Monday, 20 January 2025

*ప్రజావాణి దరఖాస్తులను ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలి .... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్**. ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తుల కు ప్రాధాన్యత నిచ్చి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి, సంబంధిత అధికారులకు పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు.ముదిగొండ మండలంలో క్రొత్తగా నియమించబడిన రేషన్ డీలర్లకు కార్డుల విభజన చేయగా, తమకు సంబంధించిన కార్డులకు సంబంధించి  రేషన్ బియ్యం దూరం వెళ్ళితీసుకోవడం జరుగుతున్నట్లు, దీంతో ఇబ్బందిగా ఉందని, రేషన్ కార్డుల సమవిభజనకు కోరగా, ఖమ్మం ఆర్డీవో కు పరిష్కారానికి కలెక్టర్ ఆదేశించారు.చింతకాని మండలం, మట్కేపల్లి నామారం కు చెందిన చిలక సైదులు, తనకు గల సర్వే నెం. 371, 383, 386/ఇ, 387/ఇ2, 388/ఇ2, 293/ఏ, 297 లోని భూమికి విలువ ధ్రువీకరణ పత్రం ఇవ్వగలందులకు కోరగా, ఖమ్మం ఆర్డీవో కు తగుచర్యకు ఆదేశించారు. వేంసూరు మండలం వేంసూరు గ్రామం నుండి బింగి సత్యనారాయణ, తనకు సర్వే నెం. 103/1/10 లో గల భూమిని రెవెన్యూ అధికారులు పొరపాటున మరొకరి పేరున నమోదుచేసి, పాస్ పుస్తకం జారీచేసారని, విచారించి న్యాయం చేయాలని కోరగా, కల్లూరు ఆర్డీవో కు తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు.స్థానిక ప్రకాష్ నగర్ నుండి ఓదెల వనిత, తాను దివ్యాoగురాలినని, తనకు రేషన్ కార్డ్, పెన్షన్ మంజూరుకు కోరగా, డిఆర్డీవో కి తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు.కల్లూరు మండలం ఎర్రబోయినపల్లె నుండి పొట్రూ భారతమ్మ, తన కుమారులు తన 3 ఎకరాల భూమి తీసుకొని, తనను చూడకుండా గెంటి వేశారని, తన పొలం, తనకు ఇప్పించమని కోరగా, కల్లూరు ఆర్డీవో కు విచారించి తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు.ఖమ్మం నుండి ఎస్కె. రహీమ్, తాను పేదవాడినని, తనకు భార్య, ఇద్దరు పిల్లలు, కిరాయి ఇంటిలో అద్దె కట్టలేని పరిస్థితి ఉందని, ఇందిరమ్మ ఇల్లు, ఇంటి స్థలం కానీ ఇప్పించాలని కోరగా, నగరపాలక సంస్థ కమీషనర్ కు పరిశీలనకై ఫార్వార్డ్ చేశారు.కొనిజర్ల మండలం గోపవరం గ్రామం నుండి మార్కాపుడి సుమలత, తాను బి.టెక్. చదువుకొని, నిరుద్యోగిగా ఇంటి వద్ద ఉన్నట్లు, అవుట్ సోర్సింగ్ లో ఉపాధికై కోరగా, జిల్లా ఉపాధి కల్పన అధికారిణి కి తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. ఏన్కూరు మండలం గార్లఒడ్డు గ్రామం నుండి కొర్ర సీత, తనకు తల్లాడ మండలం గోపాల్ పేట లో గల సర్వే నెం. 241/ఈ/1 గల భూమిని ఆన్లైన్ లో ఎక్కించి, కొత్త పాస్ బుక్ మంజూరుకు కోరగా, అదనపు కలెక్టర్/ఆర్డీవో లకు తగుచర్యకై ఆదేశించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో అరుణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------
#మణీకుమార్ కొమ్మమూరి#

No comments:

Post a Comment