అన్నమయ్య జిల్లా: తిరుమల తిరుపతి పవిత్రతకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అన్నారు నెలవారి సమీక్షలో భాగంగా ఆయన అధికారులతో శాంతిభద్రతల పై సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వారిని ఉపేక్షించవద్దని ఎటువంటి చర్యల కైనా వెనకాడ వద్దని ఆయన అధికారులకు ఆదేశించారు.
తిరుమల పవిత్ర క్షేత్రం ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా నివాసముంటున్న వ్యక్తులపై కఠిన చర్యలు.. అటువంటి వారికి ఇళ్లను అద్దెకిచ్చిన యజమానులపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.తిరుమలకు వచ్చే భక్తులు ఫేక్ వెబ్ సైట్స్ నుండి ఫేక్ దర్శన టోకన్లను పొంది మోసపోకండి - శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి చేశారు.సాంప్రదాయ పోలీసింగ్ అమలులో భాగమైన వేగు వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం..ఆస్తి నేరాల నియంత్రణకు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు.
చేశామన్నారు. LHMS APP సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు మెరుగైన అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. NDPS కేసుల నివారణకు కఠినంగా వ్యవహరించి, గాంజాను అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా చేసుకుని కేసుల్లో అరెస్టు అయ్యి, బెయిల్ పై వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పొరుగు రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు అక్రమ మద్యాన్ని నగరానికి తీసుకువచ్చి వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు, అవసరమైతే PD ACT కేసు నమోదు చేయాలన్నారు. సైబర్ క్రైమ్ నేరాల పట్ల ప్రత్యేక చొరవ చూపండి. నేరగాళ్ల ఉచ్చులో ప్రజలు పడకుండా వారికి విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు.జిల్లా ఎస్పి శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపిఎస్., జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు అదనపు ఎస్పీలు పరిపాలన శ్రీ వెంకటరావు గారు, శాంతి భద్రత శ్రీ కులశేఖర్, నేర విభాగం శ్రీమతి విమల కుమారి గారు, తిరుమల శ్రీ ముని రామయ్య వారితో తిరుపతి, తిరుమల సబ్ డివిజన్ల డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో మంగళవారం నాడు తిరుపతి పోలీస్ అతిథి గృహం సమావేశ మందిరం నందు నెలవారి నేరసమీక్షా సమావేశమును నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ పిక్ పాకెట్, మొబైల్ దొంగతనాలకు పాల్పడే నేరస్తులపై చిన్న/పెద్ద, ఆడ/మగ అనే భేదం లేకుండా అందరిపై కఠినంగా వ్యవహరించి చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలను తీసుకున్నప్పుడే, తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో భక్తుల ధన,మాన,ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించిన వాళ్లమవుతామన్నారు. తిరుమల పుణ్యక్షేత్రం నందు భక్తుల ముసుగులో కొంతమంది నేరస్తులు తలదాచుకుంటున్నారనే సమాచారం మేరకు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి భక్తుల ముసుగులో తలదాచుకుంటున్న నేరస్తులను అదుపులోకి తీసుకొని విచారించడం వలన నేర నివారణ చేయడంతోపాటు, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుపతి పోలీసుల పై అపారమైన నమ్మకం మరియు మర్యాద పెరిగి, తిరుపతి జిల్లా పోలీసుల ఖ్యాతి దశదిశలా వ్యాపిస్తుందన్నారు.
తిరుపతిలోని బాలాజీ లింక్ బస్టాండ్, రుయా ఆసుపత్రి, గోవిందరాజు స్వామి సత్రాలు, సెంట్రల్ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ వంటి భక్తుల రద్దీ ప్రదేశాలలో నేరస్తులు బిచ్చగాళ్ళ వేషంలో ఉంటూ నగరంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక సమాచారం... ఈ ప్రాంతాల్లో అక్రమంగా నివాసముంటున్న వారు తక్షణం తిరుపతి నగరాన్ని వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించారు.
తిరుమలలో వృద్ధులను, మహిళలను కొంతమంది కావాలనే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ సంఘటనలు చాలా బాధాకరం... ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.
ధీర్గకాలికంగా పెండింగ్ లో ఉన్న గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, డెకాయిటి, రాబరీ, ప్రాపర్టీ, వాహనాలు దొంగతనం, మిస్సింగ్ కేసులు, చీటింగ్ కేసులు, సైబర్ నేరాలు మరియు ఇతర కేసులను సమీక్షించారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులు, నమోదైన కేసుల్లో నేరస్తుల అరెస్టు, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీసి, కేసులను చేదించడానికి & వాటి పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు మరియు మెళకువలను అధికారులకు తెలుపుతూ దిశా నిర్దేశాలు చేశారు.SHOలు తమ పరిధిలో నివాసమున్న రౌడీ షీటర్లను, అనుమానితులను, రాజకీయ/సామాజిక ట్రబుల్ మాంగర్స్, అసాంఘిక శక్తుల యొక్క కదలికలపై నిరంతర నిఘా ఉంచి తరచుగా కౌన్సిలింగ్ ఇస్తూ, శాంతి భద్రతల పరిరక్షిస్తూ, నేర నియంత్రణ కొరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. VPO/WPO వ్యవస్థను బలోపేతం చేసి మీ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో మరియు నాన్ బెయిలబుల్ వారంట్స్ (N.B.W) ను జారీ చేయడంలో చిత్త శుద్ధితో పనిచేయాలని, అక్రమ రవాణాపై ప్రతేక బృందాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, తద్వారా ముందస్తు సమచారం సేకరించి అక్రమ రవాణా కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాతుల మీద రోడ్లమీద వ్యాపార దుకాణాలు కబ్జా చేసి రోడ్లను ఇరుకుగా తయారుచేసిన వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుని నగరంలో ట్రాఫిక్ సమస్యను వీలైనంత మేరకు తగ్గించాలని ట్రాఫిక్ & లా అండ్ ఆర్డర్ పోలీసులను ఆదేశించారు. నగరంలో రోజుకు ఒక కూడలి వద్ద స్పెషల్ పార్టీ సిబ్బంది సహకారంతో ఆకస్మిక వాహన తనిఖీలను నిర్వహించి త్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, స్నేక్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి కేసుల నమోదును చేసి రోడ్డు ప్రమాదాలను నివారించాలని అధికారులను ఆదేశించారు. తిరుమల ఘాట్ రోడ్ గురించి సరైన అవగాహన, ఘాట్ ఫిట్నెస్ లేనటువంటి ఇతర రాష్ట్రాలకు చెందిన తుఫాన్, టెంపో ట్రావెలర్ వంటి వాహనాలను తిరుమలకు అనుమతించడం వలన ఘాట్ రోడ్ నందు ఇటీవల కాలంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కావున ఇటువంటి వాహనాలను తిరుమలకు అనుమతించకుండా సప్తగిరి టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక కార్యాచరణ ద్వారా ముందుకు వెళ్లి, తిరుమల ఘాట్ రోడ్ నందు రోడ్డు ప్రమాదాలను నివారించాలని అధికారులకు ఆదేశించారు. గంజాయి మత్తులో ఉన్న వ్యక్తులు తమని తాము మర్చిపోయి, విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. కావున గంజాయి వినియోగం పై ప్రజలలో విస్తృతమైన అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, గంజాయి వ్యవహారానికి సంబంధించిన వ్యక్తులపై కఠినమైన క్రిమినల్ కేసులను నమోదు చేస్తూ మెరుపు దాడులను, ఆకస్మికతనిఖీలను నిర్వహిస్తూ, గంజాయి అక్రమ రవాణా, సరఫరా, వినియోగం జరగకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడం వల్ల యువత యొక్క విలువైన జీవితాలను సన్మార్గంలో ప్రయాణించే విధంగా చేయడమే కాక తదుపరి నేరం చేయాలనే ఉద్దేశాన్ని ఆదిలోనే తుంచి వేయడం ద్వారా ప్రజలకు మంచి జీవితాన్ని ఇచ్చిన వారు అవుతామని వివరించారు.విజిబుల్ పోలీసింగ్ ప్రక్రియను సమర్థవంతంగా జన సమూహాలు ఉన్న ప్రాంతాలలో అమలు చేసి పిక్ పాకెట్, మొబైల్ దొంగతనాలకు పాల్పడే వారిపై దయ దాక్షిన్యాలను ప్రదర్శించకుండా చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలి. సాంప్రదాయ పోలీసింగ్ లో భాగమైన వేగు వ్యవస్థను బలోపేతం చేసి ఓపెన్ బూజింగ్, NDPS కేసులకు సంబంధించిన వారిపై దృష్టి పెట్టి, నగరంలో గంజాయి ఆనవాళ్లు, అవశేషాలు కానీ లేకుండా సమూలంగా తుడిచి పెట్టాలన్నారు. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ మీద యువతీ యువకులు సెల్ఫీలు తీసుకోవడం... వారి ద్విచక్ర వాహనాలను రోడ్డు పై అడ్డంగా పార్కింగ్ చేయడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ వారు సమిష్టిగా కార్యాచరణ మేరకు నోటీస్ బోర్డులను ఏర్పాటు చేయాలి. అతిక్రమించిన వారిపై అపరాధ రుసుములను వేయడం వలన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేసి, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించే అవకాశం ఉన్నదన్నారు.ఫిర్యాదుదారుల పట్ల పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా, హుందాగా మాట్లాడి, వారి సమస్యను విని ఫిర్యాదును స్వీకరించాలి. ఫిర్యాదుదారులతో పొగరుగా, దురుసుగా ప్రవర్తించరాదు. మీకు కేటాయించిన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని, మీ పద్ధతిని మార్చుకోకపోతే మీ పై శాఖా పరమైన చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు హెచ్చరించారు.
తిరుపతి నగరంలో శాంతి భద్రతలను కాపాడుతూ, నేర నియంత్రణ, నివారణ చేస్తూ ప్రజలు జీవించటానికి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవ్వడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు అందించి, అభినందించారు.#
No comments:
Post a Comment