దేశదేశాల యువతరం గుండెల మీద చెరగని సంతకం... చే గువేరా. ఆయన మరణానంతరం కూడా చే రూపం విప్లవోద్యమ స్ఫూర్తికి చిహ్నంగా నిలుస్తోంది అంటే అతిశయోక్తి లేదు. ప్రపంచ వ్యాపితంగా పీడిత ప్రజల ఆదరాభిమానాలను అందుకుంటున్న క్యూబా విముక్తి పోరాట యోధుడు చే గువేరా కుమార్తె డా. అలైదా గువేరా ఆదివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా... ప్రముఖ పిల్లల వైద్యురాలిగా సేవలు అందిస్తున్న ఆమె క్యూబన్ వైద్యరంగ విశేషాలతో పాటు అక్కడి మహిళల స్థితిగతులు, ఫిడెల్ క్యాస్ర్టోతో తనకున్న అనుబంధం తదితర విషయాల గురించి అలైదా చెబుతున్నారిలా..!
*ప్రశ్న:- కరోనా సమయంలో యాభైకుపైగా దేశాల్లో క్యూబా వైద్యులు సేవలందించారు కదా.! ఒక చిన్న దేశం నుంచి అదెలా సాధ్యమైంది.?*
*అలైదా గువేరా:* కరోనా వంటి అంటు వ్యాధులు ప్రబలినప్పుడే కాదు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా ఇతర దేశాల అభ్యర్థన మేరకు క్యూబన్ వైద్యులు ఆయా దేశాలకు వెళ్లి సేవలందిస్తారు. అలా కరోనా సమయంలోనూ ఆఫ్రికా, యూరప్ దేశాల్లో వైద్య సేవలు అందించాం. క్యూబన్ వైద్యులకు ప్రజల ప్రాణాలను కాపాడటమే ముఖ్యం. అంతకు మించి డబ్బులు ప్రధానం కద.
#################################
*తుది దశకు బడ్జెట్ రూపకల్పన.. హల్వా వేడుకలో నిర్మలా సీతారామన్*
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఏటా నిర్వహించే హల్వా వేడుకను నార్త్ బ్లాక్‌లో (ఆర్థిక శాఖ కార్యాలయం) శుక్రవారం సాయంత్రం నిర్వహించారు.
ఈ వేడుకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న అధికారులకు, సిబ్బందికి హల్వాను నిర్మలా సీతరామన్ స్వయంగా పంచిపెట్టారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి, ఉన్నతాధికారులు తుహిన్‌కాంత్ పాండే, అజయ్ సేథ్ తదితరులు ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా ఎనిమిదోసారి. ఓ వైపు జీడీపీ వృద్ధి మందగించిన వేళ (6.4 శాతం నమోదు కావొచ్చని అంచనా) 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆమె బడ్జెట్ ప్రతిపాదించనున్నారు. ఈ సారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గడిచిన నాలుగు బడ్జెట్‌లుగా ఇదే పద్ధతిని అనురిస్తున్నారు.
*వారికి లాక్-ఇన్*
హల్వా వేడుకతో బడ్జెట్ లాక్-ఇన్పీరియడ్ ప్రారంభం అవుతుంది. అంటే బడ్జెట్ తయారీలో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులు, సిబ్బంది - పార్లమెంట్‌లో దానిని ప్రవేశపెట్టేవరకు ఆ నార్త్ బ్లాక్‌లోనే ఉంటారు. వారు బయటకు వెళ్లడానికి వీలుండదు. వారు ఎల్లప్పుడూ సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బంది నిఘాలో ఉంటారు. కనీసం వారు ఫోన్ చేయడానికి కూడా వీలుండదు. ఒకసారి పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాతే వీరు బయటకు వస్తారు. అంటే దాదాపు మరో వారం రోజుల పాటు వీరికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండవన్నమాట. 1950లో బడ్జెట్లోని ముద్రణ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో లీక్ అవ్వడంతో ఈ లాక్-ఇన్ నిర్ణయం తీసుకున్నారు.
No comments:
Post a Comment