Thursday, 31 August 2023

బ్రహ్మోత్సవాలకు విచ్చేసే కళాబృందాలకు చక్కటి వసతులు కల్పించాలి : టీటీడీ జెఈవో సదా భార్గవి


రానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల్లో ప్రదర్శనలిచ్చేందుకు వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసే కళాబృందాలకు చక్కటి సౌకర్యాల కల్పనకు ముందస్తు చర్యలు చేపట్టాలని టీటీడీ జెఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు.  తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం అధికారులతో జెఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో ఉదయం, రాత్రి వాహన సేవల్లో పాల్గొనే కళాకారులకు వారికి తగ్గట్టుగా ధర్మగిరి వేద పాఠశాలలో బస ఏర్పాట్లు చేయాలన్నారు. వసతితో పాటు భోజనం, రవాణా సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కళాకారుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య విభాగం ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. కళాకారులకు సౌకర్యాల కల్పనకు టీటీడీలోని వివిధ ప్రాజెక్టులకు చెందిన సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. వీరు ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుంటారని చెప్పారు. అంతకుముందు కళాకారుల కోసం కేటాయించిన ధర్మగిరి వేద పాఠశాల, పీఏసీ-2లోని సౌకర్యాలను జెఈవో పరిశీలించారు. ధర్మగిరి వేద పాఠశాలలో భోజనం, వంటశాల, భద్రత తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

#ttd
#tirupati
#tirumala

Thursday, 24 August 2023

జస్ట్ ఫర్ లీవింగ్ సొసైటీ ఆధ్వర్యంలో దుపట్ల పంపిణీ

తెలంగాణ/మహబూబాబాద్ జిల్లా:  జస్ట్ ఫర్ లివింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గార్ల మండల కేంద్రంలోని బాలభవన్ అనాధ పిల్లలకు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గండి సీతారాం ఆయన సతీమణి గీతలు దుపట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ తన స్వార్ధం ఆలోచించుకుంటు మనుషులు మనుషులనే మోసాలు చేస్తున్న రోజుల్లో పరులకు సహాయం చేయాలన్న గొప్ప లక్ష్యంతో జస్ట్ ఫర్ లీవింగ్ అనే సంస్థను ఏర్పాటు చేసుకుని 8సంవత్సరాలుగా పేదలకు అనాధాలకు వృద్దులకు సేవలు చేస్తున్న ఆ సంస్థ వ్యవస్థాపకులు సీతారాం గీతాలను ఆయన అభినందించారు. సంస్థ ఉదేశాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదిగి వారు తనవంతు సేవాలందించాలని కోరారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగావత్ లక్ష్మణ్ నాయక్, గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్ పాల్గొని మాట్లాడుతూ ప్రజసేవాకు అంకితమైన గండి సీతారాం దంపతులు ఆదర్శనీయులని వారి స్వచ్ఛమైన మనస్సుతో 100వసంతాలు నింపుకోవాలని, వారి సేవలు నూరేళ్లు అందగించాలని కోరారు. సాక్షి టీవీ సీనియర్ జర్నలిస్ట్ గా సేవలందిస్తూనే ఓ స్వచ్చంద సేవలందించే గొప్ప గుణాన్ని మండల విలేకరులు టియుడబ్ల్యూజె ఐజేయు నాయకులు కొనియాడారు.అనంతరం ముఖ్య అతిథులకు, పాఠశాల యాజమాన్యానికి సీతారాం దంపతులు శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా ఉపాధ్యక్షులు షేక్ బుడాన్, సహాయ కార్యదర్శి రావూరి ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జవ్వాజి శ్రీనివాస్, శేరిపురం మాజీ సర్పంచ్ జిగట వెంకన్న, ఖమ్మం సీనియర్ జర్నలిస్ట్ మణికుమార్, పాఠశాల అధ్యాపకులు సిబ్బంది పక్కి దిలీప్, కిరణ్ కుమార్, శేఖర్, శ్రావణి, కవిత తదితరులు.

Friday, 18 August 2023

ఖమ్మం జిల్లా మద్దుల పల్లి సందర్శించిన జెఎన్టియు బృందం... కాలేజీ ఏర్పాటు స్థల పరిశీలన.....


ఖమ్మం, ఆగస్టు 18: జిల్లాలో జేఎన్టియూ హైదరాబాద్ చే ఏర్పాటుచేయు కళాశాల ప్రతిపాదిత స్థలం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి లో పరిశీలించిన అనంతరం జేఎన్టీయూ ప్రొఫెసర్ ఎం. మంజూర్ హుస్సేన్, ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి లు  శుక్రవారం నూతన కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలం, తాత్కాలికంగా కళాశాల నిర్వహణకు భవన విషయమై కలెక్టర్ తో వారు చర్చించారు.

Thursday, 17 August 2023

CULTURAL TEAMS FROM ALL STATES FOR SRIVARI BRAHMOTSAVAM- JEO (H&E)


Tirumala,17 August 2023: TTD JEO (Health and Education) Smt Sada Bhargavi on Thursday directed officials to invite cultural teams from all states to participate in the annual Srivari Brahmotsavam slated in September and October.

She conducted a review meeting on Thursday at the Sri Padmavati rest house on arrangements and preparations for the Srivari Karthika and Navaratri Brahmotsavam’s.

Speaking on the occasion she directed officials to organise attractive devotional, cultural, music programs with prominent artists to enthuse the devotees coming for the nine-day event.

She asked them to invite top cultural teams from different states to participate in the Vahana Sevas, Nada Niranjanam platform and Asthana Mandapam at Tirumala and Mahati Kalakshetra, Annamacharya Kalamandiram and Ramachandra Pushkarani at Tirupati.

The JEO instructed officials to make foolproof arrangements for transport, accommodation and food etc. by coordinating with all departments. Similarly, she directed the HDPP officials to make all necessary arrangements for inviting Backward class devotees from remote areas and provide Srivari Brahmotsavam Darshan as in previous years.

HDPP program officer Sri Rajagopal Rao, HDPP Secretary Dr Srinivasulu, Dasa Sahitya Project Special Officer Sri Anandathirthacharyulu, Annamacharya Project Director Dr Vibhishana Sharma and other officials were present.

Wednesday, 16 August 2023

సెప్టెంబర్ 1న అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలి


ఖమ్మం, ఆగస్టు 16: అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలి 2023-24 ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తునట్లు ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కల్నల్ కీట్స్ కె దాస్ తెలిపారు. ఈ పరీక్ష రెండు దశలలో జరుగుతుందని, మొదటి దశ లో రాత పరీక్ష, ఇందులో ఉత్తీర్ణులైన వారికీ రెండవ దశ లో శారీరక సామర్ధ్యం , వైద్య పరీక్షలు జరుగుతాయని తెలిపారు. రాత పరీక్ష ఇప్పటికే పూర్తి అయ్యిందని, 7397 మంది ఈ ఆన్లైన్ పరీక్ష లో ఎంపికైనారని, వీరికి శారీరక, వైద్య పరీక్షలు సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతుందని అన్నారు. బుధవారం డిపిఆర్సీ భవనంలో కల్నల్ కీట్స్ కె దాస్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ లతో సమావేశమై ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి అవసరమగు గ్రౌండ్, భద్రత, ఫైర్ ఫిట్టింగ్ , ట్రాన్స్పోర్ట్, త్రాగు నీరు, సిసి కెమెరాలు, తదితర మౌళిక వసతుల కల్పనకు, ఇతర లాజిస్టిక్స్ ను ఏర్పాటు చేయాలనీ కోరారు. అనంతరం కలెక్టర్, పోలీస్ కమీషనర్లతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి మాట్లాడుతూ, 1 సెప్టెంబర్ నుండి 7 సెప్టెంబర్ వరకు అగ్నివీర్ ర్యాలీ చేపడతామని అన్నారు. అభ్యర్థుల అడ్మిట్ కార్డు లోనే హాజరు తేదీ, సమయం పొందుపర్చామన్నారు. మాండేటరీ డాక్యుమెంట్లు లేనిది అనుమతించేది లేదని ఆయన అన్నారు. అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీలో 1.6 కిమీ. రన్నింగ్, ఫుల్ అప్స్, 8 ఫీట్ డిక్, జిగ్ జాగ్, ఎత్తు, బరువు, ఛాతీ, డాక్యుమెంట్లు, వైద్య పరీక్షలు ఉంటాయన్నారు. 
      ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, అగ్నివీర్ ర్యాలీ కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ 1 నుండి 7 వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుందని అన్నారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్స్ లో సూచించిన తేదీ, సమయానికి హాజరవ్వాలన్నారు. అడ్మిట్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, విద్యార్హతల సర్టిఫికెట్లు ఒరిజినల్ తో పాటు, 2 జిరాక్స్ కాపీలు, అఫిడవిట్, స్థానికత/నివాస, కమ్యూనిటీ/కుల, రిలీజియన్, క్యారెక్టర్, అన్ మ్యారీడ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పోలీస్ వేరిఫికేషన్, ట్రైబల్ ధృవీకరణలు మాండేటరీ అని, వీటిని తప్పనిసరిగా వెంట తేవాలన్నారు. ఎటువంటి పైరవీలకు తావులేదని, పూర్తి పారదర్శకంగా, మెరిట్, ఫిజికల్ స్టాండర్డ్ ప్రకారం రిక్రూట్మెంట్ జరుగుతుందని ఆయన తెలిపారు. మధ్యవర్తుల చేతిలో మోసపోవద్దని కలెక్టర్ అన్నారు. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా జిల్లా యంత్రాంగం నుండి రిక్రూట్మెంట్ ర్యాలికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
     ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ, అగ్నివీర్ ర్యాలీ రాష్ట్రంలో మొదటగా సూర్యాపేట లో జరగగా, రెండోసారి మన ఖమ్మం జిల్లాలో జరుగనున్నట్లు తెలిపారు. మన ప్రాంత యువతకు ఎక్కువగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. మాండేటరీ డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లారన్నారు. మధ్యవర్తులని నమ్మి మోసపోవద్దని, ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఈవెంట్లలో పాస్ చేయిస్తామని ప్రలోభపెడితే, వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని, ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మెరిటోరియస్ అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని పోలీస్ కమీషనర్ అన్నారు.
    ఈ సందర్భంగా ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి,  ఆర్మీ మేజర్ శీతల్ కుమార్, సబ్ మేజర్ శివాజిలాల్, లైజన్ అధికారి వివి. నాయుడు, ఎస్ఆర్ పుష్కర్, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, ఆర్ అండ్ బి ఇఇ శ్యామప్రసాద్, ఏసీపీలు గణేష్, ప్రసన్న కుమార్, సారంగపాణి, ఉప మునిసిపల్ కమీషనర్ మల్లీశ్వరి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి,మునిసిపల్ డిఇ రంగారావు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, అధికారులు తదితరులు ఉన్నారు.

Tuesday, 15 August 2023

జస్ట్ ఫర్ లీవింగ్ సొసైటీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ



మహబూబాబాద్ గార్ల.-ఆగస్టు15
జస్ట్ ఫర్ లివేగ్ అసోసియేషన్ వ్యస్థాపకులు గండి సీతారాం గౌడ్, గీత ల ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. సహాయం చేయగలగడం గొప్ప వరమని మానవులు వీలైన మేరకు సమయానికి తోటి సమాజానికి తోచిన సహాయం చేయాలని గీత కోరారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా ఉపాధ్యక్షులు షేక్ భుడాన్, జిల్లా సహాయకార్యదర్శి రావూరి ప్రశాంత్, గార్ల వైద్యాధికారులు రాజ్ కుమార్ జాధవ్,  నాయకులు కందునూరి శ్రీనివాస్, విద్యావంతుల వెదిక నాయకులు గిన్నారపు మురళి, కాంగ్రెస్ నాయకులు వెంకట్ లాల్, తాళ్లప్పల్లి కృష్ణ గౌడ్, శంషా బేగం తదితరులు పాల్గొన్నారు.

సమరయోధుని సతీమణికి గౌరవ సన్మానం...

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కెపల్లి గ్రామ వాసి... స్వాతంత్ర సమాయొదులు *శ్రీ పరాంకుశం కిషన్ రావు
వారి భార్య *శ్రీమతి లక్ష్మమ్మ గారిని 77స్వతంత్ర దినోత్సవం సందర్బంగా చందాగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బీజేపీ నాయకురాలు శ్రీమతి నవతా రెడ్డి ఘనంగా సన్మానించారు
పాత తరం సమర యోధులు చేసిన త్యాగాలవల్లనే నేడు మనం ఎంతో సంతోషం గా జీవితం గడుపుతున్న విషయం మరువరాదు అని నవతా రెడ్డి అన్నారు
తన డివిజన్ లో నివాసం ఉన్నా సమరయోధు రాలి భార్య ను సత్కారించడం ఎంతో సంతోషం గా ఉన్నది అన్నారు 
నవతా రెడ్డి గత కొంత కాలం గా ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఉపాధ్యాయు లును సన్మానం చేయడం మహిళా దినోత్సవం సందర్బంగా ఆయారంగాల్లోకృషి చేసిన వారిని గౌరవించే సంప్రదాయం కోన సాగిస్తున్నారు

ఈసందర్బంగా డివిజన్ లోని పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాలొగొన్నారు

శ్రీ చందరర్ రావు తొలి తరం తెలంగాణా ఉద్యమం పాలొగొన్నశ్రీ చకిలం భద్ర గిరి రామా రావు ఉపాధ్యాయు రాలు ఇందిర రమేష్ రావు సంధ్య యాదగిరి లక్ష్మి నర్సింహా రావు నారాయణ రావు విజయ దత్త రూపిణి సత్య వాణి
డివిజన్ లోని బీజేపీ ప్రముఖులు పాలొగొన్నారు

తన భర్త సేవలను గురించి ప్రభుత్వం అండ ఉన్నది అన్నారు
తనకు జరిగిన సన్మానం ఎంతో సంతోషం కలిగించి నది అన్నారు
నవతా రెడ్డి కి ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు🙏💐

రిజిస్ట్రార్ అడపా రవీంద్రబాబుకు ప్రశంసా పత్రం..

ఖమ్మం: ఖమ్మం సబ్ రిజిస్టర్ -1.. అడపా రవీంద్ర బాబు మంగళవారం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్... స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసా పత్రం అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు విధి నిర్వహణలో మెరుగైన సేవలు అందించే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏడాది ఆగస్టు 15 న .. రాష్ట్ర ప్రభుత్వం ప్రసంశ పత్రాలను అందజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా నేటి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పలువురు ఉద్యోగులకు సామాజిక సేవకులకు ప్రశంసా పత్రాలను అందజేశారు వీరిలో ఖమ్మం సబ్ రిజిస్టర్-1, అడప రవీంద్రబాబు నేడు  కలెక్టర్ వి పి గౌతం సమక్షంలో  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీదగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ప్రశంసా పత్రం అందుకోవడం పట్ల అడపా రవీంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు
సబ్ రిజిస్ట్రార్ రవీంద్రబాబు ప్రశంసా పత్రం అందుకోవడం పట్ల ఖమ్మం జిల్లా రిజిస్టార్ చిట్టి మళ్ల అశోక్, కార్యాలయం సిబ్బంది సిబ్బంది రవీంద్రబాబుకు అభినందనలు తెలిపారు...

Friday, 11 August 2023

వి.ఆర్.ఏ.ల విలీన జీవోల సస్పెండ్.. జీవోల జారీకి ముందున్న స్థితి కొనసాగించాలి.. తక్షణమే ఆదేశాలు పాటించాలని హైకోర్టు స్పష్టీకరణ..


హైదరాబాద్‌, ఆగస్టు 10 : వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జూనియర్‌ అసిస్టెంట్‌లుగా నియమించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వంలో వీఆర్‌ఏలను విలీనం చేసేందుకు ఇచ్చిన జీవోలు 81, 85లను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు గురువారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ జీవో 81 జారీ చేసిన జూలై 24కు ముందు ఉన్న స్థితిని యథాతథంగా కొనసాగించాలని ఆదేశించింది. తద్వారా ఇప్పటికే వివిధ శాఖల్లో చేరిన వీఆర్‌ఏల నియామక ఉత్తర్వులు చెల్లవని స్పష్టం చేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వుల ద్వారా వారి చేరికలను రివర్స్‌ చేసింది. ఈ వ్యవహారంలో దాఖలైన మూడు పిటిషన్లపై జస్టిస్‌ మాధవీదేవి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ కేసులో రెవెన్యూ మంత్రి హోదాలో సీఎం కేసీఆర్‌, కేంద్ర ఎన్నికల సంఘం ప్రతివాదులుగా ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. దీంతో వారిని ప్రతివాదుల జాబితాలో నుంచి తొలగించేందుకు పిటిషనర్లు అంగీకరించారు. సీసీఎల్‌ఏ నవీన్‌ మిత్తల్‌ను ప్రతివాదిగా తొలగించేందుకు పిటిషనర్లు అంగీకరించలేదు. దీంతో ఆయన వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉండాలా? లేదా? అన్న అంశంపై తామే నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది.
వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. ‘అసలు జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఉండాల్సిన అర్హతలు ఏమిటి..? వారి ఎంపిక ప్రక్రియ ఏమిటి? రెగ్యులర్‌ నోటిఫికేషన్‌ ఇస్తే ఉండాల్సిన అర్హతలు లేని వారిని తమ హోదా కంటే పెద్ద హోదా కలిగిన పోస్టులోకి ఎలా తీసుకుంటారు? జూనియర్‌ అసిస్టెంట్‌కు సమానస్థాయి కలిగిన వీఆర్వోలను ఆ పోస్టుల్లోకి ఎందుకు తీసుకోలేదు? వీఆర్‌ఏలు-వీఆర్వోలకు మధ్య ఎందుకు వివక్ష చూపుతున్నారు? పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్టానికి విరుద్ధంగా మీకు నచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తారా? రెవెన్యూ శాఖలో ఖాళీలు లేవని చెప్పారు. ఇప్పుడు 50 శాతం వీఆర్‌ఏలను రెవెన్యూ శాఖలోనే సర్దుబాటు చేస్తున్నారు. వీఆర్‌ఏల నుంచి డిమాండ్‌ ఉందని చెప్తున్నారు. మరి అదే వీఆర్‌ఏల్లో అన్యాయం జరుగుతున్న వారి సమస్యలను పట్టించుకోరా? డిమాండ్‌ చేయకుండా ఉన్న వారికి అన్యాయం చేస్తారా? విలీన ప్రక్రియకు ముందు అభ్యంతరాలు స్వీకరించారా? విధాన నిర్ణయం అయినంత మాత్రాన కసరత్తు లేకుండా విలీన ప్రక్రియ చేపడతారా?’ అని ప్రశ్నించింది. వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో సర్దుబాటు చేసే జీవోలు, ప్రొసీడింగ్స్‌ నిబంధనల ప్రకారం లేవని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన ధర్మాసనం వాటిని సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. జీవోలు జారీ చేయకముందు ఉన్న స్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆర్డర్‌ కాపీ కోసం చూడొద్దని, తక్షణం ప్రభుత్వానికి సమాచారం అందించాలని న్యాయవాదికి సూచించింది. వీఆర్‌ఏల సర్దుబాటు వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
 *ఇదీ పిటిషనర్ల వాదన* 
వీఆర్‌ఏలను ఎక్కువ హోదా కలిగిన జూనియర్‌ అసిస్టెంట్లుగా నియమించడం చెల్లదని, తమను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని పలువురు వీఆర్‌ఏలు మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీఆర్‌ఏల్లో 60 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు కలిగిన వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. ‘సాధారణ వీఆర్‌ఏలు మరణించే వరకు ఉద్యోగాల్లో ఉంటారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే నెపంతో పింఛను, గ్రాట్యుటీ లేకుండా.. ఎలాంటి ప్రయోజనాలు చెల్లించకుండా రిటైర్‌ అయ్యే పరిస్థితి కల్పిస్తున్నార’ని తెలిపారు. ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న ఆఫీస్‌ సబార్డినేట్లకు కూడా నష్టం కలుగుతోందన్నారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు పీవీ కృష్ణయ్య, శ్రీరాం పొలాలి వాదనలు వినిపించారు. ‘చట్ట ప్రకారం ఒక్క ప్రభుత్వ పోస్టు సృష్టించాలంటే పెద్ద ప్రక్రియ ఉంటుంది. కానీ రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద’ని పేర్కొన్నారు. 19వ ర్యాంకులో ఉన్న నవీన్‌ మిత్తల్‌ను రెవెన్యూ కార్యదర్శిగా, సీసీఎల్‌ఏగా నియమించడం చెల్లదని తెలిపారు. ‘పెద్ద పోస్టు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆయన నిబంధనలకు విరుద్ధంగా ప్రొసీడింగ్స్‌ జారీ చేశార’ని వాదించారు.
 *ఇదీ ప్రభుత్వ వాదన* 
ప్రభుత్వ న్యాయవాది రామారావు వాదనలు వినిపిస్తూ వీఆర్‌ఏలను రెవెన్యూ శాఖలో మాత్రమే సర్దుబాటు చేయడం లేదని, అన్ని శాఖల్లోకి పంపిస్తున్నారని చెప్పారు. ‘వీఆర్‌ఏల కోసం కొత్త పోస్టులు సృష్టించారు. ఇప్పటికే ప్రక్రియ దాదాపు పూర్తయింది. మెజారిటీ వీఆర్‌ఏలు ప్రభుత్వ ఉద్యోగులుగా చేరిపోయారు. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడం సమంజసం కాదు’ అని కోరారు. వీఆర్‌ఏల విలీనం కోసం ప్రభుత్వం సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టించిందని, దీనివల్ల ఎవరికీ నష్టం ఉండదని తెలిపారు. కొత్తగా సృష్టించిన పోస్టులకు సర్వీసు నిబంధనలు సవరించాల్సిన అసవరం ఉండదని పేర్కొన్నారు. వీఆర్‌ఏల పింఛను, గ్రాట్యుటీ వంటివి ఇతర ఉద్యోగులకు వర్తించినట్లే ఉంటాయని తెలిపారు.

Monday, 7 August 2023

ప్రజా ఉద్యమ వేగుచుక్క గద్దర్ కు టియూడబ్లూజే (ఐజేయూ) నివాళి...

ఖమ్మం : తుదిశ్వాస వరకు ప్రజా ఉద్యమాలలో పని చేసి సామాజిక చైతన్యానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన గళాన్ని, కలాన్ని సంధించిన ప్రజా ఉద్యమ వేగుచుక్క గద్దర్ అని టియుడబ్ల్యూజె (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ తెలిపారు. ప్రజా ఉద్యమాలు జరిగినంత కాలం ప్రశ్నించే గొంతుక ఉన్నంత కాలం నిత్యం గద్దర్ స్మరించబడతారని ఆయన తెలిపారు. ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ సంస్మరణ సభ సోమవారం టియుడబ్ల్యూజె (ఐజేయు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లోలో జరిగింది. ఐజెయు నగర అధ్యక్షులు పాపారావు అధ్యక్షతన జరిగిన సభలో రాంనారాయణ మాట్లాడుతూ యుక్త వయస్సులోనే తొలి దశ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాల్గొన్నారని జైలు జీవితాన్ని సైతం అనుభవించారన్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన ఉద్యోగాన్ని వదులుకుని సాయుధ పోరాట బాట పట్టారని విప్లవోద్యమంలో అనేక కష్ట, నష్టాలను ఎదుర్కొన్నారని రాంనారాయణ తెలిపారు. గద్దర్ పాటలు తూటాల్లా పేలేవని ప్రజల్లో చైతన్యం రగిలిస్తే పాలకుల్లో ఆందోళనలు కలిగించాయని రాంనారాయణ తెలిపారు. గద్దర్ పాట నిత్యం చైతన్య స్ఫూర్తి అని అట్టడుగు వర్గాల ప్రజా జీవితాన్ని తన పాటలతో, తన మాటలతో కళ్లకు కట్టినట్లు చూపించిన మహానీయుడన్నారు. గద్దర్ చరిత్ర ఈ తరాలకే కాదు భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తి నిచ్చేవిధంగా పాఠ్యాంశాలలో చేర్చాలని, గద్దర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని టియుడబ్ల్యూజె (ఐజెయు) డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు. గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును తన పాటలతో చూపించిన గద్దర్ అమరుడని ప్రజాపాట బతికి ఉన్నంత కాలం గద్దర్ ప్రజల గొంతుల్లో పాటై వినిపిస్తాడని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో సమాచార వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని కానీ ఈ మార్పులు రాక ముందే పాలకుల వైఫల్యాలను, ప్రజల ఇబ్బందులను తన ఆట, పాట ద్వారా మారుమూల పల్లెలకు సైతం చేరవేసిన అతిగొప్ప జర్నలిస్టు గద్దర్ అని ఆయన తెలిపారు. సభకు ముందు గద్దర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గద్దర్ మృతికి సంతాప సూచికగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ప్రెస్ క్లబ్ కార్యదర్శి కూరాకుల గోపి ఆహ్వానితులను వేదికపైకి ఆహ్వానించగా టియుడబ్ల్యూజె (ఐజెయు) ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వర రావు, మాటేటి వేణుగోపాల్, సర్వనేని వెంకట్రావు, ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, నలజాల వెంకట్రావు, ఎస్క మోహినుద్దీన్, వై.మాధవరావు, నామ పురుషోత్తం, కె. వెంకటేశ్వర్లు, సంతోష్, భరత్ తదితరులు ప్రసంగించగా ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు సామినేని కృష్ణ మురారి, గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్, వివిధ పత్రికలు ఛానెళ్ల బాధ్యులు సత్యనారాయణ, నాగేశ్వరరావు, ఏలూరి వేణుగోపాల్, బసవేశ్వరరావు, గడల నర్సింహారావు, మేడి రమేష్, కళ్యాణచక్రవర్తి, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. ఆర్అండ్ నుంచి ప్రెస్క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు.

