ఖమ్మం : రెవెన్యూ చరిత్రలో భూ భారతి ఓ మైలురాయిగా కితాబు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల , టీ ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి , తదితరుల అండతోనే తాము విజయం సాధించామన్న గరికె ఖమ్మంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించిన వీఆర్వోల రాష్ట్ర అధ్యక్షులు గరికె . గత ప్రభుత్వ పాలనలో గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దు కావడంతో రెండున్నర సంవత్సరాలుగా మానసిక వేదనతో ఆందోళనలో ఉన్న రాష్ట్రవ్యాప్తంగా 5,139 మంది వీఆర్వోల కుటుంబాలకు అండగా నిలుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం విఆర్ఓ లను రెవిన్యూలోకి ఆప్షన్ పద్ధతిలో తీసుకుంటూ నిర్ణయించడం చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికి ఉపేంద్ర రావు అన్నారు . మంగళవారం ఖమ్మం లోని టీటీడీసీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేంద్రరావు , పలువురు రాష్ట్ర కమిటీ , జిల్లా కమిటీ సభ్యులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి యావత్ వీఆర్వోల కుటుంబాలు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు . గత ప్రభుత్వం వీఆర్వోలను రెవెన్యూ శాఖ నుంచి విడదీయడమే కాకుండా గ్రామస్థాయి రెవిన్యూ రద్దుచేసి వీఆర్వోల భవిష్యత్తును అంధకారంలో నెట్టింది అన్నారు . నాటి నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ అధికారులు అనేక దఫాలుగా ఆందోళనలు నిరసనలు తెలిపినా గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని అవినీతిపరులుగా గ్రామ రెవెన్యూ అధికారులను చిత్రీకరించి అవమానులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు . ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వంపై కోటి ఆశలతో ఉన్న వీఆర్వోలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , రెవిన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తోపాటు మిగతా మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , రాష్ట్ర సీసీఎల్ఏ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ , తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ , తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల చైర్మన్, రెవెన్యూ ఎక్స్ పర్ట్ , డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి లచ్చి రెడ్డి , కృషి ఫలితంగా మరియు డిప్యూటీ కలెక్టర్ సంఘం తెలంగాణ తాసిల్దారుల సంఘం కృషి ఫలితంగా గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ బలోపేతంలో సమస్త విఆర్ఓ లకు ఆప్షన్ పద్ధతిలో తీసుకోవడానికి కృషి చేసిన వారికి ప్రతి ఒక్కరికి తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం తరఫున గరిక ఉపేంద్రరావు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు .రెవెన్యూ చరిత్రలో భారతి చట్టం 2024 ఒక వరం . గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతుల భూ సమస్యలు స్థానికంగా వేగవంతంగా న్యాయమైన సమస్యలన్నీ పరిష్కారం చేసే విధంగా చట్టంలో రూపకల్పన చేయటం అట్లాగే ఆప్షన్ విధానం మండల డివిజన్ జిల్లా స్థాయిలలో అవకాశం కల్పించడంతోటే దళిత , గిరిజన , సన్న కారు , చిన్న కారు మధ్యతరగతి , రైతులకు ఎంతో వెసులుబాటును కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని గరికె ఉపేంద్ర రావు అన్నారు . రీ డిప్లయ్మేంట్ ద్వారా ఇతర ప్రభుత్వ శాఖల్లోకి బలవంతపు సర్దుబాటు ద్వారా అర్ధరాత్రి వేళ లాటరీ పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగుల సిసిఏ రూల్స్ , ఫండమెంటల్ రూల్స్ కు విరుద్ధంగా తీసుకున్న గత ప్రభుత్వ నిర్ణయం వలన వీఆర్ఓ లందరూ పూర్వపు సర్వీసులు పూర్తిగా కోల్పోయారు . పే ప్రొటెక్షన్ కోల్పోయారు , పదోన్నతులు కోల్పోయారు , డి గ్రేట్ చేయబడి అటెండర్లుగా , కామాటిగా , వంట కుక్కు , స్వీపర్లుగా , మహిళా జీపు డ్రైవర్‌గా , వార్డు అధికారిగా ఇలా అవమానింపబడి సమాజంలో మానవ హక్కులు కోల్పోయామని అన్నారు . ఆర్థికంగా మానసికంగా తీవ్ర ఆందోళనలకు గురికావడమే కాకుండా జిసిసి లో పనిచేస్తున్న వారికి నేటికీ నెల వారి వేతనాలు రాక మనోవేదనతో ఆర్థిక భారం తట్టుకోలేక ఇద్దరు విఆర్వోలు అకాల మరణం చెందటం చింతించదగిన అంశంగా భావిస్తున్నామని వారు తెలిపారు . గత ప్రభుత్వం నిరంకుశ విధానాల వలన మాకు జరిగిన నష్టాన్ని నేటి ప్రజా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అనేక దఫాలుగా సంఘం ఆధ్వర్యంలో మెమొరాండాలు సమర్పించి మా సమస్యల పరిష్కారానికి నివేదించుట మూలంగా మా సమస్యలను సానుకూలంగా తీసుకొని మాకు నేడు గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థలోకి రావడానికి ఆప్షన్ పద్ధతి ద్వారా మమ్మల్ని తీసుకోవడం హర్షించదగిన పరిణామం అన్నారు . నేటి ఆప్షన్ లో గత సర్వీస్ యొక్క పరిస్థితిని ప్రమోషన్ విధానాన్ని ఆప్షన్ ఫామ్ లో పొందుపరచలేదనే అంశం అనేది కొంత ఆందోళన కలిగిస్తున్నది . తప్పకుండా నేటి ప్రభుత్వం వీఆర్వోల న్యాయమైన గత సర్వీసును పరిగణలోకి తీసుకొని కామన్ సీనియారిటీ ద్వారా పదోన్నతులు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి ని గౌరవ రెవిన్యూ శాఖ మాతృ గారిని కోరారు . విలేకరుల సమావేశంలో తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు చీమల నాగేంద్రబాబు , బంక కృష్ణ , షేక్ జానీ మియా , వజ్జ రామారావు , చర్ల శ్రీనివాస్ , ధరావత్ భాస్కర్ , కిషోర్ , నెల్లూరు లవన్ కుమార్ , బంక భాస్కర్ , శ్రీ వాణి , మల్లీశ్వరి , వాంకుడోత్ వెంకన్న , వస్త్రం ధన్నూరి బాలరాజు , చిట్టి మల్ల నాగేశ్వరరావు , షేక్ నాగుల మీరా మరియు వందమంది పూర్వ విఆర్వోలు పాల్గొన్నారు .
No comments:
Post a Comment