Thursday, 30 January 2025

పర్యావరణ రుగ్మతకు ఈ డాక్టర్ సైకిల్ చికిత్స..


వాహనాలను కొందరు సామాజిక హోదాకు చిహ్నాలుగా భావిస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా వినియోగించడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ తరహా తీరు పర్యావరణానికి చేటు చేస్తోందని ఒంగోలుకు చెందిన వైద్యుడు కొర్రపాటి సుధాకర్‌ భావించారు. చికిత్సను తన నుంచే ప్రారంభించాలనుకున్నారు. ఒంగోలు నగరంతో పాటు చుట్టుపక్కల ఇరవై కి.మీల వరకు ఏ చిన్న పని ఉన్నా గత పదిహేనేళ్లుగా సైకిల్‌పై ప్రయాణానికే ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతిరోజూ ఇంటి నుంచి ఆసుపత్రికి కూడా ఇదే తరహా తీరు.ఇటీవల సంక్రాంతి పండగకు నగరం నుంచి 42 కి.మీ దూరంలో ఉన్న స్వగ్రామమైన తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలేనికి సైకిల్‌పై వెళ్లి వచ్చారు. 2016లో పురుడు పోసుకున్న ప్రకాశం గ్లోబల్‌ ఎన్నారై ఫోరమ్‌(పీజీఎన్‌ఎఫ్‌) అనే సంస్థకు ఈ వైద్యుడు కన్వీనర్‌గా ఉన్నారు. జిల్లా నుంచి విదేశాల్లో స్థిరపడిన 200 మంది వరకు ఇందులో సభ్యులు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ సంస్థ తరఫున ఇప్పటికి సుమారు వెయ్యి వరకు సైకిళ్లను ఉచితంగా అందజేశారు. 170 ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు సమకూర్చారు.

Sunday, 26 January 2025

75 ఏళ్లకు ఎగిరిన జెండా... మావోల కోటలో మువ్వన్నెల రెపరెప....

75 వసంతాల స్వతంత్ర భారతంలో ఎన్నడూ ఎరుగని జెండా పండుగను జరుపుకున్నారు. చత్తీస్గడ్ రాష్ట్రంలో మావోయిస్టుల కబంధహస్తాల్లో ఉన్న చాలా గిరిజన గ్రామాలకు భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు పూర్తి అయినా...స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం అంటే తెలవని పరిస్థితి. అసలు వారు ఇప్పటివరకు త్రివర్ణ పతాకాన్ని చూసిన దాఖలాలు లేవు. అటువంటి గ్రామాలలో నక్సలైట్ బలమైన కోటలో మొదటిసారి, భద్రతా దళాలు, గ్రామస్తులు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.సుక్మాలోని గోమ్గుడాలో సిఆర్పిఎఫ్ 241 బస్తెరియా బెటాలియన్‌ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయగా, 223 రేగుడామ్‌లో సిఆర్‌పిఎఫ్ బెటాలియన్, హాయిస్ట్ తుమల్‌ప్యాడ్‌లోని సిఆర్‌పిఎఫ్ 74 వ బెటాలియన్ గ్రామస్తులతో కలిసి జాతీయ జెండాలను ఎగురవేసింది. దక్షిణ బస్తర్లో చాలా చోట్ల స్వాతంత్ర్యం తరువాత మొదటి సారి గ్రామస్తులు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయడం తో ఆనందం వ్యక్తం చేశారు.

ఇళ్ల స్థలాల కోసం కదిలిన జర్నలిస్టు సంఘాలు.. జెండా పండుగ సాక్షిగా అంబేద్కర్ కు మొర....

జర్నలిస్టుల ఇళ్ళ స్ధలాల కోసం ఇక యుద్దమే
◆ ఇంటి స్థలాల కోసం ఖమ్మంలో జర్నలిస్టుల అక్రందన
◆ గణతంత్ర దినోత్సవం రోజు అంబేద్కర్ కు మొర
◆ ఇంటి స్ధలాలను సాధించేంత వరకు దశల వారి ఆందోళన
◆ రాష్ట్ర టీయూడబ్ల్యూజే (ఐజెయు)రాష్ట్ర కార్యదర్శి కె. రాంనారాయణ, టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు
◆ భారీగా కదలివచ్చి అంబేద్కర్ కు మొర పెట్టుకున్నఖమ్మం సెగ్మెంట్ జర్నలిస్టులు
◆ ఏకత్రాటిపైకి వచ్చిన ఖమ్మం జర్నలిస్టు సమాజం

ఖమ్మం, జనవరి 26 : జర్నలిస్టుల దశాబ్దాల సొంత గూటీ కల సాకారం చేయండి అంటూ జర్నలిస్టులు అంబేద్కర్ కు మొరపెట్టుకున్నారు. ప్రభుత్వాలు మారిన తమ గూటి గోడు మాత్రం అలాగే ఉండిపోవడంతో.. మరోసారి ఖమ్మం  నియోజకవర్గంలోని జర్నలిస్టులు కదిలారు. ఇళ్ళ స్ధలాల కోసం గణతంత్ర దినోత్సవం రోజు జర్నలిస్టుల లోకం కదలివచ్చింది. మూడు  దశాబ్దాల కలను సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జివో ను అమలు చేయాలని కోరుతూ ఖమ్మం నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కదిలివచ్చిన జర్నలిస్టులు ముక్తకంఠంతో రాజ్యంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మొరపెట్టుకున్నారు. ఖమ్మం నగరంలో జెడ్పి సెంటర్ లోని సంఘ సంస్కర్త, దేశ ప్రజలకు స్వేచ్చ, వాక్ స్వతంత్రాన్ని ఇచ్చిన స్పూర్తి దాత మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఇళ్ళ స్ధలాలు రాకుండా అడ్డుపడుతున్న అద్రశ్యశక్తిపై జర్నలిస్టులంతా ఆదివారం అక్రందన వ్యక్తం చేశారు. దేశానికి రాజ్యంగం అధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకోని 76వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్బంగా ఆదివారం జర్నలిస్టులంతా తమ న్యాయమైన హక్కును కల్పించాలని అంబేద్కరుడిని వేడుకున్నారు. గడిచిన మూడు దశబ్ధకాలంలో జర్నలిస్టుల నోటికాడికి వచ్చిన ముద్దను లాక్కుంటున్నారని, మళ్ళీ ఈసారి కూడా అదే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా ఒక్క ఖమ్మం జిల్లాలోనే జర్నలిస్టుల హౌజింగ్ సోసైటికి ప్రభుత్వం  23.02 ఎకరాల స్ధలాన్ని కేటాయించిందని, మార్కేట్ విలువ ప్రకారం ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి స్ధలాన్ని స్వాధీనం చేసుకోవాలనే అనుమతి పత్రాన్ని కూడా జారీ చేసిన తరువాత ఈ పక్రియను అర్ధాంతరంగా  నిలిపివేయడం జర్నలిస్టుల 25 ఏండ్ల ఆశలపై నీళ్ళు చల్లినట్లయ్యిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన మూడు ప్రధాన జర్నలిస్టు సంఘాలు ఒక్క త్రాటిపైకి వచ్చి, ఇళ్ళ స్ధలాల సోసైటీని ప్రక్షాళన చేసుకొని ఐక్యంగా ముందుకు సాగుతున్న తరుణంలో ఇంటి పట్టాలు చేతికి వచ్చే సమయంలో రాష్టాన్ని సాకుగా చూపి మా కడుపుకొట్టడం  తగదన్నారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు రాష్ట్ర క్యాబినేట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారని మా ఆవేదనను, అక్రందనను అర్ధం చేసుకొని ఖమ్మం జిల్లా నుంచే జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని వారు విన్నవించుకున్నారు. జర్నలిస్టులకు, తెలంగాణ ఉద్యమ కారులకు ఇళ్ళ స్ధలాను అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తమ మ్యానిఫెస్టోలో చేర్చారని ఈ సందర్బంగా వారు గుర్తు చేశారు.

ఇళ్ల స్ధలాల కోసం ఇక ఉద్యమమే : రాంనారాయణ

ఖమ్మంలో ఇళ్ళ స్ధలాల కోసం దశలవారిగా ఆందోళనకు జర్నలిస్టులంతా సిద్దంగా ఉండాలని టీయూడబ్ల్యూజే(ఐజెయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోల రాంనారాయణ పిలుపునిచ్చారు. జెడ్పి సెంటర్ వద్ద జరిగిన జర్నలిస్టుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగిస్తూ ఈరోజు నుంచే ఉద్యమకార్యచరణ ప్రారంభం అయ్యిందని ఇది ఆరంభమేనని అవసరం అయితే జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి అక్కడే దిగ్బంధనం చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాలు ఇస్తామని ఆశ చూపాయని, గత ప్రభుత్వంలో ఏకంగా జీవో జారీ చేసి స్ధలాన్ని కూడా కేటాయించిందని దానిని అమలు చేయడంలో మాత్రం ఎందకు జాప్యం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలను కేటాయించారని, ఇటివలనే మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లోని జర్నలిస్టులకు కూడా ఇళ్ధ స్ధలాలను ఇప్పించారని, హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలను ఇప్పించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా ఖమ్మం జర్నలిస్టుల హౌజింగ్ సోసైటికి ప్రభుత్వం స్ధలాన్ని కేటాయించిందని ఇతర జిల్లాలో ఎక్కడ స్ధలాన్ని కేటాయించిన దాఖలాలు లేవన్నారు. స్దల కేటాయింపుతో పాటు ప్రభుత్వ అమోదం ఉన్నందున తక్షణమే ఇళ్ధ స్ధలాలను పంపిణి చేసేవిధంగా జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు చోరవ తీసుకొని అర్హులైన జర్నలిస్టులందరికి ఇళ్ళ స్ధలాలు దక్కేవిధంగా క్రషి చేయాలని కోరారు. 
 
ఇండ్ల స్థలాలు ఇచ్చి తీరాల్సిందే : టీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ

జర్నలిస్టులకు ప్రభుత్వ హామీ మేరకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరాల్సిందేనని టిజెఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ అన్నారు. ఈ సందర్భంగా  ఆదినారాయణ మాట్లాడుతూ... ఖమ్మం జర్నలిస్టులకు గత ప్రభుత్వం 23.02 ఎకరాల భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేసిందని, అటువంటి జీవో అమలు చేయవలసిన పాలకులు నేడు విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి అందినట్లే అంది అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని ఇది మంచి పరిణామం కాదని, గత 30 సంవత్సరాలుగా జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని కానీ, సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. అంతా రేడి అయిందనుకున్న తరుణంలో అద్రశ్య శక్తి అడ్డుకుందని సమాచారం ఉందని, సమాజసేవ కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల సానకులంగా వ్యవహరించాలని ఆయన కోరారు. నేడు అంబేద్కర్ కు ఇచ్చే వినతి పత్రంతో మొదలయ్యే జర్నలిస్టుల ఆందోళన మరింత ఉధృతం చేస్తామని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చేవరకు ఈ పోరాటం కొనసాగిస్తామన్నారు. 

పని పూర్తయిన ఇళ్ల స్థలాలను జర్నలిస్టులకు అందజేయాలి : స్ధంభాద్రి జర్నలిస్టు హౌజింగ్ సోసైటి అధ్యక్షులు కనకం సైదులు

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ అధికారుల పరంగా పూర్తి కావచ్చిందని, వెంటనే జర్నలిస్టులకు అందజేయాలని స్ధంభాద్రి జర్నలిస్టు హౌజింగ్ సోసైటి అధ్యక్షులు కనకం సైదులు అన్నారు. ఈ సందర్భంగా కనకం సైదులు మాట్లాడుతూ... ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గత ప్రభుత్వం క్యాబినెట్ తీర్మాణం చేసిందని, ఈ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల పక్షాన ఇళ్లస్థలాలు ఇస్తామని చెప్పి నేటి వరకు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న తీరు బాధాకరమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీ అమలు చేయాలని, ముగ్గురు మంత్రులు ఉన్నా ఖమ్మంలో మాత్రం జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇళ్ల స్థలాలు సొసైటీకి భూమి కేటాయిస్తామని కలెక్టర్ మెమో తయారు చేసి సోసైటికి  ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో అర్ధాంతరంగా ఆపివేసి రాష్ట్రాన్ని సాకుగా చూపించి ఖమ్మం జర్నలిస్టులకు నష్టం నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అందుకే తమ గోడును రిపబ్లిక్ డే రోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  కి వినతిపత్రమిచ్చి తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రజాప్రతినిధులకు అధికారులకు కనువిప్పు కలిగించేలా చూడాలని వేడుకున్నామన్నారు. తమ సమస్య పరిష్కారం కాకపోతే దశల వారిగా పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. 
టీయూడబ్ల్యూజే (ఐజెయు) జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు నలజాల వెంకట్రావ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి నాలుగు స్దంభాల్లో మూడు స్ధంభాల ప్రతినిధులు ప్రభుత్వ వేతనాలు చెల్లిస్తుండగా, నాలుగో స్ధంభమైన ఫోర్త్ ఎస్టేట్ సమాజసేవ కోసం గౌరవ వేతనాలతో చాలి చాలనీ జీవితాలను గడుపుతున్నారని అన్నారు. మాకున్న హక్కు కోసం గణతంత్ర దినోత్సవం నాడు అంబేదర్క్ కు వినతిపత్రంతో మొర పెట్టుకున్నామని అన్నారు. నేటి పాలకులు తమ మొరను అలకించి తమ ఇళ్ళ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ నాయకులు మాటేటి వేణుగోపాల్, మైసా పాపారావు, మైనోద్దిన్, మామిడాల భూపాల్ రావు, తాళ్ళూరి మురళీ క్రష్ణ, సాక్షి మహేందర్, టివి9 నారాయణ, ఏబీఎన్ శ్రీధర్, ఈటీవీ లింగయ్య, చిర్రా రవి, బొల్లం శ్రీనివాస్, సాంబశివరావు, ప్రశాంత్ రెడ్డి, రజనీకాంత్, గుద్దేటి రమేష్ బాబు, జనతా శివ, జనార్దనచారి, నామ పురుషోత్తం, కళ్యాణ్, పసుపులేటి సత్యనారాయణ, ఉషోదయం శ్రీనివాస్, వేణుగోపాల్, మేడి రమేష్, రాంబాబు, జగదీశ్, జానీ, రాఘవ, చక్రవర్తి టౌన్ రిపోర్టర్లు రాంబాబు, హరీశ్, మోహన్, నాగేశ్వర్ రావు, తిరుపతి, అలస్యం అప్పారావు, నాగరాజు తో పాటు సుధాకర్, విజయ్, వినయ్, రాజు, సాయి రఘునాధపాలేం, ఖమ్మం అర్బన్ మండలాల పాత్రికేయులు డెస్క్ జర్నలిస్టులు ప్రసాద్ రావు, నారాయణరావు, మహిళా జర్నలిస్టులు మధులత, ఈశ్వరీ, రోజా తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ విగ్రహంతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు లకు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలను అందజేశారు.

Friday, 24 January 2025

ఇదిగో ఇదే‌ మా నాన్న జ్ఞాపకం. - అలైదా గువేరా.


దేశదేశాల యువతరం గుండెల మీద చెరగని సంతకం... చే గువేరా. ఆయన మరణానంతరం కూడా చే రూపం విప్లవోద్యమ స్ఫూర్తికి చిహ్నంగా నిలుస్తోంది అంటే అతిశయోక్తి లేదు. ప్రపంచ వ్యాపితంగా పీడిత ప్రజల ఆదరాభిమానాలను అందుకుంటున్న క్యూబా విముక్తి పోరాట యోధుడు చే గువేరా కుమార్తె డా. అలైదా గువేరా ఆదివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా... ప్రముఖ పిల్లల వైద్యురాలిగా సేవలు అందిస్తున్న ఆమె క్యూబన్‌ వైద్యరంగ విశేషాలతో పాటు అక్కడి మహిళల స్థితిగతులు, ఫిడెల్‌ క్యాస్ర్టోతో తనకున్న అనుబంధం తదితర విషయాల గురించి అలైదా చెబుతున్నారిలా..!
*ప్రశ్న:- కరోనా సమయంలో యాభైకుపైగా దేశాల్లో క్యూబా వైద్యులు సేవలందించారు కదా.! ఒక చిన్న దేశం నుంచి అదెలా సాధ్యమైంది.?*

*అలైదా గువేరా:* కరోనా వంటి అంటు వ్యాధులు ప్రబలినప్పుడే కాదు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా ఇతర దేశాల అభ్యర్థన మేరకు క్యూబన్‌ వైద్యులు ఆయా దేశాలకు వెళ్లి సేవలందిస్తారు. అలా కరోనా సమయంలోనూ ఆఫ్రికా, యూరప్‌ దేశాల్లో వైద్య సేవలు అందించాం. క్యూబన్‌ వైద్యులకు ప్రజల ప్రాణాలను కాపాడటమే ముఖ్యం. అంతకు మించి డబ్బులు ప్రధానం కద.
#################################

*తుది దశకు బడ్జెట్‌ రూపకల్పన.. హల్వా వేడుకలో నిర్మలా సీతారామన్‌*

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఏటా నిర్వహించే హల్వా వేడుకను నార్త్‌ బ్లాక్‌లో (ఆర్థిక శాఖ కార్యాలయం) శుక్రవారం సాయంత్రం నిర్వహించారు.
ఈ వేడుకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న అధికారులకు, సిబ్బందికి హల్వాను నిర్మలా సీతరామన్‌ స్వయంగా పంచిపెట్టారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి, ఉన్నతాధికారులు తుహిన్‌కాంత్‌ పాండే, అజయ్‌ సేథ్‌ తదితరులు ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇది వరుసగా ఎనిమిదోసారి. ఓ వైపు జీడీపీ వృద్ధి మందగించిన వేళ (6.4 శాతం నమోదు కావొచ్చని అంచనా) 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆమె బడ్జెట్‌ ప్రతిపాదించనున్నారు. ఈ సారి కూడా డిజిటల్‌ రూపంలోనే బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. గడిచిన నాలుగు బడ్జెట్‌లుగా ఇదే పద్ధతిని అనురిస్తున్నారు.

 *వారికి లాక్‌-ఇన్‌* 

హల్వా వేడుకతో బడ్జెట్ లాక్-ఇన్పీరియడ్ ప్రారంభం అవుతుంది. అంటే బడ్జెట్ తయారీలో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులు, సిబ్బంది - పార్లమెంట్‌లో దానిని ప్రవేశపెట్టేవరకు ఆ నార్త్ బ్లాక్‌లోనే ఉంటారు. వారు బయటకు వెళ్లడానికి వీలుండదు. వారు ఎల్లప్పుడూ సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బంది నిఘాలో ఉంటారు. కనీసం వారు ఫోన్ చేయడానికి కూడా వీలుండదు. ఒకసారి పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం పూర్తయిన తర్వాతే వీరు బయటకు వస్తారు. అంటే దాదాపు మరో వారం రోజుల పాటు వీరికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండవన్నమాట. 1950లో బడ్జెట్లోని ముద్రణ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో లీక్ అవ్వడంతో ఈ లాక్‌-ఇన్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఈడీకి ఎదురుదెబ్బ.. లక్ష జరిమానా...

ముంబైకి చెందిన రాకేశ్ జైన్ అనే స్థిరాస్తి వ్యాపారిపై మనీ లాండరింగ్ కింద దర్యాప్తు చేపట్టిన ఈడీ
ఓ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈడీ కేసు నమోదుదీంతో ముంబై హైకోర్టును ఆశ్రయించిన రాకేశ్ జైన్ఇందులో మనీ లాండరింగ్ ఎక్కడుంది.
 చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రజలను వేధించొద్దని హితవు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి రూ.1 లక్ష జరిమానా విధించిన ముంబై హైకోర్టు.....
#################################

*మరణశిక్ష విధించిన తర్వాత ఎందుకు పెన్నులు విరగ్గొడతారు?*
మరణ దండన విధించిన తర్వాత కలం మొనను విరగ్గొట్టే ఆచారాన్ని భారత న్యాయమూర్తులు బ్రిటీష్ పాలన కాలం నుంచి అనుసరిస్తున్నారు. మరణ శిక్ష విధించాక ఆ తీర్పును రద్దు చేయలేం అని చెప్పడానికి సంకేతంగా పెన్ను విరిచేస్తారు. అలాగే, రక్తం రుచి మరిగిన పెన్నుగా దానిని పరిగణించి, మరో ప్రాణం తీసే అవకాశం ఆ కలానికి ఇవ్వకూడదని ఈ పద్ధతి పాటిస్తారు.

Monday, 20 January 2025

*ప్రజావాణి దరఖాస్తులను ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలి .... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్**. ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తుల కు ప్రాధాన్యత నిచ్చి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి, సంబంధిత అధికారులకు పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు.ముదిగొండ మండలంలో క్రొత్తగా నియమించబడిన రేషన్ డీలర్లకు కార్డుల విభజన చేయగా, తమకు సంబంధించిన కార్డులకు సంబంధించి  రేషన్ బియ్యం దూరం వెళ్ళితీసుకోవడం జరుగుతున్నట్లు, దీంతో ఇబ్బందిగా ఉందని, రేషన్ కార్డుల సమవిభజనకు కోరగా, ఖమ్మం ఆర్డీవో కు పరిష్కారానికి కలెక్టర్ ఆదేశించారు.చింతకాని మండలం, మట్కేపల్లి నామారం కు చెందిన చిలక సైదులు, తనకు గల సర్వే నెం. 371, 383, 386/ఇ, 387/ఇ2, 388/ఇ2, 293/ఏ, 297 లోని భూమికి విలువ ధ్రువీకరణ పత్రం ఇవ్వగలందులకు కోరగా, ఖమ్మం ఆర్డీవో కు తగుచర్యకు ఆదేశించారు. వేంసూరు మండలం వేంసూరు గ్రామం నుండి బింగి సత్యనారాయణ, తనకు సర్వే నెం. 103/1/10 లో గల భూమిని రెవెన్యూ అధికారులు పొరపాటున మరొకరి పేరున నమోదుచేసి, పాస్ పుస్తకం జారీచేసారని, విచారించి న్యాయం చేయాలని కోరగా, కల్లూరు ఆర్డీవో కు తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు.స్థానిక ప్రకాష్ నగర్ నుండి ఓదెల వనిత, తాను దివ్యాoగురాలినని, తనకు రేషన్ కార్డ్, పెన్షన్ మంజూరుకు కోరగా, డిఆర్డీవో కి తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు.కల్లూరు మండలం ఎర్రబోయినపల్లె నుండి పొట్రూ భారతమ్మ, తన కుమారులు తన 3 ఎకరాల భూమి తీసుకొని, తనను చూడకుండా గెంటి వేశారని, తన పొలం, తనకు ఇప్పించమని కోరగా, కల్లూరు ఆర్డీవో కు విచారించి తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు.ఖమ్మం నుండి ఎస్కె. రహీమ్, తాను పేదవాడినని, తనకు భార్య, ఇద్దరు పిల్లలు, కిరాయి ఇంటిలో అద్దె కట్టలేని పరిస్థితి ఉందని, ఇందిరమ్మ ఇల్లు, ఇంటి స్థలం కానీ ఇప్పించాలని కోరగా, నగరపాలక సంస్థ కమీషనర్ కు పరిశీలనకై ఫార్వార్డ్ చేశారు.కొనిజర్ల మండలం గోపవరం గ్రామం నుండి మార్కాపుడి సుమలత, తాను బి.టెక్. చదువుకొని, నిరుద్యోగిగా ఇంటి వద్ద ఉన్నట్లు, అవుట్ సోర్సింగ్ లో ఉపాధికై కోరగా, జిల్లా ఉపాధి కల్పన అధికారిణి కి తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. ఏన్కూరు మండలం గార్లఒడ్డు గ్రామం నుండి కొర్ర సీత, తనకు తల్లాడ మండలం గోపాల్ పేట లో గల సర్వే నెం. 241/ఈ/1 గల భూమిని ఆన్లైన్ లో ఎక్కించి, కొత్త పాస్ బుక్ మంజూరుకు కోరగా, అదనపు కలెక్టర్/ఆర్డీవో లకు తగుచర్యకై ఆదేశించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో అరుణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------
#మణీకుమార్ కొమ్మమూరి#

Wednesday, 15 January 2025

50 international awards... Can we call '"Sanjay ray'"..

Absolutely we feel he is stamp of Satyajit Ray remembering him in style of making films.. in his own style.sanjay sanwal stands on heights receiving 50 international awards
Sanjay Sanwal Bombay based film maker is an Indian filmmaker based in Mumbai with an experience of more than 20 years in production, writing and filmmaking. Starting as a storyboard artist, today he stands tall with more than 50 international awards  received at various film festivals across the globe for his different films of his own. 50 yrs old.. Sanjay was started career in 1997 as a story board artist.. born and brought up in Nainital, Uttrakhand. The film i.e. trailer for the dubbed Hindi version was nominated at the Sea Gates film festival at Mumbai in 2009 later  'Ad-film Free Ticket" won more than 7 awards Globally /. He got  first international award  from Kenya.  The film is available on 
U-tube here is the link. https://www.youtube.com/watch?v=YDlRHFuyMAg It costs around 15 lakhs for a short film. I am looking for that amount from an investor for a film for the Cannes film festival , subject is EYE DONATION. We can make more than 50 Lakhs from the eye donation film if it clicks at the Cannes. I have made a film named Poonam. The budget for the film was around 1 Crore, it had the finest cast from Bollywood like RAJIT KAPOOR and MITA VASHISHTH. Here is the link of the film https://www.youtube.com/watch?v=pWkSFGNhlvk.
Sanjay Sanwal has been making ad-films and short films in Mumbai, India. His short films are mostly based on social issues. Currently his film Kannu, a film on child labor is being awarded at the Emirates Film Festival. Kannu has bagged more than two dozen awards and screening at awards and film festivals around the globe. The film has been screened and appreciated in countries like Australia, Bangladesh, Japan, Kenya, Nepal, Oman, Qatar, Sri Lanka, U.S.A. and others including several film fests. in India. The film was submitted at the Cannes, Toronto and Venice film festival. Kannu- which tells the story of a well-off man who keeps his promise to go trekking to the hills with his family. The children enjoy their hike and are famished as they trace their steps back. They eye a roadside food stall and make a bee line for it. There, while gorging on their food, the children see a boy of their age doing the dishes and other menial jobs. They learn from the owner that he does so for his own and his sick grandma’s survival. His plight evokes a sense of concern and apathy to all the members.  They are left appalled and left wondering what they and the society at large can do to stop child labor.
This film has been written and produced by Sanjay Sanwal with an eye on the award for the Cannes and other prestigious film festivals awards like Toronto, Venice and others. The film, of 10-minutes duration, is shot on a 4K camera. Made in Hindi language, it has been dubbed and subtitled in English.
Here is the link to the trailer of the film.  https://www.youtube.com/watch?v=CkKJbg5JRUQ    The Hindi version https://www.youtube.com/watch?v=ieYuAE7rugE
Sanjay Sanwal wants to sell the rights of the film Kannu. Also, he invites investors to invest in his upcoming film projects. Can we say Jewal of film making and creative art director actor..

మహా కుంభమేళా మహా రికార్డు... Mela an unbreakable record.. ప్రపంచ రికార్డులన్నీ ధ్వంసమయ్యాయి..


మహా కుంభం మొదటి రెండు రోజుల్లో 5.15 కోట్ల 
మంది స్నానాలు చేశారు.

తొలిరోజు మహాకుంభంలో 1.65 కోట్ల మంది స్నానాలు చేయగా, మకర సంక్రాంతి రోజున 3.50 కోట్ల మంది స్నానాలు చేశారు.
హింస జరగలేదు... కులం, మతం, పౌరసత్వం గురించి ఎవరినీ అడగలేదు... ఎవరినీ కించపరచలేదు.. మరే ఇతర మతాన్ని కూడా చిన్నచూపు చూడలేదు.
ప్రపంచం నలుమూలల నుంచి ధనవంతులు, స్వదేశీ, విదేశాల నుంచి అన్ని రకాల భక్తులు... వచ్చి... తమ మతాన్ని ఆచరించి అందరూ ఆనందించారు.
ఇన్ని కోట్ల మందికి ఆహారం, నీరు తదితరాల ఏర్పాటు ఉంది... ప్రయాగ్‌రాజ్‌లో వసతి కూడా ఉంది... లక్షలకు ఇది పూర్తిగా ఉచితం.
ఇలాంటి ఉదాహరణ ప్రపంచంలో ఎక్కడా 
మనకూ కనిపించదు...
తీర్థయాత్రల రహస్యాలు... ఈ ప్రయాగ్‌రాజ్ మహాకుంభం అతీంద్రియమైనది... మరపురానిది...ఊహకందనిద.

The Maha Kumbh Mela, the world’s largest spiritual gathering, is set to unfold in Prayagraj over the next 45 days. More than 40 crore devotees, from all walks of life, will gather to celebrate Sanatan Dharma and Hinduism, creating a historic event never witnessed before.This unparalleled festival centers on the Triveni Sangam, the confluence of the sacred Ganga, Yamuna, and Saraswati rivers. Bathing in these holy waters is believed to cleanse the soul and liberate one from the cycle of rebirth. The roots of the Kumbh Mela trace back to the eternal tale of the Samudra Manthan, representing the cosmic struggle between good and evil.The Maha Kumbh Mela is more than a festival—it’s a celebration of humanity’s collective faith, resilience, and unity. It is an opportunity to witness devotion on an extraordinary scale, meet spiritual leaders, and immerse oneself in age-old traditions.As the sacred event unfolds, we urge everyone to experience this once-in-a-lifetime phenomenon. Be part of a journey that transcends the material, connects you to the divine, and leaves an indelible mark on your soul. The Maha Kumbh Mela is not just an event; it is a spiritual calling.

Thursday, 9 January 2025

*Telangana Police Launches Citizen Feedback Initiative*


*January 9, 2025:* Telangana Police has launched an innovative, technology-driven initiative to enhance citizen feedback on police services. The initiative was introduced during a virtual meeting chaired by Director General of Police (DGP) Dr. Jitender, IPS. The meeting was attended by Cyberabad Commissioner of Police Avinash Mohanty, IPS., Joint Commissioner of Police  D. Joel Davis, IPS, and other officers from the Cyberabad CP Office Mini Conference Hall.
As part of the initiative, a QR code-based feedback system has been implemented to collect public opinions on their interactions with police services. Citizens can now scan QR codes displayed prominently at police stations, offices, and other key locations. Additionally, feedback is collected through outbound calls via the Citizen Feedback Call Centre, managed by the Centre of Excellence (CoE)-CID.The key feedback touchpoints include petition submissions, FIR registrations, traffic violation e-Challans, passport verification services, and other police-related services. Posters promoting the initiative have been distributed across all police stations and offices to encourage participation.
*Key Details of the Initiative*

Launch Date: January 9, 2025.
Feedback Collection Mechanism: QR codes displayed at police stations, offices, and public touchpoints for easy citizen access.
Feedback collected via outbound calls by the Citizen Feedback Call Centre.

*Feedback Touchpoints:*

Petitions.
FIR registrations.
Traffic violation e-Challans.
Passport verifications.
Other police services.

*Feedback Channels:*

Both physical and virtual platforms.
Posters prominently displayed across police stations and offices.

*Feedback Refinement*

Citizens and officers are encouraged to share suggestions on feedback forms and their content. Inputs can be sent to the SP CoE-CID via email at coefvts@gmail.com. Feedback forms will be periodically updated based on these inputs to ensure continuous improvement..An initial batch of five posters per police station and office has been distributed through DSP Stores from the Chief Office. Unit Officers and Range IGPs have been tasked with ensuring proper display and timely implementation of the initiative. Officers have also been instructed to promote the initiative extensively through print, electronic, and social media channels.
This initiative represents a significant step towards accountability, transparency, and enhanced public satisfaction with Police services in Telangana State.  The participants in the launch event from Cyberabad were Cyberabad DCP Crimes K. Narasimha, IPS, DCP EOW K. Prasad, DCP Road Safety Wing L.C. Naik, DCP Cyberabad CAR Headquarters Sanjeev, ADCP Administration Ravichandan Reddy, ACP Cyber Crimes Chandrakanth, ACP CCS Shashank Reddy and other officers.

Tuesday, 7 January 2025

నో వేర్ నుండి సమ్ వేర్ కు చేరాలంటే.. గుర్రం పరుగులా ప్రయాణం చేయాలి: మెగాస్టార్ చిరంజీవి


“ నేను నో వేర్.. అనే స్థాయి నుంచి స‌మ్ వేర్ అనే స్థాయికి వ‌చ్చానంటే న‌న్ను నేను మ‌లుచుకున్న విధానం బ‌ట్టి, ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను దాటి అనుకూల ప‌రిస్థితుల‌ను ఏర్పాటు చేసుకుని, ఎలా ఎదుగుతూ వ‌చ్చాన‌నేది చెబితే చాలు.. చాలా మందిని ఆలోచింప చేస్తుంద‌నిపించింది. నేను ఓ సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చిన వ్య‌క్తిని. చిన్నప్ప‌టి నుంచి ఆట‌లంటే ఆస‌క్తితో బాల్ బాడ్మింట‌న్‌కు వెళ్లాను అక్క‌డ బాల్ నా కంటికి త‌గిలి వాచిపోయింది. త‌ర్వాత వాలీబాల్ ఆట ఆడుదామ‌ని వెళితే అక్క‌డ కూడా బాల్ త‌గిలి వేళ్లు వంగిపోయాయి. క్రికెట్‌కు వెళితే బాల్ బొట‌న‌వేలుకి తగిలి వాచిపోయింది. దీంతో గేమ్స్ అచ్చిరాద‌నిపిస్తున్న త‌రుణంలో ఎన్‌సీసీలో జాయిన్ అయ్యాను. బీకాం ఫైన‌ల్ ఇయ‌ర్‌లో ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి రోడ్డుపై సైన్యంతో క‌లిసి క‌వాతు చేశాను. అదెంతో గొప్ప అనుభ‌వం అనే చెప్పాలి. ప్ర‌ధాని ఇందిరాగాంధీగారు, రాష్ట్ర‌ప‌తిగారున్నారు. త‌ర్వాత ఏంట‌నే దాని గురించి ఆలోచించిన‌ప్పుడు, కాలేజీలో రాజీనామా అనే డ్రామాలో యాక్ట్ చేశాను. దాంతో కాలేజ్‌లో న‌న్ను అంద‌రూ హీరోలాగా చూడ‌టం ప్రారంభించారు. అప్పుడే నా భ‌విష్య‌త్ న‌ట‌న అయితే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌కు నాంది ప‌డింది. కాలేజ్ చ‌దువు అయిపోగానే మ‌ద్రాస్‌లో యాక్టింగ్ స్కూల్‌కి వెళ‌తాన‌ని నాన్న‌గారికి చెప్ప‌గానే అక్క‌డ మ‌న‌కు ఎవ‌రూ తెలియ‌దురా.. అని అన్నారు. తెలియ‌ని ఫీల్డ్‌కు వెళ్లి రాణించ‌గ‌ల‌వా? అని అన్నారు. అయితే నా మ‌న‌సులో మాత్రం నేను త‌ప్ప‌కుండా రాణిస్తాన‌నే గ‌ట్టి న‌మ్మ‌కం అయితే ఉండింది. నేను యాక్టింగ్ స్కూల్‌లో ట్రైనింగ్ పూర్తి చేయ‌క ముందే నాకు ద‌ర్శ‌క నిర్మాత‌లు సినిమాల్లో అవ‌కాశాలిచ్చారు. ఎప్పుడైనా పాండిబజార్‌కి వెళ్లిన‌ప్పుడు కొంత మంది నెగెటివ్‌గా మాట్లాడేవాళ్లు. కుంగిపోయేవాడిని, రూమ్‌కెళ్లి నిద్ర‌పోయేవాడిని కాదు. ఆరోజు నాకు ఆంజ‌నేయ‌స్వామి మాత్ర‌మే తోడుగా ఉండేవాడు. ఆయ‌న‌తో మ‌న‌సులో మాట్లాడుకునేవాడిని. ఆయ‌నే నాకు స‌మాధానం చెబుతున్న‌ట్లు ఉండేది. ఫ‌స్ట్రేటెడ్ వాళ్ల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌కు అని ఆ భ‌గ‌వంతుడే చెప్పాడా?  లేక నా అంత‌రాత్మే చెప్పిందో తెలియ‌దు. అప్ప‌టి నుంచి అటు వెళ్లే వాడిని కాను. క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టిన గుర్రంలాగా ల‌క్ష్యం వైపు ప్ర‌యాణించాను. సినిమాల్లో నెంబ‌ర్ వ‌న్ కావాల‌నే ధ్యేయంతో ప్ర‌యాణంచాను. ఈ లోపు నాకు అవ‌మానాలు కూడా ఎదుర‌య్యాయి. ప‌రిస్థితుల‌ను అనుకూలంగా మార్చుకుంటూ ప్ర‌యాణించాను. నాకు నేనుగా నేర్చుకున్న ఫిలాస‌ఫీతో ముందుకు వెళ్లాను. స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌గారితో తిరుగులేని మ‌నిషి చిత్రంలో న‌టించాను. ఆ సినిమాలో నాకు మంచి పేరు వ‌చ్చింది. తర్వాత మరోసారి ఎన్టీఆర్‌గారితో మ‌రో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. నా ద‌గ్గ‌ర డేట్స్ కూడా తీసుకున్నారు. నేను వెయిట్ చేస్తున్నాను. నా పేరు లేకుండా మ‌రో న‌టుడికి అవ‌కాశం రావ‌టంతో ఎంతో డిసప్పాయింట్ అయ్యాను. అయితే ఆ టైమ్‌లో నాతో సినిమా చేస్తే పోతుంద‌నే బ్యాడ్ అయ్యే అవ‌కాశాలున్నాయి. దీంతో జంకాను. అయితే మ‌ళ్లీ గ‌ద్ద‌లాగా పాజిటివ్‌గా తీసుకుని ఎదిగాను. ఎవ‌రైతే చిరంజీవి వ‌ద్దులే అని అనుకున్నారో ఆయ‌న‌తోనే రామారావుగారి కంటే నాలుగు సినిమాలు ఎక్కువ‌గానే చేసేలా చేసుకున్నాను. ఆయ‌నతో చేసిన సినిమానే కోటి రూపాయ‌లు వ‌సూలు చేసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. మీ బ‌లం పాజిటివ్ థింకింగ్‌. ప‌రిస్థితుల‌ను అనుకూలంగా మార్చుకోవాలి. ప్రారంభంలో ల‌క్ష్య సాధ‌న‌లో నిల‌దొక్కుకోవాలి. డ‌బ్బు ప్ర‌ధాన కాదు. నిల‌బ‌డ్డ త‌ర్వాత డ‌బ్బు దానంత‌ట అదే వ‌స్తుంది. నాతో ప‌ని చేయ‌ని వాళ్లు, మ‌ళ్లీ చిరంజీవితో సినిమా చేయాలి అనుకునేలా నా ప్ర‌వ‌ర్త‌న ఉండేది. కాస్త త‌గ్గ‌టం వ‌ల్ల వ‌చ్చే వేవ్స్ ఆటోమెటిక్‌గా న‌న్ను పైకి తీసుకెళుతుంది. సినీ ఇండ‌స్ట్రీలో టాలెంట్ అనేది సెకండ‌రీ.. నిర్మాత‌ల‌తో ఎలా ఉంటావు.. వాళ్ల‌కు ఎలా స‌పోర్ట్ చేశావ‌నేది చూసుకోవాలి. టాలెంట్‌తో పాటు బిహేవియ‌ర్ కూడా ఉండాలి. రామారావుగారు పాలిటిక్స్‌కి వెళ్లిన త‌ర్వాత ఆ గ్యాప్‌లో ఎందరో మ‌హా న‌టులు.. నాగేశ్వ‌ర‌రావుగారు, శోభ‌న్‌బాబుగారు, కృష్ణంరాజుగారు, కృష్ణ‌గారు వంటి వారు ఉన్నారు. అయితే అప్పుడు ఓ కొత్త వాడికి చాన్స్ రావ‌టం అనేది ఎంత క‌ష్ట‌మైన విష‌య‌మో నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 
మ‌న ఎదుగుద‌ల‌తో వ్య‌క్తిత్వం ఎంతో కీల‌క‌మైన పాత్ర పోషిస్తుంది. ప్రేక్ష‌కులు ముందు న‌న్ను గుర్తించి చేయూత‌నిచ్చారు. రామారావుగారు రాజ‌కీయాల్లోకి వెళ్లిన త‌ర్వాత ఎవ‌రున్నార‌ని అంద‌రూ అనుకుంటుంటే ముగ్గురు హీరోలు నువ్వా నేనా అన్న‌ట్లుండేవాళ్లం. ఆ స‌మ‌యంలో డిస్ట్రిబ్యూష‌న్ సిస్ట‌మ్‌తోనే సినిమాలు న‌డిచేవి. ఓ హీరోతో యాబై ల‌క్ష‌ల‌తో చేయాలని నిర్మాత‌లు అనుకుంటుంటే విజ‌య‌వాడ‌కు చెందిన ల‌క్ష్మీ ఫిలింస్ లింగ‌మూర్తిగారు చిరంజీవిగారితో అయితే పాతిక ల‌క్ష‌ల్లోనే చేయ‌వ‌చ్చు.. అలా చేస్తే మేం పెట్టుబ‌డి పెడ‌తాం అన్నారు. అత‌నెందుకు? అని నిర్మాత‌లంటే.. అత‌ను ఆల్ రెడీ ఖైదీ లాంటి సినిమా చేశాడు.. అత‌ని డాన్సుల‌కు మంచి ఆద‌ర‌ణ వ‌స్తుంది. అత‌ని పొటెన్షియ‌ల్ మాకు తెలుసున‌ని అన్నారు. అప్ప‌ట్లో సాంగ్స్‌, ఫైట్స్ అనేవి రిఫ్రెష్‌మెంట్స్‌గా ఫీల్ అయ్యేవాళ్లని, చిరంజీవి సాంగ్స్‌, ఫైట్స్ ను ప్రేక్ష‌కులు అడిగి మ‌రీ రిపీటెడ్‌గా చూస్తున్నార‌ని లింగ‌మూర్తిగార‌న్నారు. ప్రేక్ష‌కులు కోరుకుంటున్నారు కాబ‌ట్టి నాకు ఆద‌ర‌ణ ద‌క్కింది. త‌ర్వాత రామారావుగారి నిర్మాత‌లు దేవీ ప్ర‌సాద్‌గారు, చ‌ల‌సాని గోపీగారు, త్రివిక్ర‌మ్‌గారు, ఏడిద నాగేశ్వ‌ర‌రావుగారు.. వంటి వారు నా షూటింగ్స్‌కు వచ్చి మాట్లాడేవాళ్లు. రామారావుగారి నిర్మాత‌లు నాతో సినిమాలు చేస్తున్నారంటే నేను నెంబ‌ర్ వ‌న్ హీరో అయ్యాన‌నిపించింది. అయ్యాన‌ని కాల‌ర్ ఎగరేస్తే ఏమ‌వుతుందో కూడా నాకు తెలుసు. అందుక‌నే అణిగిమ‌ణిగి ఉండాల‌ని, క‌ష్ట‌ప‌డి ప‌ని చేశాను. క‌ష్ట‌ప‌డితే ఆ నెంబ‌ర్ అలాగే ఉంటుంది త‌ప్ప ఎక్క‌డికీ పోదు. మ‌న నైపుణ్య‌మేంటో గుర్తించాలి, రిస్క్ తీసుకోవాలి, డిఫ‌రెంట్ ల‌క్ష్యాల‌ను ఏర్ప‌రుచుకోవాలి.. ఇవే ఎంట‌ర్‌ప్రెన్యూర‌ర్‌కు ఉండాల్సిన ల‌క్ష‌ణాలు. అవ‌న్నీ నాకు నేనుగా  ఫాలో అయ్యాను. ఫైట్స్‌, డాన్స్ సినిమాలే కాదు, స్వ‌యం కృషి, చంటబ్బాయ్ వంటి వైవిధ్య‌మైన సినిమాలెన్నో చేశాను. ప్రేక్ష‌కుల‌ను మోనాట‌నీగా ఫీల్ కాకుండా చేస్తూ వ‌చ్చాను. మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్టుగా క‌థ‌ల‌ను మార్చుకుంటూ సినిమాలు చేశాను. నా సీనియ‌ర్ న‌టీన‌టుల నుంచి మంచి విష‌యాల‌ను నేర్చుకుంటూ వ‌చ్చాను. నా అభిమానులు నాకు కొండంత అండ‌గా నిల‌బ‌డ్డారు. వారి స‌హకారంతోనే నేను బ్ల‌డ్ బ్యాంకుని స్థాపించి స‌క్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళుతున్నాను. అలాగే ఆప్త వాళ్లు కూడా ఎన్నోసార్లు అమెరికాలో ర‌క్త‌దాన శిబిరాల‌ను నిర్వ‌హించారు. ఇలా నా గురించి నేను చెప్పుకోవ‌టంలోనే తెలియ‌కుండా మీ అంద‌రికీ చెప్పాల్సిన విష‌యాల‌ను చెప్పాన‌ని అనుకుంటున్నాను. ఈ తీరుతో మ‌నం ముందుకు వెళితే ఎదురు ఉండ‌దు. నా ప్రయాణంలో నేను ఇన్‌స్పిరేష‌న్‌గా ఎలాగైతే నిలిచానో ఇక్క‌డున్న వారంద‌రూ భ‌విష్య‌త్తులో రాబోయే ఎంట‌ర్‌ప్రెన్యూరర్స్‌కి ఇన్‌స్పిరేష‌న్‌గా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌, నా ఫ్యామిలీలోని నా బిడ్డ‌లంద‌రూ నా అచీవ్‌మెంటే. మొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు.. ‘అన్న‌య్య నువ్వొక మాట అనేవాడిని గుర్తుందా.. మ‌న ఇంట్లో ఇంత మంది మీరున్నందుకు? ఈ అవకాశం నాకు భ‌గ‌వంతుడు ఇచ్చినందుకు, ఇది నాతో ఆగిపోకూడ‌దు. ఒక రాజ్ క‌పూర్ ఫ్యామిలీలో ఎంత మంది ఎలా ఉన్నారో, ఆ ర‌కంగా మ‌రో రాజ్ క‌పూర్ ఫ్యామిలీలా మ‌న మెగా ఫ్యామిలీ కావాల‌ని నువ్వు చెప్పావు’ అన్నారు. ఈరోజు నీ మాట మంత్రంలాగా ప‌ని చేసింది. నువ్వు క‌న్విక్ష‌న్‌తో అంటావు.. అందులో ఎలాంటి పొల్యూష‌న్ ఉండ‌దు. ఈ మ‌ధ్య ఓ ప‌త్రిక క‌పూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అని మా గురించి ప్ర‌స్తావించిన‌ప్పుడు ‘భ‌గ‌వంతుడా! ఇది నా గొప్ప‌ద‌నం కాదు, నువ్వు, ప్రేక్ష‌కులు, అభిమానులు ఇలా ఆద‌రించారు కాబ‌ట్టే ఇక్క‌డున్నామ‌’ని అనుకున్నాను.“
- ఆప్త‌(అమెరిక‌న్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియ‌ష‌న్‌) బిజినెస్ కాన్ఫ‌రెన్స్ మీటింగ్‌లో మెగాస్టార్ చిరంజీవి
#MegastarChiranjeevi.. సేకరణ

Saturday, 4 January 2025

దోచుకోవడం.. దాచుకోవడమే సర్కార్ పని : విలేకరుల సమావేశంలో డాక్టర్ కే ఏ పాల్


ఖమ్మం జనవరి 4:   దేశంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని అభివృద్ధిలో దూసుకుపోతామని ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దేశ ప్రజలను మోసం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భారతరత్న అవార్డు ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కె ఏ పాల్ విమర్శించారు.ఖమ్మంలోని కృష్ణ ఫంక్షన్ హాల్ లో శనివారం సర్పంచ్ లు, ఎంపీటీసీలు మేధావులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రతినిధులతో చర్చించి వారి అభిప్రాయాలను ఆయన తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో కే ఏ పాల్ మాట్లాడుతూ.... దేశ ప్రధానిగా మోడీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలం అయ్యారని, నిరుద్యోగం నానాటికి పెరిగిపోతుందని, రైతాంగ సమస్యలు పరిష్కరించలేక , అంబానీ, ఆదాని, బడా కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ ప్రజలను పట్టించుకోవటం మానేశారని దుయ్యబట్టారు.
 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు .బిజెపి ఆర్ఎస్ఎస్ వంటి శక్తుల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పుల మయంగా మారిందని, యాడాదికి లక్షన్నర కోట్ల అప్పు చేస్తుందని, ప్రతినెల పదివేల కోట్లుకు పైగాఅప్పు చేస్తూ ప్రజల నెత్తిన భారం మోపుతున్నారని ఆరోపించారు.
తమ్ముడు రేవంత్ రెడ్డి చేసే పాలన రాష్ట్రంలో అస్తవ్యస్తంగా తయారైందని, నిరుద్యోగులకు 15 వేలు కాదు కదా కనీసం 15 పైసలు కూడా ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల పథకాలు అమలు చేయటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని, తక్షణమే తన ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
భద్రాచలం నుంచి ఖమ్మం వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా అభివృద్ధి ఆనవాళ్లు లేవని,  అందుకే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి లు తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాకు తక్షణమే పదివేల కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
10 లక్షలు ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం సీతారామ ప్రాజెక్టు ఊసే ఎత్తడం లేదని, రైతులకు సాగు నీరు అందించడంలో ఇట్లు రేవంత్ రెడ్డి అటు ఖమ్మం జిల్లా మంత్రులు వైఫల్యం చెందారని దుయ్యబట్టారు. 
వరద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేయలేదని, కనీసం బాధితులను పరామర్శ కూడా నామమాత్రంగా ఓదార్చి చేతులు దులుపుకున్నారని, బాధ్యతలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేయడం ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. 
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించేందుకు సీఎం తో సహా 10మంది మంత్రులు వచ్చిన  తను ఒక్కడినే ఒకవైపు చర్చల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానని అందుకు మీరు సిద్ధమా? అనే ఆయన సవాల్ చేశారు. 
గత బిఆర్ఎస్ ప్రభుత్వం దోచుకోవటం దాచుకోవడానికే పరిమితమైందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే విధంగా ఉందని, అటువంటి వారికి భవిష్యత్తు ఉండదని అన్నారు. 
తులం బంగారం, లక్ష రూపాయల సహాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. 
*100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా*:- 
రానున్న గ్రామపంచాయతీ ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ ద్వారా గెలుపొందిన గ్రామాలలో వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని డాక్టర్ కే ఏ పాల్ అన్నారు. ప్రజాశాంతి పార్టీ ద్వారా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఏకగ్రీవంగా చేసుకునే బాధ్యత తను తీసుకుంటానని, యువతీ యువకులు పెద్ద ఎత్తున తమ పార్టీని ఆదరించాలని వచ్చే ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో ఉండేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గెలిచిన గ్రామాలలో వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. విద్యా , వైద్యం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, తాగునీరు, రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు వంద రోజుల్లో కల్పించి తీరుతామని సమావేశానికి వచ్చిన సర్పంచులకు భరోసాను ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీలో ప్రజలు పెద్ద ఎత్తున  చేరాలని ఆయన పిలుపునిచ్చారు.