*మొట్టమొదటిసారిగా కాకతీయ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీలో బ్రెయిన్ ట్యూమర్ తొలగించిన వైద్యులు*
కాకతీయ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరో సర్జరీ విభాగంలో మొట్టమొదటిసారిగా బ్రెయిన్ ట్యూమర్ చికిత్స చేయడం జరిగింది, హనుమకొండ జిల్లా ఉప్పల్ గ్రామానికి చెందిన బుర్ర స్వరూప కు బ్రెయిన్ లో ట్యూమర్ పెరగడంతో ఆమెకు తీవ్రమైనటువంటి తలనొప్పి, తల నుండి కాళ్ళ వరకు తీవ్రమైనటువంటి నరాల బాధపడుతుంటే ఆమె హాస్పిటల్ కు రావడం జరిగింది,
హాస్పిటల్లో న్యూరో సర్జరీ విభాగం హెచ్ ఓ డి డాక్టర్ మహమ్మద్ సికిందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సచిన్, వీరేష్, అనస్తీసియా డాక్టర్లు డాక్టర్ మురళి, చంద్రశేఖర్, గార్ల ఆధ్వర్యంలో ఈ శస్త్ర చికిత్స చేయడం జరిగింది, ఈ శస్త్ర చికిత్స కు 5 నుండి 6లక్షల ఖర్చు ఉంటుంది,ఈ రోజు ఆమె డిశ్చార్జ్ చేయడం జరిగింది,ఆమెకు ఈ శస్త్ర చికిత్స చేయడం విజయవంతం కావడంతో MGM సూపర్డెంట్ డాక్టర్ V. చంద్రశేఖర్, KMC ప్రిన్సిపాల్ డాక్టర్ డి.మోహన్ దాస్ లు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్, నర్సింగ్ ఆఫీసర్ లు,హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment