విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానము దేవస్థానం నందు శ్రీశోభకృత్ నామ సంవత్సర మహాశివరాత్రి మహోత్సవములు - 2024 తేది. 06.03.2024 నుండి ది. 13.03.2024 వరకు నిర్వహించుటలో భాగముగా ఈరోజు మహా శివరాత్రి ఉత్సవ కార్యక్రమములు ఉదయం ప్రారంభమైనవి. ఇందులో భాగముగా ఈరోజు ఉదయం గం.9.30 ని.లకు మంగళ వాయిద్యములు, వేదపండితుల మంత్రోచ్చారణాల నడుమ ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి (ఉత్సవమూర్తులు) వార్లకు మంగళస్నానములు ఆచరింపజేసి, వధూవరులుగా అలంకరించుట జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు , ఆలయ సహాయ కార్యనిర్వాహనాధికారులు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు, అర్చక సిబ్బంది, వేదపండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment