Sunday, 17 April 2022

వైరల్ అయిన రాష్ట్రపతి కుమార్తె ఫోటోలు..

ఫోటోలో చీర కట్టులో వినమ్రంగా నమస్కరిస్తు స్వాగతం పలుకుతున్న ఆమె పేరు స్వాతి , ఎయిర్ ఇండియా లో కేబిన్ అసిస్టెంట్ ( వాడుక భాషలో ఎయిర్ హోస్టెస్ ) గా వారి బోయింగ్ 777 విమానాలలో చాల రోజులు పనిచేసి ఈ మధ్యే వారి హెడ్ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేయబడ్డారు.
అయితే ఏంటి గొప్ప అని అంటారా, ఆ ఐదడుగుల నాలుగంగుళాల అమ్మాయి పూర్తి పేరు స్వాతి కోవింద్ . ఏంటి ఆశ్చర్య పోయారా మీరు అనుకుంటున్నది  నిజమేనండీ ఆ అమ్మాయి మన రాష్ట్రపతి శ్రీ రామనాథ్ కోవింద్ గారి కూతురు.
నిన్న మొన్నటి దాకా ఆ అమ్మాయి రాష్ట్రపతి గారి కూతురని తన మిత్రులకు కూడా తెలియదు , రాష్ట్రపతి గారు కూడా ఏనాడూ తన కూతురి గురించి ఎక్కడా చెప్పుకోలేదు లేదా ఆవిడకు ప్రమోషన్లు ఇప్పంచడానికి పైరవీలు చేయలేదు , నేను రాష్ట్రపతి అయ్యాక కూడా నీవు ఆ చిన్న వుద్యోగం చేయడం ఏమిటి అంటూ మానేయమని అడగలేదు. ఆ అమ్మాయి యొక్క ఆత్మాభిమానాన్ని గౌరవిస్తూ తనకు నచ్చిన వుద్యోగం చేసే స్వేచ్ఛ ఇచ్చారు ఆ తండ్రి.
ఈ మధ్య ఎయిర్ ఇండియా ని టాటా లకు అమ్మేసే క్రమం లో మొత్తం ఉద్యోగుల బయో డేటా అంతా బయటికి తీస్తే ఈ విషయం బయటపడింది. అప్పుడు టాటా వారు ఆ అమ్మాయిని ఎయిర్ హోస్టెస్ డ్యూటీ నుండి తప్పించి వారి హెడ్ ఆఫీస్ లో టేబుల్ డ్యూటీ వేశారు.దీంతో ఈ ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి...

No comments:

Post a Comment