ఖమ్మం , ఏప్రిల్ 17 : స్థానిక హక్కారా బావి సెంటర్ వద్ద ఉన్న క్రియేటివ్ గ్రామర్ స్కూల్ ఫేర్వెల్ డే వేడుకగా జరిగింది. పదవ తరగతి విద్యార్థులకు జూనియర్ టెన్త్ విద్యార్థులు వీడ్కోలు పలుకుతూ వేడుకలు జరిపారు. ఇన్ని సంవత్సరములు గా తమతో కలిసి మెలిసి ఉండి పాఠశాలను వదిలి వెళ్తున్న పదవతరగతి విద్యార్థులకు జూనియర్లు తమ ఆప్యాయతను, అనుబంధాన్ని చాటి జ్ఞాపికలు అందించారు. వేదికపై పదవ తరగతి విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బి.కమలాకర్, డైరెక్టర్ కౌశిక్ లు అతిథులుగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు వసంత,మేఘన, ఉపాధ్యాయులు సంధ్యా రాణి,వినీల్, గోపాల క్రిష్ణ, రామారావు, గాయత్రి,సత్యవతి తదితరులు పాల్గొన్నారు. సభానంతరం విద్యార్థులు ప్రదర్శించిన జానపద, గిరిజన, పాశ్చాత్య డాన్సులు అందరిని ఉర్రూతలూగించాయి. తీర్ధాల స్పందన బృందం ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఫేర్వెల్ డే ను పాఠశాల డైరెక్టర్లు కౌశిక్, మేఘన పర్యవేక్షించారు.
Monday, 18 April 2022
నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవనం నుండే పౌర సేవలు..
KHAMMAM/18.04.2022
___________________________
◆ సకల సౌకర్యాలతో సిద్దం.
◆ 4ఎకరాల సువిశాలమైన స్థలంలో రూ.22కోట్లతో నిర్మాణం.
◆ డివిజన్లో చెత్త సేకరణకై మినీ వ్యాన్(15), ట్రాక్టర్లు(10) ప్రారంభించిన మంత్రి పువ్వాడ.
◆ పౌర సేవల ఇక నుండి నూతన కార్యాలయం నుండి పొందాలని మంత్రి విజ్ఞప్తి.
ఖమ్మం నగర ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందించేందుకు రూ.22 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయం భవనం నుండే నేటి నుండి పౌర సేవలు అందుబాటులో ఉంటాయని, వాటిని ప్రజలు సద్వినియోగంగించుకొవవాలని ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని డివిజన్లో చెత్త సేకరణకై మినీ వ్యాన్(15), ట్రాక్టర్లు(10) ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి గారిని తన కార్యలయంను అధికార స్థానంలో కూర్చోబెట్టారు. పౌర సేవలకు ఇబ్బంది కలుగకుండా నిత్యం అందుబాటులో అంటు ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ నందు నిర్వహించనున్న పార్టీ ప్లీనరీ నిర్వహణ పూర్తి బాధ్యతలు మంత్రి కేటిఆర్ గారు నిర్వర్తిస్తూన్నందున ఖమ్మం పర్యటన వాయిదా పడిందని, పూర్తి స్థాయి కార్యలయంను మంత్రి కేటిఆర్ గారి చేతుల మీదగా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా నగర ప్రజలకు పౌర సేవలను చేరువచేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఅర్ గారు, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ గారి సహకారంతో నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవనంను నిర్మించడం జరిగిందన్నారు.
అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నిర్మించామన్నారు. ఖమ్మం బోనగర నడిబొడ్డున 4ఎకరాల సువిశాలమైన స్థలంలో ముఖ్యమంత్రి వాగ్దాన నిధులు రూ.22కోట్లతో రాబోయే తరాలకు సరిపోయే విధంగా అన్ని వసతులతో కార్యలయం తీర్చిదిద్దామని వివరించారు.
ప్రత్యేక డిజైన్‌తో ఉద్యోగులు, ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామన్నారు.
సుమారు 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాల ప్రాంగణంలో కార్యాలయంను నిర్మించనున్నారు.
కౌన్సిల్ సమావేశాల నిమిత్తం 150 మంది కూర్చునేందుకు విశాలమైన పెద్ద హల్, డ్యుయల్ కుషన్ సీటింగ్, అధునాతన సౌండ్ సిస్టమ్ , సెంట్రల్ ఏసీ తదితర సౌకర్యాలతో ఎర్పాటు చేసినట్లు చెప్పారు.
గ్రేటర్ హైద్రాబాద్ తరువాత అంతటి విశాలమైనది ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయ భవనం అని వెల్లడించారు.
ఇక నుండి మున్సిపాలిటీకి సంబందించిన ప్రతి సేవలు నూతన మున్సిపల్ భవనం నుండే పొందాలని ప్రజలను కోరారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ VP గౌతం గారు, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార గారు, సుడా చైర్మెన్ బచ్చు విజయ్ గారు, AMC చైర్మన్ లక్ష్మిప్రసన్న గారు, మున్సిపల్ అధికారులు & సిబ్బంది, కార్పొరేటర్లు ఉన్నారు.
Sunday, 17 April 2022
వైరల్ అయిన రాష్ట్రపతి కుమార్తె ఫోటోలు..
ఫోటోలో చీర కట్టులో వినమ్రంగా నమస్కరిస్తు స్వాగతం పలుకుతున్న ఆమె పేరు స్వాతి , ఎయిర్ ఇండియా లో కేబిన్ అసిస్టెంట్ ( వాడుక భాషలో ఎయిర్ హోస్టెస్ ) గా వారి బోయింగ్ 777 విమానాలలో చాల రోజులు పనిచేసి ఈ మధ్యే వారి హెడ్ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేయబడ్డారు.
అయితే ఏంటి గొప్ప అని అంటారా, ఆ ఐదడుగుల నాలుగంగుళాల అమ్మాయి పూర్తి పేరు స్వాతి కోవింద్ . ఏంటి ఆశ్చర్య పోయారా మీరు అనుకుంటున్నది నిజమేనండీ ఆ అమ్మాయి మన రాష్ట్రపతి శ్రీ రామనాథ్ కోవింద్ గారి కూతురు.
నిన్న మొన్నటి దాకా ఆ అమ్మాయి రాష్ట్రపతి గారి కూతురని తన మిత్రులకు కూడా తెలియదు , రాష్ట్రపతి గారు కూడా ఏనాడూ తన కూతురి గురించి ఎక్కడా చెప్పుకోలేదు లేదా ఆవిడకు ప్రమోషన్లు ఇప్పంచడానికి పైరవీలు చేయలేదు , నేను రాష్ట్రపతి అయ్యాక కూడా నీవు ఆ చిన్న వుద్యోగం చేయడం ఏమిటి అంటూ మానేయమని అడగలేదు. ఆ అమ్మాయి యొక్క ఆత్మాభిమానాన్ని గౌరవిస్తూ తనకు నచ్చిన వుద్యోగం చేసే స్వేచ్ఛ ఇచ్చారు ఆ తండ్రి.
ఈ మధ్య ఎయిర్ ఇండియా ని టాటా లకు అమ్మేసే క్రమం లో మొత్తం ఉద్యోగుల బయో డేటా అంతా బయటికి తీస్తే ఈ విషయం బయటపడింది. అప్పుడు టాటా వారు ఆ అమ్మాయిని ఎయిర్ హోస్టెస్ డ్యూటీ నుండి తప్పించి వారి హెడ్ ఆఫీస్ లో టేబుల్ డ్యూటీ వేశారు.దీంతో ఈ ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి...
Friday, 15 April 2022
18 న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు జరిగే పౌర సన్మానం జయప్రదం చేయండి. 200 ల కార్ల తో భారీ ప్రదర్శన
*ది.15.04.22*
*ఖమ్మం*
*ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపు* ....
*విలేకరుల సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిన్ని కృష్ణారావు,ప్రజాసంఘాల కన్వీనర్ షేక్.అప్జల్ హసన్,పౌరసేవా సమితి అధ్యక్షులు పులిపాటి ప్రసాద్* ....
ఈ నెల 19 న
జిల్లా అభివృద్ధి ప్రధాత రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా 18న ఖమ్మం నగరం గాంధీ చౌక్ కూడలి లో ఛాంబర్ ఆఫ్ కామర్స్,ఉద్యోగ జేఏసీ,
ప్రజా సంఘాల భాగస్వామ్యం తో పౌర సమితి ఆధ్వర్యంలో
*పౌర సన్మానం* నిర్వహించనున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిన్ని కృష్ణారావు,ఉద్యోగ జేఏసీ మరియు ప్రజా సంఘాల కన్వీనర్ షేక్.అప్జల్ హసన్,పౌరసేవా సమితి అధ్యక్షులు డాక్టర్ పులిపాటి ప్రసాద్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.ఖమ్మం నగరంలోని త్రీ టౌన్ ప్రాంతంలో ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల19 న సీఎం కేసీఆర్ ను మంత్రి కలిసి యాదాద్రి నరసింహస్వామి ఆలయం కు కేజీ బంగారం ను వితరణ చేయనున్నట్లు చెప్పారు.ఈ నెల 18 న నయా బజార్ సెంటర్ నుంచి పీఎస్ఆర్ రోడ్డు మీదుగా గాంధీ చౌక్ వరకు 200 ల వాహనాలతో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు.రాజకీయాలకు అతీతంగా జరిగే పౌర సన్మానంకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఖమ్మం జిల్లాను రూ.15 కోట్ల నిధులు వెచ్చించి మంత్రి ఆధునికరించడమే కాకుండా అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారని అన్నారు.ఛాంబర్ ఆఫ్ కామర్స్,హమాలి, త్రీ టౌన్ ప్రజల విజ్ఞప్తి మేరకు
వ్యవసాయ మార్కెట్ ను వేరే ప్రాంతం కు తరలించకుండా మంత్రి పువ్వాడ అజయ్ నిలుపుదల చేయడంలో కీలక పాత్ర వహించారన్నారు.అదేవిధంగా గోళ్లపాడు ఛానల్,లకారం ట్యా0క్ బండ్,మ్యూజికల్ ఫౌంటెన్,తీగల వంతెన,వాక్ వే లను ఏర్పాటు చేసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనదైన అభివృద్ధి ముద్ర వేశారని చెప్పారు.టీఎన్జీవో,టీజీవో,పంచాయతీ రాజ్,డ్రైవర్ల సంఘం,నాల్గవతరగతి ఉద్యోగులు,ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మంత్రి అజయ్ కుమార్ కు జరిగే పౌర సన్మానం ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు కొప్పు నరేష్,జనరల్ సెక్రెటరీ గోడవర్తి శ్రీనివాసరావు, కిరాణా జాగిరి మార్చంట్స్ అసోసియేషన్ వేములపల్లి వెంకటేశ్వర్లు,కోశాధికారి తూములూరి లక్ష్మీ నరసింహారావు,
ఉపాధ్యక్షులు
పత్తి పాకా రమేష్,సహాయ కార్యదర్శి కురువెళ్ల కాంతారావు,వెండి,బంగారం అధ్యక్ష,కార్యదర్శులు బంధు సూర్యం,సతీష్,
మన్నెం కృష్ణ,టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.వి.ఎస్ సాగర్,
డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షులు హకీమ్,జానిమియా,నాల్గవతరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోడి లింగయ్య లు పాల్గొన్నారు.
19న చాంబర్ అఫ్ కామర్స్, పౌరసమితి ల ఆధ్వర్యంలో మంత్రి అజయ్ కుమార్ కు సన్మానం..
ఖమ్మం... చాంబర్ అఫ్ కామర్స్ పౌరసమితి పౌర సమితి అన్ని సంఘాల అధ్యర్యంలో ఈ నెల 18నా భారీ ర్యాలీ ఈ నెల 19రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పుట్టినరోజు సందర్బంగా గాంధి చోక్ సెంటర్ లో సన్మానం నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు ఖమ్మం నియోజకవర్గ ప్రజల తరుపున ఒక కిలో బంగారం యాదాద్రి గుడి ఇస్తున్న రాని తెల్పిన చంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు చిన్ని కృష్ణరావు పౌర సమితి అధ్యక్షుడు పులిపాటి ప్రసాద్ గోడ వర్తి శ్రీను వేముల పల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు..
Thursday, 14 April 2022
శ్రీ సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి..సర్వాంగ సుందరంగా ఒంటిమిట్ట ఆలయ పరిసరాలు
ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్ 14: ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 15వ తేదీ శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒంటిమిట్ట ఆలయ ప్రాంగణం కల్యాణమహోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాభై.. విద్యుత్ కాంతుల మిలమిలల శోభయమానంగా వుంది.
రేపు ఆ కోదండరామునికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సీఎం జగన్ సమర్పిస్తారని
టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. ఒంటిమిట్టలోని రామాలయం, కల్యాణవేదిక వద్ద జరుగుతున్న పనులను గురువారం ఈవో, జిల్లా కలెక్టర్ శ్రీ విజయరామరాజు, ఎస్పీ శ్రీ అన్భురాజన్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడారు, శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సాంప్రదాయ బద్ధంగా ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సమర్పించనున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్, ఎస్పీల పర్యవేక్షణలో టిటిడిలోని అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తుల కోసం సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. శోభాయమానంగా కల్యాణవేదిక తీర్చిదిద్దుతున్నామన్నారు. లక్ష మందికి పైగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండటంతో రాజీకి తావు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తులందరికీ అక్షింతలు, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తామని వెల్లడించారు. టిటిడి, జిల్లా యంత్రాగంతో సమన్వయం చేసుకుని పటిష్టమైన క్యూలైన్లు, బారికేడ్లు, పార్కింగ్, బందో బస్తు ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు కోసం శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఎస్వీబిసి ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. ఆర్‌టిసివారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ఒంటిమిట్టకు బస్సులు ఏర్పాటు చేశారని చెప్పారు. కల్యాణం తర్వాత భక్తులు తిరిగి వెళ్లేందుకు ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.అంతకుముందు ఈవో కల్యాణ వేదిక పరిసరాలు, ప్రవేశ మార్గాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ సాయి క్రాంత్ వర్మ, సిఇవో ఏయం శ్రీమతి గౌతమి, టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, సిఇ శ్రీ నాగేశ్వరరావు, డెప్యూటీ ఈవోశ్రీ రమణకుమార్, విజివో శ్రీ మనోహర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Wednesday, 13 April 2022
రెజోనేన్స్ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న మంత్రి పువ్వాడ....పెయింటింగ్ కంపిటిషన్ లో డిస్టిక్ టాపర్ గా నిలిచిన విధ్యార్థికి అభినందనలు..
:
ఖమ్మం నగరంలోని ప్రముఖ విద్యా సంస్థ అయిన Resonance కళాశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హాజరయ్యారు.
రూరల్ మండలం పెద్దతండా లోని చల్లపల్లి గార్డెన్స్ నందు జరిగిన ఈ వేడుకలో మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా Neet, IIT లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమెంటో ఇచ్చి సత్కరించారు.
*రెజోనెన్స్ స్కూల్ విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేసిన ఏసిపి ఆంజనేయులు*
పెయింటింగ్ కంపిటిషన్ లో డిస్టిక్ టాపర్ కు ల్యాప్ టాప్ ప్రధానం .
ఖమ్మం : ఇటీవలే ట్రూ ఇంజనీర్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ వారు నిర్వహించిన క్రియేటివ్ పెయింటింగ్ కంపిటిషన్ లో రెజోనెన్స్ స్కూల్ విద్యార్థి నయోనికా డిస్ట్రిక్ట్ టాపర్ విజయతగా నిలిచినoదున ఆ విద్యార్థికు ముఖ్య అతిథిగా వచ్చిన ఏ.సి.పి ఆంజనేయులు చేతుల మీదుగా రేచల్ ల్యాప్ టాప్ ను మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రతిభను చాటి మెరిట్ మార్కులు పొందిన విద్యార్థులకు , క్లాస్ టాపర్స్ కు , స్కూల్ టాపర్స్ కు బహుమతులు అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీ పరీక్షలు నిర్వహించిన పౌండేషన్ కు అభినందనలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అందరికీ అభినందనలు తెలిపారు . అదేవిధంగా మరెన్నో పోటీపరీక్షల్లో పాల్గొని తమ యొక్క ప్రతిభను , సృజనాత్మకతను చాటుకోవాలని , స్కూల్ యాజమాన్యం అలాగే విద్యార్థిని , విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ నరేంద్ర కుమార్ , ట్రూ ఇంజనీర్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామకృష్ణ , స్కూల్ ప్రిన్సిపాల్ బేగ్ , స్కూల్ ఉపాధ్యాయులు మరియు ట్రూ ఇంజనీర్స్ ఒలింపియాడ్స్ ఫాండషన్ ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ చెన్నెము రాజేశ్వరి , కుక్కలా కావ్య తదితరులు పాల్గొన్నారు . ఈ పోటీ పరీక్షల్లో పెయింటింగ్ కాకుండా సైన్స్ , మాథ్స్ , ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ వంటి పోటీ పరీక్షలను మరియు రాబోయే సంవత్సరంలో ఆన్లైన్ లో కూడా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు . స్కూల్ యాజమాన్యం పెయింటింగ్ కాంపిటీషన్లో స్కూల్ డిస్ట్రిక్ట్ టాఫర్ గా రావడం ఎంతో సంతోషకరంగా ఉందని , విజేతలు సాధించిన స్కూల్ విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు .
Sunday, 10 April 2022
ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్ 10: టిటిడికి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్టలోని పురాతన చారిత్రకప్రాశస్త్యం గల శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు వృషభలగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజస్తంభానికి నవకలశపంచామృతాభిషేకం చేసి ఇంద్రాది సకలదేవతలను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు. అదేవిధంగా, మధ్యతాళం – నాదనామక్రియా రాగం, భృంగిణి తాళం – లలిత రాగం, చంపక తాళం – భైరవి రాగం, ఏకతాళం – మలయమారుత రాగం, త్రిపుట తాళం – మేఘరంజని రాగం, రూపక తాళం – వసంతభైరవి రాగం, గంధర్వ తాళం – కింకర రాగం, నంది తాళం – శంకరాభరణం రాగం, గరుడ తాళం – ఆనందవర్ధన రాగం ఆలపించారు. కంకణబట్టర్ శ్రీ కెహెచ్.రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈఓ శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ ధ్వజారోహణంతో వైభవంగా రాములవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ఏప్రిల్ 13న హనుమంత వాహనం, ఏప్రిల్ 14న గరుడ సేవ, ఏప్రిల్ 15న కల్యాణోత్సవం, ఏప్రిల్ 16న రథోత్సవం, ఏప్రిల్ 18న చక్రస్నానం జరుగుతాయన్నారు.
పట్టువస్త్రాల సమర్పణ
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ మేడా మల్లికార్జునరెడ్డి శ్రీ సీతారామలక్ష్మణులకు పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీ అమరనాథరెడ్డి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఎమ్మెల్యే శ్రీ మేడా మల్లికార్జునరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈఓ డా. రమణప్రసాద్, శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతి, ఏఈఓ శ్రీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ శ్రీ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఆర్.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వారి పుష్ప ప్రసాదానికి భక్తుల నుండి విశేష ఆదరణ
తిరుపతి, 2022 ఏప్రిల్ 09: గోశాల, అగరబత్తులు, డ్రై ఫ్లవర్ టెక్నాలజితో శ్రీవారి చిత్రపటాల తయారీ కేంద్రాన్ని పరిశీలించిన – టిటిడి ఈవో డాక్టర్ కెఎస్. జవర్ రెడ్డి
డ్రైఫ్లవర్ టెక్నాలజి ద్వారా టిటిడి, డాక్టర్ వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా తయారు చేస్తున్న స్వామి, అమ్మవార్ల ల్యామినేటెడ్ ఫోటోలు, పేపర్ వెయిట్స్, కీ చైన్‌లకు శ్రీవారి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోందని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని చీనీ, నిమ్మ పరిశోధన కేంద్రంలో డ్రై ఫ్లవర్ టెక్నాలజితో మహిళలలు తయారు చేస్తున్న కళాకృతులను ఈవో శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దాదాపు 200 మంది స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చి ఆరు నెలలలుగా స్వామివారి ఆకృతులను, వివిధ కళాకృతులను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇది వరకు వివిధ సైజుల్లో స్వామి వారి చిత్రపటాలు తయారు చేసిన, చివరిగా ఏ ఫోర్ సైజును ఎంపిక చేసుకొని ఎక్కువ సంఖ్యలో చిత్ర పటాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఒక మహిళ రోజుకు రెండు చిత్ర పటాలు తయారు చేయవచ్చన్నారు.
