Wednesday, 13 April 2022

రెజోనేన్స్ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న మంత్రి పువ్వాడ....పెయింటింగ్ కంపిటిషన్ లో డిస్టిక్ టాపర్ గా నిలిచిన విధ్యార్థికి అభినందనలు..

:


ఖమ్మం నగరంలోని ప్రముఖ విద్యా సంస్థ అయిన Resonance కళాశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హాజరయ్యారు.
రూరల్ మండలం పెద్దతండా లోని చల్లపల్లి గార్డెన్స్ నందు జరిగిన ఈ వేడుకలో మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా Neet, IIT లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమెంటో ఇచ్చి సత్కరించారు.
*రెజోనెన్స్ స్కూల్ విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేసిన ఏసిపి ఆంజనేయులు* 
పెయింటింగ్ కంపిటిషన్ లో డిస్టిక్ టాపర్ కు ల్యాప్ టాప్ ప్రధానం .
ఖమ్మం : ఇటీవలే ట్రూ ఇంజనీర్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ వారు నిర్వహించిన క్రియేటివ్ పెయింటింగ్ కంపిటిషన్ లో రెజోనెన్స్ స్కూల్ విద్యార్థి నయోనికా డిస్ట్రిక్ట్ టాపర్ విజయతగా నిలిచినoదున ఆ విద్యార్థికు ముఖ్య అతిథిగా వచ్చిన ఏ.సి.పి ఆంజనేయులు చేతుల మీదుగా రేచల్ ల్యాప్ టాప్ ను మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రతిభను చాటి మెరిట్ మార్కులు పొందిన విద్యార్థులకు , క్లాస్ టాపర్స్ కు , స్కూల్ టాపర్స్ కు బహుమతులు అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీ పరీక్షలు నిర్వహించిన పౌండేషన్ కు అభినందనలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అందరికీ అభినందనలు తెలిపారు . అదేవిధంగా మరెన్నో పోటీపరీక్షల్లో పాల్గొని తమ యొక్క ప్రతిభను , సృజనాత్మకతను చాటుకోవాలని , స్కూల్ యాజమాన్యం అలాగే విద్యార్థిని , విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ నరేంద్ర కుమార్ , ట్రూ ఇంజనీర్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు  రామకృష్ణ , స్కూల్ ప్రిన్సిపాల్  బేగ్ , స్కూల్ ఉపాధ్యాయులు మరియు ట్రూ ఇంజనీర్స్ ఒలింపియాడ్స్ ఫాండషన్ ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ చెన్నెము రాజేశ్వరి , కుక్కలా కావ్య తదితరులు పాల్గొన్నారు . ఈ పోటీ పరీక్షల్లో పెయింటింగ్ కాకుండా సైన్స్ , మాథ్స్ , ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ వంటి పోటీ పరీక్షలను మరియు రాబోయే సంవత్సరంలో ఆన్లైన్ లో కూడా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు . స్కూల్ యాజమాన్యం పెయింటింగ్ కాంపిటీషన్లో  స్కూల్ డిస్ట్రిక్ట్ టాఫర్ గా  రావడం ఎంతో సంతోషకరంగా ఉందని , విజేతలు సాధించిన స్కూల్ విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు .

No comments:

Post a Comment