Sunday, 23 January 2022

కిక్కిరిసిన మేడారం.. కరోనా భయంతో ముందస్తుగా మొక్కులు....


మేడారం: మేడారం:ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి మహాసమ్మేళనంగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ఇంకా నెల రోజులు సమయం ఉండగానే భక్తులు పోటెత్తుతున్నారు. జాతర సమయంలో రద్దీ, కొవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా చాలా మంది భక్తులు ముందుగానే అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. 

ప్రస్తుతం సంక్రాంతి సెలవులు కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం చేరుకొని గంటల తరబడి క్యూలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కుటుంబ సమేతంగా పసుపు, కుంకుమలతో వన దేవతలకు పూజలు చేసి బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చల్లంగా చూడు తల్లీ అంటూ  వేడుకుంటున్నారు._ఉమ్మడి వరంగల్‌ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో మేడారం పరిసరాలు రద్దీగా మారుతున్నాయి. దర్శనాల అనంతరం పరిసర ప్రాంతాల్లో వంటలు చేసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. మరోవైపు కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. భక్తులు నిబంధనలు పాటించాలంటూ మైకుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్లు పెంచడం సహా భక్తులు ఎక్కువసేపు క్యూలో ఉంచకుండా త్వరగా అమ్మవార్ల దర్శనం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతునమ ఆదివారం మేడారం పరిసరాలు కిక్కిరిసిపోయాయి భక్తులు వేలాదిగా తరలివచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. మహాజాతరకు ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. కల్యాణ కట్టల వద్ద తలనీనాలు సమర్పించుకున్నారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ఐటీ కమిషనర్ బాలకృష్ణ, బీజేపీ నాయకుడు తీన్మార్ మల్లన్న వనదేవతలను దర్శించుకున్నారు. ఆదివారం ఒక్కరోజే మూడు లక్షలకు పైగా భక్తులు మేడారాన్ని సందర్శించారని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment