Friday, 8 April 2022

పట్టుదల - ప్రయత్నం విజయానికి తొలి మెట్లు.... ప్రాంగణ నియామక విధ్యార్థులకు కాటేపల్లి నవీన్ అభినందనలు.


అనుకొన్న లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎదురయ్యే అన్ని పరిస్థితులను తట్టుకుని విజయాన్ని సాధించడమే విజేత లక్షణమని ఆ దిశగా ప్రయాణించి ప్రాంగణ నియామకాలు సాధించిన విద్యార్థులు అభినందనీయులని ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల అధినేత డాక్టర్ కాటేపల్లి నవీన్ బాబు అన్నారు.
ప్రతిష్టాత్మక ఇన్ఫోసిస్ కంపెనీ లో ఉద్యోగాలు సాధించిన రంజిత, సాయి ప్రియ భావన, భారతి, ఇ.భావన, హేమలత, సాయి హర్షిత,నవ్య శ్రీ
, కోటీశ్వరిల అభినందన కార్యక్రమంలో పాల్గొన్న నవీన్ బాబు ఫైనలియర్ విద్యార్థులు కరోనా సమయంలో ఎదురైనా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని అటు చదువులోనూ ఉద్యోగ శిక్షణ లోను రాణించి ఉద్యోగాలను సాధించగలగడం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు.
నిరంతర శిక్షణ పట్టుదల మరియు తల్లిదండ్రులు ఇంతకాలం తమకు అండగా నిలిచిన తీరును అర్థం చేసుకొని ఉద్యోగ సాధనకై పోరాటం చేసిన విద్యార్థినులు తమ జూనియర్స్ కు మార్గదర్శకంగా నిలిచారని అడ్మిన్ డైరెక్టర్ అట్లూరి వెంకటరమణ అభినందించారు.
ఈ అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్ వివిధ శాఖాధిపతులు నరసింహారావు రమేష్ స్వామి సతీష్ మరియు కళాశాల శిక్షణ అధికారి మన్మోహన్ తివారి,  రామ్మోహన్, విద్యార్థినిలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment