Thursday, 31 August 2023

బ్రహ్మోత్సవాలకు విచ్చేసే కళాబృందాలకు చక్కటి వసతులు కల్పించాలి : టీటీడీ జెఈవో సదా భార్గవి


రానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల్లో ప్రదర్శనలిచ్చేందుకు వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసే కళాబృందాలకు చక్కటి సౌకర్యాల కల్పనకు ముందస్తు చర్యలు చేపట్టాలని టీటీడీ జెఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు.  తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం అధికారులతో జెఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో ఉదయం, రాత్రి వాహన సేవల్లో పాల్గొనే కళాకారులకు వారికి తగ్గట్టుగా ధర్మగిరి వేద పాఠశాలలో బస ఏర్పాట్లు చేయాలన్నారు. వసతితో పాటు భోజనం, రవాణా సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కళాకారుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య విభాగం ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. కళాకారులకు సౌకర్యాల కల్పనకు టీటీడీలోని వివిధ ప్రాజెక్టులకు చెందిన సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. వీరు ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుంటారని చెప్పారు. అంతకుముందు కళాకారుల కోసం కేటాయించిన ధర్మగిరి వేద పాఠశాల, పీఏసీ-2లోని సౌకర్యాలను జెఈవో పరిశీలించారు. ధర్మగిరి వేద పాఠశాలలో భోజనం, వంటశాల, భద్రత తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

#ttd
#tirupati
#tirumala

No comments:

Post a Comment