ఈ ఉత్పత్తులను మరింత సమర్థవంతంగా వేగవంతంగా అనుకులమైన వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా త్వరలో ఒక ప్రత్యేక తయారీ కేంద్రన్ని సిట్రస్‌లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కళాకృతులను తయారు చేస్తున్న మహిళలను ఈ సందర్భంగా ఈవో అభినందించారు. వారు కూడా శ్రీవారి చిత్రపటాలు తయారు చేసే అవకాశాన్ని తమకు అందించి, తమ జీవితాల్లో వెలుగు రేఖలు నింపినందుకు టిటిడికి, సిట్రస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
అంతకుముందు ఎస్వీ గోసంరక్షణ శాల, అగర్బత్తిల తయారీ కేంద్రాన్ని ఈవో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
పశువైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ పద్మానాభరెడ్డి, సిట్రస్ ప్రధాన శాస్త్రవేత్త శ్రీ నాగరాజు, ఎస్వీ గో సంరక్షణశాల డాక్టర్ సుమన్ ఈవో వెంట ఉన్నారు.
Saturday, 9 April 2022
భద్రాద్రి రామయ్య కు కోనసీమ బొండాలు...
మండపేట:- తెలంగాణ రాష్ట్రం భద్రాచలం లో నిర్వహించే శ్రీ సీతారామచంద్ర మూర్తి కళ్యాణం కు మండపేట కొబ్బరి బొండాలు తరలివెళ్లడం ఆనవాయితీ. శ్రీరామ నవమినాడు భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ వేడుకలో వినియోగించే కొబ్బరి బొండాలు కోనసీమ జిల్లా మండపేట నుంచి శనివారం తరలి వెళ్లాయి. రంగులను అద్ది, రంగురంగుల రాళ్లు, పూసలు, రిబ్బన్లతో అలంకరించిన ఈ బొండాలు వివాహ వేడుకలో సీతారాముల పాదాల చెంత ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. మండపేటకు చెందిన కాజులూరి వెంకట అచ్యుతరామారెడ్డి 22 ఏళ్ల నుంచి ఏటా క్రమం తప్పకుండా కొబ్బరి బొండాలను ప్రత్యేకంగా అలంకరించి స్వామివారి వివాహానికి కానుకగా అందజేస్తున్నారు.
రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు స్వతహాగా వివాహాది శుభకార్యాల్లో వినియోగించే కొబ్బరి బొండాలను అందంగా అలంకరిస్తుంటారు. అలా అలంకరించిన బొండాలను సీతారాముల కల్యాణ వేడుకకు కానుకగా అందజేయాలన్న రామారెడ్డి ఆకాంక్షే 2001 నుంచి భద్రాద్రికి బొండాలను తీసుకువెళ్లడాన్ని ఆనవాయితీగా చేసింది. శ్రేష్టమైన బొండాలను సేకరించి, వాటికి ఎనామిల్, వాటర్ పెయింట్లు వేసి, పూసలు, రాళ్లు, రిబ్బన్లవంటివాటితో సర్వాంగసుందరంగా అలంకరిస్తారు. అలంకరణ పూర్తయ్యేందుకు దాదాపు 15 రోజులు పడుతుందని రామారెడ్డి తెలిపారు. శంఖుచక్రాలు, తిరు నామాలు, సీతారాముల పేర్లతో ప్రత్యేకంగా కొబ్బరి బొండాలను ముస్తాబు చేశారు.తాము తయారుచేసిన బొండాలను సీతారాముల పాదాల చెంత గొప్ప అనుభూతి కలిగిస్తుందని వారు ఆనందం వ్యక్తం చేశారు. మొదట్లో భద్రాద్రికి మాత్రమే బొండాలు పంపగా, ఇప్పుడు కాకినాడ జిల్లాలో ప్రసిద్ధి చెందిన గొల్లలమామిడాడ, సత్యవాడ తదితర పది ఆలయాలకు కానుకగా అందజేస్తున్నామన్నారు.
