ఉపయోగించలేదు.ప్రసంగం ఆంగ్లంలో ఉంది. ఆమె ఒకట్రెండు నిముషాలు మాత్రమే మాట్లాడింది, కానీ ఆమె మాటల్లో దృఢ నిశ్చయం ఉంది. అనంతరం చిన్నారులు కలెక్టర్‌ను కొన్ని ప్రశ్నలు అడిగారు.
ప్ర: మీ పేరు ఏమిటి?
నా పేరు రాణి, సోయామోయి నా ఇంటి పేరు. నేను జార్ఖండ్ వాసిని.
ఇంకేమైనా అడగాలా?
ఒక సన్నని అమ్మాయి ప్రేక్షకుల నుండి లేచి నిలబడింది.
అడగండి..
"మేడమ్, మీరు ఎందుకు మేకప్ వేసుకోరు?"
కలెక్టర్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె సన్నటి నుదుటి మీద చెమట కారింది. ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైంది. ప్రేక్షకులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తెరిచి కొంచెం నీళ్లు తాగింది. తర్వాత విద్యార్థిని కూర్చోమని నెమ్మదిగా సైగ చేసింది. అప్పుడు ఆమె నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించింది.
మీరు ఇబ్బందికరమైన ప్రశ్న అడిగారు. ఇది ఎప్పటికీ ఒక్క మాటలో సమాధానం చెప్పలేని విషయం. దానికి సమాధానంగా నా జీవిత కథ మీకు చెప్పాలి. నా కథ కోసం మీ విలువైన పది నిమిషాలు కేటాయించడానికి మీరు సిద్ధంగా ఉంటే నాకు తెలియజేయండి.
సిద్ధమే అన్నట్టు స్పందన వచ్చింది.
నేను జార్ఖండ్‌లోని గిరిజన ప్రాంతంలో పుట్టాను. కలెక్టర్ ఆగి పిల్లల వైపు చూసింది.
నేను కోడెర్మా జిల్లాలోని "మైకా" గనులతో నిండిన గిరిజన ప్రాంతంలో చిన్న గుడిసెలో పుట్టాను.మా నాన్న, అమ్మ మైనర్లు. నాకు ఇద్దరు అన్నలు మరియు ఒక చెల్లెలు ఉన్నారు. వర్షం పడితే కారుతున్న చిన్న గుడిసెలో మేము నివసించేవారం.వేరే ఉద్యోగం దొరక్కపోవడంతో నా తల్లిదండ్రులు తక్కువ జీతానికి గనుల్లో పనిచేసేవారు. ఈ పని చాలా దారుణం గా ఉంటుంది. నాకు నాలుగేళ్ల వయసులో మా నాన్న, అమ్మ, ఇద్దరు అన్నదమ్ములు రకరకాల జబ్బులతో మంచం పట్టారు.గనుల్లోని ప్రాణాంతక మైకా ధూళిని పీల్చడం వల్లే ఈ వ్యాధి వస్తుందని అప్పట్లో వారికి తెలియదు.నాకు ఐదేళ్ల వయసులో మా అన్నలు అనారోగ్యంతో చనిపోయారు.
చిన్న నిట్టూర్పుతో కలెక్టర్ మాట్లాడటం ఆపి, రుమాలుతో ఆమె కళ్ళు తుడుచుకున్నారు. చాలా రోజులు మా ఆహారంలో నీరు మరియు ఒకటి లేదా రెండు రోటీలు ఉంటాయి. నా సోదరులిద్దరూ తీవ్రమైన అనారోగ్యం మరియు ఆకలితో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కరెంటు, పాఠశాల, ఆసుపత్రి, మరుగుదొడ్డి లేని గ్రామాన్ని మీరు ఊహించగలరా? .
ఒకరోజు నాన్న నన్ను పట్టుకున్నప్పుడు
ఆకలితో,ఎండిపోయిన నా చర్మం, ఎముకలాంటి నా చేతిని పట్టుకున్న నాన్నతో కలిసి టిన్ షీట్లతో కప్పబడిన ఒక పెద్ద గని వద్దకు పనికోసం వెళ్ళాను. కాలక్రమేణా ఖ్యాతి గడించిన మైకా గని.అది ఒక పురాతన గని,తవ్వి, తవ్వి, పాతాళం వరకు విస్తరించింది.దిగువన ఉన్న చిన్న చిన్న గుహల గుండా వెళ్లి మైకా ఖనిజాలను సేకరించడం నా పని. పదేళ్లలోపు పిల్లలకు మాత్రమే సాధ్యమైయ్యేది.నా జీవితంలో మొదటి సారి కడుపు నిండా రోటీలు తిన్నాను. కానీ ఆ రోజు నేను వాంతి చేసుకున్నాను. నేను ఫస్ట్ క్లాస్‌లో ఉండాల్సిన సమయంలో, నేను విషపూరిత దుమ్ము పీల్చుకునే చీకటి గదులలో మైకాను సేకరిస్తున్నాను. అప్పుడప్పుడు కొండచరియలు విరిగిపడటంతో దురదృష్టవంతులైన పిల్లలు చనిపోవడం,అప్పుడప్పుడు కొందరు ప్రాణాంతక వ్యాధులతో చనిపోవడం అక్కడ సర్వసాధారణం. రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తే ఒకసారి భోజనానికి సరిపడా సంపాదించవచ్చు. ప్రతిరోజు విషపూరిత వాయువులను పీల్చడం, ఆకలి కారణంగా నేను సన్నగా మారాను. ఒక సంవత్సరం తర్వాత మా చెల్లి కూడా గనిలో పనికి వెళ్లడం ప్రారంభించింది. అలా నాన్న, అమ్మ, చెల్లి, నేను కలిసి పనిచేసి ఆకలి లేకుండా బతకగలం అనే స్థితికి వచ్చాము.
కానీ విధి మరో రూపంలో మమ్ముల్ని వెంటాడడం ప్రారంభించింది. ఒకరోజు నేను విపరీతమైన జ్వరంతో పనికి వెళ్ళనప్పుడు, అకస్మాత్తుగా వర్షం కురిసింది. గని బేస్‌లో ఉన్న కార్మికులపై గని కూలిపోవడంతో వందలాది మంది చనిపోయారు. వారిలో నాన్న, అమ్మ, చెల్లి ఉన్నారు.కలెక్టర్ రాణికి రెండు కళ్లలోనూ కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. ప్రేక్షకులంతా ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయారు. చాలా మంది కళ్లలో నీళ్లు తిరిగాయి.అప్పుడు నాకు ఆరేళ్లు మాత్రమే
చివరికి ప్రభుత్వ అనాధ ఆశ్రమానికి వచ్చాను. అక్కడ నేను చదువుకున్నాను. నేను నా మొదటి వర్ణమాలలను మా గ్రామం నుండి నేర్చుకున్నాను. ఇప్పుడు కలెక్టర్ గా మీ ముందు ఉన్నాను.
నేను మేకప్ ఉపయోగించక పోవడానికి దీనికి మధ్య సంబంధం ఏమిటని మీరు ఆశ్చర్యపోవచ్చు.ఆమె ప్రేక్షకులను చూస్తూ చెప్పడం కొనసాగించింది.
ఆ రోజుల్లో చీకట్లో పాకుతూ సేకరించిన మైకా మొత్తం మేకప్ ఉత్పత్తుల కోసం వినియోగిస్తున్నారని నేను చదువుకొనే సమయంలోనే తెలుసుకున్నాను. మైకా అనేది ముత్యాల సిలికేట్ ఖనిజంలో మొదటి రకం. పెద్ద పెద్ద కాస్మెటిక్ కంపెనీలు అందించే మినరల్ మేకప్‌లలో, 20,000 మంది చిన్నపిల్లలు తమ ప్రాణాలను పణంగా పెట్టిన బహుళ-రంగు మైకా మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.కాలిపోయిన కలలతో, ఛిద్రమైన జీవితాలతో, శిలల మధ్య నలిగిన మాంసాలతో, రక్తాలతో గులాబీ మెత్తదనం మీ చెంపల మీద విస్తరిస్తుంది. మిలియన్ల డాలర్ల విలువైన మైకా ఇప్పటికీ ఉపయోగించబడుతుంది, గనుల నుండి శిశువు చేతులను కైవసం చేసుకుంది. మన అందాన్ని పెంచుకోవడానికి. ఎంతోమందిని బలిగొన్న,
నలిగిన పిల్లల చేతుల నుండి వచ్చి మన అందాన్ని పెంచుకోవడానికి వచ్చిన ఈ మేకప్ ని నేను నా ముఖానికి ఎలా వేసుకోవాలి? ఆకలితో మరణించిన నా సోదరుల జ్ఞాపకార్థం నేను కడుపునిండా ఎలా తినగలను? ఉన్నన్నాళ్లు చిరిగిన బట్టలతో గడిపిన మా అమ్మను స్మరిస్తూ నేను ఖరీదైన పట్టు వస్త్రాలు ఎలా ధరించగలను? రాణి పెదవులపై చిరునవ్వుతో, కళ్లలోని కన్నీళ్లు తుడుచుకోకుండా, తల నిమురుతూ వెళ్లిపోతుంటే ప్రేక్షకులంతా తెలియకుండానే లేచి నిలబడ్డారు.
(జార్ఖండ్‌లో ఇప్పటికీ అత్యంత నాణ్యమైన మైకాను తవ్వుతున్నారు. 20,000 కంటే ఎక్కువ మంది చిన్నారులు పాఠశాలకు వెళ్లకుండానే అక్కడ పని చేస్తున్నారు. అనేక మంది చనిపోతున్నారు కొండచరియలు విరిగిపడటం, కొన్ని వ్యాధుల కారణంగా)
ప్రొఫెసర్ పాతూరి సీతారామంజనేయులు గారు ఇంగ్లీష్ లో పంపిన సందేశానికి
తెలుగు అనువాదం నా మిత్రుడు
*-అభినయ శ్రీనివాస్* చేసారు...
నేను చదివిన తర్వాత మీకోసం సమర్పిస్తూ..
మీ *రంగినేని మహేంద్ర*
I read in a message about Rani Soyamoyi IAS.
She narrated her story during an interaction with students in a school when she was District Collector, Malappuram. A student was curious about her not so attractive dress, not wearing any ornaments and absolute absence of makeup. She said :
“I was born in a tribal district in Jharkhand to parents who were working in Mica Mines. Mines engage child labour and I started working in the mines from age 5. We lived in abject poverty. No electricity, no toilets. Parents, my elder brother, me and my sister lived in a small hut not protected even from rains. My brother became sick and inadequate food and absence of medical attention resulted in his death. When my younger sister became 5, she also started working with us in the mica mines. We started earning enough for our survival.
One day, I remained at home as I had a fever. That day, when my parents and sister were still inside the Mines, there was a flood and landfall inside the Mines and in the accident, over 100 workers including my parents and sister lost their lives.
As the only surviving child in the family, I reached a government orphanage where I got an opportunity to go to school. Now, I am standing before you.
Tell me, how I will wear an attractive dress and jewellery or use cosmetics made from mica collected from Mines by thousands of kids who starve and work when they should be in school?”
ప్రస్తుతం మణప్పురం కలెక్టర్ V.R.Premkumar IAS గారు. సామాజిక మాధ్యమంలో రాణి నయోమోయి అనే ఝార్ఖండ్ అమ్మాయి గురించిన ఒక కథనం విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం లేదు...Collector mallapuram +91 483 273 4355
Wednesday, 26 January 2022
మహాత్మా గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
Tuesday, 25 January 2022
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం- రావత్‌కు పద్మ విభూషణ్
Sunday, 23 January 2022
కిక్కిరిసిన మేడారం.. కరోనా భయంతో ముందస్తుగా మొక్కులు....
మేడారం: మేడారం:ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి మహాసమ్మేళనంగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ఇంకా నెల రోజులు సమయం ఉండగానే భక్తులు పోటెత్తుతున్నారు. జాతర సమయంలో రద్దీ, కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా చాలా మంది భక్తులు ముందుగానే అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు.
ప్రస్తుతం సంక్రాంతి సెలవులు కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం చేరుకొని గంటల తరబడి క్యూలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కుటుంబ సమేతంగా పసుపు, కుంకుమలతో వన దేవతలకు పూజలు చేసి బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చల్లంగా చూడు తల్లీ అంటూ వేడుకుంటున్నారు._ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో మేడారం పరిసరాలు రద్దీగా మారుతున్నాయి. దర్శనాల అనంతరం పరిసర ప్రాంతాల్లో వంటలు చేసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. మరోవైపు కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. భక్తులు నిబంధనలు పాటించాలంటూ మైకుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్లు పెంచడం సహా భక్తులు ఎక్కువసేపు క్యూలో ఉంచకుండా త్వరగా అమ్మవార్ల దర్శనం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతునమ ఆదివారం మేడారం పరిసరాలు కిక్కిరిసిపోయాయి భక్తులు వేలాదిగా తరలివచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. మహాజాతరకు ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. కల్యాణ కట్టల వద్ద తలనీనాలు సమర్పించుకున్నారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ఐటీ కమిషనర్ బాలకృష్ణ, బీజేపీ నాయకుడు తీన్మార్ మల్లన్న వనదేవతలను దర్శించుకున్నారు. ఆదివారం ఒక్కరోజే మూడు లక్షలకు పైగా భక్తులు మేడారాన్ని సందర్శించారని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.Thursday, 20 January 2022
ఫిబ్రవరి 16 నుంచి మేడారం మహాజాతర
మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతరకు సర్వం సిద్ధం అవుతోంది.
ములుగు (డీ) తాడ్వాయి మండలంలో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర జరగనుంది.
కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా.
ఫిబ్రవరి 16 న సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులను గద్దెలకు తీసుకొస్తారు.
17 న చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెల దగ్గరకు తీసుకొస్తారు.
18 న సమ్మక్క - సారలమ్మలకు ప్రజలు మొక్కులు చెల్లిస్తారు.
19 న అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.
Saturday, 8 January 2022
మానవత్వం చాటిన భారతసైన్యం.. పాక్ బార్డర్ గ్రామస్తుల జేజేలు...
Wednesday, 5 January 2022
తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్నపావురం ..చైనా ట్యాగ్ వార్తలు.. సోషల్ మీడియా లో వైరల్ కోసమేనా నిజం ఎంత..?
Monday, 3 January 2022
జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుక
ఖమ్మం : జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకను నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా రిజిస్ట్రార్ చిట్టి మళ్ల అశోక్ నూతన సంవత్సర కేక్ కట్ చేసి సిబ్బందితో ఆనందాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం . సబ్ రిజిస్ట్రార్ -1, అడప రవీందర్, రిజిస్ట్రార్ -2 రాజేశం, రిజిస్టర్ ఆఫ్ చిట్సు: నరేందర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు