ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.పెనుబల్లి మండలం మర్లకుంట గ్రామానికి చెందిన జే. కోటేశ్వర్ రావు తాను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నానని, తనకు అవుట్సోర్సింగ్ లో ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా ఉపాధి అధికారికి రాస్తూ అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కూసుమంచి మండలం పోచారం గ్రామానికి చెందిన కె. రమేష్ తన తాత గారు పోచారం గ్రామానికి వి.ఆర్.ఏ. గా పనిచేసి ఆ ఉద్యోగం తన తండ్రికి ఇచ్చారని, ప్రస్తుతం తన తండ్రికి ఆరోగ్యం బాగా లేనందున ఈ ఉద్యోగాన్ని తనకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, కలెక్టరేట్ పరిపాలన అధికారికి రాస్తూ అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన డి. మల్లిఖార్జున్ రావు గత పది సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో పంప్ ఆపరేటర్ గా పని చేస్తున్నానని, 2021 లో అనారోగ్య కారణంగా పంచాయతి కార్యదర్శికి లేఖ రాసి సెలవు తీసుకున్నానని, ప్రస్తుతం తనకు గ్రామ పంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్ గా ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా పంచాయతీ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.ఖమ్మం నగరం 43వ డివిజన్ ఎన్.ఎస్.పి. రోడ్డుకు చెందిన ఎం. రమాదేవి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఈఈ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మాజీ సైనికులకు ప్రభుత్వం అందజేసే భూమిని కేటాయించాలని మాజీ సైనికుడు చెందిన సంతోష్ వినతిపత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో అరుణ, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment