Saturday, 8 January 2022

మానవత్వం చాటిన భారతసైన్యం.. పాక్ బార్డర్ గ్రామస్తుల జేజేలు...

కాశ్మీర్ మంచుకొండల్లో మంచు వెల్లువెత్తిన వెళ్ల 
 సైన్యం  మానవత్వంతో  ఆపన్నులను ఆదుకుంటోంది   .లోలాబ్ లోయలోని సుదూర ప్రాంతాలకు ప్రకృతి వైపరీత్యాలు ఎల్లప్పుడూ తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి. అటువంటి పరీక్షా సమయాల్లో ఈ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయాన్ని అందించడంలో భారతీయ సైన్యం ఎల్లప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తుంది.ఒక వైపు విపత్తు సహాయంలో వుంటునే మానవత్వంతో పౌరులకు బరోసాగా నిలుస్తున్నాయి భారత సైనిక బలగాలు..సంఘటనలలో జోరావర్ గారిసన్, నార్త్ లోలాబ్‌లోని తరియన్ గ్రామానికి చెందిన గర్భిణీ తల్లికి ఆకస్మిక ప్రసవ నొప్పి రావడంతో వారికి సాయం అందించేందుకు భారత సైన్యం ముందుకు వచ్చింది.  మంచు కురుస్తున్న కారణంగా  ఈ గ్రామంలో ఎటువంటి పౌర రవాణా అందుబాటులో లేకపోవడంతో మహిళ & ఆమె కుటుంబం బాధలో ఉన్నారు.బార్డర్   గ్రామం అయిన ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న అబ్దుల్ హమీద్ భార్య  హనీఫా బేగంకు భారత సైన్యం సహాయం అందించింది, ఆమె ప్రసవ నొప్పితో సకాలంలో ఆసుపత్రికి తరలించడానికి సహాయం చేసింది. జోరావర్ గారిసన్, గుజ్జర్‌పట్టి సైనికులు విపరీతంగా మంచు కురుస్తు అననూకూల వాతావరణంలో ఆ మహిళను స్ట్రెచర్‌పై ఎక్కించి, దాదాపు 6 కి.మీల వరకు తీసుకుని వెళ్లి సుమో వాహనాన్ని ఏర్పాటు చేసి  వైధ్యం  కోసం ఆసుపత్రికి తరలించారు.దీంతో ఆ గ్రామం భారత సైనికులకు జేజేలు పలికారు.ఆమె భర్త & కుటుంబ సభ్యులు కృతజ్ఞతతో  సైనికులను ఆలింగనం చేసుకున్నారు.. భారత సైన్యం యొక్క మానవతా ప్రయత్నాలను అన్ని వర్గాల నుండి ప్రశంసలు కురుస్తున్నాయి.

No comments:

Post a Comment