Friday, 28 February 2020

World Health Organization holds press conference


World Health Organization officials are holding a press conference Friday to update the public on the coronavirus outbreak.  the WHO said COVID-19 had spread substantially beyond China and was circulating in over 44 countries.

Epidemics have emerged in Iran, Italy and South Korea, where the number of cases are rapidly rising every day. "We're at a decisive point," WHO's director-general Tedros Adhanom Ghebreyesus told reporters on Friday. 

Thursday, 27 February 2020

విధి నిర్వహణలో మానవీయకోణం తో పనిచేయాలి...డీజీపీ మహేందర్ రెడ్డి.


హైదరాబాద్, ఫిబ్రవరి 27 :: రాష్ట్రం లో పోలీసు అధికారులు, సిబ్బంది శాంతి భద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తూ మానవీయ కోణంలో విధులు నిర్వర్తించాలని డీ.జీ.పీ ఎం. మహేందర్ రెడ్డి ఆదేశించారు. పఠాన్ చెరు లో బుధవారంనాడు కానిస్టేబుల్ చేసిన అనుచిత ప్రవర్తన నేపథ్యం లో పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ కమీషనర్లు, ట్రైనింగ్ కళాశాలలు, పోలీస్ బెటాలియన్లు,  ఎస్.పీ లు, ఇతర యూనిట్ అధికారులు,  ఎస్.హెచ్.ఓ, కానిస్టేబుల్, హోమ్ గార్డ్ అధికారులతో కలసి   ఒకే సారి వేయి కార్యాలయాలతో అనుసంధానమై నేడు సాయంత్రం దాదాపు మూడు గంటలపాటు  డీ.జీ.పీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అడిషనల్ డీ.జీ లు అభిలాష బిస్త్,  సందీప్ శాండిల్య,  ఐ.జీ స్టీఫెన్ రవీంద్ర, డీ.ఐ.జీ శివశంకర్ రెడ్డి తదితరులు డీజీపీ కార్యాలయం నుండి  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రామగుండం నుండి అడిషనల్ డీజీ జితేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీ.జీ.పీ. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణా పోలీస్ శాఖ ఎన్నోవిప్లవాత్మక మార్పులు తేవడం ద్వారా పోలీసింగ్ లో  ఇతర రాష్ట్రాలకు ఆదర్శం గా నిలిచిందని గుర్తుచేశారు. అయితే, పఠాన్ చెరు లో జరిగిన దురదృష్ట సంఘటనల వల్ల మొత్తం పోలీస్ శాఖ అప్రతిష్ట పాలు అయ్యే అవకాశం ఏర్పడిందని అన్నారు. నైతిక విలువలు, మానవీయత తదితర అంశాలపై పోలీస్ అధికారులు, సిబ్బందికి నిరంతరం పునశ్చరణ నిర్వహించాలని సూచించారు. ఇలాంటి  దురదృష్టకర సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉన్నతాధికారి నుండి కానిస్టేబుల్,  హోమ్ గార్డు వరకు బాద్యతాయుతం గా వ్యవహరించాలని సూచించారు.  విధి నిర్వహణ లో ప్రతీ పోలీస్ అధికారి ప్రజలే తమ యజమానులనీ,  తాము ప్రజల సేవకులమనే మౌలిక విషయాన్ని నిరంతరం పరిగణలో తీసుకోవాలని అన్నారు. చట్ట ప్రకారం, సమాజం హర్షించే విధంగా, ప్రజామోదం పొందే విధంగా పనిచేస్తూ తమ విధి నిర్వహణలో లక్ష్యాలను సాధించాలని డీజీపీ పేర్కొన్నారు. గత ఆరు సంవత్సరాలుగా మన పోలీస్ శాఖకు కలిగిన గౌరవం కేవలం ఒకరిద్దరు అధికారులు చేసే ఇలాంటి దురదృష్ట సంఘటనలవల్ల పోలీస్ శాఖ లో పనిచేసే వేలాది మంది పోలీస్ అధికారుల నిరంతర శ్రమ వృధా కాకుండా చూడాల్సిన భాద్యత ఉందని అన్నారు. పోలీసింగ్ పై ప్రజలనుండి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ స్వీకరించాలని, ఇందుకు గాను పోలీస్ స్టేషన్ల వారీగా  యువకులు, రైతులు, కార్మికులు,సీనియర్ సిటిజన్లు, ఉపాధ్యాయులు,మహిళలు, విద్యార్థినీ, విద్యార్థులతో కూడిన ప్రత్యేక ఫోకస్ గ్రూపులను ఏర్పాటు చేసుకోవాలని మహేందర్ రెడ్డి సూచించారు. పోలీస్ శాఖ పనితీరును సమాజం మొత్తం సునిశితంగా పరిశీలిస్తోందని, ఈ నేపథ్యం లో శాఖ లోని ఉన్నత స్థాయి అధికారినుండి కానిస్టేబుల్, హోమ్ గార్డ్ అధికారివరకు వరకు స్వీయ క్రమశిక్షణతో భాద్యతాయుతంగా ప్రవర్తించాలని తెలియచేశారు. వ్యక్తి ఆత్మ గౌరవాన్ని దెబ్బతినే  విధంగా ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రవర్తించ వద్దని ఆదేశించారు. ఈ విషయమై పోలీస్ శాఖ ఏవిధమైన చర్యలు చేపట్టాలన్న అంశంపై పోలీస్ కానిస్టేబుల్ నుండి అడిషనల్ డీజీ స్థాయి వరకు అధికారులు తమ అభిప్రాయాలను ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించారు. నేడు సుదీర్ఘంగా జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన మేధో మధనంలో వచ్చిన సలహాలు, సూచనలను అమలుపై  ఫోకస్ గ్రూప్ లతో సంప్రదించి తగు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నిర్ణయించారు. 
-------------------------------------------------------------------

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి కర్నూలులో ఘనస్వాగతం


*ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పి, ఎంపీలు, ఎమ్మెల్యేలు*
కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కాంగాటి.శ్రీదేవి కుమారుడు రామ్మోహన్ రెడ్డి, స్వర్గీయ చెరుకులపాడు నారాయణరెడ్డి దంపతుల కుమారుడు, వారి  సమీప బంధువు వైఎస్సార్ సిపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి కుమారుడు శివారెడ్డిల  వివాహ వేడుకలలో వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపేందుకు గురువారం ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు 11:16 గంటలకు
చేరుకున్నారు. ముఖ్యమంత్రి గారితో పాటు జిల్లా ఇన్చార్జ్ మరియు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు తలసిల రఘురాం లు ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్
నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కర్నూలు నగరంలోని దిన్నే దేవరపాడు (రాగమయూరి రీస్టార్ట్) కు 11:39 గంటలకు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ కే పకీరప్ప, జాoయిట్ కలెక్టర్ 2 సయ్యద్ ఖాజా మోహిద్దీన్, కర్నూలు యంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, 
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు శాసనసభ్యులు ఆర్థర్, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, శ్రీశైలం శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగి రెడ్డి, టిటిడి మెంబర్ మురళి,వైయస్సార్సీపి కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రామయ్య, నాయకులు ప్రదీప్ కుమార్ రెడ్డి, నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు తదితరులు సీఎం జగన్ మోహన్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి అర్జీలు సమర్పించి ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాగమయూరి రీస్టార్ట్ ఫెంక్షన్ హల్ కు 11:47 గంటలకు చేరుకొని వివాహా వేడుకలలో పాల్గొన్నారు. 

గురవాయూర్ ఆలయ గజరాజు కృష్ణైఖ్యం....84 వయసులోనూ గురువాయురప్ప సేవలో గజరాజు పద్మనాభన్

కేరళ /గురువయూర్  : భక్తులు గురువాయూర్ దైవానికి ప్రతిరూపంగా భావించే గజరాజు పద్మనాభన్ (84) బుధవారం మరణించారు. గజరాజు మరణం భక్తులు, ఏనుగు ప్రేమికులకు తీరని ఆవేదన మిగిల్చింది..
వయోభారం సంబంధిత సమస్యల కారణంగా గత  నెల రోజులుగా చికిత్స పొందుతున్నట్లు ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.. పద్మనాభన్ కేరళలోని ఏనుగుకైనా అత్యధిక ఊరేగింపు రుసుమును కలిగి ఉంది.

  అత్యంత పెద్ద వయస్సు, ఎత్తు ఉన్న ఏనుగులు చాలా ఉన్నప్పటికీ, పద్మనాభన్తతో ఎవరూ సరిపోలలేరని, ఈ గజరాజు పద్నమనాభన్  18, 1954 న  ఆలయానికి విరాళం ఇచ్చారు. 1962 నుండి ఆలయ సేవలలో పాలు పంచుకొంటూ  దైవం యొక్క ప్రతిరూపాన్ని తీసుకుని వెళుతున్న గురువాయూర్ పద్మనాభన్ గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం, గురువాయూర్ కేశవన్ అనే గజరాజు మరణం తరువాత ఆలయ సేవలలో వినియోగించబడుతోంది.. ‘పప్పన్’ అని పిలవబడే గురువాయూర్ పద్మనాభన్ ను జనవరి 18, 1954 న చెరుకొన్నథ్ నంబూదిరి అనే భక్తుడు గురువయూర్ శ్రీ కృష్ణ దేవాలయానికి తీసుకువచ్చారు, 
‘గజరత్నం’ రాకకు ముందు కథలు
గురువాయూర్ పద్మనాభన్ చరిత్ర నాదైరుతల్ (ఆలయానికి విరాళం)గా ఇచ్ఛారు.. పిల్లలు లేని  చెరుకున్నాద్ నంబూద్రి అనే భక్తుడు ఈ గజరాజు పద్మానాభన్ ను ఆలయ సేవకు సమర్పణ చేసినట్లు చేబుతారు. తన దుస్థితికి పరిష్కారం గురించి ఆలయ అర్చకులను ఆ భక్తుడు అడగడంతో ఏనుగును అర్పించాలని చెరుకునాథ్ నంబూదిరికి సలహా ఇవడంతో,  చెరుకున్నాథ్ నంబూదిరి పద్మనాభన్ ను ఆలయానికి అర్పించడంతో  గురువాయురప్ప అనుగ్రహంతో ఒక పిల్లవాడిని ఆశీర్వదించినట్లు కధనం. పద్మనాభన్(గజరాజు) వచ్చిన తరువాత, అనేక ఇతర ఏనుగులను కూడా గురువాయూర్ ఆలయానికి తీసుకువచ్చారు.
భగవంతుడు గురుయురప్పన్ కన్ను యొక్క ఆపిల్
జనవరి 18, 1954 న పద్మనాభన్ ఆలయానికి అర్పించారు  కేరళలోని అన్ని ఏనుగులలో ముఖ్యమైనదిగా ఎదిగాడు. అన్ని ఉత్సవాల యొక్క ఊరేగింపు సమయంలో ఈ గజరాజుకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. 1962 నుండి ‘ఏకాదసి విలక్కు’ , ‘అరట్టు ఎజున్నల్లిప్పు’ లలో గురువయరప్పన్ యొక్క తిడంబు (విగ్రహం) ను, ఇతర అన్ని ఉత్సవాలతో పాటు తీసుకువెళ్ళడం విశేషం. పురాణ గురువాయూర్ కేశవన్ మాదిరిగా గురువయరప్పన్ యొక్క ఆశీర్వాదం ఈ గజరాజు కు మెండుగా ఉందని గురువాయరప్పన్ భక్తులు విశ్వసించారు. వివిధ దేవాలయాల ఉత్సవాల నుండి లభించిన ప్రసిద్ధ పురస్కారాలలో ‘గజరత్నం’ ఒకటి.
పద్మనాభన్ యొక్క ఆకర్షణీయమైన లక్షణాలు
‘గజరత్నం’- గురువాయూర్ పద్మనాభన్ అద్భుతమైన లక్షణాలు కలిగిన గజరాజు అని కేరళీయులు చెబుతున్నారు.విశాలమైన వాయుకుంభం (నుదిటి బంప్), పెద్ద చెవులు ఫన్నింగ్ సమయంలో పెద్ద శబ్దం చేస్తాయి, ఎటువంటి చీలిక లేకుండా సమానంగా వేరు చేయబడిన దంతాలు, పొడవైన, మందపాటి తొండం భూమిని తాకినప్పుడు కూడా దాని తల ఎత్తుగా ఉంటుంది, చక్కటి తోక చీలమండను భూమిని తాకని ముగింపు . 'తిడంబు' (ప్రతిష్ఠించే దేవత యొక్క సూక్ష్మచిత్రం) ను మోస్తున్న ప్రతిసారీ నిర్వహించబడే గంభీరమైన రూపం. “మాతంగ లీలా” లో వివరించిన ఏనుగుల యొక్క అన్ని శుభ సంకేతాలతో, బాగా చెక్కిన ఆకారం. తెలివితేటలు ,ఆకర్షణీయమైన లక్షణాలు అతన్ని గురువాయూర్ ఆలయ గజరాజు పద్మనాభన్ సహజ లక్షణాలని ఆలయ సిబ్బంది వెల్లడించారు. ప్రశాంతంగా,  విధేయతతో కూడిన స్వభావానికి ప్రసిద్ది చెందాడు, 84 సంవత్సరాల జీవితంలో ఈ గజరాజు ఏవరిపైన దాడి చేసిన దాఖలాలు లేవు.
అన్ని ప్రాముఖ్యమైన పండుగలలో శక్తితో..
ఈ ప్రసిద్ధ గురువాయూర్ ఆలయ ఏనుగు అన్ని పూరాలలో ప్రసిద్ధమైన, అతి పెద్ద పూరంలో అనివార్యమైంది - త్రిస్సూర్ పూరం. 90 వ దశకం చివరి నాటికి త్రివాంబడి శ్రీ కృష్ణ దేవాలయం (త్రిస్సూర్ పూరంలో పాల్గొన్నవారిలో) తిడాంబును తీసుకెళ్లింది. 2004 లో నెన్మారా-వెల్లంగి వేలాలో పాల్గొన్నప్పుడు మొదటిసారి 2, 22,222 / - తో అత్యధిక పారితోషికం పొందిన రికార్డు గజరాజు సోంతం.  పద్మనాభన్ తన అపారమైన పవిత్రత మరియు ధర్మానికి ప్రశంసలు అందుకున్నాడు. ఎల్లప్పుడూ తిడంబును తీసుకువెళ్ళడానికి ఎన్నుకోబడ్డాడు. పెద్ద వయస్సులో కూడా ఆధ్యాత్మికత మరియు దైవభక్తి అతని నుండి ఎన్నడూ వేరు కాలేదు. శ్రీ కృష్ణ ఆలయ గురువాయూర్ యొక్క ఈ ఏనుగు రాజు గత 50 సంవత్సరాలుగా పవిత్రమైన తిడంబును దైవాన్నిమోస్తున్నాడు.

గురువాయూర్-గజకేసరి భూమి
గురువాయూర్ ‘గజకేసరి’ (ఎలిఫెంట్ కింగ్) యొక్క భూమి కావడం వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద బందీ ఏనుగుల సేకరణ ఉంది, ప్రధానంగా ఏనుగు రాజు ప్రతి కోణంలోనూ, శక్తి, విసిరిన, కాంక్రీట్ పందిరి మరియు విఐపి సంరక్షణతో. ఆలయానికి అంకితం చేసిన మిగతా ఏనుగుల మాదిరిగానే పద్మనాభన్ కూడా మంచి జీవితాన్ని పొందుతుంది. దేవాలయాలకు దోహదపడే ఏనుగులు కఠినమైన బ్రహ్మచర్యం మినహా వారి జీవన విధానాన్ని ఆనందిస్తాయి. వారికి పెంపుడు పేర్లు మరియు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వబడుతుంది, ఇది రోజుకు 32000 రూపాయలుగా వుంది.

Tuesday, 25 February 2020

.గాంధీ మార్గం అనుసరణీయం : ఢిల్లీ సి.ఎం.అరవింద్ కేజ్రీవాల్..

ఢిల్లీ అల్లర్ల పై సి.ఎం.అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
హక్కుల కోసం పోరాటం ఏవరైన చేయవచ్ఛని అది ఆహింస మార్గంలోనే వుండాలని పేర్కొన్నారు.. ఢిల్లీలో అల్లర్ల అనంతరం ఎం.ఎల్.ఏ.లు..ప్రభుత్వ ప్రధాన అధికారులతో సమావేమైన కేజ్రివాల్.. పరిస్థితిని సమీక్షించారు. ఆయన  అరవింద్ సిసోడియా, ఇతర ఎం.ఎల్.ఏలతో కలసి రాజ్ ఘట్ సందర్శించి మహాత్మ సమాధి వద్ద నివాళులు అర్పించారు.
.
క్లిష్ట సమయంలో, మనం మహాత్మా గాంధీ నుండి ప్రేరణ తీసుకొని అహింసను అవలంబించాలి. ఘర్షణల్లో హిందూ, ముస్లిం లతో పోలీసులు గాయ పడ్డారని పేర్కొన్నారు..హింస ద్వారా ఏమీ సాధించబడదు అంటూ ఆందోళన కారులకు హితవు పలికారు..అనంతరం కేజ్రీవాల్ ఢిల్లీ మ్యాక్స - జిటిబి హాస్పిటల్స్ లో చికిత్స పోందుతున్న క్షతగాత్రులను పరమర్శించారు...

Monday, 24 February 2020

లంగ్ లీవ్ యు.ఎస్ - భారత్ ఫ్రెండ్షిప్... లంగ్ లీవ్ : నమస్తే ట్రంప్ కార్యక్రమంలో మోధి నినాదం.

అహ్మదాబాద్ మోతేరా స్టడియంలో ప్రధాని నరేంద్ర మోదీ భారత్ - అమేరికాల  స్నేహ బంధం మధురమైనదని ఊటంకించారు. మిష్టర్ ప్రెసిడెంట్ మీరు 5వేల ఏళ్ల చారిత్రిక నౌక తీరం గల పట్టణంలో వున్నారంటూ ఆహ్మదాబాద్ నౌకశ్రయం చరిత్రను అమెరికన్లతో పాటు భారతజాతికి గుర్తు చేశారు.. . గత ఏడాది మేలో హౌడీమోడీ కార్యక్రమంలో అమెరికా రావడం సంతోషం కలిగిందంటూనే తమరు భారత్ రావడం మాకెంతో సంతోషం సుమండి అంటూ ట్రంప్ బృందాన్ని కాసిన్ని పొగడ్తలతో ముంచెత్తారు.ఆధ్యాతం జోష్ మొదలైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనలో భాలతీయుల్లో ఉత్సహం నింపినప్పటికి..ప్రయాణ బడలిక వల్లనేమో అగ్ర రాజ్య అధినేత డోనాల్డ్ ట్రంప్ లో  మాత్రం అమెరికా టూర్లలో ఉండే ఉత్సహం నేడు కాస్తా తగ్గిందనిపించింది..
ఆదివారం ఉదయం సకుటుంబ సపరివారంగా ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో భారత్ బయలుదేరిన ట్రంప్ దంపతులు, కుమార్తే,అలుడు ఇతర సిబ్బంది తో  ఆహ్మదాబాద్ చేరుకున్న వెంటనే శబర్మతి ఆశ్రమం చేరుకున్నారు అక్కడ గాంధీ చిత్ర పటానికి నూలుపోగు దండ వేసి నివాళి ఆర్పించారు.అనంతరం రాట్నం పై నూలు వడికే విధానం తెలుసుకుని రాట్నం తిప్పిరు. ఆశ్రమ సందర్శకుల పుస్తకంలో చేవ్రాలు రాసిన ట్రంప్ దంపతులకు ప్రధాని మోదీ చేడు వినకు..చూడకు..మాట్లాడకు అనే సందేశం ఇచ్ఛే మూడు కోతుల బొమ్మను చూపి దాని గురించి వివరించారు. అనంతరం అహ్మదాబాద్ నగరంలో నూతనంగా నిర్మాణం గావించిన అతి పెద్ద క్రికెట్ స్టేడియం లో నమస్తే ట్రంప్ కార్యక్రమానికి హాజరయ్యారు..ఈ సందర్భంగా స్టేడియంలో ప్రారంభ ఉపన్యాసం చేసిన ట్రంప్ అమేరికా ఇండియాల మధ్య ప్రేమ..అనుబంధం కలగలసిన.. స్నేహం వుందని ట్రంప్ అన్నారు.. ఇక్కడ బాలీవుడ్, క్రికేట్ క్రీడా ఎంతో గోప్పవని పోగడ్తలతో ముంచెత్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో వున్న నిర్మూలిద్దాం అంటూ ఇటీవల అల్ బాగ్దాదిని మట్టు పెట్టిన విషయం గుర్తు చేశారు.. ఉగ్రవాద నిర్ములనలో అమెరికా ఎప్పుడూ భారత్ కు అండగా వుంటుందన్నారు. ఛాయ్ వాలా గా జీవితం ప్రారంభించిన మోధి ప్రధాని కావడం అంటే అషామాషీ కాదన్నారు.. త్వరలోనే భారత్ తో వాణిజ్య ఒప్పందాలు ఉండబోతున్నాయంటూ సంకేతాలు ఇచ్ఛారు.. ఈ సందర్భంగా మోధి అమెరికా - భారత్ సంబంధాలు మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్ష వ్వక్తం చేశారు. మీరు కుటుంబ సపరివారంగా రావడం మాకు ఎంతో  ఆనందం కలిగించే విషయం. అమెరికా నుండి సుదీర్ఘ ప్రయాణం చేసి భారత గడ్డపై అడుపెట్టిన వెంటనే విశ్రాంతి తీసుకోకుండా నేరుగా శబర్మతి ఆశ్రమం సందర్శించి ఆ వెంటనే మోతేరా స్టేడియంలో అడుగు పెట్టారు. ఈ విషయం యావత్ భారతదేశం గుర్తుంచుకుంటుంది. మన స్నేహం చిరస్థాయిగా నిలిచి పోతుంది.లంగ్ లీవ్ ఫ్రేండ్ షిప్ అంటూ స్టేడియంలో వారితో నినదింపజేశారు.

Sunday, 23 February 2020

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన హిరో అర్జున్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్లలో భాగంగా రోజా,  వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు  హీరో అర్జున్ మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. పర్యావరణ పరిరక్షణ కి సంతోష్  చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్పూర్తిగా తీసుకొని రోజా  మొక్కలు  నాటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా అర్జున్  మాట్లాడుతూ భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని భావితరాలకు మంచి ఆక్సిజన్ అందించాలనే సంకల్పం గొప్పది . దానికి రోజా మొక్కలు నాటించే కార్యక్రమం చెప్పట్టడం చాలా అభినందనీయం అన్నారు . ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్,  రోజావనం లో జగపతిబాబు  , ప్రముఖ దర్శకుడు ఆర్కే సేల్వామణి, నటి కుష్బూ లను పాల్గొనాలని వారికి ఛాలెంజ్ విసిరారు. రోజా మొక్కలు నాటించడం గొప్ప శుభపరిణామం అని సంతోష్ కుమార్  ప్రత్యేకంగా అభినందించారు.

Friday, 21 February 2020

ఘరానా మొసం.. రియల్ ఏస్టేట్ విల్లాల పేరిట లక్షల లూఠీ


హైదరాబాద్జా : తక్కువ ధరకే సొంతీల్లు ..అలసించిన ఆశ భంగం అంటూ అందమైన ప్రకటనలతో జనాన్ని నమ్మించి లక్షలు దండుకున్న మాయ కంపెనీ ఉధంతం వెలుగులో కి వచ్ఛింది...
 si సతీష్ కుమార్ కథనం మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గ్ గ్రామానికి చెందిన సిడిగొందే అనిత పిర్యాదు మేరకు దమరి ఎస్టేట్స్ అండ్  ఏ  గ్రూప్ ఆఫ్ సుమన్ మీడియాస్ పేరుతో చెర్వుపల్లి సుమన్ @సుమన్ బాబు పంజాగుట్ట లోని ద్వారాకపురి కాలనిలో  రియల్ ఎస్టేట్ కంపనీ ఆఫీస్ ఓపెన్ చేసి ప్రముఖ టీవీ చానెల్స్ మరియు దినపత్రికలలో ఆకర్షణీయమైన యాడ్స్ ఇచ్చి తక్కువ ధరకే కమ్మదానం విలేజ్  ఫారూఖ్ నగర్ మండలంలో  విల్లాలు నిర్మించి ఇస్తామని చెప్పగా  అ యాడ్స్ చూసి నమ్మి ఆఫీస్ కు వచ్చి బాధితురాలు రెండు విల్లాలు బుక్ చేసుకుంది ఒక్కోవిల్లాకు 29 లక్షల చొప్పున 2 విల్లాలకు  ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ గా 14 లక్షల రూపాయలు బ్యాంకు అకౌంట్ ద్వారా ట్రాన్సఫర్ చేసింది.
10 రోజుల్లోనే  విల్లా రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ఇంతవరకు ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో  అనుమానం వచ్చి అడగడంతో రేపు మాపు అని   దాటవేస్తూ కాలయాపన చేయగా  మోసపోయమని గ్రహించి  ద్వారాకపురి లోని ఆఫీసు వెళ్లగా అక్కడినుంచి ఆఫీస్ ను అమీర్పేట్ లోని సిరి ఎస్టేట్స్ తరలించినట్టుగా తెలిసింది. ఇలా విల్లాల పేరుతో చాలా మందిని మోసం చేసినట్టుగా తెలిసింది .ఎలాంటి ల్యాండ్ లేకున్నా ల్యాండ్ ఓనర్స్ దగ్గర నుండి డెవలప్ మెంట్  పేరుతో కొంత మొత్తం అడ్వాన్స్ చెల్లించి అక్కడ ఎలాంటి వెంచర్ డెవలప్ చెయకున్న పేపర్ యాడ్స్ వేసి  వెంచర్ బ్రోచర్ లు ప్రింట్ చేసి అమాయకులను మోసం చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టుగా తెలిసింది.1.greenland2 
2.Shiva parvathi diamond space లాంటి పేర్లతో వెంచర్స్ పెట్టి ప్రజలను మోసం చేస్తున్నాట్టుగా విచారణలో తెలిసింది.ఇట్టి కేస్ లో ప్రధాన నిందితుడు అయిన చేరువుపల్లి సుమన్ ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది.  ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే పంజాగుట్ట పోలీసుస్టేషన్ లో సంప్రదించ గలరని పంజాగుట్ట ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.

Thursday, 20 February 2020

షుటింగ్ ప్రమాద మృతుల కుటుంబాలకు కమల్ ఆర్థిక సాయం...1కోటి సాయం ప్రకటన.....

తమిళనాడు : చెన్నై పూంతమల్లి వద్ద భారతీయుడు - 2 షూటింగ్ కోసం సెట్ వేసే సమయంలో క్రేన్ ప్రమాదంలో ముగ్గురు మరణించడం పట్ల నటుడు కమల్ హసన్ ఆవేదన చెందుతున్నట్లు చెప్పారు. తానుకూడా 3 సంవత్సరాల క్రితం ఓ సందర్భంలో గాయలపాలైయ్యానని తెలిపారు. అ సమయంలో ఎంతో మానసిక ఆందోళనకు గురైనట్లు తెలిపారు. శంకర్ దర్శకత్వంలో నిర్మాణం లో వున్న భారతీయుడు -2 చిత్రీకరణలో భాగంగా  ఈవీపీ స్టూడియోలో లైటింగ్‌  ఏర్పాట్ల నేపథ్యంలో బుధవారం రాత్రి 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్‌ తెగి చిత్రబృందం ఉండే టెంట్‌పై పడింది. ఈ ఘటనలో శంకర్‌ వ్యక్తిగత సహాయకుడు మధు(29), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ(34), సహాయకుడు చంద్రన్‌ మృతిచెందగా.. మరో పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను హాస్పిటల్లో పరమార్మ్మించిన  అనంతరం ఆయన  మీడియాతో మాాట్లాడారు. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని ప్రస్తుత ప్రమాదంలో తాను ముగ్గురు సహ సినీ సహచరులను కోల్పోవడం భాధకరమని పేర్కొన్నారు.
తన బాధ కంటే వారిని కోల్పోయిన కుటుంబం యొక్క దుఃఖం చాలా రెట్లు ఉంటుందని
వారిలో ఒకరిగా తన వంతుగా 1కోటి రూపాయలు ఆర్థిక సాయం బాధిత కుటుంబాలకు ప్రకటించారు. వారి కష్టాల్లో తన వంతు సహాకారం అందజేస్తానన్నారు.

Tuesday, 18 February 2020

సెల్ భధ్రం చూడాలంటే డబ్బు కట్టాల్సిందే...#

శ్రీశైలం.. శివరాత్రి బ్రహ్మ ఉత్సవాల్లో భక్తులకు సెల్ భధ్రత జేబులకు చిల్లు పడుతోంది.. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రముఖ క్షేత్రాలలో దర్శనానికి వెళ్లే భక్తుల మోబైల్ భధ్రపరచుకునేందుకు వున్న నగదు రుసుము ను ఎత్తివేయడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
 అయితే ప్రముఖ జ్యోతిర్లింగ శక్తి పీఠ క్షేత్రం శ్రీశైలంలో మాత్రం మోబైల్ భధ్రపరచే కౌంటర్ లలో ఒక్కోదానికి 5 వంతున చెల్లవేసి దర్శనానికి వెళ్లాల్సి వస్తోంది.. ఒక కుటుంబం దాదాపు 50రూపాయల వరకు మోబైల్ భద్రపరచేందుకు వెచ్ఛించాల్సిన పరిస్థితి నెలకొనివుంది...ఆదాయం పెంపుదలకు వివిధ మార్గాలు వుండగా అన్నివర్గాలు ఉపయోగించే మోబైల్ భద్రపరిచే క్లోక్ రూం వాళ్లు ముక్కుపిండి రూ.5/- వసూలు చేయడం పట్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. పాలక వర్గం.. దేవదొయ శాఖ మోబైల్ కంట్రాక్టు రద్దు చేసి ఉచితం చేయాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి      ఈ విషయం పై దృష్టి సారించాలని సామాన్య భక్తులు కోరుతున్నారు..

Monday, 17 February 2020

పరమేశా నీకు చోటుంది....! ఐఆర్టటిసి రైలులో బోలేనాధ్కు ప్రత్యేకంగా సీటు..#

వారణాసి : ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ ఫ్లాగ్ చేసిన ఐఆర్‌సిటిసి నిర్వహణలో మూడవ ప్రైవేట్ రైలు మహాకాళ్ ఎక్స్ ప్రెస్ లో ఒక సీటు శివుడికి మాత్రమే కేటాయించబడింది.
శివుడు,  చిత్రాలు, దండలు, అలంకరణలతో కొత్తగా ప్రారంభించిన కాశీ మహాకల్ ఎక్స్‌ప్రెస్‌లో కోచ్ బి 5 యొక్క సీట్ నంబర్ 64 ను చిన్న ఆలయంగా మార్చారు.  "భోలే బాబా"  పేరుతో ఈ సీటు/బెర్త్ ను  ప్రత్యేకంగా  తీర్చిదిద్దారు. పవిత్రమైన రోజులు,  సందర్భాలలో సీటు వద్ద ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలనే ఆలోచన కూడా వున్నట్లు రైల్వే అధికారుల బోగట్టా.
దీనిపై కొందరు కొంచెం అతీగా వుందని విమర్శిస్తుండగా మరికొందరు దేవునికి ఆ మాత్రం సీటు వదలాల్సిందే అంటూ స్వఛ్చమైన హిందీలో బహుత్ అచ్ఛా అంటున్నారు.
కాశీ మహాకల్ ఎక్స్‌ప్రెస్ ఓంకరేశ్వర్ (ఇండోర్ సమీపంలో), మహాకలేశ్వర్ (ఉజ్జయిని),  కాశీ విశ్వనాథ్ (వారణాసి) జ్యోతిర్లింగాలను కలుపుతు ప్రయాణించే ఈ రైలు ఫిబ్రవరి 20 నుండి క్రమం తప్పకుండా నడిపేందుకు ఐఆర్టటిసి ఏర్పాట్లు చేస్తోంది.. తేలికపాటి భక్తి సంగీతం, ప్రతి కోచ్‌లో ఇద్దరు  ప్రైవేట్ గార్డ్‌లు వుండే ఈ రైలులో శాఖాహారం భోజనం అందజేయనున్నారు. వారణాసి - ఇండోర్ మధ్య వారానికి మూడుసార్లు నడవనున్న రైలు పూర్తి ఏ.సి. బోగీలు వుంటాయి.ఈ రైలు వారణాసి - ఇండోర్ మధ్య లక్నో మీదుగా 1,131 కిలోమీటర్లు, వారణాసి మరియు ఇండోర్ మధ్య 1,102 కిలోమీటర్ల దూరం ప్రయాగ్రాజ్ (అలహాబాద్) ద్వారా సుమారు 19 గంటల్లో ప్రయాణించనుంది.

Friday, 14 February 2020

శ్రీశైల క్షేత్రానికి లక్ష విస్తర్ల సమర్పణ.. .రెండవ ఏడాది సంపూర్ణమైన సేవ సమితీ యోచన...


మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని  శ్రీ భ్రమరాంబికా సేవా సమితి ఆధ్వర్యంలో... శ్రీశైలం పుణ్యక్షేత్రానికి లక్ష విస్తరాకులను గురువారం అందజేశారు.
వీటిని ఇ.ఒ.కెఎస్.రామారావు శ్రీశైలం దేవాలయం అన్న సత్రం వద్దస్వీకరించి కార్యక్రమం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితమే సేవ సమితీ తరఫున మంచిరాజు మహాలక్ష్మీ దంపతులు సేవ సమితీ బాధ్యులతో కలసి లక్ష రూపాయలు గోశాలలో గోమాతలకు ఆహారం కోసమై అందజేయగా..
గత సంవత్సరం చేపట్టిన లక్ష విస్తర్ల సేవకు కొనసాగింపుగా ఈ ఏడాది కూడా రెండు లక్షల రూపాయల విలువతో లక్ష విస్తారాకులను కొనుగోలు చేసి ట్రాన్సుపోర్టు ఇతరత్రా ఖర్చులు భరించి శ్రీశైలం ఆలయంలోని అన్నప్రసాద శాలలో అందజేశారు. శివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో వచ్ఛే భక్తులకు అన్న ప్రసాదం అందజేసేందుకు వీటిని వినియోగించనున్నారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్ష, కార్యదర్శులు ఎంవీఎస్‌ మహాలక్ష్మి, అబ్బరాజు శ్రీనివాసకుమార్ తదితరులను ఆలయ అధికారులు అభినందించారు.... 
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఉన్న సమితి ప్రతినిధుల సహకారంతో సుమారు రూ.2 లక్షల విలువైన విస్తర్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా భధ్రాచల వాస్తవ్యులు.. తూము నరసింహదాసు వారసులు.. సీనియర్ పాత్రీకేయులు.. తూము శ్యామ్ గారిని సమితీ తరఫున చిరు సత్కారం చేయడం జరిగింది.. సమితీ బాధ్యులు.. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ.శ్రీనివాసకుమార్, ఎ.రాము(అనంతపురం), నాగేంద్రమ్మ, కె.మల్లిశ్వరి(తెనాలి), ఎ.రామచంద్రయ్య, సి.హెచ్.అప్పారావు(హైదరాబాద్), పి.గురవయ్య, వై.ప్రణయతి, లలితా ప్రసాద్, ప్రసన్న, సాంబశివరావు, విష్ణు మూర్తి, పురుషోత్తం(భధ్రాచలం) తదితరులు తమ తమ టీం సభ్యులతో కలసి పాల్గొని కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కృషి చేశారు.

 

Thursday, 13 February 2020

నేర పరిశోధనలో మేము సైతం అంటున్న పోలీసు జాగిలాలు.... 37 శిక్షణ పొందిన పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ .....

                                                                     
శాంతి భద్రతల పరిరక్షణ, సంక్లిష్టమైన కేసుల పరిశోధన, ఛేదనలో అత్యంత కీలక పాత్ర వహించే విధంగా ప్రత్యేక శిక్షణ పొందిన 37 పోలీస్ జాగిలాల ( వీటిని పోలీస్ భాషలో కెనెన్ అని పిలుస్తారు) పాసింగ్ అవుట్ పరేడ్ రేపు శుక్రవారం జరుగనుంది. మొయినాబాద్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ టైనింగ్ అకాడమీ లో జరిగే పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ కు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు  ముఖ్య అతిధిలుగా హాజరవుతారు. మొయినాబాద్ శిక్షణా కేంద్రం లో ఈ 37 జాగిలాలకు ఎనిమిది నెలల పాటు 53 మంది హాండ్లర్స్ (శిక్షకులు) ప్రత్యేక శిక్షణ ను ఇచ్చారు. ఈ 37 జాగిలాలలో ప్రధానంగా  లెబ్రడాల్‌, జర్మన్ షెప్పర్డ్, బెల్జియం మాలినోస్, కోకోర్ స్పైనల్, గోల్డెన్‌ రిట్రీవర్‌ జాతులకు చెందినవి వున్నాయి. 
*కుక్కలకు వాసన చూస్తే శక్తి 40 రెట్లు, వినికిడి శక్తి 20 రెట్లు, కంటి చూపు పది రెట్లు అదికం*
    విశ్వాసానికి మారు పేరుగా నిలిచే  కుక్కలు పోలీస్‌ శాఖకు నేర పరిశోధనలో కీలకంగా మారుతున్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరిగిన సమయంలో నిందితులను పట్టించడం, సంఘవిద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ, ఆస్తి నష్టం నివారించడంలో పోలీసు జాగిలాలు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 435 రకాల జాతులు ఉన్నాయి. చూసేందుకు అన్ని ఒకే పోలికతో ఉన్నప్పటికీ ఒక్కో జాతి శునకం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. వీటిలో ప్రధానంగా 12 జాతులకు చెందిన జాగిలాలను పోలీస్‌ శాఖ తమ నేర పరిశోధనల అవసరాలకు వినియోగించుకుంటున్నది. తెలంగాణా రాష్ట్ర పోలీస్‌ శాఖ లెబ్రడాల్‌, డాబర్‌మెన్‌, ఆల్సీషియన్‌, గోల్డెన్‌ రిట్రీవర్‌, డాల్మేషన్‌, జర్మన్‌షపర్డ్‌ వంటి ఆరు రకాల జాతుల జాగిలాల సేవలను మాత్రమే వినియోస్తున్నది. ఇవి కాకుండా ఎయిర్‌ ఫోర్టులో తనిఖీల కోసం చిన్నవిగా వుండే కాకర్స్‌ స్పెనియన్‌ జాతి కుక్కలను పోలీసులు వినియోగిస్తున్నారు. మనుషులతో పోలీస్తే వివిధ జాతుల కుక్కలకు వాసన చూస్తే శక్తి 40 రెట్లు, వినికిడి శక్తి 20 రెట్లు, కంటి చూపు పది రెట్లు అదికంగా కలిగివుంటాయి.            ఎనిమిది నెలల కఠోర శిక్షణ
  హైదరాబాద్‌లోని మొయినాబాద్‌లో  పోలీస్ శాఖ అద్వర్యం ఉన్నఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ టైనింగ్ అకాడమీలో   పోలీస్ జాగిలాలకు   కఠోర శిక్షణ ఇస్తున్నారు. తమకు అవసరమైన జాగిలాల గురించి ఆయా యూనిట్ల అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తారు. ఇంటెలిజెన్స్‌, సెక్యూ రిటీవింగ్‌ అధి కారుల ఆధ్వర్యంలో ఆయా యూనిట్లకు కావాల్సిన కుక్క (స్నిఫర్‌ లేదా ట్రాకర్‌)ను తీర్చిదిద్దేందుకు మూ డు నెలల వయస్సు కలిగిన కుక్క పిల్లలను అందుబాటులోని కేంద్రాల్లో కొను గోలు చేస్తారు. దీనిని హ్యాండ్లింగ్‌ చేసేందుకు  ప్రత్యేకంగా ఒక  కానిస్టేబుల్‌ను కేటాయిస్తారు.
. మొదటి నెలలో గ్రూమింగ్‌, వేళకు ఆహారం ఇవ్వడం ద్వారా యజమాని (హ్యాండ్లర్‌ ) పట్ల కుక్కకు ప్రేమ, ఆకర్షణ కలిగేలా చేస్తారు. 
ఈ సమయంలో కుక్క తన యజమానిని గుర్తించే స్థాయికి చేరుతుంది.  నాలుగోనెల నుంచి ఐదో నెల వరకూ విధేయత, కూర్చోవడం, నిలబడడం, పడుకోవడం, సెల్యూట్‌ చే యడం వంటివి నేర్పిస్తారు. ఆ తర్వాత వాటికి ఉన్నతాధికారుల సమక్షంలో పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణ త పొందిన వాటికి ఐదు నెలల పాటు పేలుడు పదార్థాలను కనిపెట్టడం,  నిందితుల ఆచూకీలను కనిపెట్టడం, ఇతర అంశాల్లో పూర్తి స్ధాయి శిక్షణనిస్తారు.
*క్రమం తప్పని దినచర్య*
ఉదయం ఆరుగంటలకు క్యానల్‌ లను స్థావరం నుంచి బయటకు వదులుతారు. ఎనిమిది గంటల వరకూ రన్నిం గ్‌, వ్యాయామంతో పాటు దైనందిన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటాయి. అరగంట పాటు గ్రూమింగ్‌ (దువ్వడం) చేస్తారు. ఎనిమిదిన్నరకు ఆహారం ఇచ్చి తిరిగి క్యానల్‌లోకి పంపిస్తారు. మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి ఆరున్నర గంటల వరకూ తిరిగి శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటాయి.
*ఎనిమిదేళ్లకే ఉద్యోగ విరమణ*
సాధారణంగా శునకాల జీవిత కాలం 12 నుంచి 14 సంవత్సరాలు. పోలీస్‌ జాగిలాలకు ఎనిమిదేళ్లు నిండగానే ఉద్యోగ విరమణ చేస్తారు. ఎందుకంటే ఈ వయసుకు వచ్చే సరికి జాగిలాలలో వాసన పసిగట్టే శక్తి తగ్గిపోతుంది. పేలుడు పదార్థాలను గుర్తించే జాగిలాలు సాధారణం కంటే 40 రెట్లు ఎక్కువగా వాసన పీల్చుతాయి.
*ఉద్యోగ విరమణ తర్వాత*
ఉద్యోగ విరమణ చేసిన పోలీస్‌ జాగిలాలను వాటి హ్యాండ్లర్స్‌కు అప్పగిస్తారు. ఒక వేళ వీటిని పెంచు కునేందుకు వారు సమ్మతించకపోతే జంతు ప్రేమికులు ముందుకు వస్తే పోలీసు ఉన్నతాధికారులు అన్ని విధాల పరిశీలించాక వారికి అప్పగిస్తారు. జంతు ప్రేమికులకు అప్పగించిన రెండు నెలల వరకు వాటి బాగోగు లను, యజమానితో జాగిలాలు వ్యవహ రిస్తున్న తీరును వాటి హ్యాండ్లర్లు తప్పని సరిగా పరిశీలిస్తారు
*క్రమశిక్షణలో మేటి*
పోలీస్‌ శాఖ అంటేనే క్రమ శిక్షణకు మారుపేరు. ఇందుకను గుణంగానే జాగిలాలు కూడా క్రమశిక్షణను పాటిస్తాయి. అతిఽథులు ఎవరైనా వచ్చినప్పుడు, విచారకర సంఘటనలు జరిగినప్పుడు హ్యాండ్లర్‌ ఆదేశాల మేరకు ఈ జాగిలాలు ప్రవర్తిస్తాయి. సెల్యూట్‌ చేయడం, నిర్దేశించిన వాహనంలోకి, లేదా ప్రదేశంలోకి వెళ్ళేలా హ్యాండ్లర్‌ ఇచ్చిన ఆదేశాలను శిరసా వహిస్తాయి.
    *నేర పరిశోధనలో ఘనం*
ఇంటి యజమానుల పట్ల శునకాలు ఎంత విశ్వాసం చూపుతాయో.. పోలీస్‌ కేసుల పరిశోధనలో కూడా అంతే పాత్ర పోశిస్తున్నాయి. బందోబస్తు, దొంగతనాలు, హత్య కేసుల్లో నేరస్థుల కదలికలను గుర్తించడం, బాంబ్‌లు, ఇతర మందు సామగ్రిని గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎన్నో కేసులను శునకాలు చేధించిన సందర్భాలు ఉన్నాయి.
*బీహార్ జాగిలాలు కూడా శిక్షణ*
జాగిలాల శిక్షణ లో జాతీయ స్థాయిలో పేరుగాంచిన మొయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో బీహార్ రాష్ట్రానికి చెందిన 20 జాగిలాల కు అక్రమ మద్యం గుర్తించేందుకు ప్రత్యేక శిక్షణ అందచేశారు. బీహార్లో అధికంగా వున్నా అక్రమ మద్యం తయారీ, వాటి నిల్వలను గుర్తించే విధంగా అక్కడి 20 కుక్కలకు మనదగ్గర ప్రత్యేక శిక్షణ నిచ్చారు. ఈ శిక్షణ పొందిన బీహార్ శునకాలు అక్రమంగా నిల్వ చేసిన మద్యం గుర్తింపు, అక్రమద్యం తయారీ కేంద్రాలను విజయవంతంగా గుర్తిస్తున్నాయని బీహార్ పోలీస్ శాఖ తెలిపింది.  
Source : K. Venkataramana, CPRO, DGP Office, Hyderabad .

Tuesday, 11 February 2020

అధునాతన హంగులతో ఆగర్వాల్ ఐ హాస్పిటల్.. మెహిదిపట్నంలో 7వ బ్రాంచి ప్రారంభించిన హిరోయిన్ అదాశర్మ...


డాక్టర్ ఆగర్వాల్స్ ఐ హాస్పిటల్ తెలంగాణ లో ఏడవ బ్రాంచిని మేధిపట్నంలో సినీ నటి అదాశర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డా "గౌరవ్ అరోరా,రీజనల్ హెడ్  క్లినికల్ సర్వీసెస్ , డా"వంశిధర్, రీజనల్ హెడ్  క్లినికల్ సర్వీసెస్ , డా"బాల్కి సత్క ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదాశర్మ మాట్లాడుతూ మన కళ్ళు అత్యంత విలువైనవని, ఇవి చూపును బహుమతిగా అందిస్తాయని అన్నారు. 
ఐ హాస్పిటల్ నూతన కేంద్రాన్ని ప్రారంభించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు అదాశర్మ. శస్త్ర చికిత్సలు, ఔట్ పేషెంట్,డయాగ్నోష్ఠిక్స్,దృష్టి లోపాలకు అంతర్జాతీయంగా అత్యున్నత ప్రమాణాలతో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ లో చికిత్స అందిస్తామన్నారు డా"అరోరా. తమ హాస్పిటల్ లో ప్రతి ఒక్కరికి మెరుగైన నేత్ర దృష్టికి భరోసా కల్పిస్తుందన్నారు డా వంశిధర్.

ఈ ప్రశాంత్ వెనకుంటే విజయము వెన్నంటే

అతడో వ్యుహకర్త..మాస్టర్ మైండ్..
అతనెక్కడుంటె అక్కడ విజయం నల్లేరుపై నడకే..మొన్న. బజాపా... నిన్న..వైకాపా...నేడు ఆప్ .
ప్రశాంత్ కిషోర్  భారతీయ రాజకీయ వ్యూహకర్త  రాజకీయ నాయకుడు  జనతాదళ్ (యునైటెడ్) లో రాజకీయ అరంగేట్రం చేసిన ఈ మేధోకర్త. 
పౌరసత్వ సవరణ చట్టం (2019) పై జనతా దళ్  విమర్శించినందుకు కిషోర్ని  జనవరి 29, 2020 న అధ్యక్షుడు నితీష్ర్టీకుమార్ పార్టీ నుండి  బహిష్కరించారు.  ప్రారంభంలో ప్రజారోగ్యంలో శిక్షణ పొందిన కిషోర్ భారత రాజకీయాల్లోకి రాకముందు ఐదేళ్లపాటు ఐక్యరాజ్యసమితిలో  పనిచేశారు .
2014 కేంద్రంలో బజాపా బారీ మొతంలో సీట్లు..
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ భారీ మొత్తం లో సీట్లు..
.ఇప్పుడు కెజ్రీవాల్ నేతృత్వంలో అప్ కి దక్కిన అధిక సీట్లు ప్రశాంతంగా ప్రశాంత్ కిషోర్ మ్యాజిక్ మానియా..హట్స్ ఆఫ్ టు ప్రశాంత్ కిశోర్ బ్రిలోయన్స్ & టీం వర్క్..

Sunday, 9 February 2020

సమాచార హక్కు తెచ్చిన తంటా.. కార్యదర్ములు స్థానికంగా వుండాలంట...

గ్రామస్థుల సమస్యలు తీర్చేందుకు పంచాయతీ సెక్రటరీలు & జూనియర్ పంచాయతీ సెక్రటరీలు తాము పనిచేసే గ్రామంలోనే స్థానికంగా నివసించాలంటూ కలేక్టర్ ఆదేశాలు జారిచేయడంతో ఈ సమాచార హక్కుతో మా చెడ్డా తంటా వచ్ఛిపడిందంటూ గ్రామ కార్యదర్శులు చెవులు కొరుక్కుంటే..ఎన్నో ఏళ్లుగా ఇలాంటివి ఎన్ని చూడలేదు.. ఈ ఉత్తర్వులతో పెట్టాబెడ సదిరేస్తామా ఎంటి అంటూ మరికొందరు దిలాశాగా వున్నారు. ఇహ అసలు కధలోకి వెళితే పెద్దపల్లి జిల్లా, ఓదెల మండల వాసి ఒకరు తమ జిల్లాలో మొత్తం ఎందరు పంచాయతీ సెక్రటరీలు & జూనియర్ పంచాయతీ సెక్రటరీలు తాము పని చేసే గ్రామం లోనే నివసిస్తున్నారో.. సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా అడిగి తెలుసుకున్నారు..
దాదాపు ఎవరు కూడా స్థానికంగా నివసించడం లేదని పౌర సమాచార అధికారి సమాధానం ఇచ్చారు..ఈ సమాచారాన్ని ఆధారంగా తీసుకొని.. దరఖాస్తు దారు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు ఇచ్చాడు.
జిల్లా లోని ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు తాము పని చేసే గ్రామం లోనే నివసించాలని DPO మెమో జారీ చేసారు.తాము పని చేసే గ్రామంలో వుండటంతో పాటు.. వారు నివసించే ఇంటి నెంబర్ వివరాలు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి 15 రోజుల్లో వివరాలు పంపించాలని MPDO, MPO లకు, పెద్దపల్లి & మంథని డివిజినల్ పంచాయతీ అధికారులకు.. DPO మెమోలు జారీ చేసారు.
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 - సెక్షన్ 43(8) ప్రకారం గ్రామ పంచాయతీ సెక్రటరీ స్థానికంగా పని చేసే గ్రామంలోనే నివాసం వుండల్సి వుండగా

Saturday, 8 February 2020

ప్రత్యేక చట్టంతో మహిళలకు మరింత భద్రత.. జగనన్నకు కృతజ్ఞతలు... వైకాపా మహిళా నేత శైలజ చరణ్ రెడ్డి....

మహిళలకు రక్షణగా నిలిచేందుకు దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి దిశా యాక్ట్, దిశా యాప్, దిశా పోలీస్ స్టేషన్లు తెచ్చిన ఎ.పి. సీయం వైయస్ జగన్ కు మహిళా లోకం రుణ పడి వుంటుందని వైయస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, రీజనల్ కోఆర్డినేటర్ పూతలపట్టు నియోజకవర్గ ఎలక్షన్ అబ్జర్వర్  శైలజ చరణ్ రెడ్డి అన్నారు. మహిళా రక్షణకోసమై దేశం లోనే మొట్టమొదటిసారిగా... తొలి దిశ పోలిస్ స్టేషన్ ను రాజమండ్రిలో ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ కు అమే కృతజ్ఞతలు తెలియజేశారు.

 రాష్ట్రం  సాంఘిక , సామాజిక,  ఆర్థిక, రాజకీయ రంగాలలో మహిళలకు పెద్దపీట వేస్తూ  మహిళలకు వెన్నుదన్ను లా రక్షణ కల్పించడం ద్వారా వైఎస్రొ జగన్మోహన్సారెడ్డి మరోసారి మహిళా పక్షపాతి అని  నిరూపించుకున్నారని శైలజరెడ్డి కొనియాడారు
దిశ చట్టంలో  మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపుల కేసుల్లో ఐపీసీ 354 ఎఫ్, 354 జి సెక్షన్లను అదనంగా చేర్చడం ద్వారా సత్వర న్యాయం పొందవచ్ఛని అభిప్రాయ పడ్డారు.
- ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 పని రోజుల్లో విచారణ పూర్తవుతుందన్నారు. దిశ చట్టం కింద నమోదైన కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారని కేసుల దర్యాప్తు కోసం రాష్ట్రంలో 18 ప్రత్యేక దిశ పోలీస్‌ స్టేషన్లు జగన్ సర్కార్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

 ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా దిశ కోర్టులు
- 13 మంది ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం.
- రేప్, గ్యాంగ్‌ రేప్‌లకు పాల్పడితే ఉరిశిక్ష.
- చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవితఖైదు.
- సోషల్‌ మీడియా, డిజిటల్‌ మీడియాలో మహిళలను వేధిస్తే మొదటిసారి రెండేళ్లు జైలు శిక్ష. రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలు శిక్ష.
- అత్యాచారం కేసుల్లో శిక్ష పడిన దోషులు అప్పీలు చేసుకునే గడువు 180 రోజుల నుంచి 45 రోజులకు కుదింపు.
- మహిళలు, చిన్నారులపై అకృత్యాలకు పాల్పడే వారి వివరాలను అందరికీ తెలిసేలా డిజిటల్‌ (ఆన్‌లైన్‌) రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.
- మంగళగిరి, విశాఖపట్నం, తిరుపతిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ఆధునికీకరణ.
- తిరుపతి, విశాఖపట్నంలో రెండు డీఎన్‌ఏ సెంటర్లు.
- బయాలజీ, సెరాలజీ, సైబర్‌ ల్యాబ్‌లు.
- దిశ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే వారికి 30 శాతం ప్రత్యేక అలవెన్సు.
- కేసుల దర్యాప్తునకు నెలకు రూ.లక్ష.
- రాష్ట్రంలో మహిళా పోలీస్‌ స్టేషన్ల అప్‌గ్రేడేషన్‌. ఒక డీఎస్పీ, మూడు ఎస్‌ఐ పోస్టులు మంజూరు.
- బాధితుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో గైనకాలజీ పోస్టుల భర్తీ.
- అన్యాయానికి గురైన మహిళ రాష్ట్రంలో ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా జీరో ఎఫ్‌ఐఆర్‌ సౌకర్యం.
  ఇలాంటి అద్భుతమైన, చారిత్రాత్మకమైన నిర్ణయాలను  తీసుకొని చరిత్ర సృష్టించ గల  నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని , రాజశేఖర్ రెడ్డి గారి కలలను నిజం చేస్తూ  మహిళల అందరి మనసులో ప్రత్యేకమైన  స్థానాన్ని కల్పించుకున్న  జన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని ఆమె అభివర్ణించారు.  పిల్లల భద్రతకు  అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ కృషి చేయడం పట్ల ఆమే హర్షాన్ని వ్యక్తం చేశారు.

రిజిస్ట్రేషన్ & స్టాంప్సు శాఖకు ఇ-గవర్నస్ అవార్డు

ఇ - గవర్నస్ జాతీయ అవార్డును 2019-2020 గాను తెలంగాణ టి-చిట్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ & స్టాంపుల శాఖ దక్కించుకుంది నేడు ముంబైలో జరిగిన 23వ ఇ-గవర్నన్న్సన్సు సదస్సులో  రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంఎస్ సుభాషిని ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు తెలంగాణ ప్రభుత్వం తరఫున అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇతర  ప్రముఖులు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు .
ఇ-గవర్నెన్స్‌పై రెండు రోజుల వార్షిక జాతీయ సదస్సు యొక్క 23 వ ఎడిషన్ ముంబైలో శుక్ర, శనివారాలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుండి హాజరైన ప్రముఖులు ప్రభుత్వ కార్యాలయాలు ఆన్‌లైన్‌ సేవలపై విస్తృతంగా చర్చించారు. ఇ - గవర్నస్ ద్వారా పౌర సేవలలో ఏర్పడుతున్న ఇబ్బందులు సమావేశంలో ప్రస్తావనకు వచ్ఛాయి. 
ఇబ్బందులు తొలగించేందుకు తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం వుందని పలువురు విజ్జప్తి చేశారు..
రెండు రోజుల సమావేశాన్ని ముంబైలో రాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య థాకరే ప్రారంభించారు .
ఈ సమావేశానికి ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి, అజయ్ సాహ్నీ, పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల కార్యదర్శి కె. శివాజీ హాజరయ్యారు.
ఆరోగ్యం, వ్యవసాయం, విద్య మరియు భూమి పబ్లిక్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల కోసం గుర్తించబడిన ప్రాధాన్యత రంగాలలో ఇ-గవర్నస్ సేవలను కొనియాడారు. సుమారు 800 మంది హాజరు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం ,  17 రాష్ట్రాలు  చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

హస్తిన ప్రభువులు పట్టించుకోండి.. జాతీయ పండుగగా గుర్తింపు ఇవ్వండి.....


మెడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి  కోరారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా మేడారం వచ్ఛిన సందర్భంగా ఆయనకు వినతి పత్రం అందజేశారు. 
ప్రపంచంలో నే అతిపెద్ద గిరిజన జాతర యిన మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని ఎన్నో  ఏళ్లుగా  కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.ఇప్పటికైనా మేడారం జాతరను  జాతీయ పండుగగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.  మేడారం జాతరను సందర్శించిన కేంద్ర మంత్రి అర్జున్ ముండా  వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
 ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ ఆయనకు స్వాగతం పలికారు.అనంతరం మంత్రి సమ్మక్క,సారలమ్మ ల ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర మంత్రి వెంట రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వడా అజయ్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్,డిజిపి మహేందర్ రెడ్డి, కలేక్టర్ ఆర్.వి.కర్ణన్ తదితరులు వున్నారు.ఈ సందర్భంగా కట్టు దిట్టమైన భధ్రత ఏర్పాట్లు చేశారు..

Friday, 7 February 2020

జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రో పరుగులు...

జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రోరైలు మార్గాన్ని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌ జేబీఎస్ స్టేషన్ లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. 
అనంతరం సీఎం కేసీఆర్‌ ఎంజీబీఎస్‌ వరకు ప్రయాణించారు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 11 కి.మీ మార్గంలో 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ శ్రీ పద్మారావు గౌడ్‌, మంత్రులు శ్రీ కేటీఆర్‌, శ్రీ మహమూద్‌ అలీ, శ్రీ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీ మల్లారెడ్డి, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, ఎంపీ శ్రీ రేవంత్ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి, మేయర్‌ శ్రీ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ శ్రీ బాబా ఫసీయుద్దీన్‌ ప్రభుత్వ, మెట్రో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.