Sunday, 31 March 2024

*దేశాలు చుట్టిన బస్ ....లండన్ టు కలకత్తా @ 50డేస్...*

ఇప్పుడంటే లండన్ చేరుకోవడానికి కేవలం 9 గంటల విమానంలో ప్రయాణం కానీ లండన్ నుండి  నుండి కలకత్తా (కోల్‌కతా)కి ఈ బస్సు సర్వీస్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన బస్సు మార్గంగా పరిగణించబడింది.  ఆల్బర్ట్ ట్రావెల్ ద్వారా1957లో ప్రారంభించబడిన ఈ బస్ సర్వీస్  UK తర్వాత భారతదేశానికి, బెల్జియంకు, యుగోస్లేవియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు పశ్చిమ పాకిస్తాన్ మీదుగా యూరప్ మీదుగా కొనసాగి భారతదేశంలో ప్రవేశించిన తరువాత, అది చివరికి న్యూఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్ మరియు బనారస్ మీదుగా కలకత్తా చేరుకునేది.
 ఈ మార్గం హిప్పీ మార్గంగా ప్రసిద్ధి చెందింది. బస్సు లండన్ నుండి కలకత్తా చేరుకోవడానికి దాదాపు 50 రోజుల ప్రయాణం పట్టేది. ఈ ప్రయాణం 32,669 కి.మీ పొడవు మరియు 1976 వరకు సేవలో ఉంది. అప్పటికి ఈ యాత్ర ఖర్చు ఆహారం, ప్రయాణం మరియు వసతితో సహా £145. బస్సులో పఠన సౌకర్యాలు, ప్రతి ఒక్కరికీ ప్రత్యేక స్లీపింగ్ బంక్‌లు మరియు ఫ్యాన్‌తో పనిచేసే హీటర్లు ఉన్నాయి. అన్ని పరికరాలు మరియు సౌకర్యాలతో వంటగది ఉంది. బస్సు యొక్క తరువాతి వెర్షన్ ఎగువ డెక్‌లో ఫార్వర్డ్ అబ్జర్వేషన్ లాంజ్ . బస్సు పార్టీలకు రేడియో, మ్యూజిక్ సిస్టమ్‌ను అందించింది. బనారస్ మరియు గంగా ఒడ్డున ఉన్న తాజ్ మహల్‌తో సహా దారిలో ఉన్న ప్రధాన పర్యాటక ప్రదేశాలలో గడపడానికి సమయం ఇచ్చేవారు. సాల్జ్‌బర్గ్, వియన్నా, ఇస్తాంబుల్, కాబూల్ మరియు టెహ్రాన్‌లలో షాపింగ్ బ్రేక్‌లు టూర్ లో బాగంగా వుండేవి.

Saturday, 30 March 2024

*మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రదానం*


*న్యూ ఢిల్లీ :మార్చి 30
తెలుగు బిడ్డ, బహుభాషా కోవిదుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ భారత రత్న అవార్డును ప్రదానం చేశారు.

పీవీ నరసింహారావు కుమా రుడు పీవీ ప్రభాకర్ రావు ఈ అవార్డును అందుకు న్నారు. రాష్ట్రపతి భవన్ లో భారత రత్న అవార్డు ప్రధా నోత్సవం జరిగింది.

*పీవీ ఫ్యామిలీతో పాటు నలుగురు ప్రముఖులు భారతరత్న అందుకు న్నారు. పీవీ ప్రభాకర్ రావు, కర్పూరీ ఠాకూర్, స్వామినా థన్, చరణ్ సింగ్ కుటుంబ సభ్యులు ఈ అవార్డు అందుకున్నారు*

Friday, 29 March 2024

మార్గదర్శానానికి బాధ్యత గల అధికారులు వుండాలి: కలెక్టర్ వి పి గౌతమ్


ఖమ్మం, మార్చి 29: రానున్న లోకసభ ఎన్నికల కౌంటింగ్ కేంద్ర ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలను పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి సందర్శించి, రాబోయే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్, స్ట్రాంగ్ రూంలు, రిషిప్షన్ కేంద్ర ఏర్పాట్లపై క్షేత్ర పరిశీలనలు చేశారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్ల వారిగా స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ రూం ల ఏర్పాట్లకు అధికారులకు సూచనలు చేశారు. క్రొత్తగా నియమిస్తున్న రెండో అంతస్తులో స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ రూం లు అనువుగా చూసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూంలకు కిటికీలు ఉండకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. భద్రతా, పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు, ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఎండాకాలం దృష్ట్యా విద్యుత్ ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఫెన్సింగ్ ను తిరిగి ఉపయోగించాలన్నారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లు, పోస్టల్ బ్యాలెట్ లకు గదులు సిద్ధం చేయాలన్నారు. 25 అగ్నిమాపక పరికరాలు ఇప్పటికి ఇక్కడే ఉన్నట్లు, అదనంగా కావాల్సిన వాటిఏర్పాటు, స్ట్రాంగ్ రూమ్ లకు అలారం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎంపిడివో లను తమ తమ మండల పరిధిలో ఎన్నికల సంబంధ అన్ని ఏర్పాట్లపై బాధ్యత పెట్టాలన్నారు. కేంద్రీకృత రిషిప్షన్ కేంద్రం ఏర్పాట్లను పరిశీలించారు. ప్రవేశం, నిష్క్రమణ మార్గాలను పరిశీలించారు.  పెద్ద సమూహాన్ని హ్యాండిల్ చేసే టాస్క్ జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ఇవిఎం ల రవాణా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రిషిప్షన్ కేంద్రం లో రెయిన్ ప్రూఫ్ టెంట్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఒకే భవనంలో 7 సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ జరగనున్నందున, ఏ సెగ్మెంట్ కు సంబంధించిన ఇవిఎం లు ఆ సెగ్మెంట్ కు వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇవిఎం తరలింపు సిబ్బందికి సెగ్మెంట్ ల వారిగా కలర్ కోడ్ తో టీ షర్టులు ఇవ్వాలని, సెగ్మెంట్ల పేరు వాటిపై ప్రింట్ చేయించాలని అన్నారు. సెగ్మెంట్లకు సంబంధించి, నామ సూచికలు, బ్యానర్లు, స్టిక్కర్లు, రూట్ మ్యాప్ లు తదితర అన్నిటిపై ఆయా సెగ్మెంట్ కి కేటాయించిన రంగునే వాడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏ సెగ్మెంట్ కి వెళ్లే వారిని ఆ సెగ్మెంట్ కి వెళ్లేలా ప్రవేశం దగ్గర బాధ్యత గల అధికారిని ఉంచి, మార్గదర్శనం చేసేలా చూడాలన్నారు.  శిక్షణా కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. శిక్షణ కు సంబంధించి పిపిటి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. 
    ఈ కార్యక్రమంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్,  శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, శిక్షణ ఐపీఎస్ పి. మౌనిక, ఆర్ అండ్ బి ఎస్ఇ శ్యామ్ ప్రసాద్, ట్రాన్స్కో ఎస్ఇ సురేందర్, ఎస్డీసి ఎం. రాజేశ్వరి, ఎడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సిహెచ్. స్వామి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 26 March 2024

బ్రెయిన్ ట్యూమర్ తొలగించిన కాకతీయ వైద్యులు

*మొట్టమొదటిసారిగా  కాకతీయ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీలో బ్రెయిన్ ట్యూమర్ తొలగించిన వైద్యులు*

కాకతీయ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరో సర్జరీ విభాగంలో మొట్టమొదటిసారిగా  బ్రెయిన్ ట్యూమర్ చికిత్స చేయడం జరిగింది, హనుమకొండ జిల్లా ఉప్పల్ గ్రామానికి చెందిన బుర్ర స్వరూప కు బ్రెయిన్ లో ట్యూమర్ పెరగడంతో ఆమెకు తీవ్రమైనటువంటి తలనొప్పి, తల నుండి కాళ్ళ వరకు తీవ్రమైనటువంటి నరాల బాధపడుతుంటే ఆమె హాస్పిటల్ కు రావడం జరిగింది,

హాస్పిటల్లో న్యూరో సర్జరీ విభాగం హెచ్ ఓ డి  డాక్టర్ మహమ్మద్ సికిందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సచిన్, వీరేష్, అనస్తీసియా డాక్టర్లు  డాక్టర్ మురళి, చంద్రశేఖర్, గార్ల ఆధ్వర్యంలో ఈ శస్త్ర చికిత్స చేయడం జరిగింది,  ఈ శస్త్ర చికిత్స కు 5 నుండి 6లక్షల ఖర్చు ఉంటుంది,ఈ రోజు ఆమె డిశ్చార్జ్ చేయడం జరిగింది,ఆమెకు ఈ శస్త్ర చికిత్స చేయడం విజయవంతం కావడంతో MGM సూపర్డెంట్ డాక్టర్ V. చంద్రశేఖర్, KMC ప్రిన్సిపాల్ డాక్టర్ డి.మోహన్ దాస్ లు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్, నర్సింగ్ ఆఫీసర్ లు,హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Tuesday, 19 March 2024

ఎన్నికల విధులు కీలకమైనవని : కలెక్టర్ వి.పి.గౌతమ్


ఖమ్మం, మార్చి 19: ఎన్నికల నిర్వహణలో ఏ దశలోనూ లోపాలు లేకుండా, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. మంగళవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి, ఏఆర్ఓ, డిఎస్పీ, ఏసీపీ, నోడల్ అధికారులతో లోకసభ ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ఎన్నికల విధులు చాలా కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న తప్పిదానికి తావివ్వకుండా వంద శాతం సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. శనివారం ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ మేరక ఏప్రిల్ 18 నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 26న స్క్రూటిని, ఏప్రిల్ 29 వరకు అభ్యర్థుల ఉపసంహరణ ఉండగా, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ఉంటుందని ఆయన అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టి బృందాలను పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలన్నారు  ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలకు వాహనాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నిఘా బృందాలు తమకు కేటాయించిన ప్రదేశాల్లో విధుల నిర్వహణ చేయాలన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా కేటాయించిన బృందాలు ఏ ఏ ప్రదేశాల్లో ఏర్పాటు చేసింది అడిగి తెలుసుకున్నారు. ఏఆర్ఓ లు నిఘా బృందాల పర్యవేక్షణ చేయాలన్నారు. క్రిటికల్, వల్నరబుల్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం లోపల సిసి కెమెరా ల ఏర్పాటు వందశాతం చేయాలని, పోలీసుల నివేదిక మేరకు పోలింగ్ కేంద్రాల వెలుపల సిసి కెమెరాల ఏర్పాటుచేయాలన్నారు. ఏఆర్ఓలు, పోలీస్ అధికారులు తమ పరిధిలోని ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, మౌళిక సదుపాయాల పరంగా, భద్రతా పరంగా చేపట్టాల్సిన చర్యల గురించి కార్యాచరణ చేయాలన్నారు. సువిధ సింగిల్ విండో ద్వారా అనుమతులు జారిచేయాలని, నిర్ణీత కాలవ్యవధిలోగా అనుమతులు జారీ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రవాణా కార్యాచరణ పకడ్బందీగా చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఆయా సెగ్మెంట్ల పరిధిలోను, రిషిప్షన్ కేంద్రం ఒకేచోట కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి, రిషిప్షన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు చూసుకోవాలన్నారు. ఎన్నికల పరిశీలకుల సందర్శన లోగా కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సి విజిల్ పై విస్తృత చేయాలన్నారు. యువతతో సమావేశాలు నిర్వహించి, సి-విజిల్ పై అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఒక సెక్టార్ లో గరిష్టంగా 12 పోలింగ్ కేంద్రాలుండే విధంగా మరో 10 అదనపు సెక్టార్లు ఏర్పాటుచేశామన్నారు. ఒక పోలింగ్ కేంద్రం ఒకటి కంటే ఎక్కువ సెక్టార్లలో ఉండకుండా చూడాలన్నారు. 85 సంవత్సరాలు పైబడిన వారికి, దివ్యాoగులకు హోం ఓటింగ్ నిమిత్తం ఫారం -12డి లను ఇంటింటికి అందజేయాలన్నారు. సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమ నగదు, లిక్కర్, ప్రలోభాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 12 ఎఫ్ఎస్టి, 15 ఎస్ఎస్టి, 2 ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 10 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు, 24 గంటల నిఘా ఉంచినట్లు తెలిపారు. సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రజలతో మర్యాదగా మెదగాలన్నారు. అనుమానిత రవాణా పట్ల చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రచార సామాగ్రిపై ప్రచురణకర్త పేరు, వివరాలు లేకుంటే సీజ్ చేయాలన్నారు. సీజర్ కు 102 కూడా ఉపయోగించాలన్నారు. సీజర్ సమయంలో అన్ని నియమ నిబంధనలను పాటించాలన్నారు. క్రిటికల్, వల్నరబుల్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు మార్గదర్శకాల మేరకు చేపట్టాలన్నారు.  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, శిక్షణా ఐపిఎస్ పి. మౌనిక, అదనపు డిసిపి ప్రసాద రావు, భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎస్డీసి ఎం. రాజేశ్వరి, ఖమ్మం, కల్లూరు, కొత్తగూడెం ఆర్డీవోలు గణేష్, శ్రీనివాస్, మధు, డిసిఓ మురళీధర్ రావు, ఐటి అధికారి సాయి కుమార్, జిల్లా శిక్షణ నోడల్ అధికారి కే. శ్రీరామ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------------
జిల్లా పౌరసంబంధాల అధికారి, ఖమ్మం కార్యాలయంచే జారిచేయనైనది.

Thursday, 7 March 2024

ఇంద్రకీలాద్రి పై శివరాత్రి ఉత్సవములు ప్రారంభం:..

విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానము       దేవస్థానం నందు శ్రీశోభకృత్ నామ సంవత్సర మహాశివరాత్రి మహోత్సవములు - 2024 తేది. 06.03.2024 నుండి ది. 13.03.2024 వరకు నిర్వహించుటలో భాగముగా ఈరోజు మహా శివరాత్రి ఉత్సవ కార్యక్రమములు ఉదయం ప్రారంభమైనవి. ఇందులో భాగముగా ఈరోజు ఉదయం గం.9.30 ని.లకు మంగళ వాయిద్యములు, వేదపండితుల మంత్రోచ్చారణాల నడుమ ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి (ఉత్సవమూర్తులు) వార్లకు మంగళస్నానములు ఆచరింపజేసి,  వధూవరులుగా అలంకరించుట జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు , ఆలయ సహాయ కార్యనిర్వాహనాధికారులు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు, అర్చక సిబ్బంది, వేదపండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

రాజీవ్‌ స్వగృహా జలజ టౌన్‌షిప్‌ పై సమీక్ష..

ప్రచురణార్ధం : రాజీవ్‌ స్వగృహా జలజ టౌన్‌షిప్‌ ఆస్తులను ఖచ్చితమైన ధరల నిర్ణయానికి ప్రతిపాదనలు సమర్పించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ పేర్కొన్నారు.  బుధవారం నూతన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఖమ్మం రూరల్‌ మండలం పోలేపల్లిలో గల జలజ టౌన్‌షిప్‌ (రాజీవ్‌ స్వగృహ) గృహసముదాయాల   ఆస్తులను ధరలు నిర్ణయించడానికి జిల్లా కలెక్టర్‌/ చైర్మన్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్‌  మార్గదర్శకాలపై  రాజీవ్‌ స్వగృహ కార్పోరేషన్‌ లిమిటెడ్‌, రెవెన్యూ, మున్సిపల్‌, ఆర్‌.అండ్‌.బి, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న 8 టవర్స్‌ (576),  ఫ్లాట్స్‌, ఖాలీస్థలాన్ని 2013లో పనిచేపట్టబడి అసంపూర్తిగా ఉన్నటువంటి వాటి విలువను నిర్ధారించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో కూలంకషంగా చర్చించి తదుపరి చర్య నిమిత్తం సంబంధిత ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించేందుకు కమిటి ఆమోదం తెలిపడం జరిగిందన్నారు.నగరపాలక సంస్థ కమీషనర్‌ ఆదర్శ్‌ సురభి, రాజీవ్‌ స్వగృహ కార్పోరేషన్‌ ఎస్‌.ఈ సి.భాస్కర్‌రెడ్డి, ఆర్‌.అండ్‌.బి ఎస్‌ఈ శ్యాంప్రసాద్‌, జాయింట్‌ సబ్‌ రిజిష్ట్రార్‌ పద్మ, ఖమ్మం రెవెన్యూ డివిజనల్‌ అధికారి జి.గణేష్‌, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ మదన్‌గోపాల్‌, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు సమావేంలో పాల్గొన్నారు.
````````````````````````````````````````````````````````````````

Wednesday, 6 March 2024

సూర్య-చంద్రులపై భక్తులను కరుణించిన కళ్యాణ వేంకటవిభూడు...ప‌ర‌వ‌శించిన భ‌క్త జ‌నం....

తిరుమల: 
శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై శ్రీరామ కృష్ణ గోవింద అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఉదయం 8 నుండి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యప్రభ వాహనంపై శ్రీ సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
బుధవారం సాయంత్రం చంద్రప్రభ వాహ‌నంపై ద‌ర్బార్ కృష్ణుడి అలంకారంలో శ్రీ కల్యాణ  వేంకటేశ్వరస్వామి 
  శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధ‌వారం రాత్రి 7 గంటలకు శ్రీ కల్యాణ  వేంకటేశ్వరస్వామి చంద్రప్రభ వాహ‌నంపై ద‌ర్బార్ కృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను నివారిస్తుంద.Tirupati, On the seventh morning of the annu Brahmotsavam in Srinivasa Mangapuram Sri Kalyana Venkateswara Swami appeared to the devotees in the form of Sri Rama Krishna Govinda on the Surya Prabha Vahanam on the bright Sunny day.#####Tirupati, As part of the ongoing annual Brahmotsavam of Sri Kalyana Venkateswara Swamy in Srinivasa Mangapuram, the devotees were filled with religious ecstasy by catching the glimpse of Sri Darbar Krishna  on Chandraprabha Vahanam on Wednesday evening.

Tuesday, 5 March 2024

అప్లైడ్ మ్యాథ్స్ లో పరిశోధనకు చకిలం ప్రత్యూషకు డాక్టరేట్..


హైదరాబాద్  : జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్  హైద్రాబాద్ గేట్స్ట్ ప్రొఫెసర్ చకిలం ప్రత్యూషకు రేవు యూనివర్సిటీ డాక్టరేట్ వరించింది. యూనివర్సిటీ కాలేజ్ మాథ్స్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న గొల్ల పూడి (చకిలం )ప్రత్యూష తన పరిశోనకు గాను రేవ యూనివర్సిటీ వారు డాక్టరెట్ ప్రధానం చేశారు 3సంవత్సరాల పాటు తను విషయం :ఆపరేషన్ రీసెర్చ్ అప్లై డ్ మ్యాథ్స్ అనే అంశంపై పరిశోధన చేసి తన పరిశోధ గ్రంధం యూనివర్సిటీ కి సమర్పించారు, అదే యూనివర్సిటీలో మాథ్స్ విభాగంలో అధ్యాపకు రాలుగా భోదన చేస్తూ PhD చేశారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం తుమ్మల పల్లి గ్రామనికి చెందిన చకిలం ప్రత్యూష తన భర్త, అత్త మామల సహాకారం తల్లిదండ్రుల ఆశీస్సుల వల్లనే  డాక్టరెట్అందుకున్నానని పేర్కొన్నారు.
 పుట్టపత్రి లో డిగ్రీ చేసి jntu యూనివర్సిటీ లోనే మాథ్స్ లో MSC చేసినట్లు ప్రత్యూష తెలిపారు.కొత్త విషయాలు తెలుసు కొని వాటి ని విద్యార్థులు తెలియచేస్తూ పరిణతి చెందిన అధ్యాపకురాలుగా పేరు సంపాదించారు. కాగా ప్రత్యూష సంగీత కళాకారిణిగా, గాయనిగా కూడా మంచి 
Jntu యూనివర్సిటీ మాజీ ఫ్రొఫెసర్ Dr శ్రీవాస్ రావు, పలువురు సహా అధ్యాపకులు మాథ్స్ డిపార్ట్మెంట్ టీచింగ్ నాన్ టీచింగ్ సిబంది స్టూడెంట్స్
ప్రత్యూష  భర్త సాకేత్ రాం, విహాన్, రమేష్ రావు, సంధ్య రాణి, తండ్రి సుబ్రహ్మణ్యం,తల్లి రజని బంధువులు రేవ యూనివర్సిటీ ఆచార్య బృందం ప్రత్యూష కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేశారు,,@ మణికుమార్ కొమ్మమూరు,9032075966

విభజనకు తావులేనిది భజన.. సేవనం : సత్యసాయి ట్రస్టీ RJ రత్నాకర్ ఉధ్ఘాటన...

ఖమ్మం: విభజనకు తావులేని భజన-సేవలలో పాలుపంచుకోవడం ద్వారా దైవానుగ్రహం పొందుతారని  సత్యసాయి సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ సభ్యులు  RJ రత్నాకర్ అన్నారు. ఖమ్మం జిల్లాలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన పలు కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై జిల్లాలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. నేలకొండపల్లి మండలం జెక్కెపల్లి గ్రామంలో భజన మండలి నూతన భవనమును ప్రారంభించి. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో భజన మండలికి సొంత భవనం ఉండాలనే ఆకాంక్షతో జక్కెపల్లి గ్రామ వాసులు అందరూ కలిసి తలా కొంత చందాలు వేసుకొని భజన మండలి నూతన భవనమును నిర్మించుకోవటం ఆనందదాయకమని భజన మండలికి హాజరైతే విభజన ఉండదని గ్రామం ప్రశాంతంగా ఉంటుందని గ్రామాలు ప్రశాంతంగా ఉంటే దేశం ప్రశాంతంగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లాలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు .  ఖమ్మం పట్టణంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిత్య అన్నదాన కార్యక్రమం ఆరవ వార్షికోత్సవం కు హాజరై ప్రతిరోజు క్రమం తప్పకుండా 500 మందికి అన్నదానం చేస్తున్న ఖమ్మం జిల్లా సత్యసాయి సంస్థ సభ్యులను  ప్రశంసించారు. వైరా సత్యసాయి సమితి వారు నిర్వహించబోయే గోశాలను ప్రారంభించారు. 
సాయంత్రం సత్తుపల్లిలో సత్యసాయి సమితి మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై సత్యసాయి సంస్థలు చేస్తున్న కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమమునకు జిల్లా అధ్యక్షులు దమ్మాలపాటి సుధాకర్ రావు, కన్వీనర్ ఆలస్య నరసింహారావు, 
మాదిరాజు రామచంద్ర రావు, మూర్తి, ఆదినారాయణ, బుల్ల రామారావు,కొదుమూరు వెంకటేశ్వర్లు,రామారావు, భాస్కర రావు, ఎం.విజయ్ తదితరులు పాల్గొన్నారు@మణికుమార్ కొమ్మమూరు,9032075966.

Friday, 1 March 2024

*ముఖ్యమంత్రికి జర్నలిస్టుల సంక్షేమంపై పూర్తి అవగాహన ఉంది*: శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్బ/బషీర్‌బాగ్‌ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హయాంలో పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య కార్డులు, అక్రిడిటేషన్‌ కార్డులు తదితర అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పాత్రికేయుల ఇళ్ల స్థలాల విషయమై త్వరలోనే ఉన్నత స్థాయి సమావేశం ఉంటుందని తెలిపారు. గురువారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో అకాడమీ ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్‌ అలీ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. జవహర్‌లాల్‌ నెహ్రూ హౌసింగ్‌ సొసైటీ ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని దీనిపై తనతో చర్చించారన్నారు. ముఖ్యమంత్రి సీపీఆర్‌వో అయోధ్యరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర మీడియా అకాడమీ మాజీ ఛైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడారు..
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జర్నలిస్టుల అవసరాలు, వారికి అందాల్సిన సంక్షేమం  గురించి పూర్తిగా అవగాహన ఉందని, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా  పదవి బాధ్యతలు తీసుకున్న,  కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ,  తనను చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రిని రెండు రోజుల క్రితం కలసి ధన్యవాదాలు తెలిపిన సందర్భంలో రాష్ట్ర జర్నలిస్టుల సమస్యల గురించి క్షుణ్ణంగా చర్చించినట్లు తెలిపారు.
జర్నలిస్టులకు ఇవ్వాల్సిన ఇండ్ల స్థలాల విషయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ స్థలాలను గుర్తించవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తున్న దని తెలిపారు.
హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సభ్యులు ఒక్కొక్కరు తమకు రావలిసిన ఇళ్ల స్థలాల కోసం 17 సంవత్సరాల క్రితం రెండున్నర లక్షల రూపాయలు కట్టారని, వారికి ఇవ్వాల్సిన ఇంటి స్థలాలు వెంటనే ఇవ్వడానికి కృషి చేస్తానని అన్నారు. గత 17 సంవత్సరాల లో దాదాపు 60 మంది జర్నలిస్టులు ఇంటి స్థలాలు అందకుండానే చనిపోయారని గుర్తు చేశారు. 