Saturday, 5 August 2023

టిటిడి చైర్మన్ గా భూమన కరుణాకరరెడ్డి...


టిటిడి చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియమించారు.. మన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు 
ఈనెల 8వ తేదీతో ముగియనున్న వైవి సుబ్బారెడ్డి పదవి కాలం ముగియనుంది. తిరుపతి నగర అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్గా నియమించడం పట్ల ఆయన వైయస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు

గతంలోనూ 2006-2008 మధ్య వైయస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరుణాకర్ రెడ్డి  టీటీడీ చైర్మన్ గా పనిచేశారు.
కాగా 2019 లో టీటీడీ చైర్మన్ గా వై.వి. సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టగా ఈనెల 8 తో  పదవి కాలం పూర్తి కానుంది.

ప్రధానికి పోస్ట్ కార్డు ద్వారా కృతజ్ఞతలు...

ఢిల్లీ: ఢిల్లీ కల్కాజి ప్రాంతంలో నివసించే మురికివాడ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీకి పోస్ట్ కార్డులు ద్వారా తమ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మురికి వాడల నివారణ పథకం ద్వారా కల్కాజీ ప్రాంతవాసులు  ఆర్.సి.సి.గృహాలను నిర్మాణం చేసుకున్నారు.. విదేశీయాన మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్ కల్కాజి ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా ఆ ప్రాంత వాసులు ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ కార్డు అందజేశారు. వాటిని జయశంకర్ ప్రధానమంత్రి కి అందజేయడం జరిగింది పోస్ట్ కార్డుల ద్వారా కల్కాజి ప్రాంతవాసులు తనకు కృతజ్ఞతలు తెలపడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొంటూ వారి పోస్ట్ కార్డులను ఫీడ్ చేసి ఆనందం వ్యక్తం చేశారు.

Tuesday, 1 August 2023

కొల్హాపూర్ మహాలక్ష్మికి కేసీఆర్ ప్రత్యేక పూజలు..

ప్రఖ్యాత శక్తిపీఠం కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు
హైదరాబాదు నుండి ప్రత్యేక విమానంలో మరాష్ట్ర‌లోని కొల్హాపూర్‌ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రఖ్యాత మ‌హాలక్ష్మి మాతా (అంబాబాయి) దేవాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వహించారు. బిఆర్ఎస్ అధ్యక్షుని హోదాలో మహారాష్ట్ర పర్యటనలో ఆయన పలువురు మహారాష్ట్ర రాజకీయ నేతలతో భేటీ అయ్యారు.. అనంతరం మరాఠీ కవి రచయిత.. సామాజిక కార్యకర్త అన్నావ్ సాఠే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.. 
BRS President, CM Sri KCR offered special prayers at the Mahalaxmi Ambabai Temple at Kolhapur, Maharashtra.