గత ఎనిమిది ఏళ్లుగా కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగే సీతారాముల కల్యాణ వేడుకకు కూడా పంపుతున్నామన్నారు. గత ఏడాది అక్కడ కరోనా నిబంధనలు అనుసరించి అనుమతి ఇవ్వలేదు.ఈ ఏడాది ఒంటిమిట్ట కూడా పంపనున్నారు. గత ఏడేళ్లు గా విజయనగరం జిల్లా రామతీర్థంలో జరిగే కల్యాణోత్సవానికీ పంపామని తెలిపారు. కాగా రామారెడ్డి దంపతులు ప్రత్యేకంగా అలంకరించిన బొండాలతో శనివారం సాయంత్రం భద్రాద్రి బయలుదేరారు.
Friday, 8 April 2022
పట్టుదల - ప్రయత్నం విజయానికి తొలి మెట్లు.... ప్రాంగణ నియామక విధ్యార్థులకు కాటేపల్లి నవీన్ అభినందనలు.
అనుకొన్న లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎదురయ్యే అన్ని పరిస్థితులను తట్టుకుని విజయాన్ని సాధించడమే విజేత లక్షణమని ఆ దిశగా ప్రయాణించి ప్రాంగణ నియామకాలు సాధించిన విద్యార్థులు అభినందనీయులని ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల అధినేత డాక్టర్ కాటేపల్లి నవీన్ బాబు అన్నారు.
ప్రతిష్టాత్మక ఇన్ఫోసిస్ కంపెనీ లో ఉద్యోగాలు సాధించిన రంజిత, సాయి ప్రియ భావన, భారతి, ఇ.భావన, హేమలత, సాయి హర్షిత,నవ్య శ్రీ
, కోటీశ్వరిల అభినందన కార్యక్రమంలో పాల్గొన్న నవీన్ బాబు ఫైనలియర్ విద్యార్థులు కరోనా సమయంలో ఎదురైనా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని అటు చదువులోనూ ఉద్యోగ శిక్షణ లోను రాణించి ఉద్యోగాలను సాధించగలగడం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు.
నిరంతర శిక్షణ పట్టుదల మరియు తల్లిదండ్రులు ఇంతకాలం తమకు అండగా నిలిచిన తీరును అర్థం చేసుకొని ఉద్యోగ సాధనకై పోరాటం చేసిన విద్యార్థినులు తమ జూనియర్స్ కు మార్గదర్శకంగా నిలిచారని అడ్మిన్ డైరెక్టర్ అట్లూరి వెంకటరమణ అభినందించారు.
ఈ అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్ వివిధ శాఖాధిపతులు నరసింహారావు రమేష్ స్వామి సతీష్ మరియు కళాశాల శిక్షణ అధికారి మన్మోహన్ తివారి, రామ్మోహన్, విద్యార్థినిలు పాల్గొన్నారు.
Monday, 4 April 2022
అంగరగవైభవంగా రాములోరి కల్యాణం చేద్దాం : నవమి ఏర్పాట్లపై అధికారులతో మంత్రి పువ్వాడ.
Bhadrachalam/04.04.22
శ్రీసీతారామచంద్రస్వామి వారి కళ్యాణం ఈసారి అంగరంగ వైభవంగా నిర్వించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు స్పష్టం చేశారు.
రెండో అయోధ్యగా భాసిల్లుతున్న ఖమ్మం జిల్లా భద్రాచలంలో స్వామివారి కల్యాణ మహోత్సవం వేలాది మంది భక్తజన సందోహనం నడుమ వైభవోపేతంగా ఈనెల 10న జరిగే శ్రీరామనవమికి స్వామివారి కళ్యాణ ఉత్సవం, భక్తులకు ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాల ఏర్పాట్లపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయలో జిల్లా కలెక్టర్, ఆలయ అధికారులు, పోలీస్, పంచాయతి రాజ్, విద్యుత్, రవాణా, గ్రామ పంచాయతి, ఆర్టీసి, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, ఫైర్, రెవెన్యూ, ఎండోమెంట్ సంభందిత శాఖల అధికారులు, ఆలయ అర్చకులతో సమీక్ష నిర్వహించారు.
