మెడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కోరారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా మేడారం వచ్ఛిన సందర్భంగా ఆయనకు వినతి పత్రం అందజేశారు.
ప్రపంచంలో నే అతిపెద్ద గిరిజన జాతర యిన మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.ఇప్పటికైనా మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. మేడారం జాతరను సందర్శించిన కేంద్ర మంత్రి అర్జున్ ముండా వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ ఆయనకు స్వాగతం పలికారు.అనంతరం మంత్రి సమ్మక్క,సారలమ్మ ల ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర మంత్రి వెంట రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వడా అజయ్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్,డిజిపి మహేందర్ రెడ్డి, కలేక్టర్ ఆర్.వి.కర్ణన్ తదితరులు వున్నారు.ఈ సందర్భంగా కట్టు దిట్టమైన భధ్రత ఏర్పాట్లు చేశారు..
Nice article
ReplyDelete