Saturday, 5 August 2023
ప్రధానికి పోస్ట్ కార్డు ద్వారా కృతజ్ఞతలు...
ఢిల్లీ: ఢిల్లీ కల్కాజి ప్రాంతంలో నివసించే మురికివాడ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీకి పోస్ట్ కార్డులు ద్వారా తమ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మురికి వాడల నివారణ పథకం ద్వారా కల్కాజీ ప్రాంతవాసులు ఆర్.సి.సి.గృహాలను నిర్మాణం చేసుకున్నారు.. విదేశీయాన మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్ కల్కాజి ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా ఆ ప్రాంత వాసులు ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ కార్డు అందజేశారు. వాటిని జయశంకర్ ప్రధానమంత్రి కి అందజేయడం జరిగింది పోస్ట్ కార్డుల ద్వారా కల్కాజి ప్రాంతవాసులు తనకు కృతజ్ఞతలు తెలపడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొంటూ వారి పోస్ట్ కార్డులను ఫీడ్ చేసి ఆనందం వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment