Monday, 19 June 2023

అనంత అళ్వార్ తోటలో తులసి మొక్కలను నాటిన ఆళ్వార్ వారసులు శ్రీమాన్ రంగాచార్యులు..

తిరుమల అనంతాళ్వార్ తోటలో శ్రీమాన్ టి.ఎ.పి రంగాచారి గారు తులసి మొక్కలను నాటారు.. అనంతాళ్వార్ వంశంలో 26వ తరం వారసులు శ్రీమాన్ టి.ఎ.పి. రంగాచారి గారు ప్రస్తుతం అనంతాళ్వార్ తోట సంరక్షకుల బాధ్యతలో స్వామివారికి ప్రతినిత్యం తొలిసారి చేసే పుష్పకాయంకర్యం కోసం.. పుష్పాలను, తులసి దళాలను ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు, శ్రీవారి సేవకుల చే తోట నుండి సేకరించి పంపుతున్నారు.
వీరితోపాటు పీవీ రామిరెడ్డి, రమణ ఇతర సేవకులు భక్తులు సైతం తోటను తీర్చిదిద్దటంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. 82 వత్సరంలో శ్రీమాన్ రంగాచార్యులు గారు ఎంతో ఉత్సాహంగా శ్రీనివాసులు సేవకు తులసి మొక్కలను నాటడం చూపరులను ఆకట్టుకుంది. అదే ఉత్సాహంతో ఆయన భక్తులకు అనంతాళ్వార్ ఏడుకొండలవాని పుష్ప కైంకర్యానికై ఏడుకొండలు ఎక్కి ఎంతో శ్రమించి కొండలను పిండి చేసి తోటగా మార్చిన కథను భక్తుల కళ్ళకు కట్టారు తిరుమలలో అణువణువు భక్తి పారవస్యమే ప్రతిరేణువు ప్రతిపక్షి ప్రతి జంతువు, ప్రతి భక్తుడు ప్రతి సేవకుడు సైతం ఆ స్వామి కరుణ కోసం కటాక్షం కోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూసే వారే... అటువంటి తిరుమల సన్నిధిలో పుష్పకాయంకర్యానికై ఏర్పాటుచేసిన తోటలో తులసి వనం నిర్వహణ ఎంతో పుణ్యప్రదం ఇట్టి కార్యక్రమంలో పాల్గొనే ప్రతి భక్తుడు సేవకుడు ధన్యులే...(అనంతాళ్వార్ 26వ వారసులు శ్రీమాన్ టి ఏ పి రంగాచారి గారితో అనంతాళ్వాార్ దివ్యచరితము పుస్తక రచయిత పివి రామిరెడ్డి గారుుు) 

అళ్వార్ గురించిన వృత్తాంతం.. (సోషల్ మీడియా పేజీ నుండి)

శ్రీవారి కైంకర్యం లో తరించిన భక్తాగ్రేశ్వరుడు శ్రీ అనంతాళ్వార్. శ్రీ అనంతాళ్వార్ తిరుమల కొండ మీద  శ్రీవారి ఆలయానికి వెనక వైపు నివసించారు. ఈయన స్వామి వారికి రోజూ పూలమాలాలు సమర్పించేవారు. తిరుమల లో పూల తోటవేసి, ఆ తోట లోని పూలను మాలలుగా అల్లి రోజూ స్వామి వారికి సమర్పించేవారు. అనంతాళ్వారులు  తిరుమలలో పూల తోటకి నీళ్ళ కోసం బావి తవ్వటానికి భార్యని సహకారం తీసుకొన్నారు. అనంతాళ్వారులు గునపంతో బావి తవ్వుతూ మట్టిని తట్టలో పోస్తే, ఆయన భార్య ఆ మట్టితట్టని తీసుకొని వెళ్ళి దూరంగా పోసి వచ్చేది. అనంతాళ్వారులు కు సహాయం చెయ్యటానికి శ్రీనివాసుడు బాలుని రూపంలో వచ్చి, అనంతాళ్వార్ ని నేను మీకు సహాయం చేస్తాను అంటే అనంతాళ్వారులు  అంగీకరించలేదు. బాలుడు అనంతాళ్వారులు భార్య కి సహాయం చేస్తాను అంటే ఆమె అంగీకరిస్తుంది. ఆమె మట్టితట్టని తీసుకొనివెళ్ళి ఇస్తే, బాలుడు దూరంగా పోసివచ్చేవాడు. భార్య తొందర తొందరగా మట్టిని తట్టలు తీసుకొనివెళ్ళటానికి రావటం గ్రహించిన అనంతాళ్వారులు, భార్య  అడిగితే ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది.
 
 
ఆగ్రహించిన అనంతాళ్వారులు కోపంతో, చేతిలో ఉన్న గునపాన్ని బాలుని మీదకి విసురుతాడు. అది వెళ్ళి బాలుని గడ్డానికి  తగులుతుంది. ఆ బాలుడు అక్కడ నుంచి వెళ్ళిపోతే, అనంతాళ్వారులు మళ్ళీ బావి తవ్వే పనిలో నిమగ్నం అవుతారు. సాయంత్రం చక్కగా పూల మాలలు అల్లి బుట్టలో పెట్టుకొని శ్రీవారి ఆలయానికి వెళ్తాడు అనంతాళ్వార్. అక్కడ శ్రీనివాసుని గడ్డానికి దెబ్బ తగిలి రక్తం రావటం  చూసిని అనంతాళ్వారులు, అయ్యో ...  నేను గునపం విసిరింది ఎవరిమీదకో కాదు, సాక్షాత్తు శ్రీనివాసుడే బావి తవ్వటంలో సహాయం చెయ్యటానికి వచ్చాడని గ్రహిస్తాడు. స్వామివారి గడ్డం పై పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటినుంచి  స్వామివారి గడ్డం పై రోజూ  పచ్చకర్పూరం అద్దుతారు. ఇప్పటికీ మనం అనంతాళ్వారులు స్వామివారి మీద విసిరిన గునపాన్ని మహద్వారం దాటిన తర్వాత కుడి వైపు గోడకు వెళ్ళడుతూ ఉండటం చూడవచ్చు. శ్రీ అనంతాళ్వార్ బృందావనం శ్రీవారి  ఆలయం వెనకవైపు ఉంటుంది. మనం  అనంతాళ్వార్ బృందావనం దర్శించవచ్చు. శ్రీవారి  ఉత్సవ మూర్తి అయిన మలయప్పస్వామి సంవత్సరానికి ఒకసారి  శ్రీ అనంతాళ్వార్ బృందావనం కి వెళ్తారు..(జులై 22 అ అనంతాళ్వార్ పరమపదోత్సవం.. ప్రత్యేకంగా నిర్వహించనున్నారు)
 

No comments:

Post a Comment