Saturday, 1 February 2020

ఘనంగా రధ సప్తమివేడుక ... తిరుమలలో పోటేత్తిన భక్తులు....

కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి ఈ రధసప్తమి సందర్భంగా విశేషమైన పూజలు, వాహన సేవలు నిర్వహించారు..
 ఆలయంతోపాటు అన్నప్రసాదం, నిఘా మరియు భద్రత, ఉద్యానవన తదితర విభాగాలు సమన్వయంతో రధసప్తమి వేడుకల్ని అత్యంత శోభయనమయంగా నిర్వహించారు. సప్తమి వేడుకల్లో భాగంగా ఒకే రోజు ఏడు వాహనాలు సేవలను నిర్వహించారు
* భక్తులు చలికి, ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడకుండా గ్యాలరీల్లో వేచి ఉండేందుకు వీలుగా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయడంతో కొంత ఉపశమనం లభించినప్పటికి విఐపిల తాకిడి ఎక్కువగా వుండటం సామాన్య భక్తులకు ఇబ్బంది కరంగా మారింది వాహన సేవలు ఉదయం 5 30 సూర్యప్రభ వాహనంతో  మొదలైన సూర్య రధసప్తమి వేడుక రాత్రి చంధ్రప్రభ వాహనంపై శ్రీవారి ఊరేగింపు తో ముగిసింది.
ఉదయం నుండి రాత్రి వరకు టి, కాఫి, పాలు, తాగునీరు, మజ్జిగ, అల్పాహారం, అన్నప్రసాదాలు నిరంతరాయంగా పంపిణీ చేయయడంతో భక్తులు ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా వాహన సేవలు వీక్షించి భక్తి పరవశులయ్యారు
శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తరువాత ఉదయం 4.30 గంటలకు శ్రీమలయప్ప స్వామివారు ఆలయం నుండి వాహనమండపానికి వేంచేయగా అక్కడ విశేష పూజలతజ  సమర్పణ చేసి
ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు - సూర్యప్రభ వాహనం సేవ నిర్వహించారు.
ఉదయం 9 నుండి 10 గంటల వరకు - చిన్నశేషవాహనం, ఉదయం 11 నుండి 12 గంటల వరకు - గరుడ వాహనం,మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు - హనుమంత వాహనం,మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు - చక్రస్నానం,సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు - కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు - సర్వభూపాల వాహనం,
రాత్రి 8 నుండి 9 గంటల వరకు - చంద్రప్రభ వాహనంతో సప్తమీ వేడుకలు అధ్భుతంగా సాగాయి.
భక్తులకు మరింత మేరుగైన సేవలందించేందుకు అదనపు సిబ్బందికి డెప్యుటేషన్పపై విధులు కేటాయించారు. ప్రతి గ్యాలరీలో శ్రీవారి సేవకులు, ఆరోగ్య సిబ్బంది చక్కటి సేవలు అందించారు. మరోవైపు భక్తులు వాహనసేవలను తిలకించేందుకు వీలుగా ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో భక్తులు వాహన సేవలను మరింత బాగా చూసే అవకాశం కలిగింది.. కాగా రధసప్తమి రోజు సూర్యుని ఆరాధన ఆరోగ్య వంతం అని పండితులు పేర్కొన్నారు.

No comments:

Post a Comment