Thursday, 29 June 2023

శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం... వేద మంత్రాలతో మార్మోగిన మైదానం...


 లోక కల్యాణార్థం టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో గురువారం ఉదయం  శాస్త్రోక్తంగా శ్రీశ్రీనివాస చతుర్వేద హవనం ప్రారంభమైంది.
రుత్వికులు కలశ స్థాపన, కలశ ఆవాహన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం యజమాని సంకల్పం, భక్త సంకల్పం, గణపతి పూజ, అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు చేపట్టారు. 32 మంది రుత్వికులు నాలుగు వేదాల్లోని మంత్రాలను పఠిస్తూ హవనం చేశారు. వేద మంత్రాలతో టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని మైదానం మారుమోగింది. మధ్యాహ్నం 1 గంట వరకు హవనం జరుగుతుంది.
 టీటీడీ ఈవో ధర్మారెడ్డి దంపతులు, జేఈవో  సదా భార్గవి ఈ కార్యక్రమంలో పాల్గొని సంకల్పం చేసుకున్నారు.లోక కల్యాణార్థం చతుర్వేద హవనం : టీటీడీ ఈవో ధర్మా రెడ్డి. లోక కల్యాణార్థం  వారం రోజుల పాటు తిరుపతిలో తొలిసారిగా శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గురువారం ఉదయం చతుర్వేద హవనం కార్యక్రమంలో  పాల్గొన్న అనంతరం  ఆయన మీడియాతో  మాట్లాడారు.  జూలై 5వ తేదీ వరకు ఏడు రోజులపాటు 32 మంది రుత్వికులు ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు. సృష్టిలోని సకల జీవరాశులు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ నాలుగు వేదాల్లోని మంత్రాలను పఠిస్తూ,  ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తి సంగీత కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు . భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమ మార్గదర్శకులు ఆచార్య చిర్రావూరి శ్రీరామ శర్మ మాట్లాడుతూ నాలుగు వేదాల్లోని మంత్రాలను పఠిస్తూ,  ఆయా దేవతలకు ఆహుతులను ఇవ్వడం ద్వారా సత్ఫలితం  సిద్ధిస్తుందని తెలిపారు. కంచి పరమాచార్యులు చెప్పిన నియమాలను పాటిస్తూ, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం లోని మంత్రాలను పఠిస్తూ హవనం నిర్వహిస్తున్నామని  వివరించారు.

Monday, 26 June 2023

కన్నుల పండుగగా సప్తవర్ణ పుష్ష్పయాగం...

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో సోమ‌వారం పుష్పయాగం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 9.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ ఎపి శ్రీనివాస దీక్షితులు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది.ఇందులో  మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల సాంప్రదాయ పుష్పాలు, తుల‌సి, మ‌రువం, ద‌మ‌నం, బిల్వం, ప‌న్నీరాకు  పత్రాలు కలిపి మొత్తం 3 టన్నులతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ఈ పుష్పాలను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు విరాళంగా అందించారు.
   మే 26 నుండి జూన్ 3వ తేదీ వరకు వరకు ఆల‌యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. బ్ర‌హ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ.

ముగిసిన సాక్షాత్కార వైభవోత్సవాలు.... గరుడ వాహనంపై శ్రీ కల్యాణ వెంకన్న కటాక్షం....


 తిరుపతి : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు సోమవారం ముగిశాయి. చివరి రోజు రాత్రి విశేషమైన గరుడ వాహనంపై స్వామివారు కటాక్షించారు.
   ఉదయం సుప్రభాతంతో స్వామివారిని  మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఊంజల్‌ సేవ జరిగింది. రాత్రి 7 గంటల నుండి  గరుడ వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

#Ttd
#tirupati

Sunday, 25 June 2023

ఎస్వీ గోశాలలో ఫలవంతమైన పిండమార్పిడి.. సాహి వాల్ దూడకు పద్మావతిగా నామకరణం...-. టీటీడీ ఈవో ధర్మారెడ్డి

దేశంలో తొలిసారిగా పిండ మార్పిడి పద్ధతిలో సాహివాల్ దూడ జననం
- దాతల సహకారంతో  దేశావాళీ గోవుల అభివృద్ధి
- సాహి వాల్ దూడకు పద్మావతిగా నామకరణం
-.  టీటీడీ ఈవో ధర్మారెడ్డి

    దేశంలో తొలిసారిగా పిండ మార్పిడి (సరోగసి ) పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ  గోశాలలో ఆదివారం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.
      ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సూచనలతో టీటీడీ, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా దేశావాళీ  గోజాతులను అభివృద్ధి చేయాలని గత ఏడాది ఎంఓయు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మేలు రకమైన దేశవాళీ గో జాతిని అభివృద్ధి చేసే క్రమంలో ఎస్వీ గో సంరక్షణ శాల లోని మేలు జాతి ఆవుల  నుండి అండం సేకరించి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఐవిఎఫ్ ల్యాబ్ లో కృత్రిమంగా పిండాలను  అభివృద్ధి చేశారన్నారు . వీటిని టీటీడీ గోశాలలోని ఆవులలో ప్రవేశపెట్టి దేశంలోనే తొలిసారిగా విజయం సాధించినట్లు ఈవో తెలిపారు. ఈ ప్రక్రియలో శనివారం రాత్రి ఒంగోలు ఆవుకు జన్మించిన సాహివాల్ దూడకు పద్మావతి అని నామకరణం చేసినట్లు చెప్పారు. 
     తిరుమల శ్రీవారి ఆలయంలో ధూప దీప నైవేద్యాలకు, నిత్య కైంకర్యాలకు అవసరమయ్యే పాలు, పెరుగు, వెన్న, నెయ్యిని దేశవాళీ ఆవుపాల నుండి ఉత్పత్తి  చేయాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. ఇందుకోసం ఇప్పటికే  200 దేశీయ గోవులను దాతలు సమకూర్చారని, మరో 300 గోవులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.  
   ఆవుల ఆరోగ్య పరంగా, అధిక పాల దిగుబడి దిశగా నాణ్యత కలిగిన దాణా తయారీ చేసుకోవడానికి ఇటీవలే గోశాలలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ప్రారంభించినట్లు చెప్పారు. అదేవిధంగా గోశాలలో రోజుకు సుమారు 3 వేల నుండి 4 వేల  లీటర్ల  ఆవు పాలను ఉత్పత్తి చేయనున్నట్లు ఈవో తెలిపారు.  రోజుకు 60 కేజీ ల స్వచ్ఛమైన నెయ్యిని సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసి స్వామి వారి నిత్య కైంకర్యం, నైవేద్యాలకు వాడేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.   గో ఆధారిత  వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రైతులకు టీటీడీ ఉచితంగా గోవులను అందిస్తోందని అన్నారు. గోశాలలో ఉన్న షెడ్లలో  మార్పులను చేయడం, ఇసుక తిన్నెలను ఏర్పాటు చేసి గోవులకు సహజ సిద్ధమైన వాతావరణాన్ని కల్పించామన్నారు . గోశాలలోనే కాకుండా తిరుపతి పరిసర ప్రాంతాల్లో సేంద్రీయ  పద్ధతుల్లో పండించిన పచ్చి మేతను కొనుగోలు చేసేందుకు కలెక్టర్ తో  సంప్రదించామన్నారు.   రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలు పొందేందుకు వీలుగా నూతన షెడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు.ఎస్వీ పశు వైద్య విశ్వవిద్యాలయం  విసి డాక్టర్ పద్మనాభరెడ్డి మాట్లాడుతూ,  రానున్న 5 సంవత్సరాల్లో 324 మేలు రకమైన సాహివాల్ గోజాతి దూడలను ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా పిండ మార్పిడి చేయబడిన  ఆవులలో ఇప్పటి వరకు 11 గోవులు గర్భం దాల్చినట్లు తెలిపారు. ఒక  ఆవు శనివారం రాత్రి సాహివాల్ పెయ్య దూడకు జన్మనిచ్చిందన్నారు. రానున్న రోజుల్లో ఇంకా 10 సాహివాల్  దూడలు జన్మించనున్నాయని తెలియజేశారు. ఇదే కాకుండా లింగ నిర్ధారిత వీర్యాన్ని ఎస్వీ  గోశాలలో ఉన్న సాహివాల్, గిర్ గోవులలో కృత్రిమ గర్భధారణ ద్వారా ప్రవేశపెడతామన్నారు . దీనివల్ల  సరోగసి చెందే ఆవు లక్షణాలు దూడకు రావని ఆయన చెప్పారు. 
ఈ కార్యక్రమం ద్వారా మేలు రకమైన దేశీయ జాతి గోవులను రైతులకు సబ్సిడీపై  అందించవచ్చని ఆయన వివరించారు.

గురు పౌర్ణమి ప్రత్యేకం..అరుణగిరికి టి.ఎస్.ఆర్టీసి ప్రత్యేక బస్...

*
*హైదరాబాద్  :  తమినాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. పౌర్ణమి సందర్భంగా జూలై 3న అరుణాచలంలో జరిగే గిరి ప్రదర్శనకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. 
సర్వీసు నంబర్ 98889 గల ఈ బస్సు.. జులై 2న ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరి.. ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనానంతరం అదే రోజు రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది. గిరి ప్రదర్శన పూర్తయిన తర్వాత జులై 3 సాయంత్రం 3 గంటలకు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ వెళ్లి.. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు మరుసటి రోజు జులై 4 ఉదయం 10 గంటలకు చేరుకుంటుంది. ఈ మేరకే టీఎస్ఆర్టీసీ అరుణాచల గిరి ప్రదర్శనను టూర్ ప్యాకేజీలాగా అందిస్తోంది. ఈ ప్యాకేజీ ధరను ఒక్కొక్కరికి రూ.2600గా సంస్థ నిర్ణయించింది. గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరిప్రదర్శనకు భక్తుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ సదుపాయాన్ని అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులు వినియోగించుకోవాలని సూచించింది. ఈ టూర్ ప్యాకేజీని సంస్థ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఎంబీజీఎస్, జేబీఎస్, దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ తో పాటు సమీప టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి సంబందించిన పూర్తి సమాచారం కోసం 9959226257,9959224911 ఫోన్ నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.' ఈ మేరకు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఐపీఎస్ సూచించారు.

Thursday, 22 June 2023

అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్... KMC మేయర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్

ఖమ్మం : రాష్ట్ర అవతరణ దశభి ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరవీరుల దినోత్సవం ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. ఖమ్మం మయూరి సెంటర్ లోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, అదనపు కలెక్టర్ స్నేహలత తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు.
 అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ నందు జరిగిన స్మారక సభలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి చేసిన త్యాగం ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నాయన్నారు.

దశాబ్ది వేడుకల్లో నేడు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళులర్పించేందుకు హైదరాబాద్‌ నడి బొడ్డున హుస్సేన్ సాగరతీరంలో నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నంను ముఖ్యమంత్రి కేసీఅర్ గారు ప్రారంభోత్సవం చేస్తున్నారని అన్నారు.
ఆత్మ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో పాలన పగ్గాలు అందుకున్న ఉద్యమనేత కేసీఆర్‌ సర్కారు అమరుల కుటుంబాలకు అడుగడుగునా అండగా నిలుస్తూ ఆసరానిస్తున్నదన్నారు.
రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలను రాష్ట్రం ఏర్పాటైన రెండేండ్లలోనే అక్కున చేర్చుకుందని, అమరుల కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయగా.. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించిన విషయం గుర్తు చేశారు. 
2016 జూన్‌ 2న రాష్ట్రం రెండో అవతరణ రోజునే దీన్ని పూర్తి చేసిందని, అమరుల కుటుంబ సభ్యుల్లో కొందరికి చదువు, వయసు వంటి నిబంధనల్లో అనేక సడలింపులు ఇచ్చి ఉద్యోగాలను కల్పించిందన్నారు.
ఇదే సమయంలో రాష్ట్ర సాధన కోసం సాగిన పోరులో అసువులు బాసిన అమరులకు ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తు.. అమరుల ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ గారు తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపేలా సాగుతున్న పాలనపై అమరుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.. 
నీళ్లు, నిధులు, నియామకాలతో కూడిన ఉద్యమ ట్యాగ్‌లైన్‌ను పరిపూర్ణం చేస్తూ సాగుతుండడంపై నేడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారుని, రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకోవడం గొప్ప విషయమన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజు గురువారం అమరవీరుల దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో, వాడవాడలా అమరులకు ఘనంగా నివాళులర్పించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుందన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ గారు ప్రవేశపెట్టిన "అమరుల సంస్మరణ" తీర్మానాన్ని కార్పొరేటర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు, ఉద్యమకారులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

Wednesday, 21 June 2023

కోమలమ్మ సత్రంలోకి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్- శాస్రోక్తంగా పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించిన జేఈఓ సదా భార్గవి

తిరుపతి శ్వేత భవనంలోని టీటీడీ శ్రీనివాస  కల్యాణం , వైభోత్సవాల ప్రాజెక్ట్ కార్యాలయాన్ని కోమలమ్మ సత్రం ప్రాంగణంలోకి మార్చారు.  బుధవారం  జేఈవో  శ్రీమతి సదాభార్గవి కోమలమ్మ సత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు శాస్రోక్తంగా పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ, టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి సూచనల మేరకు 1.5 ఎకరాల విస్తీర్ణంలోని  కోమలమ్మ సత్రం లో  ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు శ్రీ శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్ లోని స్వామి అమ్మవార్ల విగ్రహాలను ఇక్కడ ఉంచి నిత్య పూజ, కైంకర్యాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశం నలుమూలల నిర్వహించే శ్రీవారి కల్యాణం , వైభోత్సవాలకు ఇక్కడి నుండే ఉత్సవర్లను తీసుకు వెళ్ళనున్నట్లు చెప్పారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో పంచమి తీర్థం రోజున శ్రీవారి ఆలయం నుండి అమ్మవారికి తీసుకువచ్చే సారెను  కోమలమ్మ సత్రంలో ఉంచి పూజలు నిర్వహిస్తారన్నారు. దాస సాహిత్య  ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రాజెక్ట్ ల ద్వారా ఈ సత్రంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత,  ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జేఈవో  వివరించారు.  భక్తులు ఈ ప్రాంగణంలో పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం : కలెక్టర్ వి.పి.గౌతమ్


ఖమ్మం, జూన్ 21: యోగాతో సంపూర్ణంగా ఆరోగ్యంతో జీవించవచ్చని, ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం 9వ ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో క్రీడా, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో ప్రజ్ఞా భారతి సంస్థ సహకారంతో యోగా దినోత్సవంను నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రపంచంలో యోగ అంటే ఇండియా.. ఇండియా అంటే యోగ ల భావన వచ్చిందన్నారు. యోగ మన వారసత్వ సంపద అని, దీనిని నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. విదేశాల్లో యోగాకు మంచి గుర్తింపు ఉందని ఆయన తెలిపారు. మారే ప్రపంచంలో స్కిల్స్ నిత్యం మారుతుంటాయని, మన మీద మనకు స్వీయ నియంత్రణ ఉండాలన్నారు. మెడిటేషన్, ప్రాణయువు, యోగాతో ఒత్తిడిని జయించవచ్చని కలెక్టర్ అన్నారు. నిత్యం యోగా చేయడం ద్వారా శరీరం ఉల్లాసంగా తయారవుతుందని అన్నారు. యోగాతో అనేక లాభాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా వయోవృద్ధులు యోగాసనాల ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. 
ఈ సందర్భంగా కలెక్టర్ యోగా గురువు చేయిస్తున్న యోగాను కార్యక్రమంలో పాల్గొన్న అందరితోపాటు కలెక్టర్ చేశారు. యోగాలో అద్భుత ప్రదర్శన ఇచ్చిన సతీష్, చినబాబు లను అభినందించి, మెమోంటో అందజేశారు.
  ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పరంధామ రెడ్డి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, జిల్లా పశుసంవర్థక అధికారి డా. వేణు మనోహర్, డా. కొలికొండ మహేంద్ర కుమార్, పరాశారం ప్రసాద్, ఆయుష్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

తిరుమలకు వచ్చే భక్తులు ఫేక్ వెబ్ సైట్స్ నుండి ఫేక్ దర్శన టోకన్లను పొంది మోసపోకండి - శ్రీవారి భక్తులకు ఎస్.పి.పరమేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి..


అన్నమయ్య జిల్లా: తిరుమల తిరుపతి పవిత్రతకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అన్నారు నెలవారి సమీక్షలో భాగంగా ఆయన అధికారులతో శాంతిభద్రతల పై సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వారిని ఉపేక్షించవద్దని ఎటువంటి చర్యల కైనా వెనకాడ వద్దని ఆయన అధికారులకు ఆదేశించారు.
 తిరుమల పవిత్ర క్షేత్రం ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా నివాసముంటున్న వ్యక్తులపై కఠిన చర్యలు.. అటువంటి వారికి ఇళ్లను అద్దెకిచ్చిన యజమానులపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.తిరుమలకు వచ్చే భక్తులు ఫేక్ వెబ్ సైట్స్ నుండి ఫేక్ దర్శన టోకన్లను పొంది మోసపోకండి - శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి చేశారు.సాంప్రదాయ పోలీసింగ్ అమలులో భాగమైన వేగు వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం..ఆస్తి నేరాల నియంత్రణకు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు. 
చేశామన్నారు. LHMS APP సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు మెరుగైన అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. NDPS కేసుల నివారణకు కఠినంగా వ్యవహరించి, గాంజాను అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా చేసుకుని కేసుల్లో అరెస్టు అయ్యి, బెయిల్ పై వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పొరుగు రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు అక్రమ మద్యాన్ని నగరానికి తీసుకువచ్చి వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు, అవసరమైతే PD ACT కేసు నమోదు చేయాలన్నారు. సైబర్ క్రైమ్ నేరాల పట్ల ప్రత్యేక చొరవ చూపండి. నేరగాళ్ల ఉచ్చులో ప్రజలు పడకుండా వారికి విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు.జిల్లా ఎస్పి శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపిఎస్., జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు అదనపు ఎస్పీలు పరిపాలన శ్రీ వెంకటరావు గారు, శాంతి భద్రత శ్రీ కులశేఖర్, నేర విభాగం శ్రీమతి విమల కుమారి గారు, తిరుమల శ్రీ ముని రామయ్య వారితో  తిరుపతి, తిరుమల సబ్ డివిజన్ల డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో మంగళవారం నాడు తిరుపతి పోలీస్ అతిథి గృహం సమావేశ మందిరం నందు నెలవారి నేరసమీక్షా సమావేశమును నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ పిక్ పాకెట్, మొబైల్ దొంగతనాలకు పాల్పడే నేరస్తులపై చిన్న/పెద్ద, ఆడ/మగ అనే భేదం లేకుండా అందరిపై కఠినంగా వ్యవహరించి చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలను తీసుకున్నప్పుడే, తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో భక్తుల ధన,మాన,ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించిన వాళ్లమవుతామన్నారు. తిరుమల పుణ్యక్షేత్రం నందు భక్తుల ముసుగులో కొంతమంది నేరస్తులు తలదాచుకుంటున్నారనే సమాచారం మేరకు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి భక్తుల ముసుగులో తలదాచుకుంటున్న నేరస్తులను అదుపులోకి తీసుకొని విచారించడం వలన నేర నివారణ చేయడంతోపాటు, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుపతి పోలీసుల పై అపారమైన నమ్మకం మరియు మర్యాద పెరిగి, తిరుపతి జిల్లా పోలీసుల ఖ్యాతి దశదిశలా వ్యాపిస్తుందన్నారు.
తిరుపతిలోని బాలాజీ లింక్ బస్టాండ్, రుయా ఆసుపత్రి, గోవిందరాజు స్వామి సత్రాలు, సెంట్రల్ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ వంటి భక్తుల రద్దీ ప్రదేశాలలో నేరస్తులు బిచ్చగాళ్ళ వేషంలో ఉంటూ నగరంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక సమాచారం... ఈ ప్రాంతాల్లో అక్రమంగా నివాసముంటున్న వారు తక్షణం తిరుపతి నగరాన్ని వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించారు. 
తిరుమలలో వృద్ధులను, మహిళలను కొంతమంది కావాలనే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ సంఘటనలు చాలా బాధాకరం... ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.
 ధీర్గకాలికంగా పెండింగ్ లో ఉన్న  గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, డెకాయిటి, రాబరీ, ప్రాపర్టీ, వాహనాలు దొంగతనం, మిస్సింగ్ కేసులు, చీటింగ్ కేసులు, సైబర్ నేరాలు మరియు ఇతర కేసులను సమీక్షించారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులు, నమోదైన కేసుల్లో నేరస్తుల అరెస్టు, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీసి, కేసులను చేదించడానికి & వాటి పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు మరియు మెళకువలను అధికారులకు తెలుపుతూ దిశా నిర్దేశాలు చేశారు.SHOలు తమ పరిధిలో నివాసమున్న రౌడీ షీటర్లను, అనుమానితులను, రాజకీయ/సామాజిక ట్రబుల్ మాంగర్స్, అసాంఘిక శక్తుల యొక్క కదలికలపై నిరంతర నిఘా ఉంచి తరచుగా కౌన్సిలింగ్ ఇస్తూ, శాంతి భద్రతల పరిరక్షిస్తూ, నేర నియంత్రణ కొరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. VPO/WPO వ్యవస్థను బలోపేతం చేసి మీ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో మరియు నాన్ బెయిలబుల్ వారంట్స్ (N.B.W) ను జారీ చేయడంలో చిత్త శుద్ధితో పనిచేయాలని, అక్రమ రవాణాపై ప్రతేక బృందాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, తద్వారా ముందస్తు సమచారం సేకరించి అక్రమ రవాణా కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాతుల మీద రోడ్లమీద వ్యాపార దుకాణాలు కబ్జా చేసి రోడ్లను ఇరుకుగా తయారుచేసిన వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుని నగరంలో ట్రాఫిక్ సమస్యను వీలైనంత మేరకు తగ్గించాలని ట్రాఫిక్ & లా అండ్ ఆర్డర్ పోలీసులను ఆదేశించారు. నగరంలో రోజుకు ఒక కూడలి వద్ద స్పెషల్ పార్టీ సిబ్బంది సహకారంతో ఆకస్మిక వాహన తనిఖీలను నిర్వహించి త్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, స్నేక్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి కేసుల నమోదును చేసి రోడ్డు ప్రమాదాలను నివారించాలని అధికారులను ఆదేశించారు. తిరుమల ఘాట్ రోడ్ గురించి సరైన అవగాహన, ఘాట్ ఫిట్నెస్ లేనటువంటి ఇతర రాష్ట్రాలకు చెందిన తుఫాన్, టెంపో ట్రావెలర్ వంటి వాహనాలను తిరుమలకు అనుమతించడం వలన ఘాట్ రోడ్ నందు ఇటీవల కాలంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కావున ఇటువంటి వాహనాలను తిరుమలకు అనుమతించకుండా సప్తగిరి టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక కార్యాచరణ ద్వారా ముందుకు వెళ్లి, తిరుమల ఘాట్ రోడ్ నందు రోడ్డు ప్రమాదాలను నివారించాలని అధికారులకు ఆదేశించారు. గంజాయి మత్తులో ఉన్న వ్యక్తులు తమని తాము మర్చిపోయి, విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. కావున గంజాయి వినియోగం పై ప్రజలలో విస్తృతమైన అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, గంజాయి వ్యవహారానికి సంబంధించిన వ్యక్తులపై కఠినమైన క్రిమినల్ కేసులను నమోదు చేస్తూ మెరుపు దాడులను, ఆకస్మికతనిఖీలను నిర్వహిస్తూ, గంజాయి అక్రమ రవాణా, సరఫరా, వినియోగం జరగకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడం వల్ల యువత యొక్క విలువైన  జీవితాలను సన్మార్గంలో ప్రయాణించే విధంగా చేయడమే కాక తదుపరి నేరం చేయాలనే ఉద్దేశాన్ని ఆదిలోనే తుంచి వేయడం ద్వారా ప్రజలకు మంచి జీవితాన్ని ఇచ్చిన వారు అవుతామని వివరించారు.విజిబుల్ పోలీసింగ్ ప్రక్రియను సమర్థవంతంగా జన సమూహాలు ఉన్న ప్రాంతాలలో అమలు చేసి పిక్ పాకెట్, మొబైల్ దొంగతనాలకు పాల్పడే వారిపై దయ దాక్షిన్యాలను  ప్రదర్శించకుండా చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలి. సాంప్రదాయ పోలీసింగ్ లో భాగమైన వేగు వ్యవస్థను బలోపేతం చేసి ఓపెన్ బూజింగ్, NDPS కేసులకు సంబంధించిన వారిపై దృష్టి పెట్టి, నగరంలో గంజాయి ఆనవాళ్లు, అవశేషాలు కానీ లేకుండా సమూలంగా తుడిచి పెట్టాలన్నారు. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ మీద యువతీ యువకులు సెల్ఫీలు తీసుకోవడం... వారి ద్విచక్ర వాహనాలను రోడ్డు పై అడ్డంగా పార్కింగ్ చేయడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ వారు సమిష్టిగా కార్యాచరణ మేరకు నోటీస్ బోర్డులను ఏర్పాటు చేయాలి. అతిక్రమించిన వారిపై అపరాధ రుసుములను వేయడం వలన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్  అంతరాయం లేకుండా చేసి, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించే అవకాశం ఉన్నదన్నారు.ఫిర్యాదుదారుల పట్ల పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా, హుందాగా మాట్లాడి, వారి సమస్యను విని ఫిర్యాదును స్వీకరించాలి. ఫిర్యాదుదారులతో పొగరుగా, దురుసుగా ప్రవర్తించరాదు. మీకు కేటాయించిన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని, మీ పద్ధతిని మార్చుకోకపోతే మీ పై శాఖా పరమైన చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు హెచ్చరించారు.
తిరుపతి నగరంలో శాంతి భద్రతలను కాపాడుతూ, నేర నియంత్రణ, నివారణ చేస్తూ  ప్రజలు జీవించటానికి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవ్వడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు అందించి, అభినందించారు.#

Monday, 19 June 2023

అనంత అళ్వార్ తోటలో తులసి మొక్కలను నాటిన ఆళ్వార్ వారసులు శ్రీమాన్ రంగాచార్యులు..

తిరుమల అనంతాళ్వార్ తోటలో శ్రీమాన్ టి.ఎ.పి రంగాచారి గారు తులసి మొక్కలను నాటారు.. అనంతాళ్వార్ వంశంలో 26వ తరం వారసులు శ్రీమాన్ టి.ఎ.పి. రంగాచారి గారు ప్రస్తుతం అనంతాళ్వార్ తోట సంరక్షకుల బాధ్యతలో స్వామివారికి ప్రతినిత్యం తొలిసారి చేసే పుష్పకాయంకర్యం కోసం.. పుష్పాలను, తులసి దళాలను ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు, శ్రీవారి సేవకుల చే తోట నుండి సేకరించి పంపుతున్నారు.
వీరితోపాటు పీవీ రామిరెడ్డి, రమణ ఇతర సేవకులు భక్తులు సైతం తోటను తీర్చిదిద్దటంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. 82 వత్సరంలో శ్రీమాన్ రంగాచార్యులు గారు ఎంతో ఉత్సాహంగా శ్రీనివాసులు సేవకు తులసి మొక్కలను నాటడం చూపరులను ఆకట్టుకుంది. అదే ఉత్సాహంతో ఆయన భక్తులకు అనంతాళ్వార్ ఏడుకొండలవాని పుష్ప కైంకర్యానికై ఏడుకొండలు ఎక్కి ఎంతో శ్రమించి కొండలను పిండి చేసి తోటగా మార్చిన కథను భక్తుల కళ్ళకు కట్టారు తిరుమలలో అణువణువు భక్తి పారవస్యమే ప్రతిరేణువు ప్రతిపక్షి ప్రతి జంతువు, ప్రతి భక్తుడు ప్రతి సేవకుడు సైతం ఆ స్వామి కరుణ కోసం కటాక్షం కోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూసే వారే... అటువంటి తిరుమల సన్నిధిలో పుష్పకాయంకర్యానికై ఏర్పాటుచేసిన తోటలో తులసి వనం నిర్వహణ ఎంతో పుణ్యప్రదం ఇట్టి కార్యక్రమంలో పాల్గొనే ప్రతి భక్తుడు సేవకుడు ధన్యులే...(అనంతాళ్వార్ 26వ వారసులు శ్రీమాన్ టి ఏ పి రంగాచారి గారితో అనంతాళ్వాార్ దివ్యచరితము పుస్తక రచయిత పివి రామిరెడ్డి గారుుు) 

అళ్వార్ గురించిన వృత్తాంతం.. (సోషల్ మీడియా పేజీ నుండి)

శ్రీవారి కైంకర్యం లో తరించిన భక్తాగ్రేశ్వరుడు శ్రీ అనంతాళ్వార్. శ్రీ అనంతాళ్వార్ తిరుమల కొండ మీద  శ్రీవారి ఆలయానికి వెనక వైపు నివసించారు. ఈయన స్వామి వారికి రోజూ పూలమాలాలు సమర్పించేవారు. తిరుమల లో పూల తోటవేసి, ఆ తోట లోని పూలను మాలలుగా అల్లి రోజూ స్వామి వారికి సమర్పించేవారు. అనంతాళ్వారులు  తిరుమలలో పూల తోటకి నీళ్ళ కోసం బావి తవ్వటానికి భార్యని సహకారం తీసుకొన్నారు. అనంతాళ్వారులు గునపంతో బావి తవ్వుతూ మట్టిని తట్టలో పోస్తే, ఆయన భార్య ఆ మట్టితట్టని తీసుకొని వెళ్ళి దూరంగా పోసి వచ్చేది. అనంతాళ్వారులు కు సహాయం చెయ్యటానికి శ్రీనివాసుడు బాలుని రూపంలో వచ్చి, అనంతాళ్వార్ ని నేను మీకు సహాయం చేస్తాను అంటే అనంతాళ్వారులు  అంగీకరించలేదు. బాలుడు అనంతాళ్వారులు భార్య కి సహాయం చేస్తాను అంటే ఆమె అంగీకరిస్తుంది. ఆమె మట్టితట్టని తీసుకొనివెళ్ళి ఇస్తే, బాలుడు దూరంగా పోసివచ్చేవాడు. భార్య తొందర తొందరగా మట్టిని తట్టలు తీసుకొనివెళ్ళటానికి రావటం గ్రహించిన అనంతాళ్వారులు, భార్య  అడిగితే ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది.
 
 
ఆగ్రహించిన అనంతాళ్వారులు కోపంతో, చేతిలో ఉన్న గునపాన్ని బాలుని మీదకి విసురుతాడు. అది వెళ్ళి బాలుని గడ్డానికి  తగులుతుంది. ఆ బాలుడు అక్కడ నుంచి వెళ్ళిపోతే, అనంతాళ్వారులు మళ్ళీ బావి తవ్వే పనిలో నిమగ్నం అవుతారు. సాయంత్రం చక్కగా పూల మాలలు అల్లి బుట్టలో పెట్టుకొని శ్రీవారి ఆలయానికి వెళ్తాడు అనంతాళ్వార్. అక్కడ శ్రీనివాసుని గడ్డానికి దెబ్బ తగిలి రక్తం రావటం  చూసిని అనంతాళ్వారులు, అయ్యో ...  నేను గునపం విసిరింది ఎవరిమీదకో కాదు, సాక్షాత్తు శ్రీనివాసుడే బావి తవ్వటంలో సహాయం చెయ్యటానికి వచ్చాడని గ్రహిస్తాడు. స్వామివారి గడ్డం పై పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటినుంచి  స్వామివారి గడ్డం పై రోజూ  పచ్చకర్పూరం అద్దుతారు. ఇప్పటికీ మనం అనంతాళ్వారులు స్వామివారి మీద విసిరిన గునపాన్ని మహద్వారం దాటిన తర్వాత కుడి వైపు గోడకు వెళ్ళడుతూ ఉండటం చూడవచ్చు. శ్రీ అనంతాళ్వార్ బృందావనం శ్రీవారి  ఆలయం వెనకవైపు ఉంటుంది. మనం  అనంతాళ్వార్ బృందావనం దర్శించవచ్చు. శ్రీవారి  ఉత్సవ మూర్తి అయిన మలయప్పస్వామి సంవత్సరానికి ఒకసారి  శ్రీ అనంతాళ్వార్ బృందావనం కి వెళ్తారు..(జులై 22 అ అనంతాళ్వార్ పరమపదోత్సవం.. ప్రత్యేకంగా నిర్వహించనున్నారు)
 

Thursday, 15 June 2023

ఈ-ఆఫీస్ ద్వారా ఫైళ్లు నడపండి: కలెక్టర్ వి.పి. గౌతమ్


ఖమ్మం, జూన్ 15:  ఫైళ్ల నిర్వహణ ఈ-ఆఫీస్ ద్వారా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టర్ ఐడిఓసి లోని వివిధ కార్యాలయాలు పరిశీలించి, సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, ఆరోగ్యశ్రీ, రోడ్లు భవనాల శాఖ, వ్యవసాయ శాఖ, కలెక్టరేట్, ముఖ్య ప్రణాళిక అధికారి, జిల్లా ఉపాధికల్పనాధికారి, జిల్లా టూరిజం అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, సెర్ప్ కార్యాలయాలను ఆయన తనిఖీ చేశారు. కార్యాలయ సిబ్బంది వివరాలు, ఎవరు ఏ ఏ విభాగాల విధులు నిర్వర్తించేది అడిగి తెలుసుకున్నారు. పాత ఫైళ్లను నిబంధనల మేరకు ఖండనము చేయాలని, అవసరం లేని ఫైళ్లను తొలగించాలని అన్నారు. పాత ఫైళ్ళతో డస్ట్ ఏర్పడి, ఆరోగ్య సమస్యలు వస్తాయని, అనవసరంగా భద్రపర్చడంతో నిల్వ సమస్యలు వస్తాయని అన్నారు. రన్నింగ్ ఫైళ్లు, నిబంధనల మేరకు భద్రపర్చాల్సిన ఫైళ్లు మాత్రమే ఉండాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్ విభాగం, ఎన్నికల విభాగాల్లో ఇంటర్నెట్, పవర్ పాయింట్ల సమస్యలు పరిష్కరించినట్లు, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.  కార్యాలయం లోపల మంచి వాతావరణం ఉండాలని, పరిశుభ్రతను పాటించాలని ఆయన తెలిపారు. 
 కలెక్టర్ తనిఖీ సందర్భంగా శిక్షణా సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయ నిర్మల, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాంబాబు, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Tuesday, 13 June 2023

Radhyatra on 19th June..

👉*🚩🛕Sri Jagannath Rath Yatra 2023 - Rituals*

*🌟20th June 2023, Tuesday - Gundicha Yatra or Sri Jagannath Rath Yatra🌟*

*🚩🛕Sri Jagannath Dham, Puri, Odisha*

*🌹Day 1 - 19th June 2023, Monday🌹*

*📍Ritual 1 - Agyana Mala Bije*
*The Sewaks who all will be accompanying the Rathas to and fro will go inside Niladri Mandap the Sanctum Sanctorum of Sri Jagannath Dham and will get Agyana or Spiritual Knowledge from Mahaprabhu Sri Jagannath*

*📍Ritual 2 - Ubha Jatra or Yatra*

*The three Rathas will be brought in front of Singha Dwar and an small Puja will be performed for each Rathas*

*🌺Day 2 - Rath Yatra Day - 20th June 2023, Tuesday 🌺*

*The Rituals begin at 07:00 a.m. - Ratha Pahandi or bringing the three deities to the Rathas from Niladri Mandap the Sanctum Sanctorum of Sri Jagannath Dham - Pahandi means step by step movement, there is a procedure followed in Sri Jagannath Dham on bringing the deities, below is the details 👇*
*1. Sudarshan Chakra or Sudarshana Murthy comes out first*

*2. Dau Balabhadra steps out second*

*3. Maa Subhadra Devi steps out third*

*4. Raja Raman and Madana Mohan, the gods of Mahaprabhu steps out fourth*

*5. Mahaprabhu Sri Jagannath steps out last*

*The Ratha Pahandi duration is 2 hours 15 minutes, starts at 7 a.m. and ends at 09:15 a.m.*

*Once the three deities have boarded their respective Rathas a small Puja takes place before the arrival of the King of Puri Shri Divya Singha Deba IV "

*The King of Puri Shri Divya Singha Deba IV arrives shortly after the initial Puja rituals get over, he comes to perform Chhera Pahanra or cleaning and washing the three Rathas, the King Sweeps and washes the three Rathas with aromatic herbal water, after which he performs Puja at the three Rathas which includes Aarthi before the commencement of Gundicha Yatra or Sri Jagannath Rath Yatra*

*Only after the King of Puri shows the Green Flag, the Rath starts moving towards Gundicha Temple on the Bada Danda or Grand Road, the Rath movement has a procedure the details are below 👇*

*a. First Dau Balabhadra Rath TALADHWAJA moves.*

*b. Second after few minutes Maa Subhadra Devi Rath DEVDALANA or DARPADALANA moves.*

*c. Third after Dau Balabhadra and Maa Subhadra Devi Rath has moved some distance Mahaprabhu Sri Jagannath Rath NANDIGHOSH moves.*

*All the three Rathas reach Gundicha Temple in the evening, a 3 km distance in close to 7 hours*

*On reaching Gundicha Temple, welcoming ceremony takes place, new vastra or dress offered to the three deities, Puja and Aarthi are performed.*

*In the night the three deities give the devotees Shayanrathri Darshan on the Rathas*

*💐Day 3 - 21st June 2023, Wednesday - Gundicha Temple, Puri, Odisha*

*Mangala Abhishek, Shringaar (new vastra) and Aarthi performed to to the three deities on their respective Rathas - same is done during the Maha Bhog Aarthi Shringaar Darshan and just before the three deities step inside Gundicha Temple in the evening*

*Towards evening the three deities are brought down from their respective Rathas and taken inside Adapa Mandap of Gundicha Temple one by one, this Ritual is called Adapa Mandap Bije*

*The procedure of entering Gundicha Temple - Adapa Mandap 👇*

*1. Sudarshan Chakra or Sudarshana Murthy goes in first*

*2. Dau Balabhadra steps inside second*

*3. Maa Subhadra Devi steps inside third*

*4. Raja Raman and Madana Mohan, the gods of Mahaprabhu steps inside fourth*

*5. Mahaprabhu Sri Jagannath steps inside last*

*I have given you the 1st three days Rituals on 10th June 2023, Saturday, the other days Rituals I will be giving you on 11th June 2023, Sunday*

*I have not copy pasted from any source, fully drafted by me whatever I have learned about Gundicha Yatra or Sri Jagannath Rath Yatra in 2022*

*🙏🌹🌺💐🙏 Jai Jagannath 🙏

Tuesday, 6 June 2023

జమ్మూలో శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం





      జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం నిర్వహించారు.
 వైదిక కార్యక్రమాల్లో భాగంగా బింబశుద్ధి కోసం పంచగవ్యాధివాసం చేపట్టారు. ముడిశిలను శిల్పులు చాకచక్యంగా స్వామి, అమ్మవార్ల విగ్రహాలుగా మలుస్తారు. ఈ క్రమంలో సుత్తి, ఉలి దెబ్బలకు వేదనకు గురయ్యే విగ్రహాలకు ఉపశమనం కల్పించడం కోసం పంచగవ్యాలైన పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రంతో అభిషేకం చేశారు. ముందుగా అక్షిణ్మోచనం, నవకలశస్నపనం నిర్వహించారు. సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపడతారు.
Satya News..

అప్పులు యాగంటి/తిరుపతి 
సూర్యప్రభ వాహనంపై బద్రి నారాయణుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం ఉదయం స్వామివారు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

Sunday, 4 June 2023

వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం-. స్వర్ణ కవచంలో మెరిసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు


 తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం ఆదివారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో 
పునః దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంట  ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీమలయప్ప స్వామివారికి, దేవేరులకు స్నపనతిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Friday, 2 June 2023

చేతిలో గీత... సీక్రెట్ ఆఫ్ క్రికెట్ లెజెండ్...

మహేంద్ర సింగ్ ధోనీ విత్ భగవద్గీత
విఖ్యాత క్రికెటర్ MS ధోనీ ఎంతటి కష్టతరమైన ఆటలో కూడా "మిస్టర్ కూల్" గా సైలెంట్ ఉంటూ చివరికి విజయం సాధించే దాకా "స్థితప్రజ్ఞుడిగా" ఉండటంలో, అతని మానసిక బలం, విజయంలో ప్రేరణలో నిలిచింది భగవద్గీత..
మొన్న IPL ఫైనల్ అయ్యాక ధోని గురువారం రోజున సర్జరీకి ముందు ముంబైలో తన కారులో భగవద్గీతను అందరికి చూపుతూ కనిపించాడు. ఇది భగవద్గీత పట్ల ఆయనకున్న విశ్వాసం. 
ధోనికి స్కూల్ రోజుల్లో నుంచి భగవద్గీత చదివే అలవాటు ఉందని, రోజు అధ్యాయల వారిగా రోజు కొన్ని శ్లోకాలు చదువుతానని, ఇంట్లో ఉన్నపుడు తనతో పాటు భార్య సాక్షి, కుమార్తె జివా కి కూడా భగవద్గీత ను చదివి వినిపిస్తానని ధోని తెలిపాడు.
నేటి ఈ నవీన సాంకేతిక డిజిటల్ యుగంలో ప్రపంచ మేటి ఆటగాడు, ప్రఖ్యాత క్రికెట్ టీమ్ లకు లీడర్ గా ఉన్న ధోని భగవద్గీతను అనుసరించండం అనేది బాగా గమనించాల్సిన విషయం.
అందుకే మీరు కూడా మీ పిల్లలకు నేర్పించండి.
వారికి భగవద్గీత చదివేలా ప్రోత్సహించండి. ప్రతిరోజూ ఒక అధ్యాయంలో 5 శ్లోకాలు, వాటి తాత్పర్యంతో పాటు వివరణలు అర్ధమయ్యేలా చదివించండి. వారితోపాటు మీరు చదువుతూ అందులోని కొన్ని ప్రశ్నలు అడగండి. వారికి మన ధర్మం గురించి తెలియజేయండి..
ప్రస్తుత యువత భగవద్గీత విలువని, గీతాసారాన్ని అర్ధం చేసుకుంటే జీవిన విధానంలో ఉత్తమ మార్పు, చేపట్టిన కార్యాలల్లో, మానవ జీవిత సార్థకతలో విజయం సులభంగా సాధ్య పడుతుంది
(సోషల్ మీడియా పేజీ నుండి)