ఖమ్మం : రాష్ట్రంలోనే తొలి సారి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ప్రవేశపెట్టిన మిర్చి నాణ్యత పరిశీలన యంత్రాన్ని రవాణా శాఖ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మిర్చి నాణ్యతను పరిశీలించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో మిర్చి, పత్తి రేట్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో పాలకవర్గం అధికారులను అభినందించారు.
అనంతరం ఎక్కువ రేటు పలికిన రైతును మంత్రి పువ్వాడ సన్మానించారు. వ్యాపారులు, పాలకవర్గం కోరికమేరకు కేక్ కట్ చేసి రైతులకు మిఠాయి పంచారు..*
No comments:
Post a Comment