Thursday, 7 March 2024

రాజీవ్‌ స్వగృహా జలజ టౌన్‌షిప్‌ పై సమీక్ష..

ప్రచురణార్ధం : రాజీవ్‌ స్వగృహా జలజ టౌన్‌షిప్‌ ఆస్తులను ఖచ్చితమైన ధరల నిర్ణయానికి ప్రతిపాదనలు సమర్పించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ పేర్కొన్నారు.  బుధవారం నూతన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఖమ్మం రూరల్‌ మండలం పోలేపల్లిలో గల జలజ టౌన్‌షిప్‌ (రాజీవ్‌ స్వగృహ) గృహసముదాయాల   ఆస్తులను ధరలు నిర్ణయించడానికి జిల్లా కలెక్టర్‌/ చైర్మన్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్‌  మార్గదర్శకాలపై  రాజీవ్‌ స్వగృహ కార్పోరేషన్‌ లిమిటెడ్‌, రెవెన్యూ, మున్సిపల్‌, ఆర్‌.అండ్‌.బి, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న 8 టవర్స్‌ (576),  ఫ్లాట్స్‌, ఖాలీస్థలాన్ని 2013లో పనిచేపట్టబడి అసంపూర్తిగా ఉన్నటువంటి వాటి విలువను నిర్ధారించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో కూలంకషంగా చర్చించి తదుపరి చర్య నిమిత్తం సంబంధిత ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించేందుకు కమిటి ఆమోదం తెలిపడం జరిగిందన్నారు.నగరపాలక సంస్థ కమీషనర్‌ ఆదర్శ్‌ సురభి, రాజీవ్‌ స్వగృహ కార్పోరేషన్‌ ఎస్‌.ఈ సి.భాస్కర్‌రెడ్డి, ఆర్‌.అండ్‌.బి ఎస్‌ఈ శ్యాంప్రసాద్‌, జాయింట్‌ సబ్‌ రిజిష్ట్రార్‌ పద్మ, ఖమ్మం రెవెన్యూ డివిజనల్‌ అధికారి జి.గణేష్‌, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ మదన్‌గోపాల్‌, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు సమావేంలో పాల్గొన్నారు.
````````````````````````````````````````````````````````````````

No comments:

Post a Comment