అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ నందు జరిగిన స్మారక సభలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి చేసిన త్యాగం ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నాయన్నారు.
దశాబ్ది వేడుకల్లో నేడు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళులర్పించేందుకు హైదరాబాద్ నడి బొడ్డున హుస్సేన్ సాగరతీరంలో నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నంను ముఖ్యమంత్రి కేసీఅర్ గారు ప్రారంభోత్సవం చేస్తున్నారని అన్నారు.
ఆత్మ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో పాలన పగ్గాలు అందుకున్న ఉద్యమనేత కేసీఆర్ సర్కారు అమరుల కుటుంబాలకు అడుగడుగునా అండగా నిలుస్తూ ఆసరానిస్తున్నదన్నారు.
రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలను రాష్ట్రం ఏర్పాటైన రెండేండ్లలోనే అక్కున చేర్చుకుందని, అమరుల కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయగా.. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించిన విషయం గుర్తు చేశారు.
2016 జూన్ 2న రాష్ట్రం రెండో అవతరణ రోజునే దీన్ని పూర్తి చేసిందని, అమరుల కుటుంబ సభ్యుల్లో కొందరికి చదువు, వయసు వంటి నిబంధనల్లో అనేక సడలింపులు ఇచ్చి ఉద్యోగాలను కల్పించిందన్నారు.
ఇదే సమయంలో రాష్ట్ర సాధన కోసం సాగిన పోరులో అసువులు బాసిన అమరులకు ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తు.. అమరుల ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపేలా సాగుతున్న పాలనపై అమరుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు..
నీళ్లు, నిధులు, నియామకాలతో కూడిన ఉద్యమ ట్యాగ్‌లైన్‌ను పరిపూర్ణం చేస్తూ సాగుతుండడంపై నేడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారుని, రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకోవడం గొప్ప విషయమన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజు గురువారం అమరవీరుల దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో, వాడవాడలా అమరులకు ఘనంగా నివాళులర్పించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుందన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ గారు ప్రవేశపెట్టిన "అమరుల సంస్మరణ" తీర్మానాన్ని కార్పొరేటర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు, ఉద్యమకారులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
No comments:
Post a Comment