75 వసంతాల స్వతంత్ర భారతంలో ఎన్నడూ ఎరుగని జెండా పండుగను జరుపుకున్నారు. చత్తీస్గడ్ రాష్ట్రంలో మావోయిస్టుల కబంధహస్తాల్లో ఉన్న చాలా గిరిజన గ్రామాలకు భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు పూర్తి అయినా...స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం అంటే తెలవని పరిస్థితి. అసలు వారు ఇప్పటివరకు త్రివర్ణ పతాకాన్ని చూసిన దాఖలాలు లేవు. అటువంటి గ్రామాలలో నక్సలైట్ బలమైన కోటలో మొదటిసారి, భద్రతా దళాలు, గ్రామస్తులు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.సుక్మాలోని గోమ్గుడాలో సిఆర్పిఎఫ్ 241 బస్తెరియా బెటాలియన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయగా, 223 రేగుడామ్‌లో సిఆర్‌పిఎఫ్ బెటాలియన్, హాయిస్ట్ తుమల్‌ప్యాడ్‌లోని సిఆర్‌పిఎఫ్ 74 వ బెటాలియన్ గ్రామస్తులతో కలిసి జాతీయ జెండాలను ఎగురవేసింది. దక్షిణ బస్తర్లో చాలా చోట్ల స్వాతంత్ర్యం తరువాత మొదటి సారి గ్రామస్తులు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయడం తో ఆనందం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment