Monday, 18 April 2022

వేడుకగా క్రియేటివ్ స్కూల్ ఫేర్వెల్ డే..


ఖమ్మం , ఏప్రిల్ 17 : స్థానిక హక్కారా బావి సెంటర్ వద్ద ఉన్న క్రియేటివ్ గ్రామర్ స్కూల్ ఫేర్వెల్ డే వేడుకగా జరిగింది. పదవ తరగతి విద్యార్థులకు జూనియర్ టెన్త్ విద్యార్థులు వీడ్కోలు పలుకుతూ వేడుకలు జరిపారు. ఇన్ని సంవత్సరములు గా తమతో కలిసి మెలిసి ఉండి పాఠశాలను వదిలి వెళ్తున్న పదవతరగతి విద్యార్థులకు జూనియర్లు తమ ఆప్యాయతను, అనుబంధాన్ని చాటి జ్ఞాపికలు అందించారు. వేదికపై పదవ తరగతి విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బి.కమలాకర్, డైరెక్టర్ కౌశిక్ లు అతిథులుగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు వసంత,మేఘన, ఉపాధ్యాయులు సంధ్యా రాణి,వినీల్, గోపాల క్రిష్ణ, రామారావు, గాయత్రి,సత్యవతి తదితరులు పాల్గొన్నారు. సభానంతరం విద్యార్థులు ప్రదర్శించిన జానపద, గిరిజన, పాశ్చాత్య డాన్సులు అందరిని ఉర్రూతలూగించాయి. తీర్ధాల స్పందన బృందం ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఫేర్వెల్ డే ను పాఠశాల డైరెక్టర్లు కౌశిక్, మేఘన పర్యవేక్షించారు.

No comments:

Post a Comment