ఖమ్మం: ఖమ్మం సబ్ రిజిస్టర్ -1.. అడపా రవీంద్ర బాబు మంగళవారం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్... స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసా పత్రం అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు విధి నిర్వహణలో మెరుగైన సేవలు అందించే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏడాది ఆగస్టు 15 న .. రాష్ట్ర ప్రభుత్వం ప్రసంశ పత్రాలను అందజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా నేటి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పలువురు ఉద్యోగులకు సామాజిక సేవకులకు ప్రశంసా పత్రాలను అందజేశారు వీరిలో ఖమ్మం సబ్ రిజిస్టర్-1, అడప రవీంద్రబాబు నేడు కలెక్టర్ వి పి గౌతం సమక్షంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీదగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ప్రశంసా పత్రం అందుకోవడం పట్ల అడపా రవీంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు
సబ్ రిజిస్ట్రార్ రవీంద్రబాబు ప్రశంసా పత్రం అందుకోవడం పట్ల ఖమ్మం జిల్లా రిజిస్టార్ చిట్టి మళ్ల అశోక్, కార్యాలయం సిబ్బంది సిబ్బంది రవీంద్రబాబుకు అభినందనలు తెలిపారు...
No comments:
Post a Comment