వాహనాలను కొందరు సామాజిక హోదాకు చిహ్నాలుగా భావిస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా వినియోగించడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ తరహా తీరు పర్యావరణానికి చేటు చేస్తోందని ఒంగోలుకు చెందిన వైద్యుడు కొర్రపాటి సుధాకర్ భావించారు. చికిత్సను తన నుంచే ప్రారంభించాలనుకున్నారు. ఒంగోలు నగరంతో పాటు చుట్టుపక్కల ఇరవై కి.మీల వరకు ఏ చిన్న పని ఉన్నా గత పదిహేనేళ్లుగా సైకిల్‌పై ప్రయాణానికే ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతిరోజూ ఇంటి నుంచి ఆసుపత్రికి కూడా ఇదే తరహా తీరు.ఇటీవల సంక్రాంతి పండగకు నగరం నుంచి 42 కి.మీ దూరంలో ఉన్న స్వగ్రామమైన తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలేనికి సైకిల్‌పై వెళ్లి వచ్చారు. 2016లో పురుడు పోసుకున్న ప్రకాశం గ్లోబల్ ఎన్నారై ఫోరమ్(పీజీఎన్‌ఎఫ్) అనే సంస్థకు ఈ వైద్యుడు కన్వీనర్‌గా ఉన్నారు. జిల్లా నుంచి విదేశాల్లో స్థిరపడిన 200 మంది వరకు ఇందులో సభ్యులు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ సంస్థ తరఫున ఇప్పటికి సుమారు వెయ్యి వరకు సైకిళ్లను ఉచితంగా అందజేశారు. 170 ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు సమకూర్చారు.
No comments:
Post a Comment