హైదరాబాద్ లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఒకే చోట కాకుండా నగరానికి నాలుగు వైపుల గుర్తించి ఎవరికి ఎక్కడ ఇష్టముంటే అక్కడనే ఇస్తే బాగుంటుందని అన్నారు.
జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు అన్ని ఆసుపత్రులలో పనిచేసే విధంగా ఆదేశాలు ఇచ్చేలా కృషి చేస్తానని అన్నారు. లేదా జర్నలిస్ట్ కూడా కొంత సొమ్మును హెల్త్ కార్డు కోసం కట్టి మంచి చికిత్స అన్ని ఆసుపత్రులలో పొందే విధంగా ప్రయత్నిస్తామని అన్నారు. 
రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్, ఇంటి స్థలం, హెల్త్ కార్డు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి గారి ముఖ్య పౌర సంబంధాల అధికారి, అయోధ్య రెడ్డి, జర్నలిస్ట్ పక్షపాతి అని, ఆయన  సహకారంతో జర్నలిస్టులకున్న సమస్యలను అధిగమించడానికి కృషి చేస్తానని అన్నారు.
పత్రిక యాజమాన్యాలను పక్కనపెట్టి పత్రికా విలేకరులు జర్నలిజం ప్రమాణాలను పెంచడానికి కృషి చేయాలని అన్నారు. ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్నది కనుక విలేకరులు జాగ్రత్తగా రిపోర్టింగ్ చేసి ప్రజా పక్షపాతిగా పనిచేయాలన్నారు.
ఇండ్ల స్థలాల విషయంలో న్యాయపరమైన ఇబ్బందులు ఉంటే అడ్వకేట్ జనరల్ సలహా తో పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి సలహా ఇచ్చారని అన్నారు.
  మీడియా అకాడమీ కి కావాల్సిన బడ్జెట్, కార్యాలయానికి కావాల్సిన భవనం, అవసరమైన సిబ్బంది, అన్ని సౌకర్యాలు అందించే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి తన ముఖ్య కార్యదర్శిని ఆదేశించారని తెలిపారు.
 ముఖ్యమంత్రి గారి ముఖ్య పౌర సంబంధాల అధికారి, అయోధ్య రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇవ్వాల్సిన ఇండ్ల స్థలాల విషయంలో కొంత కాలయాపన జరిగిన విషయం వాస్తవమని, వారికి గౌరవప్రదంగా రావలసిన ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని అన్నారు, త్వరలోనే దీనిని పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు.
 సమాచార పౌర సంబంధాల శాఖ,  ప్రత్యేక కమిషనర్, హనుమంతరావు మాట్లాడుతూ జర్నలిజం లో పుట్టి, పెరిగి వారి అవసరాల గురించి క్షణం క్షణం ఆలోచించే వ్యక్తి శ్రీనివాసరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ గా రావడం జర్నలిస్టుల అదృష్టమని అన్నారు. సమాజంకోసం తపించే వ్యక్తి జర్నలిస్ట్ అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మానవీయ కథనాలు ఎన్నో రాసి ప్రభుత్వం దృష్టికి, సమాజం ఉన్న లోటుపాట్లను   తెచ్చేవాడు జర్నలిస్టు, అట్టి సమాజసేవకుడికి  సదుపాయాలు కల్పించడానికి, అధికారిగా తన బాధ్యతలు నిర్వర్తి స్తానని అన్నారు.

జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ సింగ్

ఖమ్మం ,,: ట్రైనీ కలెక్టర్ మయాంక్ సింగ్ IAS, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని నేడు సందర్శించారు.. రిజిస్ట్రేషన్ శాఖ సంబంధించిన విధులు.. బాధ్యతలు, దస్తావేజులు, తదితర అంశాలను కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు..ఈ సందర్భంగా జిల్లా రిజిస్ట్రార్ చిట్టిమళ్ల అశోక్, జిల్లా ఆడిట్ విభాగం అధికారి అడపా రవీంద్రబాబు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. సబ్ రిజిస్ట్రార్లు పద్మ,జ్వోతి, జూనియర్ అసిస్టెంట్ సాయి... కార్యాలయ పనితీరుని అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ సింగ్ కు వివరించారు