ఈనెల 10న జరగనున్న రాములవారి కల్యాణం, 11న పట్టాభిషేకం నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై జిల్లా కలెక్టర్ అనుదీప్ ను ఆయా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సీతారామ కళ్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాలనుండి తరలివచ్చే అశేష భక్తజన కోటికి సకల సౌకర్యాలు కల్పించాలన్నారు.
కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా స్వామి వారి కళ్యాణంను ఆలయంకే పరిమితం చేసినందున, ఈ మహోత్సవాలకు ఈ సారి లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున 3 లక్షల స్వామివారి ప్రసాద లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు.
సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక వసతి, మరుగుదొడ్లు, ఉచిత వైద్యశిభిరాలను ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పార్కింగ్ ప్రాంగణాలు దూర ప్రాంతాలలో కాకుండా.. సాధ్యమైనంత దెగ్గరగా ఉండేలా చూడాలని సూచించారు.
భక్తుల కోరిక మేరకు తలంబ్రాలు విరివిగా అందుబాటులొ ఉండేలా ఎక్కువ కేంద్రాలు ఎర్పాటు చేయాలన్నారు.
ముఖ్యంగా పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని కోరారు. బ్లీచింగ్ ను ఎప్పటికప్పుడు వెడజల్లుతు పరిశుభ్రత పాటిస్తూ, ors ప్యాకెట్స్ ను ఉచితంగా అందించాలని అన్నారు. ప్రత్యక్షంగా స్వామి వారి కళ్యాణంను తిలకించేందుకు రాలేని వారికోసం వారధి గా ఉన్న మీడియా కు ప్రత్యేక విభాగంను ఎర్పాటు చేసి ప్రసార సదుపాయాలు కల్పించాలన్నారు. భక్తులు సులువుగా కల్యాణ ప్రాంగణంకు చేరుకునేలా ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఎర్పాటు చేయాలన్నారు.అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ అప్రమత్తంగా ఉండాలని, fire extinguisher లు అందుబాటులొ ఉంచుకోవాలన్నారు.
ఆలయంలో కల్యాణ మంటపాలకు రంగులు అద్ది మెరుగులు దిద్దాలన్నారు. నిర్దేశించిన పనులన్నీ 8వ తేదీ కల్లా శ్రీరామ నవమి పనులు పూర్తచేయాలని, మిథిలా స్టేడియంలో, మూడవీధులు, స్వామివారి కళ్యాణ మండపం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాల ఏర్పాట్లు చేయాలన్నారు.
భక్తుల తాకిడి అధికంగా ఉండనున్న నేపథ్యంలో అవసరమైతే వివిఐపి భద్రత కోరకు CRPF బలగాలను వినియోగించుకోవాలని, వరంగల్, ఖమ్మం జిల్లా పోలీసులను కూడా వినియోగించుకుని పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు.ఈ సందర్భంగా పలు సూచికలు, కళ్యాణం ప్రాంగణ వివరాలు, వివిధ సేవలకు సంబందించిన పలు అంశాలతో రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
అనంతరం స్వామివారి కల్యాణం జరిగే చోటు అయిన మిథిలా ప్రాంగణాన్ని మంత్రి పువ్వాడ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.
మిర్చి నాణ్యత పరిశీలన యంత్రాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం : రాష్ట్రంలోనే తొలి సారి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ప్రవేశపెట్టిన మిర్చి నాణ్యత పరిశీలన యంత్రాన్ని రవాణా శాఖ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మిర్చి నాణ్యతను పరిశీలించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో మిర్చి, పత్తి రేట్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో పాలకవర్గం అధికారులను అభినందించారు. అనంతరం ఎక్కువ రేటు పలికిన రైతును మంత్రి పువ్వాడ సన్మానించారు. వ్యాపారులు, పాలకవర్గం కోరికమేరకు కేక్ కట్ చేసి రైతులకు మిఠాయి పంచారు..*
Subscribe to:
Comments (Atom)